Saturday, 7 March 2026

Blog

తిరుపతి

గిరి ప్రదక్షిణ భక్తులకు అన్నదానం చేసిన కరుణీక సంఘం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో “శ్రీకాళహస్తి కరుణీక సంఘం” వారిచే సుమారు 1000 మందికి అన్నదానం చేయడమైనది. ఈ అన్నదానం సేవా కార్యక్ర మమును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సంఘ ప్రతినిధులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కె. ఉమాశంకర్, కె. రమేష్, పి. సూర్యప్రకాష్, కె. సురేష్, శ్రీనివాసులు, కె. గురుప్రసాద్, పి.మనోజ్ కుమార్, డాక్టర్ కె. హరీష్, కె.సాయి కిరణ్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది-తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి వ్యవసాయం, అనుబంధరంగాల కోసం 2026-27 బడ్జెట్‌లో రూ.13,598 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ విడుదలపై రైతులకు కలిగే ఉపయోగలపై తెదేపా నాయకులు తంగేళ్ళ పాలెంలో అవగాహన సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వంలో ఎదురైన చేదు అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకూడదని, రైతన్నకు అండగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నదని రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు రైతన్నా మీకోసం” కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇందులో పంచ సూత్రాలు అయిన “(1) నీటి భద్రత, (2)డిమాండ్ ఆధారిత పంటలు, (3) అగ్రిటెక్, (4) ఫుడ్ ప్రాసెసింగ్, (5) ప్రభుత్వం నుంచి మద్దతు” అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన” పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, అలాగే 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో ప్రతిపాదించారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత ఎన్డీయే కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిదే అని కొనియాడారు. గత ప్రభుత్వం పాలనాకాలంలో రైతులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా చేసుకొని, దానిని పూర్తి పని చేసి రైతులకు అండగా నిలిచామని గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా..ఏ ఒక్క రైతూ నష్టపోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్‌లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ, దాదాపు రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చుచేసి సుమారు లక్ష మంది రైతులను ప్రభుత్వం ఆదుకున్నదని తోతాపూరి మామిడి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్ట పరిహారం కింద హెక్టారుకు రూ.25 వేలు ఉన్న పరిహారాన్ని 50 వేల రూపాయలకు పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించారని, అలాగే, పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు నాగరాజు, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, తెలుగు యువత తొట్టంబేడు మండల అధ్యక్షుడు బీమాల చంద్రబాబు @ చందు, సీనియర్ బిసి నాయకులు బీమాల వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

గర్జించిన అనుపల్లి మారుమోగిన స్వరాజ్య నినాదం ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

200 బైక్‌లతో భారీ ర్యాలీ, కేతనం ఎగురవేసిన యువత 100 కేజీల భారీ కేక్ కట్‌, హోరెత్తిన జై శివాజీ నినాదాలు పున్నమిప్రతినిధి ,రామచంద్రపురం అతడు కేవలం కిరీటం ధరించిన రాజు మాత్రమే కాదు, బానిస సంకెళ్లను తెంచుకున్న అజేయ శక్తి. అన్యాయంపై ఎక్కుపెట్టిన అస్త్రం, తరతరాలకు తరగని స్ఫూర్తి ప్రదాత. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల సందర్భంగా రామచంద్రపురం మండలంలోని అనుపల్లి గ్రామంలో గురువారం అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది. దేశభక్తి విస్ఫోటనాన్ని తలపిస్తూ యువత నిర్వహించిన వేడుకలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. కాషాయమయమైన వీధులు శివాజీ జయంతిని పురస్కరించుకుని స్థానిక యువత భారీ ఎత్తున కదం తొక్కారు. సుమారు 200 బైక్‌లతో చేపట్టిన మెగా ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. చేతిలో కాషాయ కేతనాలు పట్టుకుని యువత చేసిన నినాదాలతో అనుపల్లి వీధులు మారుమోగాయి. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాణసంచా పేలుస్తూ, 100 కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో శివాజీ మహారాజ్ జీవితం ఒక గొప్ప మేనేజ్‌మెంట్ పాఠం అని పలువురు వక్తలు కొనియాడారు. ఎటువంటి వనరులు లేని కాలంలోనే సామాన్యులను సైనికులుగా మార్చి, స్వరాజ్యాన్ని స్థాపించిన ఆయన ధైర్యం సాహసాల నిఘంటువని పేర్కొన్నారు.ఎదురుదెబ్బలకు కుంగిపోకుండా కొత్త దారి వెతుక్కోవడమే శివాజీ నేర్పిన పాఠం. నేటి యువతకు ఆయన ఆశయాలే అసలైన మార్గదర్శమని యువత చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, పెద్దసంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు.

తిరుపతి

తిరుపతి జిల్లా అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధం

టీడీపీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పున్నమి ప్రతినిధి, తిరుపతి గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ కో ఆర్డినేటర్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో “తిరుపతి జిల్లా అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై సమీక్షా సమావేశం” నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మరియు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి *”తుడా చైర్మన్, టీడీపీ తిరుపతి జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి”* పాల్గొన్నారు.ఈ సమావేశంలో తిరుపతి జిల్లాలో అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన పార్టీ కమిటీతో పాటు అనుబంధ విభాగాలు కూడా ఎంతో కీలకమని, తెలుగు మహిళ, తెలుగు యువత, బిసి, ఎస్సీ, ఎస్టీ సెల్, వాణిజ్య విభాగం. ఇలా మరిన్ని అనుబంధ విభాగాలు ఏర్పాటు చేసి, పార్టీకి ఎప్పటినుండో కస్టపడి పనిచేసిన వారికి ఈ కమిటీల్లో సముచిత స్థానం కల్పించడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని, దీనిద్వారా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని తెలియజేశారు.

తిరుపతి

బిజెపి కిషన్ మోర్చ జిల్లా కార్యదర్శిగా పొన్నా శంకర్ రెడ్డి పలువురు బిజెపి నాయకులు అభినందనలు

పున్నమి ప్రతినిధి, 19 ఫిబ్రవరి రామచంద్రాపురం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు పొన్నా శంకర్ రెడ్డిని ని బిజెపి కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా బుధవారం నియమించారు. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులను అందజేశారు. కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమితులైన శంకర్ రెడ్డి ని పలువురు బిజెపి నాయకులు, కూటమి నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతు కృషి చేస్తామని తెలిపారు. నాపై నమ్మకంతో జిల్లా కిషన్ మోర్చా కార్యదర్శి పదవిని ఇచ్చిన పెద్దలకు జిల్లా అధ్యక్షులు సామాంచి శ్రీనివాసులు, చంద్రగిరి నియోజకవర్గ బిజెపి నేత మేడసాని పురుషోత్తం నాయుడు లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అర్హులకు అందే విధంగా పనిచేస్తామని తెలిపారు. జిల్లాలో పార్టీ నాయకులు కలుపుకొని పార్టీ బలోపేతానికి పని చేస్తామని చెప్పారు.సుబ్రహ్మణ్యం యాదవ్, దుర్గం ప్రసాద్, దామినేటి శివ, మోహన్ రెడ్డి, బి లక్ష్మణ్ రెడ్డి, తులసి రామ్ రెడ్డి, జగదీష్ రెడ్డి లు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఏసిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా జంగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకారం

నెల్లూరులోని ఏసిఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా జంగా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్ రావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖలో 39 సంవత్సరాలుగా నిజాయితీగా సేవలందించిన శ్రీనివాసులు ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ పదవి నుండి పదోన్నతి పొంది ఏవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏపీ హంస నాయకత్వం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో అరవ పరిమళ, నారాయణరాజు, మజార్, హరిప్రసాద్, గౌస్ బాషా, మంజరి, సుజాత, లక్ష్మీకాంతమ్మ, విజయకుమారి, ప్రసన్న కుమార్, శ్రీనివాస్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధానకార్యదర్శిగా చిత్తూరు చిరంజీవి మండల ప్రధాన కార్యదర్శిగా వేమూరు గురుమూర్తి

పున్నమి ప్రతినిధి, 19 ఫిబ్రవరి రామచంద్రపురం తిరుపతి జిల్లా అధ్యక్షులు కంభం లోకనాదం ఆధ్వర్యంలో బీసీ సంఘం బలోపేతం దిశలో భాగంగా తిరుపతి బీసీ కార్యాలయ లో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చంద్రగిరి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా రామచంద్రాపురం మండలం సొరకాయలపాలెం గ్రామానికి చెందిన చిత్తూరు చిరంజీవిని మరియు రామచంద్ర పురం మండల బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా వేమూరు గురుమూర్తి ని నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శులు మధు మార్గచార్యులు, పి. జ్యోతి, జిల్లా ఐటీ విభాగం , మండల అధ్యక్షుడు కోటి యాదవ్ మరియు బీసీ సంఘ నేతలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు సెంటర్‌లో ప్రమాదం: బైక్-కారు ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు

దుత్తలూరు 19-2-2026 నందిపాడు సెంటర్‌లో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న కారు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి ఒక కారు వస్తుండగా, అదే సమయంలో ఆత్మకూరు నుంచి ఒక వ్యక్తి తన బైక్‌పై వస్తున్నారు. నందిపాడు సెంటర్ వద్దకు చేరుకోగానే రెండు వాహనాలు వేగంగా ఉండటంతో నియంత్రణ కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ​ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కాలు కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం వెంటనే ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ​ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

E-పేపర్

నీలం శ్వేతా పై వేటు తప్పదా…?* *నీలం స్వేత ఎన్నిక చెల్లదా…?* *BRS పార్టీకి మరో కౌన్సిలర్ దూరం అయినట్టేనా…?*

పున్నమి న్యూస్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : నీలం శ్వేతా పై వేటు తప్పదా…? నీలం స్వేత ఎన్నిక చెల్లదా…? BRS పార్టీకి మరో కౌన్సిలర్ దూరం అయినట్టేనా…? ఇక చైర్మన్ పీఠం పై BRS ఆశలు వదులోకోవాలసిందేనా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంట రేపుతున్న వేల నిల స్వేత రూపంలో మరో బాంబ్ పేలింది…. బీసీ రిజర్వేషన్ ఉన్న స్థానంలో oc మహిళా పోటీ చేసిందని అట్టి ఎన్నిక చెల్లదని సదరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరోపిస్తిన్నారు… నీలం స్వేత పై పిర్యాదు సైతం చేశారు… అదే నిజం అయితే స్వేత అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే BRS సంఖ్య బలం 13 కి పడిపోతుంది… ఇక నీలం స్వేత అభ్యర్థిత్వం పోతే సెకండ్ వచ్చిన అభ్యర్థికి విజయం లభిస్తుంది దింతో కాంగ్రెస్ సంఖ్యబలం 12 కి చేరుతుంది.. రోజు రోజు కు మారుతున్న రాజకీయ సమీకరణాలలో BRS క్యాంపు లొ ఉండే అభ్యర్థులు ఎంతమంది ఉంటారో తెలియడం లేదు…

అనకాపల్లి

ఏటికొప్పాకలో రాజకీయ శక్తి ప్రదర్శన… ఉచిత గుండె శిబిరంతో ప్రజల్లో నమ్మకం పెంచుకున్న తెలుగుదేశం పార్టీ…!

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 19 పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో, స్వరా హాస్పటల్ సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. అనుభవజ్ఞులైన హృదయ వైద్యులు గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ECG, ECHO వంటి ఖరీదైన స్కానింగ్ పరీక్షలను ఉచితంగా చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, ఊడి రామకృష్ణ, భజంత్రీల శ్రీను తదితర కూటమి సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఇలాంటి శిబిరాలు మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.