Tuesday, 5 May 2026

Blog

తిరుపతి

అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు క్రీడా పరికరాలు భహుకరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 12, శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి ప్రభుత్వ పాఠశాలకు SOS స్వచ్ఛంద సేవా సంస్థ ద్వార రూ.35,000 విలువచేసే క్రీడా పరికరాలైన గ్రీన్ చాక్ బోర్డులను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ….విద్యార్థుల సమగ్రాభివృద్ధికి క్రీడలు ఎంతో అవసరమని, సంస్థ చేసిన సేవ ప్రశంసనీయంమని ఆమె పేర్కొన్నారు. అనంతరం SOS సంస్థ ప్రతినిధులు మాట్లాడతూ..విద్యార్థుల్లో క్రీడాభిరుచి, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అక్కుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రూ.35 వేల విలువైన క్రీడా పరికరాలు,గ్రీన్ చాక్ బోర్డులు అందజేసామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, అంజనీ ప్రసాద్, రమీజా, డాక్టర్ దేవరాజులు, గోపాలకృష్ణ, ప్రకాశంరాజు, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్? ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.*

పున్నమి ప్రతినిధి: *తెలంగాణలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ నెల 23,27 తేదీల్లో విడుదలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్? ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.* గ్రామ సర్పంచ్,వార్డు మెంబర్ ఎన్నికలు మెదటిది 11,రెండో విడత 14,మూడో విడత 17 నా పూర్తి ఐతున్న సందర్బంగా సర్కార్ వాడి వేడిగా నిర్వహణకు భారీగా సన్నాహాలు మొదలు పెట్టింది….2026 జనవరి 26 రోజున గ్రామా,మండల కేంద్రాల్లో నూతనంగా గెలుపొందిన వారు జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణకు స్పీడ్ పెంచినట్లు సమాచారం…..*

తెలంగాణ

వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : జాతీయ ప్రాధికార సంస్థ

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) వరదలు పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్రస్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి ఇతర అధికారులు హాజరయ్యారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై ఎం.ఎస్. రాకేష్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. రాత్రి వేళల్లో జరుగుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రమాదాలను నివారించడం, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు. వాహనాలను ఒక్కోటిగా ఆపి డ్రైవర్‌లను చెక్ చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి పై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

విశాఖపట్నం

IIAM బిజినెస్ స్కూల్‌లో అల్యూమ్ని మీట్‌–2025 కి ఆహ్వానం

విశాఖపట్నం: ఇంటిగ్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ (IIAM) వైజాగ్ వారిచే ప్రతి ఏడాది నిర్వహించే ప్రతిష్టాత్మక Alumni Meet 2025 ఈ నెల 13, 14 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రతినిధులు ప్రకటించారు. MVP కాలనీలోని IIAM క్యాంపస్‌లో ఉదయం 10 గంటలనుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు “Re-unite, Interact & Have Fun” అనే థీమ్‌తో మళ్లీ ఒక్కచోట చేరనున్నారు. పూర్వ విద్యార్థుల ఎదుగుదల,వారి అనుభవాలను పంచుకుంటూ, కొత్త అవకాశాలపై చర్చిస్తూ ఆనందోత్సాహాలతో జరిగే ఈ మీట్ కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం, అలాగే క్యాంపస్ టూర్‌ కోసం ప్రత్యేకంగా QR కోడ్‌లు కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులో ఉన్నాయని IIAM బిజినెస్ స్కూల్ అధినేత డా ఎస్ పి రవీంద్ర, ప్రతినిధులు తేజ ముత్యం తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కళాశాలల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలింది గత ప్రభుత్వమే పీపీపీతో పేదలకు ఉచిత వైద్యం–విద్య అందుతుందని స్పష్టం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నాయకత్వ ఘాటైన స్పందన

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంపై నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలను నందిగామ టీడీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులు కానని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేం దుకే దుష్ప్రచారం” టీడీపీ నేతల వివరాల ప్రకారం— 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, మిగతా నిధులను ఇతర పనులకు మళ్లించడం వల్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయా యని ఆరోపించారు. “గతప్రభుత్వ పనితీరుతో వెళ్లి ఉంటే ఈ కళాశాలలు పూర్తవడానికి కనీసం 20–23 సంవత్సరాలు పట్టేది. పేదలకు వైద్యం, యువతకు వైద్య విద్య అందుబాటులోకి రాకుండా ఆలస్యం చేసింది ఇదే ప్రభుత్వమే” అని టీడీపీ నాయకులు విమర్శించారు. “నిజమైన ప్రైవేటీకరణ చేసిందెవరు?” వైద్య విద్యలో ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంచిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ మోడల్‌ను గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. “అది నిజమైన ప్రైవేటీకరణ. ఇప్పుడు పీపీపీపై అబద్ధాలు చెప్పడం నిస్సిగ్గు రాజకీయమే” అని నేతలు వ్యాఖ్యానించారు. *పీపీపీతో లభించే ప్రయోజనాలు* ప్రభుత్వం స్పష్టంచేసిన పీపీపీ విధానం వివరాలను టీడీపీ నేతలు మీడియాకు తెలియజేశారు: కళాశాలలు 100% ప్రభుత్వ యాజమాన్యంలోని వారేనని సీట్లలో 50%పేద–మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచితమని, ఆసుపత్రులలో 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించనున్నారని, ఆలస్యాలను నివారిస్తూ ఆధునిక మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నమని చెప్పారు. “పీపీపీ అంటే ప్రజల భాగ స్వామ్యం ప్రైవేటీకరణ కాదు” ప్రజల ఆరోగ్యం, విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనివేననిఅర్ధమవుతోందన్నారు.

విశాఖపట్నం

*విశాఖ క్వీన్ మేరీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక!*

విశాఖపట్నం, డిసెంబర్, 12: విశాఖపట్నం పాత పట్నం పాటపట్నం క్వీన్ మేరీ హై స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులంతా నగరంలో ఆర్ కె బీచ్ తీరాన ఓ ప్రముఖహోటల్ లో కలసి సందడి చేసారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము,చదువుల చెట్టు నీడలో అంటూ 1968 సం లో క్వీన్ మేరీ హైస్కూల్ లో చదివిన పూర్వ విద్యార్ధులు 15 మందీ .. అందరూ ఓ చోటచేరిన తమ ఆత్మీయ కలయిక వారి జీవితాల్లో మధుర ఘట్టంగానిలిచిపోయింది. పూర్వ విద్యార్థులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆట,పాటలతో మైమరచిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకేచోట తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ యోగక్షే మాల అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బెంగులూరు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వైద్య తదితర ఉద్యోగాలలో స్ధిరపడి, రిటైర్ట్ అయిన ఉద్యోగులు కూడా ఈ ఆత్మీయ కలయికలో పాల్గోని మధురానుభూతిని పొందారు. ఈ సందర్బంగా బాలభాను విద్యాలయం ట్రస్టీ, క్వీన్ మేరీ హై స్కూల్ పూర్వ విద్యార్థిని వారణాసి పార్వతి మాట్లాడుతూ అమెరికా నుంచి గొల్లపూడి లక్ష్మి రాక సందర్బంగా తామంతా కలిశామని, ఇప్పటి వరకూ 8 సార్లు కలిసి తమ జ్నాపకాలను గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*పెనుగంచిప్రోలు మండలంలో రోడ్ల పరస్థితి అద్వానం* *సంవత్సరకాలంగా ఇదే దుస్థితిలో రోడ్లు* *ఈ రోడ్లు కాస్త పట్టించుకోండి సారో అంటూ అధికారులకు ప్రజలు, ప్రయాణికుల మొర*

పెనుగంచిప్రోలు మండలంలో సంవత్సరం పైబడి పాడైపోయి ఉన్న గుమ్మడిదుర్రు నుండి అనిగండ్లపాడు మీదుగా పెట్రోల్ బంక్ వరకు, అలాగే పెనుగంచిప్రోలు నుండి వేమవరం వెళ్లేదారిలో కాలువ కట్ట నుండి వేమవరం వరకు, ముచింతల రోడ్డు, ముళ్లపాడు రోడ్ల దుస్థితిని గూర్చి అధికారులు మర్చిపోయారేమో అనిపిస్తుంది. గత సంవత్సరం వరదల సమయంలో వచ్చిన వరద ప్రవాహానికి రోడ్లన్నీ తీవ్రంగా కొట్టుకొని పోయాయి. అయితే వాటికి తాత్కాలికంగా వాహనాలు తిరిగేలా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు కానీ నిత్యము ఈ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల అయితే అడుగు లోతు గుంటలు పడి నాలుగు చక్రాల వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రాణ సంకటంగా మారింది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన వరదకు ఆ రోడ్లు ఇంకాస్త పాడైపోయి ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైంది నిత్యము రద్దిగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణికులు ఇంత ఇబ్బందిపడుతున్న ఇంతకాలంగా ఈ రోడ్లు మరమ్మత్తులపై దృష్టి పెట్టకపోవడంపై ఈ రోడ్డు మరమ్మత్తు పనులు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మత్తులు కొరకై ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను నియోజకవర్గంలోని రెండు రోడ్ల నిర్మాణాల కొరకు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూనే వాటితో పాటు నిత్యం రద్దీగా ఉంటూ ప్రాణ సంకటంగా మారిన పెనుగంచిప్రోలు మండలంలోని ముళ్లపాడు, ముచింతల గుమ్మడిదూరు అనిగండ్లపాడు రోడ్డు అలాగె పెనుగంచిప్రోలు పాత వేమవరం రోడ్లపై కూడా దృష్టిని సారించాలని అధికారులను ప్రయాణికులు బలంగా కోరుతున్నారు

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.