Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

సిఐఐ భాగస్వామ్య సదస్సుకాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా*

*సిఐఐ భాగస్వామ్య సదస్సు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *కాన్ఫరెన్స్ హాల్ నెం.3, సెషన్ 1 – రష్యా* 1. *H.E Mr Alexey Gruzdev, Deputy Minister of Industry and Trade, Russian Federation* : ఏపీ గేట్ వే ఇండియా. వాణిజ్య పరంగానే కాకుండా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. వ్యవసాయ రంగం, ఉత్పత్తి కేంద్రాలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి పలు రంగాలు గణనీయంగా వృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ఎగుమతులు, దిగుమతుల్లో ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ అని అన్నారు. 2. *Mr.Andrey Anisimov, Deputy Managing Director, Sberbank India* : ప్రపంచ పారిశ్రామిక యుగంలో రష్యా మరియు భారతదేశం తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకుంటున్నాయి. పారిశ్రామిక మరియు సాంకేతిక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లనున్నాయి. తమ బ్యాంకుల్లో 97 శాతం మంది భారతీయులే ఉన్నారని చెప్పారు. 3. *Mr.Victor Ivanovsky, Director of International Business Strategy Positive Technologies* : సైబర్ భద్రత ను మరింత పటిష్టం చేసేలా సహకరిస్తాం. రష్యా నుంచి భారత్ లోని అన్ని ప్రధాన నాగరాలకు ఎయిర్ పోర్ట్ సౌకర్యం కల్పిస్తే వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. ఇది ఇరుదేశాలకు ఉపయోగకరంగా ఉంటుంది. 4. *Ms.Marina Epifantseva, Deputy Head Investment Development Agency of the Republic of Tatarstan* : ప్రాంతీయ, అభివృద్ధి వంటి రంగాలలో సహకారానికి కొత్త నమూనాలను నడిపించే శక్తివంతమైన కూటమిని ఏర్పరచగల సామర్థ్యాన్ని భారత్ కలిగి ఉంది. 5. *Mr.Sergey Krasilnikov, Vice President, Russian Union of Industrialists and Entrepreneurs* : రెండు దేశాలు పరిపూరక బలాలను కలిగి ఉన్నాయి. పరస్పర సహకారంతో మరింత ముందుకు వెళ్ళనున్నాయి. 6. *Mr.Anton Bazulev, Vice President for International Cooperation, UC RUSAL* : పారిశ్రామికంగా ఇరుదేశాలు భాగస్వామ్యంతో ఎగుమతులు, దిగుమతులు చేసుకుంటాయి. మూడు దశాబ్దాలుగా తక్కువ కార్బన్ విడుదల చేసే హై క్వాలిటీ అల్యూమినియంను సరఫరా చేస్తున్నాం. పర్యావరణానికి హాని లేకుండా పరిశ్రమల స్థాపనకు సహకరిస్తాం. 7. *Mr.Alexey Kechko, Head of Representative Office in India, VEB RF* : రష్యాకి బెస్ట్ బిజినెస్ ఇచ్చే దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉందని అన్నారు. భారత్ లో పరిశ్రమల స్థాపనకు ఆర్ధిక సహకారం అందిస్తామని అన్నారు. విక్రయాలు, కొనుగోళ్లు జరిగేలా చూస్తామన్నారు. 8. *Mr.Mamed Akhmedov, Head of Representative Office in India, Russian Export Center* : రష్యాలో 1000 మందికి పైగా ఎగుమతులు చేసే వారు ఉన్నారని, రానున్న కాలంలో మరిన్ని ఎగుమతులు పెరగనున్నాయని అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నట్లు చెప్పారు.

విశాఖపట్నం

వైద్య రంగంలో ఏఐ పాత్ర కీలకం* *ఐదేళ్లలో గణనీయ మార్పులు*

*వైద్య రంగంలో ఏఐ పాత్ర కీలకం* *ఐదేళ్లలో గణనీయ మార్పులు* *సెషన్ 8 లో వక్తలు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*: వైద్యారోగ్య రంగంలో కృత్రిమ మేధ భవిష్యత్తులో కీలకం కానుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా శుక్రవారం 3 వ సెమినార్ హాలులో 8 వ ప్లీనరీ సెషన్ ‘ఇండియా ప్రెసిషన్ మెడిసిన్ లీప్ హేమషింగ్ ఏఐ అండ్ జీనోమిక్స్ ఫర్ వికసిత్ భారత్ ‘ అంశంపై జరిగింది. పి డబ్ల్యుసి ఇండియా హెల్త్ కేర్ లీడ్ అండ్ సీనియర్ పార్టనర్ డాక్టర్ రానా మెహతా మోడరేటర్ గా వ్యవహరించిన ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ, వైద్యారోగ్యరంగంలో డేటా విశ్లేషణ ముఖ్యమని పేర్కొన్నారు. దీనిలో ఏఐ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జన్యు క్రమం విశ్లేషణ ద్వారా వ్యాధుల నిర్ధారణకు కూడా ఏఐ దోహదం చేస్తుందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏఐ కారణంగా వైద్యారోగ్య రంగంలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. అత్యాధునిక పరికరాల ద్వారా శస్త్ర చికిత్సలు కూడా జరుగుతాయని చెప్పారు. ఖచ్చితమైన వైద్యం, జీనోమిక్స్ లో విప్లవాత్మక మార్పులు తధ్యమని స్పష్టం చేశారు. ఈ సెషన్లో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సిఐఐ నేషనల్ కమిటీ ఆన్ హెల్త్ టెక్నాలజీ సీఈవో ప్రశాంత్ టాండన్, సిఐఐ నేషనల్ మెడికల్ టెక్నాలజీ ఫోరం ఎండి గౌరవ్ అగర్వాల్, అవెస్ట జెన్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ విల్లు మోర్వాల పాటిల్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిడిఓ డాక్టర్ రేచెస్ ఎల్లా, వెల్కమ్ మెడిటిక్ లిమిటెడ్ గ్రూప్ సిఎఫ్ఓ సుధీప్ ధరైవాలా, ఏఐజీ హాస్పిటల్స్ సిటీవో డాక్టర్ కింజల్ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు*

*అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ సాధిస్తోంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*: ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల సారథ్యంలో ఆంధ్రా మళ్ళీ దేశంలో అగ్రస్థానం దిశగా దూసుకుపోతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శుక్రవారం నాడు విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో జరుగుతున్న 30వ సిఐఐ పాట్నర్షిప్ సమ్మిట్ లో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ సభలో తనదైన శైలిలో ప్రసంగించారు. గడచిన కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ సరైన విజన్ లేక, మార్గనిర్దేశం లేక వెలవెలబోయిందనీ.. నేడు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మిన్నగా రాష్ట్రం ఎదుగుతూ అగ్ర స్థానాన్ని ఆంధ్రా మళ్ళీ క్లెయిమ్ చేస్తోందని తెలిపారు. చంద్రబాబు అమలు చేసిన విజన్ కారణంగా ఒకప్పుడు సైబరాబాద్ గురించి మాట్లాడుకునేవారని.. ఇప్పుడు అమరావతి, రాయలసీమా, ఉత్తరాంధ్ర.. ఇలా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రా గురించి చర్చించుకుంటున్నారనీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వం ఇలా ప్రజలతో మమేకం అవ్వడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల పాత్ర కీలకంగా మారిందని అన్నారు. వికసిత్ భారత్ 2047 తో అపరిమిత అవకాశాలు రానున్నాయని గుర్తు చేసిన రామ్మోహన్ నాయుడు.. ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులకు ఇది సరైన సమయం అని అన్నారు. విమానయానంలో కూడా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ వ్యవస్థ గా మన దేశ ఏవియేషన్ రంగం నిలిచిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతీ ఏభై రోజులకు ఒక ఎయిర్ పోర్ట్ చొప్పున ప్రారంభిస్తున్నామని, ఏడు ఎయిర్పోర్ట్ లు ఇప్పటికే రాష్ట్రంలో ఉండగా.. మరో ఏడు అతి త్వరలో సేవలు అందివ్వనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో లాజిస్టింగ్ హబ్, ఏవియేషన్ హబ్ లను ఏర్పాటు చేయడం తో పాటు, 4 ఏవియేషన్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు కూడా రానున్నాయని భవిష్యత్ ప్రణాళికను స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పరిధిలో ఎమ్.ఆర్.ఓ వ్యవస్థ, ఏవియేషన్ స్కిల్లింగ్ యూనివర్సిటీ, డ్రోన్ సెక్టార్, ఏరో సిటీ లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధి విషయంలో చేతుల నిండా పనితో తాము ఉన్నా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఇంకా సంతృప్తి లేదని.. ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తో అభివృద్ధి కావాలని ఆయన అడుగుతూ ఉంటారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. ఇలాంటి విజనరీ లీడర్షిప్ లో గేట్ వే ఆఫ్ ఇండియా గా ఆంధ్రా మారుతుండగా.. సన్ రైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా విశాఖపట్నం మారుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కితాబిచ్చారు.

విశాఖపట్నం

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎం గ్రీన్ సంస్థ*

* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎం గ్రీన్ సంస్థ* * *ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఒప్పందం* * 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియమ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ * రూ. 40 వేల కోట్లతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పరిశ్రమ పెట్టనున్న ఏఎం గ్రీన్ * ఇప్పటికే ఏపిలో రూ.50 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన ఏఎం గ్రీన్ సంస్థ * బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుపై మరో ఒప్పందం చేసుకున్న ఏఎం గ్రీన్ సంస్థ * రూ.10 వేల కోట్లతో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యుయల్ తయారీ యూనిట్ ను పెట్టనున్న ఏఎం గ్రీన్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టనున్న ఏఎం గ్రీన్ సంస్థ

విశాఖపట్నం

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

*30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ ప్లీనరీ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *ప్లీనరీ సదస్సుకు హాజరైన ఆర్మేనియా, సింగపూర్, మారిషస్, నేపాల్, అంగోలా, వెనిజులా దేశాలకు చెందిన మంత్రులు యూఎన్ఓ ప్రతినిధులు* *ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…* • సౌదీ, రష్యా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, జపాన్, కెనడా తదితర దేశాల నుంచి డెలిగెట్స్ ఈ సదస్సుకు హాజరుకావటం సంతోషాన్ని కలిగిస్తోంది • సీఐఐ భాగస్వామ్య సదస్సును కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే చూడొద్దు. నెట్వర్కింగ్ కోసం, మేధోపరమైన చర్చల కోసం, ఆవిష్కరణల కోసం ఏర్పాటు చేశాం • పరస్పరం పెట్టుబడుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధించగలం అని అంతా గుర్తించాలి • సింగపూర్ చాలా చిన్న దేశమైనా అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చింది • ఆర్గానిక్ ఉత్పత్తిగా అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగింది. అక్వా ఉత్పత్తులు, నేచురల్ ఫార్మింగ్‌లోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది • ఖనిజాలు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కొత్త టెక్నాలజీలు ఉంటే వారితో పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంది • ఏపీలోని సుదీర్ఘ తీరప్రాంతం, గండికోట, అరకు లాంటి ప్రకృతి అందాలు పర్యాటక రంగంలో పెట్టుబడులకు అనుకూలం • అలాగే కొత్తగా భారతీయ రుచులకు సంబంధించిన రంగాల్లోనూ విస్తృత అవకాశాలు వినియోగించుకోవచ్చు • మా ప్రాంతంలోని సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ఎక్స్ పీరియన్స్ సెంటర్లను • డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం • సాంకేతికత సాయంతో అతి తక్కువ నష్టంతోనే ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కుంటున్నాం • నూతన ఆవిష్కరణలు, యువతకు నైపుణ్యాల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేశాం • ఏపీలో 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ పరిశ్రమలకు, ప్రాజెక్టులకు అందుబాటులో ఉంచాం • భారత్‌లో ప్రధాని మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది • బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ విజయం సాధించింది. • ఎన్టీఏపై నమ్మకం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు • మానవాళి సంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులకు, పారిశ్రామిక వేత్తలకు పిలుపునిస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్

బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ విజయం సాధించడం పట్ల అమలాపురంలో బీజేపీ నేతలు సంబరాలు

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన సందర్భంగా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో బాణాసంచా కాల్చి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్ లో 202 సీట్లలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం చాలా ఆనందకరమైన విషయం అని, ఇది ప్రజా విజయం అని అన్నారు. దేశం లో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని బీహార్ ఎన్నికలతో మరోసారి రుజువైందని అన్నారు. దేశాభివృద్ది,ప్రజల సంక్షేమం రెండు కళ్లుగా పాలనచేస్తూ అగ్రరాజ్యాలకు పోటీపడుతూ 4 వ స్దానంలో భారత్ ఉండడం మోదీ పాలన వల్లేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు అయ్యల భాష, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ , జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శిలు రమా వర్మ, మోకా ఆదిలక్ష్మి, సాద్విక్, గోకరకొండ గంగన్న స్వామి, అరిగెల నాని, కొండేటి ఈశ్వర్ గౌడ్, జగతా శాంతి, సంసాని రత్నకుమార్, బండి శ్రీను, డీవీఎస్ రాజు, పావులూరి వెంకట్, బొచ్చు ప్రభాకర్, దాకే వెంకటరావు, జంగా రాజేంద్ర కుమార్, చెరుకూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్న :జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ పట్టణంలోని ఎన్ జి కళాశాల మైదానంలో సింథటిక్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్జీ కళాశాల మైదానం నల్గొండకు ఒక మంచి గుర్తింపు అని అన్నారు. నల్గొండ కళాశాల మైదానంలో మంచి క్రీడా సౌకర్యం కల్పించే విషయంలో మున్సిపల్ లేదా జిల్లా యంత్రాంగం నిధులతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

E-పేపర్

భీమొలు గ్రామం గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు జన్మదిన వేడుకలు

తూ. గో జిల్లా… గోపాలపురం మండలం పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాడు వెంకటరాజు గారి జన్మదిన వేడుకలు భీమూలు గ్రామంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దాకారపు అప్పారావు, జనసేన గ్రామ అధ్యక్షులు గండ్రొతు ఉమామహేశ్వరరావు, సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎక్సర్పంచ్ గండ్రొతు శ్రీనివాసరావు, కొత్తచెరువు నీటి సంఘం అధ్యక్షులు కోడి సత్యనారాయణ, జనసేన సీనియర్ నాయకులు రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం, వరప్రసాద్,రాంపండు, మోసే, పొలరాజు, రవీంద్ర, మోహన్ రావు, శివ రామకృష్ణ, సత్యనారాయణ పోలరాజు దాసు పండుతెలుగుదేశం మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో End

రంగారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతొ బాలాపూర్ లో సంబరాలు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడంతో మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ లో స్వీట్లు పంచుకుని సంబరాలలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ గెలుపులో భాగస్వామ్య పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన పెయిడ్ సర్వేలను ప్రజల్లోకి పంపి అయోమాయానికి గురిచేసిన జూబ్లిహిల్స్ ప్రజలు స్పష్టమైన నిర్ణయాన్ని ఓటు రూపంలో చూపించారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను గుర్తించి తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ పన్నాల రాజేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, ఏఐసీసీ విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, నాయకులు తుళ్ల సునీత గౌడ్, నయన చారి, గిరి ముదిరాజ్, రాకేష్, అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.