Saturday, 7 March 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తిలో విదేశీయుల శివనామస్మరణ-ముక్కంటి సేవలో రష్యా, జర్మనీ భక్తులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తి క్షేత్రం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండగా శుక్రవారం నాడు విదేశీ భక్తుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రష్యా, జర్మనీ దేశాలకు చెందిన సుమారు 200 మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆధ్యాత్మిక సాగరంలో విదేశీయులు ఆలయానికి చేరుకున్న విదేశీ ప్రతినిధుల బృందం, సంప్రదాయ దుస్తులు ధరించి క్రమశిక్షణతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని మహిమను, ఆలయ విశిష్టతను తెలుసుకున్న వీరు, స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత, యోగా, శివతత్వంపై ఉన్న ఆసక్తితో తాము ఇక్కడికి వచ్చినట్లు భక్తులు తెలిపారు. ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని చూసి వారు అబ్బురపడ్డారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి, క్షేత్ర ప్రాశస్త్యాన్ని వివరించారు.

తిరుపతి

కైలాసగిరి ప్రదక్షిణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20: శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల గిరిప్రదక్షిణ కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

తిరుపతి

శివపార్వతుల గిరి ప్రదక్షిణ సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి రిషిత రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 20:శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అత్యంత పవిత్రమైన కైలాసగిరి ప్రదక్షిణం (కొండచుట్టు) కార్యక్రమం ఘనంగా జరిగినది. ముందుగా ఆలయం నుండి శ్రీ స్వామి, అమ్మవార్లు బయలుదేరి నాలుగు మాడ వీధుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదక్షిణ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయ గాలిగోపురం వద్ద భక్తిభావంతో ముగిసింది. ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఈ గిరి ప్రదక్షణలో పాల్గొని నియోజకవర్గ ప్రజలందరి సంక్షేమం కోరుతూ ఆ వాయులింగేశ్వరుని కృపాకటాక్షాలు మన నియోజకవర్గ ప్రజలపై, రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటు మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అశేష భక్తజనం పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

చీకోడులో మల్లన్న సాగర్ కాలువ శుభ్రత పనులు – త్వరలో నీటి సరఫరా కోసం అధికారులతో చర్చలు

ముస్తాబాద్/ ఫిబ్రవరి/ పున్నమి ప్రతినిధి ఈజు చీకోడు గ్రామంలో మల్లన్న సాగర్ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న పూడిక, చెట్లు మరియు చెత్తను JCB సహాయంతో తొలగించడం జరిగింది. కాలువలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే, మల్లన్న సాగర్ నీళ్లు త్వరలోనే గ్రామానికి చేరుకునేలా అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మన ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆస రంజిత్, 6వ వార్డు మెంబర్ బనక నాగరాజ్ యాదవ్, ఎమ్మార్వో మరియు మండల సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం

జైలు నుంచి విడుదలైన పగడాల నాగరాజును పరామర్శించిన కేటీఆర్

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ఖమ్మం నగర బి ఆర్ ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజును భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు చరవాణి ద్వారా పరామర్శించారు. సుమారు 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉండి శుక్రవారం విడుదలైన నాగరాజు ఆరోగ్య పరిస్థితి, తాజా పరిస్థితులపై కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల హడావుడి కారణంగా వ్యక్తిగతంగా రావలేకపోయానని, త్వరలోనే ఖమ్మం వచ్చి కలుస్తానని నాగరాజుకు హామీ ఇచ్చినట్లు సమాచారం. నాగరాజు ధైర్యంగా ఉండాలని, పార్టీ కార్యకలాపాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని కేటీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామంతో ఖమ్మం బి ఆర్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాగితాలపూరు రైతులకు ఊరట: పైపులైను–చెక్ డ్యాం పనులతో 400 ఎకరాలకు నీరందింపు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు, జట్లకొండూరు రైతుల కోసం యుద్ధప్రాతిపదికన పైపులైను, చెక్ డ్యాం పనులను పరిశీలించారు. 400 ఎకరాలకు నీటి కొరత నివారణకు రూ.25 లక్షలతో 10 హెచ్‌పీ, 7.5 హెచ్‌పీ మోటార్ల ద్వారా నీటిని చెరువుకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టేళ్లకాలువ చెక్ డ్యాం 2,000 ఎకరాలకు వరంగా మారిందన్నారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు అందించామని, రైతు ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా…

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని ప్లాస్టిక్ వ్యర్ధాలు కాల్చినందుకు ది లష్ రీ ట్రీట్ యాజమాన్యానికి 5,000 జరిమానా… పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి ఓఆర్ సర్వీస్ రోడ్ పక్కన గల ది లాస్ట్ రేట్ యాజమాన్యం గురువారం సాయంత్రం భారీ ఎత్తున ప్లాస్టిక్ నిలువలు కాల్చినట్లు సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు శుక్రవారం ఉదయం హాల్ ప్రాంతానికి చేరుకొని ది లష్ రిట్రీట్ యాజమాన్యానికి 5000 జరిమానా వేధించారు. బై సంఘంగా చెత్త కాల్చడం నిషేధం లో ఉన్నట్లు దీన్ని ఎవరు ఉల్లంఘించిన ఉపేక్షించేది లేదని శానిటేషన్ ఇన్స్పెక్టర్ వనిత అన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ప్రజలు సహకరించాలని చట్టాల్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలిపారు. జిహెచ్ఎంసి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు ఘన సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు తెలిపిన : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​

పున్నమి న్యూస్ ప్రతినిధి 20 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : డాక్టరేట్ అందుకున్న కిన్నెర మొగులయ్యకు సన్మానం – అరుదైన కళాకారుడికి అభినందనలు : వనస్థలిపురం ఇన్​స్పెక్టర్​ మహేశ్​ ‘తెలంగాణ సంస్కృతిలో అరుదైన కళగా పేరు పొందిన 12 మెట్ల కిన్నెర గానాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్య’ అని వనస్థలిపురం పోలీస్​ ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ అన్నారు. అంతరించి పోతున్న కళను తన ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తెచ్చిన మొగులయ్యకు ఇటీవల చెన్నైలోని ‘గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం వనస్థలిపురం పీఎస్​కు వచ్చి ఇన్​స్పెక్టర్​ మహేశ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ మొగులయ్యను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. కళారంగంలో వారి కృషి రాష్ట్రానికి , దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని ఇన్​స్పెక్టర్​ టి. మహేశ్​ ప్రశంసించారు.

రాజన్న సిరిసిల్ల

ఆటో డ్రైవర్లకు రామన్న ఆత్మీయ భరోసా

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామంలో “రామ్మన్న ఆత్మీయ భరోసా” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25 మంది ఆటో డ్రైవర్లకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల పద్మారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో 93 మందికి పైగా ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. సిరిసిల్ల–ముస్తాబాద్ రూట్ ఆటో యూనియన్ అధ్యక్షులు కోటగిరి కనకయ్య మాట్లాడుతూ, వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో KTR అండగా నిలిచారని తెలిపారు. అనంతరం ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించి భరోసా కలిగించారని చెప్పారు. అలాగే ఆటో డ్రైవర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఉచిత చికిత్స అందించేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించిన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మణపల్లె, తుర్కపల్లె, ఆవునూర్ గ్రామాల సర్పంచులు, భారత రాష్ట్ర సమితి BRS గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, యువత సభ్యులు, కార్యకర్తలు మరియు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి హయత్ నగర్ డివిజన్ 20 ఫిబ్రవరి 2026 Madras_Filter_Coffee ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి హయత్ నగర్ ఇంజాపూర్ ప్రధాన రోడ్ మార్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన Madras Filter Coffee ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువ పారిశ్రామిక వేత్తలు స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాపార సంస్థలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. హయత్ నగర్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కొత్త వ్యాపార సంస్థలు ప్రారంభమవడం అభినందనీయమని, వ్యాపారం మరింత అభివృద్ధి చెంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. దుకాణ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలు కూడా స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరారు,ఈ కార్యక్రమం లో బీజేపీ సీనియర్ నాయకులు సంఘీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. హయత్ నగర్ డివిజన్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.