Saturday, 7 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ వహీద్దుద్దీన్ రహమాన్ ఎన్నిక

విజయవాడ, ఫిబ్రవరి 20: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కార్యవర్గంలో నెల్లూరు జిల్లా డివిజనల్ సబ్ ట్రెజరీలో సహాయ ఖజానా అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీ సయ్యద్ వహీద్దుద్దీన్ రహమాన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికపై సహచర అధికారులు, సిబ్బంది, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో సంఘ బలోపేతానికి కృషి చేస్తానని రహమాన్ గారు తెలిపారు. సభ్యుల సంక్షేమం, సేవా నాణ్యత పెంపు దిశగా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.

సాహితీ

“ప్రకృతి సంగీత శ్వాస – మాతృభాష” – డాక్టర్ బద్రి పీర్ కుమార్

బంగ్లా భాషా ఉద్యమం మరియు మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ప్రకటించింది యునెస్కో. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలుగుతామని యునెస్కో భావించి ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినంగా ప్రకటించడం వలన 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మాతృ భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. రాష్ట్రం ఏదైనా దేశం ఏదైనా తల్లి నుండి బిడ్డకు సంక్రమించే అమృతభాష మాతృభాష. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈ కవిత *అం* అంతరంగ భావతరంగఘని *త* తరగని సుసంపన్న ధ్వని *ర్జా* జాతి చరిత్రరీతి ప్రకాశిని *తీ* తీరు మారని అనుబంధ ఆమని *య* యవ్వనానంద సరాగిణి *మా* మానవత్వ మధుర భామిని *తృ* తృణముకాని త్రికాలమణి *భా* భావవ్యక్తీకరణ సంస్కరిణి *షా* షాన్మయం జనలోకాభినయం *ది* దివ్యమైన ప్రకృతిలో శ్వాసగ *నో* నోటిబాటలో విహరిస్తున్న హృదయమాధురి *త్స* ఉత్సవశోభతో కదలాడే కమనీయ భావసిరి *వం* వందనం అభినందనం భాషామతల్లికి సదా నీరాజనం ఆత్మీయ అర్థాంశాల సూచకం పరవశించు జీవుల మనో నేత్రదాయకం స్పందించు మానవ హృదయ జ్ఞాపకం సాక్షాత్ ప్రకృతి సంగీత సరస్వతి రూపకం – మాతృభాష

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 22న వనభోజన మహోత్సవం

మూలపేట వీరశైవ కళ్యాణమండపంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జంగమ సేవా సంఘం జిల్లా నేతలు మాట్లాడుతూ, ఫిబ్రవరి 22న తోటపల్లి గూడూరు మండలం వరిగొండలోని శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో 12వ వార్షికోత్సవం సందర్భంగా వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోపూజ, అభిషేకం, మెడికల్ క్యాంప్, కళ్యాణ మహోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనం, వివాహ పరిచయ వేదిక, చిన్నపిల్లలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, జిల్లాలోని జంగమ కులస్తులు భారీగా పాల్గొనాలని కోరారు.

ఖమ్మం

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ సునీల్ దత్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రికజిల్లా ఇంచార్జి) ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రజా పరీక్షల సందర్భంగా అన్ని పరీక్ష కేంద్రాల పరిధిలో బి ఎన్ ఎస్ లోని సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల నిర్వహణను ప్రశాంతంగా, అవాంఛనీయ ఘటనలు లేకుండా సాగించేందుకు ఈ నిర్ణయం3 తీసుకున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుంపులుగా నిలబడటాన్ని నిషేధించినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

ఉద్యోగ విరమణ బకాయిలు రాక ఆర్థిక ఇబ్బందులు… రిటైర్డ్ ఎస్సై మృతి

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కూమర్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జ్ ) ఉద్యోగ విరమణ చేసి ఏడాది గడిచినా బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్సైగా సేవలందించిన కె. మైసయ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. అయితే ఆయనకు రావాల్సిన సుమారు రూ.50–60 లక్షల ఉద్యోగ విరమణ బకాయిలు ఇప్పటికీ అందకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో మైసయ్యతో పాటు ఆయన భార్య భాగ్యమ్మ కూడా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి వీరిద్దరినీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భాగ్యమ్మ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మైసయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఆయన మృతి చెందారు. ఆసుపత్రి బిల్లుల చెల్లింపులో కుటుంబం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం కొంతమేర బిల్లును చెల్లించి, మృతదేహాన్ని ఆయన స్వగృహానికి తరలించే ఏర్పాట్లు చేసింది. ఉద్యోగ విరమణ బకాయిలు సమయానికి చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు, సహచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

ఖమ్మం

జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజుకు ఘన స్వాగతం

ఖమ్మం ఫిబ్రవరి ( పువ్వాడ నాగేంద్ర కుమార్ జిల్లా ఇంచార్జి) ఖమ్మం: గత నెలలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుపై సిట్ అధికారులు చేపట్టిన విచారణను నిరసిస్తూ ఖమ్మం నగరంలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైరా నుంచి ఖమ్మంకు వస్తున్న నాగరాజును పోలీసులు అడ్డుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సుమారు 22 రోజులుగా ఖమ్మం జిల్లా జైలులో ఉన్న నాగరాజుకు గురువారం బెయిల్ మంజూరవగా, శుక్రవారం ఉదయం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన నాగరాజుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కత్తి శ్రీను, నాగేశ్వరరావు, రాజేష్, తిరుమల రావు పూలపొంగు వెంకట్, ఉపేందర్, రమేష్ సహా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకి పూల మాలలు వేసి ఘనం స్వాగతం పలికారు . నాగరాజు విడుదలతో ఆయన అనుచరుల్లో ఆనందం నెలకొంది.

పల్నాడు

*21 నుంచి 24 వరకు వడగండ్ల వానలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ

రుతువుల మార్పిడితో కురిసే అవకాశం హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఉరుములు, మెరుపులతో గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నట్టు తె లిపింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని, నె లాఖరు వరకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

పల్నాడు

ఇన్‌స్టాలో పరిచయం

*lసోషల్ మీడియా మాయలో వివాహిత..* *ధనవంతుడని నమ్మి వెళ్లి షాక్ తిన్న ఘటన *ఇన్‌స్టాలో పరిచయం.. ఏపీ చేరగా బయటపడ్డ అసలు నిజం* సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తున్నాయో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఓ వివాహితను తన కుటుంబం నుంచి దూరం చేసి, చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట చాట్‌గా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ఆడియో, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది. ఆ నమ్మకంతోనే భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏపీకి చేరుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ వ్యక్తిని కలిసింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ధనవంతుడినని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ తీవ్ర నిరాశకు లోనైంది. ఇదే సమయంలో ఆమె గల్లంతైన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో మహిళను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే, భార్య తప్పుదారి పట్టినా భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి అంగీకరించడం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. కానీ అదే సమయంలో అపరిచితులతో ఏర్పడే సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ, ఎంపికైన వారికి ఉచితంగా విద్య

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్లోని 164 ఏపీ మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 12న జరిగే ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు ఉచితంగా ఆంగ్ల మాధ్యమ బోధన పొందవచ్చు.

జాతీయ అంతర్జాతీయ

ట్రంప్ గాజా శాంతి మండలి తొలి సమావేశానికి హాజరైన భారత్

అమెరికాలో జరిగిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశానికి భారత్ గురువారం అబ్జర్వర్గా హాజరైంది. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయ తాత్కాలిక బాధ్యురాలు నమ్గ్యా సి ఖంపా భారతికి ప్రాతినిధ్యం వహించారు. ఈ బోర్డులో శాశ్వత సభ్యదేశంగా చేరాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదు. బోర్డులో శాశ్వత సీటుకు $1 బిలియన్ కట్టాలి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.