Friday, 20 March 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: మిగుల సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సర డిగ్రీ కోర్సులో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా కేబీకే నాయక్ ఆదివారం తెలిపారు. బి.కాం(జనరల్), బి.కాం(సీఏ), బి.యస్సీ మేథ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులలో సీట్లు ఉన్నట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుండి అర్హత ధ్రువపత్రాలు, పాస్ ఫొటోలతో కళశాల ఆఫీసు లో సంప్రదించాలన్నారు.

E-పేపర్

మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 : మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ ఏటీఎం పనిచేయడం లేదు మేడిపల్లి ఇండియన్ బ్యాంక్ క్యాష్ రీసైకిలయర్ (RECYCLER ) ATM రెండు రోజులుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బంది ఇండియన్ బ్యాంక్ అధికారులు స్పందించి బ్యాంక్ ఎటిఎం ని మరమ్మతులు చేసి ఖాతాదారులకు అందుబాటులో తేవాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇండియన్ బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన డబ్బులు రీసైక్లింగ్ ( నగదు జమ, డిపాజిట్) ఏటీఎంను ఏర్పాటు చేసిన సందర్భంగా ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ రెండు రోజులుగా క్యాష్ డిపాజిట్ తీసుకోవడం లేదు .మరియు డబ్బులు తీసుకోవాలనుకున్న ఏటీఎం నుండి క్యాష్ రావడం లేదు క్యాష్ రా ఒక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కొంబత్తుల స్టాన్లీ భీమ్ (అరుల్) మొదటి పుట్టినరోజు సందర్భంగా

కొంబత్తుల స్టాన్లీ భీమ్ (అరుల్) తొలి పుట్టినరోజు ఈ ప్రత్యేక రోజున ప్రేమతో, ఆనందంతో నిండిన హృదయపూర్వక శుభాకాంక్షలు. అరుల్ జీవితంలో మొదటి సంవత్సరం అతనికి మాత్రమే కాదు, కుటుంబానికి కూడా ఎంతో విలువైన జ్ఞాపకాలను అందించిన ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిరునవ్వు, ప్రతి చిన్న అడుగు, ప్రతి మురిపెంగా చేసిన చిలిపి నడక—all these moments have turned into precious memories. ఈ తొలి పుట్టినరోజు అరుల్ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేసే కొత్త ఆశలుకు నాంది కావాలి. ఆరోగ్యంగా, ఆనందంగా, విద్యలో రాణిస్తూ, కుటుంబానికి గర్వకారణంగా ఎదగాలి. దేవుడు స్టాన్లీ భీమ్ (అరుల్) కు ఆయురారోగ్యాలతో కూడిన, సుఖసంతోషాలతో నిండిన జీవితం అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. హ్యాపీ 1st బర్త్‌డే స్టాన్లీ భీమ్ (అరుల్

ఆంధ్రప్రదేశ్

పెడన లో హిందువు ల పై జరుగుతున్న దాడుల పై రాష్ట్ర హోం శాఖ దృష్టి సారించాలి :హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

అర్ధరాత్రి అరెస్టుతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పెడన తీవ్ర ఆందోళన చేపట్టిన హిందూ సంఘాలు కృష్ణాజిల్లా హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరావు మాట్లాడుతూ గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పెడన పోలీసులు అరెస్టు చేశారని, ఇదే పెడనలో శివాలయం పై దాడులు చేస్తే వారి మీద ఎటువంటి చర్యలు లేవని, కక్ష కట్టి నన్ను ఒక్కసారి అంతమొందించాలని స్కెచ్ వేస్తే స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారని సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుండి రక్షణ పొందానని అటువంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు లేవని,పోలీసుల పక్షపాత వైఖరిపై ఆయన తీవ్ర నిరసన తెలియజేశారు. ఇదే విషయం పై ఆయనకు మద్దతు తెలియచేయడానికి వచ్చిన బిజెపి జిల్లా అధ్యక్షుడు మరియు హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పట్ల పోలీసుల తీరు సరిగ్గా లేకపోవడంతో వారందరూ రోడ్డుపై బైఠాయించడంతో ఒకానొక పరిస్థితిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెడనలో గోవధ జరుగుతుందని కేసులు పెడితే వారి మీద ఎటువంటి చర్యలు ఉండటం లేదని పిర్యాదు చేస్తున్న హిందువులు ను అక్రమంగా కాళ్ళకు చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేస్తున్నారని, ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర హోంశాఖ పెడనపై దృష్టి పెట్టాలని ఆయన తెలియజేశారు. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఈ విషయం గురించి మా పెద్దలు డిఎస్పి గారితో చర్చిస్తుంటే ఆయన గట్టిగ అరుస్తూ బెదిరిస్తున్నారని, పెడన ఎస్సై,మిమ్మల్ని కొడతాము,తిడతాము, అరెస్టులు చేస్తామంటూ బెదిరిస్తున్నారని, అదే ముస్లింలకు అయితే ఆయన కొమ్ముకాస్తున్నారని పెడనలో ఇవే కొనసాగితే హిందూ బంధువులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

కడప

వైభవంగా కార్తీక మాసం జ్యోతుల మహోత్సవం

*కార్తీక మాసం జ్యోతుల మహోత్సవం సందర్భంగా స్థానిక సుబ్బిరెడ్డి కొట్టాల చౌడేశ్వరి దేవస్థానం,వసంతపేట చౌడేశ్వరి దేవస్థానాల నందు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు* *రామేశ్వరం శ్రీ భద్రావతి భావన్నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు* *ఈ కార్యక్రమాలలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ Vs ముక్తియార్ గారు,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,అమర్ నాథ్ సింగ్,K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి గారు,కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి,ఘంటసాల వెంకటేశ్వర్లు,సోమా బాలయ్య,మార్తల గురివి రెడ్డి,మీగడ చంద్ర,నాగేంద్ర,గురు శేఖర్ రెడ్డి,శ్రీకాంత్,శివ,బాబు,శ్రీనివాసుల రెడ్డి,వద్దిరెడ్డి రామముని రెడ్డి,ఉప్పు మల్లిఖార్జున,ఈఓ జగన్ మోహన్ రెడ్డి గారు,పల్లేటి ప్రభాకర్ రెడ్డి,నందం రామయ్య,పల్లేటి శేఖర్ రెడ్డి,నందం కుమార్,రంగడు,పల్లేటి రాముడు,పగిడాల సుబ్బారెడ్డి,మేరువ మూర్తి,శ్రీనివాసుల రెడ్డి తదితరులు*

కడప

కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ

ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రొద్దుటూరు మండలం ఖాదరాబాద్ గ్రామంలో కొనసాగుతోంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో జిల్లా కార్యదర్శి నొస్సం వెంకట రమణా రెడ్డి గారు గ్రామంలో నిర్వహించారు కార్యక్రమం లో శివ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

కానిస్టేబుల్ ను గుడ్డి వెళ్లిపోయిన కారు.

(పున్నమి ప్రతినిధి విశాఖ జిల్లా తేదీ 17-11-2025) *సూర్యాపేట జిల్లా: నగరం సివారులో వాహనాల తనిక్కి చేపట్టినా పోలిసులు.వీధి నిర్వాహనలో ఉన్న కానిస్టేబుల్ కమలాకర్ ను వేగంగా ఢి కొట్టి వెళ్ళిపోయిన కారు. ప్రమదంలో కానిస్టేబుల్ కి రెండు కాళ్ళు విరిగిపోగా.హాస్పిటల్‌కి తరాలింపు. కారు కోసం వెతుకుతూనా పోలీసులు.

తెలంగాణ

వణుకుతున్న తెలంగాణ… 8.1 డిగ్రీలకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర చలిగాలులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండగా, వికారాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 8.1 డిగ్రీలుగా నమోదు కావడం చలికాలం తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తోంది. రాత్రివేళల్లో ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు చేరుకోవడంతో ప్రజలు వణుకుతున్నారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలానే ఉండగా, రైతులు ఉదయపు మంచు ప్రభావంతో పంటలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో 8.4, 9.1, 9.6, 9.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోవడం గమనార్హం. వాతావరణ శాఖ ప్రకారం వచ్చే 3 నుండి 4 రోజులు ఇలాగే చలి కొనసాగనుంది. ప్రజలు రాత్రివేళల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించింది

E-పేపర్

గీత మహా యజ్ఞం

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామంలో ని కోదండరామాలయంలో భక్తులచే భగవద్గీత పారాయణం చాతుర్మస దీక్ష 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంపూర్ణ గీతా పారాయణం, అభిషేకం, హవనం, మహా పూర్ణహుతి, కార్యక్రమాలు గ్రామ పురోహితులు పెడసనగంటి రవికిరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో నిర్వహింపబడుతున్నాయి. END

E-పేపర్

ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్యవైశ్యులు

రైల్వేకోడూరు స్థానిక ఆర్యవైశ్య సంఘంలో సుమారు 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన రైల్వే కోడూరులో ఎన్నికలు నిర్వహించడం ఉత్కంఠభరితంగా మారింది అని ఆర్యవైశ్యులు అంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.