Friday, 20 March 2026

Blog

తిరుపతి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల వితరణ

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మండలంలోని అక్కుర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు గిరిజన బాలబాలికలకు శనివారం నాడు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వారి సౌజన్యంతో ఇచ్చిన సైకిళ్లను ప్రధానోపాధ్యాయురాలు జయకుమారి చేతుల మీదుగా తిరుపతి జిల్లా విద్యాశాఖ, పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ…సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు నడిచి వచ్చే విద్యార్థులకు సైకిళ్లు గొప్ప సహాయంగా నిలుస్తాయని విద్య అందరికీ చేరేలా దాతలు చేస్తున్న సహకారం అభినందనీయమని, ఇలాంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ప్రతిరోజూ బడికి హాజరై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణం కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాశం రాజు, చెంగళ్రాయులు, చంద్రయ్య, గోపి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

E-పేపర్

వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ

ప్రతిభకు పట్టం…. వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ అధిష్టానం ఓబులవారిపల్లి మండల వాసి కి అగ్ర తాంబూలం… హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు… ఓబులవారిపల్లె నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసిపి పార్టీలో వీర విధేయుడిగా పార్టీ అధిష్టానం ప్రకారం వైసీపీ పార్టీకి ఒక దశాబ్దం విధేయతను ప్రదర్శిస్తుంది అటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీకి బలోపేతానికి మైనార్టీ పార్టీల తరఫున పార్టీ అభివృద్ధి కష్టపడి పని చేయడంతో ప్రతిభకు అధిష్టానం పట్టం కట్టింది రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపూడి గ్రామానికి చెందిన సుకేసుల రఫీ విధేయతను మెచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసిపి పార్టీ మైనార్టీ కార్యదర్శిగా సీనియర్ నాయకులు సుంకేసుల రఫీని నియమించడం మైనార్టీ నాయకులలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంతేకాకుండా పార్టీలో మైనార్టీ తరఫున విశేష కృషి చేసి వైసిపి పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకోవడంతోపాటు మైనార్టీలను ఒక తాటిపై నడిపించే ఘనత ఆయనకు దక్కిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మైనార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఉంటానని సుంకేసుల రఫీ అభిప్రాయం వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పదవి నాకు అప్పగించిన మాజీ మంత్రి వైసిపి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అలాగే ఎంపీ మిధున్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి అధికార ప్రతినిధి కొరముట్లశ్రీనివాసులకు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు ఖాదర్ బాషా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారికి ఎల్లవేళలా విధేయతను ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు నా మన్నారు.

అల్లూరి సీతారామరాజు

ఘనంగా జన జాతీయ గౌరవ్ దివాస్

అరకులోయ( పున్నమి ప్రతినిధి), నవంబర్ 15 అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో జన జాతీయ గౌరవ్ దివాస్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎంపీడీవో లవరాజు, సిబ్బంది, వైసిపి నాయకులు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా సేవలను, త్యాగాల గురించి ఎంపీడీవో వివరించారు. జల్, జంగిల్, జమీన్ పై పూర్తి హక్కు ఆదివాసీలదే అని బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిర్సా ముండా పోరాడారని పేర్కొన్నారు. బస్కీ పంచాయతీ సర్పంచ్ పాడి రమేష్, వైసీపీ నాయకులు కమ్మిడి అశోక్, గరం పూర్ణచంధర్, ఏవో ఉదయ భాస్కర్, ఉపాధి హామీ సిబ్బంది జగదీష్, తదితరులు ఉన్నారు.

E-పేపర్

వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ

ప్రతిభకు పట్టం…. వైసిపి పార్టీకి విధేయుడుగా దశాబ్దం కాలంగా… రాష్ట్ర వైసీపీ పార్టీ మైనార్టీ కార్యదర్శిగా.. సుంకేసుల రఫీ అధిష్టానం ఓబులవారిపల్లి మండల వాసి కి అగ్ర తాంబూలం… హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు… ఓబులవారిపల్లె నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గంలో వైసిపి పార్టీలో వీర విధేయుడిగా పార్టీ అధిష్టానం ప్రకారం వైసీపీ పార్టీకి ఒక దశాబ్దం విధేయతను ప్రదర్శిస్తుంది అటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీకి బలోపేతానికి మైనార్టీ పార్టీల తరఫున పార్టీ అభివృద్ధి కష్టపడి పని చేయడంతో ప్రతిభకు అధిష్టానం పట్టం కట్టింది రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపూడి గ్రామానికి చెందిన సుకేసుల రఫీ విధేయతను మెచ్చి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైసిపి పార్టీ మైనార్టీ కార్యదర్శిగా సీనియర్ నాయకులు సుంకేసుల రఫీని నియమించడం మైనార్టీ నాయకులలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అంతేకాకుండా పార్టీలో మైనార్టీ తరఫున విశేష కృషి చేసి వైసిపి పార్టీ అభివృద్ధిలో పాలుపంచుకోవడంతోపాటు మైనార్టీలను ఒక తాటిపై నడిపించే ఘనత ఆయనకు దక్కిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మైనార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వైసీపీ పార్టీకి ఎప్పటికీ ఉంటానని సుంకేసుల రఫీ అభిప్రాయం వ్యక్తం చేశారు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పదవి నాకు అప్పగించిన మాజీ మంత్రి వైసిపి నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అలాగే ఎంపీ మిధున్ రెడ్డికి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వైసిపి అధికార ప్రతినిధి కొరముట్లశ్రీనివాసులకు రాష్ట్ర వైఎస్ఆర్ సీపీ పార్టీ మైనార్టీసీల అధ్యక్షులు ఖాదర్ బాషా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని వారికి ఎల్లవేళలా విధేయతను ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతు నా మన్నారు.

ఆంధ్రప్రదేశ్

16 న కనిగిరిలో జాబ్ మేళా

కనిగిరిలో అమరావతి గ్రౌండ్ నందు MLA ఉగ్రనరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఓ ప్రైవెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. టెన్త్, ఇంటర్,, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులన్నారు.ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి వెంటనే అపాయిoట్మెంట్ ఇస్తానన్నారు.ఈ అవకాశాన్ని నిరోద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నిర్మల్

ఆమ్ ఆద్మీ పార్టీ “జాడు చలావ్ యాత్ర”లో వై.ఎస్.ఆర్. కాలనీలో వెలుగులోకి వచ్చిన ముఖ్య సమస్యలు

నిర్మల్ నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా నిర్మల్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో ‘జాడు చలావ్ యాత్ర’ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ సహా నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు దయనీయ స్థితిలో ఉండటం, డ్రైనేజీ లేమి, చెత్త కుప్పలు పేరుకుపోవడం, వరద ముంపు ప్రమాదం వంటి తీవ్రమైన మౌలిక సమస్యలు బయటపడ్డాయి. మురుగునీటి నిల్వ కారణంగా డెంగ్యూ–మలేరియా వంటి వ్యాధులు విస్తరించడంతో సుమారు 20 మంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై ఆప్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రోడ్ల మరమ్మతులు, శాశ్వత డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య చర్యలు, వీధి దీపాల ఏర్పాటు, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ జిల్లా అధికారులకు త్వరలోనే వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైండ్ల శ్రీనివాస్, వినోద్ కుమార్, అబ్దుల్ సాదిక్, యాకిన్, షేక్ ఇమామ్, షేక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తంగిరాల సౌమ్య కంచికచర్ల గృహప్రవేశం, రామాంజనేయ వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవం కార్యక్రమాలలో పాల్గొన్నారు

కంచికచర్ల, వీరులపాడు ప్రాంతాల ప్రజల సంకల్పాన్ని ప్రోత్సహిస్తూ, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేసారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నవంబర్ 15 (రిపబ్లిక్ న్యూస్) *కంచికచర్ల* : శనివారం కంచికచర్ల టౌన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా నేత, కాకతీయ ఫౌండేషన్ డైరెక్టర్ అట్లూరి రాఘవ (చిన్న) గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు మరియు ఇతర కూటమి నేతలు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. *వీరులపాడు* : వెల్లంకి గ్రామంలో మల్లెల నాగేశ్వరరావు రామాంజనేయ వే బ్రిడ్జ్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. బ్రిడ్జ్ యాజమాన్యానికి ఆమె శుభాకాంక్షలు తెలియజేసి, ప్రాంతీయ ప్రజల సరళమైన ప్రయాణానికి ఈ సదుపాయం కీలకమని పేర్కొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ

నందిగామ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో శనివారం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పాలకవర్గం కొత్తగా ప్రమాణ స్వీకరించిన సందర్భం గా ఘన మహోత్సవాన్ని జరిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ముఖ్యంగా, ఎమ్మెల్యే సౌమ్య దేవాలయ కమిటీ చైర్మన్ మహంకాళి వెంకటేశ్వరరావు (వెంకన్న గురుస్వామి) ను శాలువాతో సత్కరించి, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యు లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కొత్త కమిటీ సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే ఈ దేవాలయ చారిత్రక ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, 1890–91 సంవత్సరాలలో నిర్మించబడిన ఈ ఆలయం భక్తుల విశేష పూజలతో, గ్రామం లోని ఆధ్యాత్మిక కాంతిని నిలిపివస్తోందని వివరించారు. సీతారామాంజనేయ స్వామి అనుగ్రహంతో ఈ ఆలయం ప్రాంత ప్రజలకు శాంతి, సమృద్ధి మరియు సాత్వికతకు నిలయంగా ఉంటుందని తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకరించిన కమిటీ సభ్యులు సమిష్టిగా పనిచేసి దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో భక్తులు, స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు, కూటమి నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.భక్తి, విశ్వాసం, సేవ—ఈ మూడు లక్షణాల ప్రతీకగా, నందిగామ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన మహోత్సవం స్థానిక ప్రజలకు ఒక ఆధ్యాత్మిక ఉత్సవంగా మారి చిరస్థాయిగా నిలిచిపోయింది.

చిత్తూరు

అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ – అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్

*అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ* *నిర్వాసితులకు ఆందోళన వద్దు* *అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్* : పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతొంది. ఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు. ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగానే రోడ్డును ఏర్పాటు చేయాలని ఈమధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు ఆ పనులను చేపడుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భాగం రోడ్డు విస్తరణకు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాయల్ పేట గ్రామంలో పర్యటించి మార్కింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో స్థానికులు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి ఆందోళన వద్దని అధికారులు మరియు గ్రామస్తుల తో సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయ సేకరణ అనంతరమే పనులు చేపడతామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వివి మెరక గ్రామంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

మల్కిపురం నవంబర్ 15 పున్నమి ప్రతినిధి శ్రీ చింతా.కోటమ్మ సూర్య ప్రకాష్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు చింతా.సుధాకర్ రావు జగదీశ్ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా 21 సంవత్సరాల నుంచి వృద్ధులకు మరియు అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివి మెరక సర్పంచ్ ఓగూరి. రత్నకుమారి బాబుల్, జాన. శంకర్రావు,(బాబ్జి) సహదేవ్. తాడి, ఉప్పు సోమరాజు, ఇనుమర్తి . శ్రీకాంత్, కందనాల ముత్యాలు, కారు పత్తి భాస్కర నాగేశ్వరరావు, కొండ బాబి, గోళ్ళ బాపూజీ, జాన పార్వతీశం, గుంటు. రంగా తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.