Saturday, 7 March 2026

Blog

తిరుపతి

శ్రీవారికి వైసీపీ నేతల అవమానం సహించబోం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21:శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పవిత్రమైన సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు నిరసనగా శనివారం ఎమ్మెల్యే నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి (కూటమి) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఉరందూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి, సభ సాక్షిగా అవమానించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. గత ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపిన వారు ఇప్పుడు కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. హిందూ ధర్మంపై, భక్తుల మనోభావాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ శ్రీవారిని కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, కూటమికి చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వరాలయ చైర్మన్‌కు వివాహపత్రికను అందజేసిన జిజేయం ప్రాజెక్ట్స్ ప్రతినిధి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ని జిజేయం ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్, మీడియా హెడ్ చందు సిమిరాల శనివారం నాడు చైర్మన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తన వివాహ మహోత్సవానికి విచ్చేయవలసిందిగా చైర్మన్‌ను కోరారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ చందు సిమిరాలని శాలువాతో ఘనంగా సత్కరించి మహిమగల శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందజేసి, వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి గ్లోబల్ కేర్ ఫార్మా ప్రొప్రైటర్ నార్జాల నరేన్ రాయల్, ఎస్ క్యాబ్స్ ప్రొప్రైటర్ వి. శివతేజ, రాజ్యలక్ష్మి మిల్స్ అండ్ డిగాగిగేటర్స్ ప్రొప్రైటర్ కంటా మునిరత్నం, శ్రీకాళహస్తీశ్వర కో – ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కొట్టే అనిల్ రాయల్, పాకాల రామ్మోహన్ తదితరుల పాల్గొన్నారు.

తిరుపతి

శివయ్యసన్నిధిలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషిత రెడ్డి , ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికి ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. శ్రీకాళహస్తి క్షేత్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా విమాన సర్వీసుల కనెక్టివిటీని పెంచుతామని హామీ ఇచ్చారు.

అనకాపల్లి

ధర్మవరం అభివృద్ధే లక్ష్యం… సమస్యలపై రాజీ లేదు: ఎమ్మెల్యే విజయ్‌కుమార్ ఘాటైన సందేశం

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి(ఆనంద్) : ఎలమంచిలి నియోజకవర్గం ధర్మవరంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘాటైన రాజకీయ సందేశం ఇచ్చారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన ఆయన, ప్రజా సమస్యలపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ధర్మవరం అభివృద్ధికి తాను పూర్తి కట్టుబడి ఉన్నానని, కూటమి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వేగవంతమైన చర్యలు చేపడతామని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయ భేదాలు అడ్డుకావని, ప్రజాహితం కోసం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనకాపల్లి

జనవాణి వేదికగా పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే విజయకుమార్

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ 27 మంది బాధితులకు రూ.13 లక్షల 76 వేల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ గెస్ట్ హౌస్‌లోని ఎమ్మెల్యే ఛాంబర్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యలు జనవాణి ద్వారా తెలియజేసిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను అడ్డుకోవాలని కాంగ్రెస్ నేతల యత్నం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు:

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) దేశ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ నాయకుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో సోమవారం ఆర్ & బి అతిథి గృహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చే సమ్మిట్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. యువ కాంగ్రెస్ నాయకుల చర్యలు దేశ ఖ్యాతికి మచ్చతెస్తాయని విమర్శించారు. భారత్‌ సాంకేతిక రంగంలో ముందుకు సాగుతున్న వేళ, ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవడం దేశ అభివృద్ధికి వ్యతిరేకమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ దేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలుస్తోందని, దీనిని రాజకీయ దృష్టితో చూడడం సరైంది కాదని వారు అన్నారు. దేశ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టే ధోరణిని ప్రజలు సహించరని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆల్లిక అంజయ్య, శ్రీమతి పమ్మి అనిత, సాయి రామ్, జ్వాలా నర్సింహా రావు, ఆచంటి కోటేశ్వరరావు, వల్లల రమేష్, ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్, రుద్ర గాని మాధవ, ఆర్.వి.ఎస్. యాదవ్, నకిరికంటి వీరభద్రం, నల్ల మాస శ్రీనివాస్, మార్తినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

యాచారం మండల్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యంతో శిశువు మృతి

యాచారం మండల్ లోని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు నిర్లక్ష్యంతో శిశువు మృతి డెలివరీ సమయంలో జాగ్రత్తలు పాటించలేదని కుటుంబీకుల ఆరోపణ పున్నమి న్యూస్ ప్రతినిధి 21 ఫిబ్రవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : డెలివరీ సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మగ బిడ్డ చనిపోయాడని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం మల్కిస్గుడా గ్రామానికి చెందిన నానకపేట కళ్యాణిని ఆమె భర్త కృష్ణ డెలివరీ కోసం యాచా రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె మగ బిడ్డకు జన్మినిచ్చింది. అ యితే శిశువు మృతి చెందాడు. ప్రసవం సమయం లో వైద్యులు సరియైన జాగ్రత్తలు తీసుకోలేదని, ప్రసవం కాకపోతే హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తామని ప్రాధేయపడిన వినకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులు అందుబాటులో ఉండ డం లేదని, నర్సులే డెలివరీలు చేస్తున్నారని, అందువల్లనే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ పుట్టినరోజు ఘనంగా జరిపిన బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడూరు గ్రామంకు చెందిన కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సేన నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పలపల్లి గ్రామం కేటీఆర్ సేన అధ్యక్షులు పోతారం సతీష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వంగూరి దిలీప్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగాని మనోహర్, సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ అమర్ కాంత్, సోషల్ మీడియా ఇంచార్జ్ నరేంద్ర చారి మాట్లాడుతూ, కేటీఆర్ సేన బలోపేతానికి వంగూరి దిలీప్ గారు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ సేన మండల, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని వంగూరి దిలీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకున్న సడిమెల శోభారానికి దళిత బహుజన నాయకులు ఘన సన్మానం

ముస్తాబాద్/ ఫిబ్రవరి /పున్నమి ప్రతినిధి కలాంగులకు మరియు పెన్షన్ దారులకు నిరంతరం సేవలందిస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తున్న వికలాంగుల జిల్లా కన్వీనర్ సడిమెల శోభారాణి గారు ప్రతిష్టాత్మకమైన మహాత్మా గాంధీ పేరుతో అందించే ఇంటర్నేషనల్ మహాత్మా గాంధీ అవార్డు అందుకోవడం పట్ల ఈరోజు మండల దళిత బహుజన నాయకులు కలిసి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వికలాంగుల హక్కుల పరిరక్షణ, పెన్షన్ దారుల సమస్యల పరిష్కారం కోసం శోభారాణి గారు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు రావడం గర్వకారణమని పేర్కొన్నారు. సడిమెల శోభారాణి గారు మాట్లాడుతూ, తనపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా వికలాంగులు మరియు పేద ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల దళిత బహుజన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

నామాపూర్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్‌లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్‌లోని మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్‌లో ఈరోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. తమ కాలేజీ జీవితం లోని మధుర జ్ఞాపకాలు, అనుభవాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి విద్యార్థులు భావోద్వేగంగా తమ సందేశాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ కొండల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అధ్యాపక బృందం విద్యార్థులకు తమ అనుభవాలను తెలియజేస్తూ ఆశీస్సులు అందజేసి, క్రమశిక్షణతో కష్టపడి చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ వీడ్కోలు కార్యక్రమం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.