Thursday, 5 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్ష కిట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

సీతారామపురం కస్తూరిబా బాలికల విద్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్షా కిట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కుర్రా రత్తయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి ఎమ్మెల్యే Kakarla Suresh పాల్గొని సుమారు 300 మంది విద్యార్థులకు పరీక్షా సామగ్రి కిట్‌లను అందజేశారు. పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు, రబ్బరు, రైటింగ్ ప్యాడ్‌లతో కూడిన కిట్‌లు విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యే భవిష్యత్తుకు భరోసా అని పేర్కొంటూ క్రమశిక్షణ, సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎడమ తిరుపతయ్య గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

🔸ఎడమ తిరుపతయ్య గారి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సీతారామపురం మండలం బెస్త కాలనీలో హెడ్‌మాస్టర్‌గా సేవలందించిన ఎడమ తిరుపతయ్య పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై తిరుపతయ్య ని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, తిరుపతయ్య ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా ఆదర్శవంతమైన గురువుగా ఎన్నో తరాల విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేశారని కొనియాడారు. పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, క్రమశిక్షణ, నైతిక విలువల బోధనలో ఆయన చూపిన అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు. తదుపరి, తిరుపతయ్య గారికి పదవీ విరమణ అనంతర జీవితం ఆనందంగా, ఆరోగ్యంతో, కుటుంబ సభ్యుల మధ్య సుఖశాంతులతో గడవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన మేయర్‌గా ఎన్నికైన దేవరకొండ సుజాత కు సన్మానం

నెల్లూరు నగర నూతన మేయర్‌గా ఎన్నికైన దేవరకొండ సుజాత గారు, శాసన మండలి సభ్యులు మరియు టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నగరంలోని మాగుంట లే అవుట్‌లో జరిగిన ఈ సమావేశంలో మేయర్ సుజాత, బీద రవిచంద్రను సాలువాతో సత్కరించారు. అనంతరం బీద రవిచంద్ర ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మేయర్ సుజాతను బీద రవిచంద్ర దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధి, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల విస్తరణ, పారిశుధ్య కార్యక్రమాలు తదితర అంశాలపై వారు సవివరంగా చర్చించుకున్నారు. నగర అభివృద్ధికి పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తహసిల్దార్ జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు

అనంతసాగరం మండలంలో పనిచేస్తున్న తహసిల్దార్ జయవర్ధన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఓ మహిళ మండల సర్వేయర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు నిజమని నిర్ధారించారు. విచారణ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని తహసిల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ లేదని జిల్లా యంత్రాంగం తెలిపింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిడిపి నాయకుడు గూడూరు వెంకటేశ్వరరావు గారిని పరామర్శించిన ఎమ్మెల్యే

ఉదయగిరి మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గూడూరు వెంకటేశ్వరరావు అనారోగ్యంతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, గౌరవ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందించిన వెంకటేశ్వరరావు వారికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెగా మెడికల్ క్యాంప్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికార వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అపోలో హాస్పిటల్స్ , పెన్నా హాస్పిటల్స్ వైద్యుల సహకారంతో పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. 212 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌పి సూచించారు. వైద్యులను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అంశంపై విస్తృతంగా చర్చించారు.

ఈ రోజు తిక్కవరప్పాడు పంచాయితీ పరిధిలోని కండ్రిగ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసే అంశంపై విస్తృతంగా చర్చించారు. గ్రామాభివృద్ధి, సామాజిక న్యాయం, దళిత హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పబ్లిక్ పరీక్షలు రాయుటకు సంపూర్ణగా సిద్ధం చేయాలి

మండలం పరిషత్ ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్న G-FLN కార్యక్రమాన్ని సందర్శించిన ఉదయగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు గారు, ప్రతి విద్యార్థికి బలమైన అభ్యసన పునాది నిర్మించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 75 రోజుల కార్యక్రమంలో భాగంగా 59వ రోజు నిర్వహించిన తెలుగు, గణిత, ఆంగ్ల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అవగాహనతో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి విద్యార్థిని SKY స్థాయికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ షేక్ హుస్సేన్ భాషా గారిని అభినందించారు. CRMT షేక్ మోహిద్దీన్ కూడా పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో 15 డివిజన్‌ల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం — రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) రాబోయే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని 15 డివిజన్‌లలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షుడు ధనియాకుల వెంకట్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పున్నమి దినపత్రిక జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఖమ్మం రెండవ పట్టణ పరిధిలోని ప్రతి డివిజన్‌లో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం దిశగా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బీజేపీ నాయకత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం నగర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలే నగర ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ఈ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్తూన్నాం అని దీని వల్ల బీజేపీ మరింత బలపడుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయని, అదే ఉత్సాహంతో ఖమ్మంలో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ధనియాకుల వెంకట్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తారని, ఖమ్మం రెండవ పట్టణంలో అన్ని డివిజన్ లలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఆయన స్పష్టం చేశారు.

అన్నమయ్య

శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలంపాట నిర్వహణ

చిట్వేల్ మండలం నగిరిపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ రంగనాయకుల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు వైభవంగా నిర్వహించబడనున్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ ప్రకారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వేలంపాట కార్యక్రమం స్వామివారి సన్నిధిలో భక్తుల సమక్షంలో జరిగింది.ఈ వేలంపాటలో కుమ్మరిపల్లె వాస్తవ్యులైన కట్టా కృష్ణయ్య గారి కుమారుడు కట్టా ప్రసాద్ రూ.1,15,000 (ఒక లక్ష పదిహేనువేలు)కు వేలం దక్కించుకున్నారు.వేలంపాట అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కట్టా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. వేద పండితులు కే. రంగాచార్యులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ చైర్మన్ పోలిన నాగేశ్వరయ్య పూలమాల మరియు శాలువాతో సన్మానించారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.