Monday, 4 May 2026

Blog

రంగారెడ్డి

* పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కాంగ్రెస్ శీతకన్ను –పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు –కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలి. —సబితా ఇంద్రారెడ్డి మరియు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం..

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24 : మహేశ్వరం నియోజకవర్గంలోని జిహెచ్ఎంసి మీర్పేట్ సామ యాదిరెడ్డి గార్డెన్ లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తొలిసారిగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించాం.పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చెప్పిన వాస్తవాలను పక్కన పెట్టి కాంగ్రెస్ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.90 శాతం పనులు పూర్తయినా మిగిలిన 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసి, కనీసం చర్చ కూడా చేయలేదు. “పాలమూరు బిడ్డ”నని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు.తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభించింది — కాళేశ్వరం, పాలమూరు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసుల కారణంగా ఆలస్యం జరిగింది, లేకుంటే ఎప్పుడో పూర్తయ్యేది.అన్ని కేసులు కొట్టివేసిన తర్వాత 30 వేల కోట్ల రూపాయలతో కేసీఆర్ పాలమూరు పనులకు శంకుస్థాపన చేశారు 27 వేల కోట్లతో రిజర్వాయర్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే నీళ్లు వస్తాయని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.పాలమూరు ప్రాజెక్టు పూర్తైతే 7 నియోజకవర్గాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదు, తట్ట మట్టి కూడా తీయలేదు.45 టీఎంసీలు సరిపోతాయని మంత్రి ఉత్తమ్ ఎందుకు లేఖ రాశారో ప్రజలకు చెప్పాలి.గత 10 ఏళ్లలో కేసీఆర్ రైతులకు ఉచిత కరెంట్, ప్రాజెక్టులు, రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్‌ను విమర్శించడమే కాదు, ముందుగా మిగిలిన పనులు పూర్తి చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా కూలిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సీఎం తన సొంత నియోజకవర్గానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారా? మిగతా నియోజకవర్గాలకు నీళ్లు అవసరం లేదా అని ఘాటుగా స్పందించారు. ఇట్టి అంశంపై కెసిఆర్ అధ్యక్షతన మా కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు.ఈ సమావేశంలోరంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ , మహేష్ రెడ్డి , మెతుకు ఆనంద్ , పైలెట్ రోహిత్ రెడ్డి , ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి , సీనియర్ నాయకులు క్యామ మల్లేష్ , రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఉమ్మడిగా చెక్ పవర్ –రద్దు వార్తలు అవాస్తవం – పార్టీలకు అతీతంగా పల్లెల అభివృద్ధి. –కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బి ఆర్ ఎస్ నేతల అవాస్తవాలు: కే ఎల్ ఆర్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24 : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ… అవాస్తవాలు, సత్య దూరమైన ప్రకటనలు చేస్తున్నారని బిఆర్ఎస్ నేతలపై లక్ష్మారెడ్డి మండిపడ్డారు.మహేశ్వరం నియోజకవర్గంలో గంగపుత్రులు, ముదిరాజులు, చేపల పెంపకంపై ఆధారపడ్డ కుటుంబాలకు చేయుతనివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందని అన్నారు.ప్రతీ ఇంటికి ఉచిత విద్యుత్, రేషన్ సన్నబియ్యం – కార్డులు, బస్సు ప్రయాణం, మహిళా రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ, గ్యాస్ సిలిండర్, లక్షలాది మంది రోగులకు సీఎంఆర్ఎఫ్ , ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తూనే.. రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడా డోకా లేకుండా సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, ఫ్యూచర్ సిటి పనులు, విద్య – వైద్యం, ఉద్యోగ – ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామని కిచ్చెన్న స్పష్టం చేశారు.

యాదాద్రి భువనగిరి

* ఎలాంటి సమస్య లేకుండా ప్రజలలకు నిరంతరం వైద్యం అందించాలి ..సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) డిసెంబర్ 24 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని సందర్శించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి . ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు విషయంపై డాక్టర్ సిబ్బందిని ఆరోగ్య కేంద్రంలో సమస్యలు అడిగి తెలుసుకుంది. ఎంతోమంది మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వైద్యం కోసం వస్తున్న తరుణంలో ఇలాంటి సమస్య లేకుండా చూసి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. మంచినీటి సౌకర్యము, నీటి సరఫరా సక్రమంగా లేక పోవటం. మీటింగ్ హాల్ లేకపోవడం ఫర్నిచర్ కొరత ఉండటం మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండటం వల్ల అన్ని గదులను పరిశీలించి పైన ఉన్న వాటర్ ట్యాంకులను పరిశీలన చేసి ట్యాంక్ లోకి నీళ్లను ఎక్కించి వైద్యులకు, ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి వైద్యురాలు కు సిబ్బందికి హామీ ఇవ్వడం జరిగింది. మండల ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి తండాల నుంచి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యము కల్పించి తేలుకాటు కుక్కకాటు పాము కాటు నివారణకు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే విధంగా వైద్యులు నిరంతరం ప్రజలకు సేవలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ, మాజీ సర్పంచ్ కొండ్రెడ్డి నరసింహ, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, కొండ నవీన్ గౌడ్, వార్డు మెంబర్ సూరపల్లి వెంకటేశం, పట్నం బాలకృష్ణ, బల్గూరి శివ, కాంగ్రెస్ నాయకులు గునిగంటి రాజు గౌడ్, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేశం, ఎండి యూసఫ్ ఖాన్, ఈసం శివకుమార్, విడం సాయి కిషోర్,ప్రెస్ రిపోర్టర్ సింగం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

గుర్తుతెలియని గడ్డి మందు తాగి ఒకరు మృతి

కామారెడ్డి, 24 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : మానసిక ఒత్తిడికి గురై గుర్తుతెలియని గడ్డి మందు తాగి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం చాతర బోయిన శంకర్ మృతి చెందాడు.బుధవారం ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.మన స్థాపాలతో బాధపడుతున్న శంకర్, గుర్తు తెలియని గడ్డి మందు సేవించుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభిం చారు.రామారెడ్డి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శంకర్ శవాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కు తరలించారు. మొదటి నివేదికల ప్రకారం, మానసిక ఒత్తిడి కారణంగానే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.పోలీసులు మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అనకాపల్లి

ఎలమంచిలిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు

డిసెంబర్ 24 పున్నమి న్యూస్ ప్రతినిధి: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలమంచిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ హాజరై భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం సందేశాన్ని ఇచ్చారు.

విశాఖపట్నం

సృష్టి వరల్డ్ స్కూల్‌లో క్రిస్మస్ వేడుకల సందడి

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) ఉక్కునగరం సెక్టర్–11లోని సృష్టి వరల్డ్ స్కూల్‌లో క్రిస్మస్ పండుగను భక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ, బాల యేసు జన్మ వృత్తాంతాన్ని నాటికగా ప్రదర్శించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పశువుల పాక సందర్శకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ పి. సుశీలా రాణి విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఈ. చంద్రిక, ఎగ్జిక్యూటివ్ ప్రిన్సిపల్ డి. కిరణ్, చీఫ్ అకాడమిక్ హెడ్ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఖమ్మం

సిరి గోల్డ్ కేసు ఎఫెక్ట్‌? రామచంద్ర రావు ఖమ్మం పర్యటన రద్దు వెనుక కారణమిదేనా!

ఖమ్మం డిసెంబర్ (పున్నమి జిల్లా ప్రతి నిధి) ఖమ్మం జిల్లా పర్యటనను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 24వ తేదీ బుధవారం నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తల్లాడలో నిర్వహించనున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రామచంద్ర రావు హాజరుకావాల్సి ఉండగా, చివరి నిమిషంలో పర్యటన రద్దైనట్లు సమాచారం. ఇదే సమయంలో సిరి గోల్డ్ వ్యవహారంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కుసంపూడి రవీందర్‌లపై బాధితుడు యాస నాగేశ్వరావు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రామచంద్ర రావు ఖమ్మం పర్యటనకు వస్తే మీడియా ప్రతినిధులు సిరి గోల్డ్ అంశంపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉండటంతో, సమాధానాలపై ఒత్తిడి తప్పించుకునేందుకే పర్యటనను రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, సిరి గోల్డ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకుల నుంచి తెప్పించుకునే పనిలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. అవసరమైతే ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నుంచి రాజీనామా కోరడం లేదా పార్టీ నుంచి బహిష్కరణ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా బీజేపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయా అన్నది వేచి చూడాల్సిందే.

రాజన్న సిరిసిల్ల

ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న నామాపూర్ సర్పంచ్ మాదాసు అనిల్ పాలకవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాదాసు అనిల్ గారు తన మాటను నిలబెట్టుకున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్య అయినా ఇందిరమ్మ కాలనీ లో మురికి కాలువ అపరిశుభ్రంగా ఉందని దీని వలన ప్రజలకు అనేక రోగాలు మరియు అంటువ్యాధులు వ్యాపిస్తున్నాయని ప్రజలు తనను కోరారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే గ్రామంలో మురికి నీటి పారుదల వ్యవస్థ చక్కగా ఉండాలని వాటిని కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈరోజు తాత్కాలిక పరిష్కార మార్గంగా జెసిపితో మురికినీటిని అక్కడి నుంచి వెళ్లే విధంగా దానిని శుభ్రం చేస్తూ ప్రజలకు అండగా ఉంటా అంటూ మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనిల్ గారు మరియు అతని పాలకవర్గం పాల్గొన్నారు ఈ విషయం పైన ప్రజలు అతనికి అభినందనలు తెలియజేశారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెను : పాస్టర్ ఎర్నెస్ట్ పాల్

ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెను : పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ అమలాపురం, డిసెంబరు 24 ( పున్నమి ప్రతినిధి ) : ప్రపంచానికి ప్రేమ తత్వాన్ని బోధించడానికి ఏసు క్రీస్తు జన్మించెననీ పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ తన క్రిస్మస్ సందేశం లో పేర్కొన్నారు. డా.బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ లోని శాంతిని కేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాస్టర్ ఎర్నెస్ట్ పాల్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందించారు. సాటి వారిని ప్రేమించి సమాజంలో అసమానతలు తొలగించుకోవడమే క్రీస్తు బోధనలు ముఖ్య ఉద్దేశమన్నారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గణిత పోటీలలో విజేతలకు మెమంటో ష్, సర్టిఫికెట్స్ అందజేశారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ కేక్ కట్ చేసి విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ బి.నాగరాజు, సెక్రటరీ ప్రసన్న లక్ష్మీ, ప్రిన్సిపాల్ కే.వి.వి.ఎస్. సత్యనారాయణ, ఏ .ఓ నాగదుర్గ, ఉపాధ్యాయ బృందం ప్రసాద్, భవాని, జ్యోతి, వనితా దేవి, కావ్య, అపర్ణ, ఎన్.కనక దుర్గ, అలేఖ్య పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పైప్స్ రంగంలో విశ్వసనీయ బ్రాండ్ సుధాకర్

సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ దేశవ్యాప్తంగా విశ్వసనీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. పైప్స్, ఫిట్టింగ్స్, వైర్లు, కేబుల్స్, ప్రొఫైల్ సిస్టమ్స్ తయారీలో అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ నాణ్యతకు పెద్దపీట వేస్తోంది. ISO 9001:2015 సర్టిఫికేషన్‌తో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది. గృహ, వాణిజ్య, పరిశ్రమల అవసరాలకు తగిన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందిస్తోంది. దీర్ఘకాలిక మన్నికే సుధాకర్ ప్రత్యేకత.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.