Friday, 20 March 2026

Blog

కడప

తెలుగుగంగ డ్యామ్ కి హారతి పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు

తెలుగు గంగ డ్యామ్ ను పూర్తి స్థాయిలో నింపి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట.. ➖ బ్రహ్మంగారిమఠం నందలి తెలుగుగంగ డ్యామ్ నందు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు. ➖ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి కృషితో తెలుగుగంగ డ్యామ్ చరిత్రలో మొదటి సారిగా 17.2 TMC సామర్థ్యంతో నీటిని నింపటం జరిగింది. ➖ ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు గంగ డ్యామ్ నందు చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి స్థాయితో నింపటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ➖ దీనివలన రైతులకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది, పంట బాగా పండేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ➖ అలాగే చుట్టుపక్కల మండలాలకు త్రాగునీటి సమస్య లేకుండా కొన్ని సంవత్సరాల వరకు నీరు అందుతుందని తెలిపారు. ➖ ఎమ్మెల్యే గారు తెలుగు గంగ జలాలకు పూజలు నిర్వహించి, హారతి

తెలంగాణ

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పరిశీలించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు, నక్కలగండి తండా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరిశీలించారు. గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరద పరిస్థితిని ఆమె పరిశీలించారు. ముఖ్యంగా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నక్కలగండి తండా, అలాగే రిజర్వాయర్ కట్టను ఆమె పరిశీ లించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 95% పూర్తయినందున తక్కిన ఐదు శాతం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఈ సందర్భంగా డిండి ప్రాజెక్టు దిగువ బాగాన ఉన్న రైతులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఊట నీటి కారణంగా తమకు ఇబ్బంది కలుగుతుందని, తమకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ బద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ, డి ఈ చక్రపాణి, పవన్ తదితరులు ఉన్నారు.

విశాఖపట్నం

వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం* *విమ్స్ లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర*

*వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం* *విమ్స్ లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యాన్ని పరిరక్షించు కోవచ్చని విశాఖ ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని విమ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ప్రారంభించారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల థీమ్ అయిన వ్యక్తిగత సామాజిక పరిశుభ్రత అనే కార్యక్రమం లో భాగంగా ఆసుపత్రి ఆవరణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గల కారణాల్లో వ్యక్తిగత అశుభ్రత ఒకటి అని కోవిడ్ టైం లో కూడా వ్యక్తిగత శుభ్రత అనేది ఎంత అవసరమో అనేది మన అందరికీ తెలిసిందన్నారు. మనం మన వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సామాజిక పరిశుభ్రతకు కృషి చేయాలి అన్నారు. నిరంతరం చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పై నృత్యం చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు..

విశాఖపట్నం

హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ అట్మాస్పియర్ కోర్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి: గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ అట్మాస్పియర్ కోర్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ* *ఆ సంస్థ దక్షిణాసియా ఎండీ సౌవాగ్య మొహాపాత్ర, గ్రూప్ ఎండీ సలీల్ పాణిగ్రాహితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు* *రాష్ట్రంలో ఆధునిక పర్యాటక రంగ అభివృద్ధి, ప్రీమియం లగ్జరీ హోటళ్ల విస్తరణ వంటి అంశాలపై చర్చ* • రాష్ట్రంలోని తిరుపతి, విశాఖపట్నం, అమరావతిలో అట్మాస్పియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు • ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని వెల్లడించిన అట్మాస్పియర్ కోర్ సంస్థ ప్రతినిధులు • ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి • గండికోటలో అడ్వంచర్ రిసార్ట్స్, అరకు-అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆలోచన చేయాలన్న సీఎం • బొబ్బిలి-విజయనగరం ప్యాలెస్‌లను పరిశీలించి వాటిని పర్యాటకంగా ఎలా అభివృద్ధి చేయవచ్చనే దానిపై సూచనలివ్వాలన్న సీఎం • రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు ఆసక్తి కనబరిచిన అట్మాస్పియర్ కోర్ ప్రతినిధులు • ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, టూరిజం కార్పోరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, టూరిజం శాఖ ఉన్నతాధికారులు అజేయ్ జైన్, ఆమ్రపాలి

విశాఖపట్నం

విశాఖపట్నంలోని బురుజుపేటలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవం ఏర్పాట్లపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆలయ ఉప కమిషనర్ & కార్యనిర్వాహణాధికారి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

*అమరావతి*నవంబర్ ( విశాఖ పున్నమి ప్రతినిధి) విశాఖపట్నంలోని బురుజుపేటలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవం ఏర్పాట్లపై రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆలయ ఉప కమిషనర్ & కార్యనిర్వాహణాధికారి శ్రీమతి కే. శోభారాణి గారు నేడు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. *ఈ సందర్భంగా EO శోభారాణి మాట్లాడుతూ* బురుజుపేటలో లక్షలాదిగా విచ్చేసే భక్తులను దృష్టిలో పెట్టుకొని వసతి, రక్షణ, పారిశుధ్యం, క్యూ లైన్లు, పార్కింగ్, దర్శనం ఏర్పాట్లు, తాగునీరు, వైద్య సౌకర్యాలు తదితర అంశాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి గారికి వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పలు చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి చరిత్రాత్మక వైభవం, భక్తుల అపార విశ్వాసం వల్ల ప్రతి సంవత్సరం మార్గశిర మహోత్సవాలు విశేషంగా నిర్వహిస్తున్నామని EO తెలియజేశారు. *ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ* దేవాదాయ శాఖ తరఫున అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులకు కలిగె ఇబ్బందులను ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. మహోత్సవాలు మరింత ఘనంగా సాగాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి తల్లి ఆశీస్సులతో విశాఖపట్నం మొత్తం సంపన్నతతో కళకళలాడాలని మంత్రి ఆనం అభిలషించారు

E-పేపర్

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ):

*రైల్వే కోడూరు నియోజకవర్గం* *అన్నమయ్య జిల్లా.* *నూతన వధూవరులను ఆశీర్వదించిన కస్తూరి* అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ): అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు దివంగత రైల్వే కోడూరు మాజీ శాసనసభ్యులు వడ్డే చెన్నయ్య మనమరాలు వివాహము ఈరోజు అనగా 15.11.2025 వ తేదీన శనివారం నాడు తిరుమలలోని శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ గోవిందా కళ్యాణ మండపం నందు జరిగినది కార్యక్రమానికి హాజరై *సాహిత్య – కృష్ణ కిషోర్* నూతన వధూవరులను ఆశీర్వదించిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాధ నాయుడు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు.*

విశాఖపట్నం

సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం- ఏపీ ప్రభుత్వం* *ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఎండీ జెరెమీ జర్గెన్స్, సీఎస్ కె.విజయానంద్* *అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…* • ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోంది. • 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం • అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి సాధించి సరఫరా చేయాలనేది మా ప్రభుత్వ ఆలోచన • ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలి • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగాం • ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలి • అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యం అవుతుంది. • వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ విద్యుత్ అవసరం • అత్యంత నాణ్యమైన, తక్కువ వ్యయంతో విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది • ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నాం • ట్రాన్స్ మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి • పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలు ఉండాలి • ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టాం *మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ…* • ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళ్తోంది. • 6 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశాం • ఇప్పుడు అది సాకారం అయ్యింది. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయటం ఓ సవాలు • అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయటం కూడా ముఖ్యమైన అంశం • అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే అది వ్యయం ఎక్కువ అయిపోతుంది • అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారు • సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెజిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల రక్షణకు పనిచేస్తుంది • ఆయన ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారు. అందుకే మేం అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం • ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నాను *జెరెమీ జెర్గెన్స్ మాట్లాడుతూ….* • ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశం • ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయం • విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్‌లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయి • ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమైన అంశం • దీనికి అవసరమైన నిపుణులైన మానవ వనరుల్ని తయారు చేసుకోవాల్సి ఉంది • సామాజికంగా, ఆర్ధికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరం అవుతుంది *విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…* • ఈ కేంద్రం కేవలం టెక్నాలజీ కోసం మాత్రమే కాదు. ఇంధన వ్యవస్థల రక్షణ కోసం ఏర్పాటు • ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు తీసుకొస్తోంది. • ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యం. • అందుకే సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నాం

విశాఖపట్నం

సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్-2025 ప్లీనరీ-20

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్-2025 ప్లీనరీ-20 సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు-2025 రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం 10:00 నుండి 10:45 వరకు “క్లైమేట్ రిస్క్స్ ఫర్ ఇండియన్ బిజినెస్” అంశంపై 20వ ప్లీనరీ హాల్ -5 లో జరిగింది డా.వెంకట రమణ, CEO, Avera, India Pvt. Ltd, మోడరేటర్ గా నిర్వహిచిన ఈ ప్లీనరీలో ఫిలిప్ అస్మస్, CEO, FyrstGen, స్విట్జర్లాండ్, సచిన్ గుప్తా, మేనేజింగ్ పార్ట్నర్, UV Capital Pvt Ltd, డా. జూలీ రివియర్ – కంట్రీ డైరెక్టర్, GIZ ఇండియా- భూటాన్, సునీల్ నంబియార్ సింగపూర్ పానల్ సభ్యులుగా పాల్గొన్నారు. సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ ధ్రువ వ్యవస్థగా మారుతున్న తరుణంలో, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు భారతీయ వ్యాపారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని పానెల్ సభ్యులు తెలిపారు. వీటి వల్ల ఉత్పాదక కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థలు, అసెట్లు, మార్కెట్లు ప్రభావితమవుతున్నాయని, వరదలు, హీట్ వేవ్ లు, మండుటెండలు, భారీ తుఫానులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. అలాగే విపత్తులు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తూ, కార్మికుల జీవనోపాధులను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రకృతి విపత్తులను సమర్థవంగా నియంత్రించేందుకు, భారతీయ వ్యాపారాలు తమ బలాలను, బలహీనతలను గుర్తించి, ఎదురైయ్యే ప్రమాదాలను ముందుగా అంచనా వేయాలని సూచించారు. తగిన అప్రమత్తత, సంసిద్దతలతో విపత్తు నివారణ, నియంత్రణ వ్యూహాలను ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో అమలు చేయడం అవసరమని తెలిపారు. కార్యక్రమంలో సిఐఐ విపత్తుల నియంత్రణపై ప్రచురించిన డిజాస్టర్ రిజీలియన్స్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ఏలూరు అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, బిల్డింగ్ క్లైమేట్ రిజీలియన్స్ ఫర్ ఇండియన్ ఇండస్ట్రీ నివేదికలను ఆవిష్కరించారు

E-పేపర్

వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి

వైసీపీ రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన రామిరెడ్డి ద్వజారెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 15 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు మండలం పరిధిలోని బుజ్జ వారి పల్లి గ్రామపంచాయతీ బంగ్లామెట్ట ఎస్టి కాలనీ నందు బడ్జెట్ వారి పల్లి ఉపసర్పంచ్ సిద్దు రాయల్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మాజీ శాసనసభ సభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్న రచ్చబండ కార్యక్రమంలో ప్రసంగించిన మండల వైస్ ఎంపీపీ రామిరెడ్డి ప్రజారెడ్డి. కార్యక్రమంలో జడ్పిటిసి పాలెం కోటి రత్నమ్మ, ఉప సర్పంచ్ తోట శివ సాయి ఎంపీటీసీ బండారు మల్లికార్జున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ,

విశాఖపట్నం

సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, ఆ సంస్థ కార్పోరేట్ డెవలప్మెంట్ హెడ్ జతిన్ ఖన్నా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి టీజీ భరత్ రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్న రేమాండ్ గ్రూప్ సిల్వర్ స్పార్క్ అప్పారెల్, జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్, జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్ యూనిట్లకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన రాప్తాడులో రూ.497 కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్న రేమాండ్ గ్రూప్ అనంతపురం జిల్లా గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న రేమాండ్ గ్రూప్ అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్న రేమాండ్ గ్రూప్ మొత్తంగా రూ.1201 కోట్ల పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమల ఏర్పాటు ద్వారా 6500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న రేమాండ్ సంస్థ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.