Friday, 20 March 2026

Blog

Others

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం.

రైల్వేకోడూరులో రాష్ట్రస్థాయి అండర్-19 బేస్బాల్ పోటీలు ప్రారంభం. రైల్వే కోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం కే. బుడుగుంట పల్లి పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత కళాశాల మైదానంలో ఎస్.జి.ఎఫ్. ఏపీ సెక్రటరీ భానుమూర్తి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని 13 జిల్లాల అండర్-19 బాలబాలికల బేస్బాల్ పోటీలను శనివారం ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఆంధ్ర రాష్ట్రం నుండి అంతర్ రాష్ట్ర స్థాయి బేస్బాల్ NS 25 జట్టులో ఆడే అవకాశం దక్కుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోదర, తాసిల్దార్ అమర్నాథ్, సీఐ హేమ సుందర్ రావు, ఎంఈఓ సుందర్ బాబు, సర్పంచ్ దార్ల చంద్రశేఖర్, హెడ్మాస్టర్ ఉమా శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

E-పేపర్

చలో ఢిల్లీ మాల మహానాడు రాజ్యాంగ రక్షణ రాజ్యాంగ హక్కులు కోసం…

*రాజ్యాంగ హక్కుల సాధన, రాజ్యాంగ రక్షణకై ఛలో ఢిల్లీ* * బుట్టి సత్యనారాయణ జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి* దూలిమిట్ట : జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యఅతిథిగా *జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ*… రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఎంతకైనా పోరాటం చేయాలని, రాజ్యాంగ హక్కులను సాధించడానికే జాతీయ మాలమహానాడు ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. *డిమాండ్లు:👇🏻* *👉 పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి.* *👉 జాతీయస్థాయిలో మాల, మహార్ అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి.* *👉 శాస్త్రీయమైన లెక్కలు లేకుండా చేసిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, రోస్టర్ జీవో నెం. 99, జీవో నెం. 29 రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి. (నవంబర్ 25న ఢిల్లీలో నిరసన)* *👉 ప్రైయివేటు రంగంలో రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలి.* *👉 ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని 15% నుండి 20% శాతానికి పెంచాలి.* *👉 దళితులపై దాడులను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.* *👉 న్యాయస్థానాల్లో రాజ్య సభలో రిజర్వేషన్లు అమలు చేయాలి.* *👉 భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో నాన్- డీటైయిల్డ్ గా విద్యార్థులకు అందించాలి.* *👉 కరెన్సీ నోట్లపై భారతరత్న అంబేడ్కర్ గారి ఫోటోను ముద్రించాలి.* *👉 బ్యాగరి, కాటికాపరులకు జాతీయస్థాయిలో తగిన గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం అందించాలి.* *👉 ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి.* *👉 రాజ్యాంగ పీఠికను ప్రేయర్లలో తప్పకుండా చదివేల చేయాలి.* లాంటి డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందన్నారు. *నవంబర్ 26న జరిగే ఛలో ఢిల్లీని విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలిని పిలుపునిచ్చారు.* *ఈ కార్యక్రమంలో:- సుద్దాల నర్సింలు, పులి కనకయ్య, మన్నె రాజేందర్ , సుద్దాల కర్ణాకర్, బడే రాజు,సుద్దాల బాబు, సుద్దాల చింటూ, సుద్దాల వినయ్ , సుద్దాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు*

E-పేపర్

భోలా శంకర్ సేవా సమితి అధ్వర్యములో నిత్యవసర సరుకులు

భోలా శంకర్ సేవా సమితి అధ్వర్యములో నిత్యవసర సరుకులు రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు మందల నాగేంద్ర అధ్వర్యములో నరసరంపేటకు చెందిన మల్లెల సుబ్రహ్మణ్యం నాగమణి ల కుమారుడు మురళీసింహనాధ్ యాదవ్ పుట్టినరోజు సందర్బంగా భోళా శంకర్ సేవా సమితి ద్వార ఎవరైనా నిరుపేదలుఉంటె మావంతు సహాయ సహకారాలు అందిస్తాను.అన్ని ముందుకు వచ్చిన వారికి మాభోలా శంకర్ సేవా సమస్త ద్వార రైల్వే కోడూరు రెడ్‌వుడ్ పార్క్ వధ వెంకటేశ్వర పురం నకు చెందిన నిరుపేదలైన కుంభ.వెంకటేసు కిడ్ని పేషంట్ మరియు వారి భార్య హ్యాండిక్యాప్ వసంతమ్మలకు వారివంతు నిత్యావసర సరుకులు బియం పంపిని చేసి మానవత్వము చాటు కున వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేస్తూ మురళీసింహనాధ్ యాదవ్ కు భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షడు మరియు సభ్యులు ద్వార జన్మదిన శుభకాంక్షలు తెలియచేస్తు ఈకార్యక్రమములో పాల్గోనవారు ,చెనం శెట్టి రమేష్ బాబు, బైసాని కిరణ్ కుమార్, వాసా బాబు ,పుల్లశెట్టి రాజేశ్వరి, మహంకాళి సుబ్రహ్మణ్యం, యనమల.రట్టయ్య.కొప్పల.శంకరయ్య ,భూమ్ పల్లి నాగరాజ, తాన్నీరు ఆంజనేయులు,.పెనుకొండ సుబ్బారాయుడు ,శేఖర్, కస్తూరి సుబ్బారావు ,మంధల ప్రశాంత్ ,కంభంపాటి వెంకట్ రమణ, చెనంశెట్టి.పురుషోత్తం,మందల.ప్రమోద్ కుమార్.తధితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తిరుమలగిరిలోనే ప్రత్తి కొనుగోలు ప్రారంభం రైతులకు పెద్ద ఉపశమనం… MLA తంగిరాల సౌమ్య ప్రత్యేక చొరవ

నందిగామ పరిసరాల్లో ప్రత్తి పండించే రైతులకు శుభవార్త. ఇకపై గుంటూరు వరకూ వెళ్లకుండా స్థానికంగానే ప్రత్తిని విక్రయించుకునే అవకాశం లభించింది. నందిగామ మార్కెట్‌యార్డు వద్ద ఇటీవల సీసీఐ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రైతుల సమస్యలను గుర్తించిన స్థానిక శాసనసభ్యు రాలు తంగిరాల సౌమ్య ముందుకు వచ్చి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, సమీపంలోని తిరుమలగిరి సాంబశివ కాటన్ మిల్ వద్దనే ప్రత్తి కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఏ ఎమ్ సి వైస్‌ చైర్మన్‌ అమ్మినేని జ్వాలా ప్రసాద్ మాట్లాడుతూ— మంగళవారం నుంచి రైతులు ముందుగానే స్లాట్‌ బుకింగ్ చేసుకుని తిరుమలగిరిలోనే తమ ప్రత్తిని సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపారు. స్థానికంగా ఈ సౌకర్యం లభించ డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు, సమయ నష్టం, గిరాకీసమస్యలు తగ్గిపోవడంతో రైతులకు నిజమైన ఉపశమనం లభించనుందని చెప్పారు. ఈ ఏర్పాట్లకు కృషి చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు ఎడి, సెక్రటరీలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రానున్న ప్రత్తి సీజన్‌లో ప్రాంతంలోని వేలాది మంది రైతులకు మేలు చేయనుందని వ్యవసాయ వర్గాలు అభినందిస్తున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

CMRF చెక్కులను అందజేసిన సామినేని ఉదయభాను

అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద దరఖాస్తు చేసిన జగ్గయ్యపేట పట్టణానికి చెందిన గుండా వెంకయమ్మ మరియు బరిగెల భాగ్య త్రివేణి కు, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను సిఫారసు మేరకు, జనసేన పార్టీ అధ్యక్షులు & ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో మంజూరైన రూ. 1,28,000/- విలువగల CMRF చెక్కులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ, “పేదల ఆరోగ్య రక్షణ కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తోంది. వైద్యానికి ఇబ్బంది పడుతున్న వారు ఈ నిధులను సకాలంలో పొందడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది. మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోవాలి” అని పేర్కొన్నారు.

సాహితీ

గ్రంథాలయం (కవిత) – డాక్టర్ బద్రి పీర్ కుమార్

గ్రంథాలయ వారోత్సవాలు ( నవంబర్ 14 నుండి 20 వరకు) సందర్భంగా రాసిన గ్రంథాలయం కవిత *గ్రం-* గ్రంథాలు చదవగ *థా-* ధార్మిక విజ్ఞాన శక్తిని పెంచగ *ల-* లయబద్ధమైన మానసరాగాలు పలికించగ ప్రతిఫలించే *యం-* యంత్రాలయం ఏకాగ్రత మంత్రాలయం గ్రంధాలయం

తిరుపతి

ఐఐటి చే ఓరియెంటేషన్ టెక్ వర్క్ షాప్ లో ది స్కూల్ విద్యార్థుల ప్రతిభ

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ది స్కూల్ విద్యార్థులు తిరుపతి ఐ ఐ టి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వారు నిర్వహించిన ఓపెన్ స్కూల్ డే (Open School Day) ది స్కూల్ 9, 10 తరగతి విద్యార్థులు పాల్గొని ఐఐటి చే ఓరియెంటేషన్, టెక్ వర్క్ షాప్ (Orientation, Tech Workshop), విద్యార్థులకు భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి వివరించారు. ఐ ఐ టి ఓపెన్ స్కూల్ డే కార్యక్రమంలో 170 విద్యార్థులు పాల్గొనగ అందులో ది స్కూల్ కి చెందిన విద్యార్థులైన 9వ తరగతి ఎస్.కెతన్ ప్రథమ బహుమతి, 10వ తరగతి ఎం.రీతిక ద్వితీయ బహుమతులను సాంకేతిక పరిజ్ఞానం పై నిర్వహించిన ఉపన్యాస పోటీలో గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ది స్కూల్ కరెస్పాండెంట్ జనార్ధన్ రావు జె. పవార్ మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు ఐ ఐ టి , ఓపెన్ స్కూల్ డే నందు పాల్గొని సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన పొందారని శాస్త్ర , సాంకేతిక రంగాల్లో తమ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు.

తిరుపతి

శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా కయ్యూరు బాలు

తొట్టంబేడు నవంబర్ 15, పున్నమి న్యూస్ : తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత,కవి, రచయిత, మిమిక్రీ కళాకారులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా నియమితులయ్యారని జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కయ్యూరు బాలు మాట్లాడుతూ… సాహిత్య, సాంస్కృతిక పరంగా తను సంస్థకు సేవలు అందిస్తానని వర్థమాన కవులు, కళాకారులను సంస్థ వేదికగా ప్రోత్సాహిస్తానని తనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరీ నాగభూషణం గార్లకు బాలు తన ధన్యవాదాలు తెలిపారు.

తిరుపతి

నాసా పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన శ్రీ చైతన్య విద్యార్థులు

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : స్థానిక శ్రీరామ్ నగర్ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో 6 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు గల అన్ని ఓరియంటేషన్ విద్యార్థులకు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) సంస్థ వారు నిర్వహించిన పరీక్షలో 21 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ NASA వారి తరపున పాఠశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ… నాసా వంటి ప్రపంచస్థాయి సంస్థల నుంచి గుర్తింపు పొందేలా ఎంపిక అయిన విద్యార్థులు ప్రాజెక్టులను తయారు చేయాలని, అది వారి ప్రతిభకు నిదర్శనంగా ఎంపిక కావాలని నాసా సంస్థ వారు విద్యార్థులకు కేటాయించినటువంటి కిట్లను వారికి అందించడం నాకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. అనంతరం ఎ.జి.ఎం సురేష్ మాట్లాడుతూ….ఈ గుర్తింపు మరందరో విద్యార్థులకు ప్రేరణగా నిలిచి గొప్ప లక్ష్యాల వైపు నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ త్రివేణి, S – Batch ఇన్చార్జ్ శ్రీహరి, నాసా ఇంచార్జ్ కవిత పాల్గొన్నారు.

తిరుపతి

దయానంద రావు జై పవర్ కి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నవంబర్ 15, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ రావు జై పవర్ వాళ్ళ తమ్ముడు దయానంద రావు, ఆకస్మిక మృతి చెందారు. అయన పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పఠాన్ ఫరీద్, గోరా, ఉత్తరాజి శరవణ కుమార్,బుల్లెట్ జయ శ్యామ్ రాయల్,మున్నారాయల్, శంకర్, నాగేశ్వరరావు, జూమ్లేష, జిలానీ, ఫిరోజ్, బావాజీ, గాలి రవి నాయుడు, మణి, జయకృష్ణ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.