Saturday, 7 March 2026

Blog

హైదరాబాద్

గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయండి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి పేదల సొంతింటి కల నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పం

హైదరాబాద్ పున్నమి ప్రత్యేక ప్రతి నిధి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో గత 12 ఏళ్లుగా ఒక ఇల్లు కూడా కేంద్ర పథకాల కింద మంజూరు కాలేదని పేర్కొంటూ, కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా 3 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పొంగులేటి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గృహనిర్మాణ పరిస్థితులు, పెండింగ్ డిమాండ్, కేంద్ర పథకాల కేటాయింపులపై ఆయన సమగ్ర వివరాలు అందించారు. 2014 నుంచి 2023 వరకు దాదాపు పదేళ్ల కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణం జరగలేదని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం కేంద్రం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదని విమర్శించారు. సంవత్సరానికి కనీసం పదివేల ఇండ్ల నిర్మాణం కూడా జరగలేదని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో భారీగా గృహ అవసరం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం పేదల గృహనిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ‘ఇందిరమ్మ ఇండ్లు’ మంజూరు చేసినట్లు వెల్లడించారు. కేంద్రం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం గతంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ (PMAY-G) 1.0లో భాగస్వామ్యం కాలేదని మంత్రి వివరించారు. 2023 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం PMAY-G 2.0లో రాష్ట్రం అధికారికంగా చేరిందన్నారు. 2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం PMAY-G 2.0కు ఆమోదం తెలిపి, ఆవాస్+2018 సర్వే ఆధారంగా ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించిందని చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రం PMAY-G 1.0లో భాగం కాకపోవడంతో 2018 పెండింగ్ డేటా లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్ సిద్ధం చేసిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే చేపట్టి 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించారు. గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల ఇండ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని మంత్రి పొంగులేటి అధికారికంగా కోరారు. పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసం కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గృహాలను మంజూరు చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నారాయణపేట

పాఠశాలకు చేయూత భద్రాది ఫౌండేషన్ దాతృత్వం

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో భద్రాది ఫౌండేషన్ తరపున తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా కున్సి గ్రామ పాఠశాలకు రూ 75,022/- విరాళంగా అందిస్తున్నట్లు ఉపాధ్యాయుడు రామకృష్ణ గారు తెలిపారు ఈరోజు జరిగిన కార్యక్రమంలో భద్రాది ఫౌండేషన్ తరపున కున్సి ఉన్నత పాఠశాల విద్యార్థులకు చేయూతగా ఉండాలని భావించి 75 వేల 22 రూపాయలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సంతోషి గారికి విరాళంగా అందజేశారు. దాతృతం గుణం కలిగిన రామకృష్ణ గారి సేవా భావాన్ని మెచ్చుకుంటూ, ఈ విరాళాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా సమర్థవంతంగా వినియోగిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత రామకృష్ణ గారు వారి తల్లిదండ్రులు ధన్వాడ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ కుమార్ గారు ఉపాధ్యాయులు నరేందర్ గారు కాశి అలిమ్ గారు నర్సింలు గారు సత్యనారాయణ రెడ్డి గారు సౌమ్య స్వాతి గీత నాగేష్ రాధిక గారు సుదర్శన్ గారు హరీఫ్ గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరఫున భద్రాద్రి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఇంటర్మీడియేట్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు,జిల్లా ఎస్.పి. డా.అజిత వేజెండ్ల IPS,,గారు.

SPS నెల్లూరు జిల్లా తేది:21.02.2026 జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ పోలీస్ కంట్రోల్ వాట్సాప్ +919392903413 లేదా 100/112 కు సమాచారం అందించాలి – జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు… జిరాక్స్‌ సెంటర్లు మూసివేత, పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు ప్రతీ రోజు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించు ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలియచేసారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని తెలిపారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఆర్మ్డ్ గార్డులను పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాలు నిఘా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 82 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణ నిర్వహించేందుకు ఇతర శాఖల సమయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని, ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షలు జరుగు సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలు దాటితే పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని, కావున దయచేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులతో పాటు పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది కూడా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతి లేదన్నారు. చిట్టీలు, పుస్తకాలు పెట్టి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

తిరుపతి

శ్రీకాళహస్తి, గుడిమల్లం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తాం-కేంద్ర మంత్రి

శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా ఇరువురు అభివృద్ధి పనులపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ అభివృద్ధికి చేపడుతున్న మాస్టర్ ప్లాన్ పనులను మంత్రికి వివరించారు. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత పురాతన శివలింగం ఉన్న గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ విశిష్టతను, అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ….ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీకాళహస్తి, చారిత్రక గుడిమల్లం ఆలయాలను దేశవ్యాప్తంగా అగ్రగామి పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విన్నవించినట్లుగా శ్రీకాళహస్తి కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, మన సంస్కృతికి నిలువుటద్దమని గుడిమల్లం, శ్రీకాళహస్తి ఆలయాలకు కేంద్ర పర్యాటక శాఖ నుండి మరిన్ని నిధులు, గుర్తింపు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెంచేలా విమానయాన అనుసంధానతపై కూడా దృష్టి సారిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొజ్జల కుటుంబ సభ్యులు, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు, ముఖ్య అనుచరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా పల్లకి సేవ..పురవీధుల్లో విహరించిన ఆది దంపతులు

శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహో్మూ వాత్సవాలలో భాగంగా శనివారం రాత్రి పల్లకి సేవ వైభవంగా జరిగింది. మానవులకే కాకుండా దేవతల సైతం స వతి పోరు తలనొప్పులు పుట్టించినట్టు పురాణాలలో వుంది. మహాశివరాత్రి బ్రహ్మోవాత్సవాలలో అత్యంత ప్రత్యేకమై నది పల్లకి సేవ పార్వతి దేవి ఎంతో ఇష్టపడి మనువాడుతుంది. పరమశివుడు మాత్రం గంగాదేవిని వదలక నెత్తిన జ టాజుటంలో పెట్టుకుంటాడు అంతేకాకుండా ఉత్సవాల సమయంలో ప్రత్యేక స్థానాన్ని గంగాదేవికి కల్పిస్తాడు వివాహ అనంతరం పరమేశ్వరుడు గంగాదేవితోనే ఊరేగడం జ్ఞానప్రసునాంబిక దేవికి విపరీతమైన కోపాన్ని కలిగిస్తుంది. దీని తో స్వామి కోసం ఎదురు చూడకుండా కోపంతో ముందుగానే పల్లకీలో వెళ్లిపోతుంది. ఆమె కోపాన్ని తగ్గించాడానికి స్వామి అమ్మవారి వెనుకగా పరుగులు తీస్తారు. ఈ నయానాందకర దృశ్యం శనివారం రాత్రి జరిగింది, “ప్రతి ఉ’ త్సవాలలో స్వామి వాహనానికి వెనుక ప్రక్కన అమ్మవారు వస్తారు. ఐతే పల్లకి సేవ రోజు మాత్రం అమ్మవారి వాహనం ముందుగా వెళుతుంది. ఆగ్రహంతో వున్నట్లు అమ్మవారిని పూజరులు అలంకరిస్తారు. భక్తులు నేరుగా అమ్మవారిని చూడటం అంత శ్రేయేస్కరం కాదని అమ్మవారిముందర దర్పణం (అద్దం) అమర్చుతారు. భక్తులు అమ్మవారిని దర్ప ణ దర్శినం చేసుకుని తరించారు. ఉత్సవాల్లో భాగంగా చివరగా జరిగే ఏకాంత సేవతో ఈ వేడుకలు ముగియనున్నాయి. భక్తులు తమ ఇంటి ముంగిట స్వామివారికి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సేవలో దేవస్థాన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

తిరుపతి

‘జీరో లిట్టర్’ పారిశుధ్య డ్రైవ్ చేపట్టిన మునిసిపల్ కమిషనర్ భవాని ప్రసాద్

శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీ కాళహస్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. శనివారం నాడు ప్రభుత్వం వారు లీట్టర్ ఫ్రీ గవర్నెన్స్ ను ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమలలో భక్తులు వదిలివేసిన వ్యర్ధాలను కమిషనర్ పి. భవాని ప్రసాద్ తమ పారిశుద్ధ్య కార్మికులతో కలసి కైలాసగిరి ప్రాంతము, రాజీవ్ నగర్, టైలర్స్ కాలనీ, రామాపురం డ్యాం వరకు లిటిరింగ్ జరిగిన ప్రదేశాలలో పేపర్ ముక్కలు వాటర్ బాటిల్స్ మిగిలిన చెత్తను శుభ్రపరచడం వంటి కార్యక్రమాన్నిచేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మునిసిపల్ సిబ్బంది, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రాని పూర్తిచేశారు.

తిరుపతి

రూ…21 లక్షలు దాటిన శ్రీ పరుశురామేశ్వర స్వామి ఆదాయం

ఏర్పేడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: ఏర్పేడు మండలంలోని గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్బంగా వచ్చిన విరాలను శనివారం నాడు ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణ అధికారి పరివేక్షణలో లెక్కించడం జరిగినది. టికెట్ల ద్వారా రూ..521200, చందాల ద్వారా రూ..207928, ఆన్లైన్ ద్వారా రూ..2599922, స్వామివారికి పుష్పాలంకరణతో వచ్చిన చందా రూ..161116, హుండీల ద్వారా రూ.. 631149, అన్నదానం ద్వారా రూ..11254,లు శివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి మొత్తము శివరాత్రికి ఆదాయము రూ..2162569 లు వచ్చినదని అలయాధికారులు అధికార పూర్వకంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కే రామచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరుపతి డివిజన్ ఇన్స్పెక్టర్ పనిరాజ సేన, పాలకమండ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

కే.వి.బి. పురం మండలంలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు

కే.వి.బి. పురం, పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21: కే.వి.బి. పురం మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ రాగిగుంట పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు ఎస్. వెంకట కృష్ణయ్య ఆధ్వర్యంలో, ఆర్. శ్రీలక్ష్మి,సుహాసిని ఇతర ఉపాధ్యాయులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యవక్తలు మాట్లాడుతూ…. ఒక జాతి మనుగడకు మాతృభాష అత్యంత అవసరమని తరించిపోతున్న అనేక జాతుల మనుగడకు మాతృభాష పరిరక్షణ ఎంతో ముఖ్యమని మాతృభాషలోనే ప్రాథమిక విద్య జరగేటట్లు ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన “భువనవిజయం” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం విద్యార్థులను మాత్రమే కాకుండా గ్రామస్తులను కూడా ఎంతో ఆకట్టుకుంది. విద్యార్థులు చారిత్రక పాత్రలను ధరించి అద్భుతంగా ప్రదర్శన ఇవ్వగా విద్యార్థుల కోసం క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడంజరిగినది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

తిరుపతి

ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శివ భక్తులకు అన్నదానం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: మహాశివరాత్రి లో భాగంగా 8వ రోజైన పల్లకి సేవ రోజున శ్రీకాళహస్తి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ….మహాశివరాత్రి సందర్భంగా గతంలో తమ సంఘ పెద్దలు ‌ దేవుడి పెళ్లి రోజున కొన్ని వందల పేదలందరికీ తాళిబొట్లు పంపిణీ కార్యక్రమం జరిగేదని దాని కొనసాగింపుగా ప్రస్తుతం ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహించడంలో మా సంఘం ముందుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ పెద్దలు వై వి రమణయ్య, తోటకూర కోటేశ్వరరావు, ఆకుల గురుమూర్తి, కోనేటి అయ్యప్ప, మణి, పిల్లారి అమరావతి, పిల్లారి బత్తినయ్య, ఆకుల సునీత, బొజ్జ గోవిందస్వామి, రాజేంద్ర, అంకయ్య, రాధాకృష్ణ, కునాటి ఈశ్వర్, రాయపేట సుబ్రహ్మణ్యం, తిరుపాల్, రాజా, వేణు, నరేంద్ర, కోటి, మునస్వామి, నాగార్జున, కోనేటి నాగలక్ష్మి, అమ్ములు, జయంతి ముదిరాజ్ సంఘ నాయకులూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీవారికి వైసీపీ నేతల అవమానం సహించబోం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 21:శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పవిత్రమైన సభ సాక్షిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని అవమానించే విధంగా వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు నిరసనగా శనివారం ఎమ్మెల్యే నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి (కూటమి) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో వైసీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం ఉరందూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే, అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ… కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి, సభ సాక్షిగా అవమానించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. గత ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రతను మంటగలిపిన వారు ఇప్పుడు కూడా తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. హిందూ ధర్మంపై, భక్తుల మనోభావాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ శ్రీవారిని కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. పవిత్ర క్షేత్రాల ప్రతిష్టను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, కూటమికి చెందిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.