Monday, 4 May 2026

Blog

విశాఖపట్నం

రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే.

*తిరుపతి డిసెంబర్ 26 విశాఖ పున్నమి ప్రతినిధి* – రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణే. – రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం. – పోస్టర్లపై జంతు రక్తం చల్లి భయబ్రాంతులకు గురిచేసే సంస్కృతి ఏమిటి? – గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టిన పోలీసులకు అభినందనలు. – అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు భరోసాగా పోలీసులు. *తిరుపతిలో నూతన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో తన అభిప్రాయాలను రాసిన ముఖ్యమంత్రి.

విశాఖపట్నం

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ

సిఐటియు అఖిలభారత మహాసభలు జయప్రదంకై సిఐటియు బైక్ ర్యాలీ *విశాఖపట్నం డిసెంబర్ 26పున్నమి ప్రతినిధి* విశాఖలో ఈ నెల 31 నుండి జనవరి 4వరకు జరుగుతున్న సిఐటియు అఖిలభారత 18వ మహాసభలను విజయవంతం చేయాలని మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీని ప్రజాశక్తి జనరల్ మేనేజర్ కె. హరికిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మద్దిలపాలెం ఆఫీస్ నుండి ప్రారంభమై సత్యం జంక్షన్, సీతమ్మధార, హెచి కాలనీ, వెంకోజీపాలెం, ఎంవిపి, వాల్తేరు మీదుగా సిరిపురం నుండి మద్దిలపాలెంకు చేరుకుంది. ఈ సందర్భంగా జోన్ కార్యదర్శి పి. వెంకటరావు మాట్లాడుతూ విశాఖలో జరిగే ఆలిండియా మహాసభలకు వివిధ రాష్ట్రాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఎయు కన్వెన్షన్ హాల్లో జరిగే మహాసభల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక పోరాటాలను చర్చించడం జరుగుతుందన్నారు. 27 నుండి జనవరి 2వ తేదీ వరకు బీచ్డ్డులో ఉన్న ఎయు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రామిక ఉ త్సవాలను రేపు సాయంత్రం జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని, సినీ ప్రముఖులు ప్రకాష్రజ్ ముఖ్యఅతిధిగా హజరవుతున్నారన్నారు. 4న మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో సిఐటియు నాయకులు వి.సరేంద్రకుమార్, కె. కుమారి, శంకర్, శ్రీను, నాయుడు, ఆదినారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ*

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ* పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం డిసెంబర్ 26 ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 పిలుపుమేరకు ఈనెల 27న చేపట్టనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 9:30 గంటల వరకు జర్నలిస్టులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జారీ చే సిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ ధర్నా చేపడం జరుగుతుందన్నారు. అర్హులైనజర్నలిస్టులందరికీ అక్రిడి టేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల జo గ్ సైరన్ పేరిట చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జర్నలిస్టులను కోరారు.రాష్ట్ర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని, తెలిపారు.

E-పేపర్

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ*

కలెక్టరేట్ జర్నలిస్టుల ధర్నా జయప్రదం చేయండి* 👉*అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలి* 👉 *ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ* పున్నమి న్యూస్ ప్రతినిధి: ఇబ్రహీంపట్నం డిసెంబర్ 26 ) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252ను సవరించాలని కోరుతూ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 పిలుపుమేరకు ఈనెల 27న చేపట్టనున్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టి యు డబ్ల్యూ జే – హెచ్,143 అధ్యక్షులు సూరమోని సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం ఉదయం 9:30 గంటల వరకు జర్నలిస్టులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నూతనంగా జారీ చే సిన జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ ధర్నా చేపడం జరుగుతుందన్నారు. అర్హులైనజర్నలిస్టులందరికీ అక్రిడి టేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టుల జo గ్ సైరన్ పేరిట చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని జర్నలిస్టులను కోరారు.రాష్ట్ర రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని, తెలిపారు.

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేకే మహేందర్ రెడ్డి తుర్కపల్లి గ్రామా నివాసులైన అంబేద్కర్ సంఘం శాఖ అంకని అశోక్ అంకని మురళి అడ్వకేట్ అంకని అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వెలుమల రామిరెడ్డి యాదగిరి గౌడ్ కర్ణాకర్ బాలయ్య ఇతర కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు మహిళా మండల అధ్యక్షులు వనిత పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

రాజన్న సిరిసిల్ల

కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న నూతన సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్రెడ్డి ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామానికి చెందిన నూతనంగా ఎంపికైన గ్రామ సర్పంచ్ రోడ్డబాగ్య వార్డు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ అయిన కేక మహేందర్ రెడ్డి తుర్కపల్లి గ్రామా నివాసులైన అంబేద్కర్ సంఘం శాఖ అంకని అశోక్ అంకని మురళి అడ్వకేట్ అంకని అశోక్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు వెలుమల రామిరెడ్డి యాదగిరి గౌడ్ కర్ణాకర్ బాలయ్య ఇతర కార్యకర్తలు ప్రముఖ వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు మహిళా మండల అధ్యక్షులు వనిత పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాజీ ఎంపీటీసీ శ్రీనివాసు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

నూతన సంవత్సర వేడుకల్లో డ్రింక్ అండ్ డ్రైవ్‌కు చెక్ – చిట్వేల్ ఎస్సై హెచ్చరిక

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని చిట్వేల్ మండలం ఎస్సై ఎస్.వినోద్ కుమార్ హెచ్చరించారు. డ్రింక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించడంతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే చర్యలు కూడా తప్పవని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ డ్రైవింగ్, సైలెన్సర్ల మార్పు, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చిట్వేల్ మండల ప్రజలు చట్టాన్ని అతిక్రమించకుండా నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై సూచించారు.

E-పేపర్

వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించిన చెన్నంశెట్టి చిన్న

వంగవీటి మోహనరంగాకు నివాళులర్పించిన నాయకులు రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వేకోడూరు స్థానిక శివాలయం సెంటర్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి సందర్భముగా ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నా చెన్నంశెట్టి శెట్టి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన అభిమానులు మరియు రైల్వే కోడూరు పట్టణంలో ఆయనకు ఘనంగా బాణసంచా పేలుస్తూ నాయకులందరూ ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. అన్నమయ్యజిల్లా రాధా రంగా మిత్ర మండలి అధ్యక్షులు మర్రి రెడ్డి ప్రసాద్,రైల్వేకోడూరు గౌరవ అధ్యక్షులుచెన్నం శెట్టి చలపతి,కోడూరు అధ్యక్షులు చెన్నం శెట్టి శ్రీనివాసులు,భాస్కర్,మందల నాగేంద్ర, రమేష్, వంశీ, ఎంపీటీసీ మల్లికార్జున, రత్తయ్య, అంకెపల్లి అఖిల్, వాసా బాబు మొదలగువారు పాల్గొన్నారు.

E-పేపర్

పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్..

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….* అబ్దుల్లాపూర్మెట్ మండల పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 25 డిసెంబర్ 2025 అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

E-పేపర్

పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్ అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో

*పుష్ప సినిమా స్టైల్లో గోవుల స్మగ్లింగ్….* అబ్దుల్లాపూర్మెట్ మండల పున్నమి న్యూస్ ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : 25 డిసెంబర్ 2025 అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రం వద్ద విజయవాడ హైవే పై 70కి పైగా ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని గోరక్షక కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. నిందితులు పోలీసుల కళ్లుగప్పేందుకు లారీ పైభాగంలో తాడిమట్టలతో ప్రత్యేకంగా అరలను ఏర్పాటు చేసి, వాటి కింద గోవులను దాచారు. అంతేకాకుండా, ఈ లారీకి ఒకవైపు హర్యానా, మరోవైపు తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఉండటం గమనార్హం. అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగుచూసింది. కార్యకర్తలు వెంటనే లారీని పోలీస్ స్టేషన్ తరలించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.