Thursday, 19 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

APK ఫైల్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

, SPSR నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) నకిలీ APK ఫైళ్లతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా యస్‌.పి. డా. అజిత వేజెండ్ల, IPS తెలిపారు. కావలి 1టౌన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక సాయం తీసుకొని జార్ఖండ్‌లోని జాంతారా జిల్లాలో ముగ్గురు ముద్దాయిలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.21.90 లక్షలు స్వాధీనం చేసుకోగా, రూ.1,23,855/- అకౌంట్‌లో ఫ్రీజ్ చేశారు. 9 మొబైల్‌లు, ల్యాప్‌టాప్, సిమ్‌లు, బ్యాంక్ పుస్తకాలు తదితర వస్తువులు స్వాధీనం అయ్యాయి. ముద్దాయిలు RTO ఈ-చలానా పేరుతో APK ఫైల్ పంపి ఫోన్ హ్యాక్ చేసి UPI ద్వారా డబ్బులు దోచుకున్నట్టు విచారణలో బయటపడింది. ప్రజలు తెలియని APK ఫైళ్లు, టెలిగ్రామ్ ప్రకటనలు, లింకులు క్లిక్ చేయకూడదని యస్‌.పి. హెచ్చరించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేస్తే నష్టం చాలా వరకు నివారించవచ్చని సూచించారు. కేసు చేధనలో భాగమైన కావలి 1టౌన్ పోలీసు సిబ్బందిని యస్‌.పి. అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ స్టేట్ అడ్వైజర్ బోర్డు చైల్డ్& లేబర్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన బిజెపి నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన శ్రీ వేటుకూరి సూర్యనారాయణ రాజు *ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజరీ బోర్డు& చైల్డ్ లేబర్ చైర్మన్ గా నియమితులైన సందర్భముగా కాకినాడలో వారి నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపిన ముమ్మిడివరం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోశాధికారి గ్రంధి నానాజీ జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలియజేయడమైనది

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు విస్తృత స్పందన

నవంబర్ నెల్లూరు (పున్నమి ప్రతినిధి) జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 113 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా యస్.పి. డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించకూడదని, ప్రతి పిటీషన్‌పై చట్టపరంగా త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. వచ్చిన ఫిర్యాదుల్లో ఉద్యోగ మోసం, వివాహ వాగ్దానం చేసి మోసం చేయడం, కుటుంబ వేధింపులు, వృద్ధుల ఆస్తి సమస్యలు, అదృశ్యమైన మహిళ ఆచూకీ వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని యస్.పి. హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ యస్.పి. సౌజన్య, రూరల్ DSP శ్రీనివాసరావు, SB DSP, లీగల్ అడ్వైజర్ మరియు కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజమౌళి వ్యక్తిగత నమ్మకాలను గౌరవించాలి—వివాదం చేయాల్సిన అవసరం లేదు

భారతదేశంలోని అత్యంత గౌరవనీయ దర్శకుల్లో ఎస్. ఎస్. రాజమౌళి ఒకరు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన కళాకారుడు. ఇటీవల ఆయన దేవుడిపై వ్యక్తిగత నమ్మకాల గురించి చెప్పిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. అయితే భక్తి, నమ్మకం అనేవి పూర్తిగా వ్యక్తిగత విషయాలు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా అది వారి వ్యక్తిత్వాన్ని, విలువలను, లేదా సమాజానికి చేసిన సేవలను తగ్గించదు. రాజమౌళి తన ప్రతి సినిమాలో భారతీయ సంస్కృతి, పురాణాలు, సంప్రదాయాలపై ఉన్న గౌరవాన్ని చూపించారు. బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి చిత్రాలు మన చరిత్ర, వీరత్వం, నైతికతలపై ఆయనకు ఉన్న లోతైన అభిమానం యొక్క ప్రతిబింబాలు. ఆయన కథనం, ఆయన కృషి, ఆయన సృజనాత్మకత—వీటన్నింటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయ సంస్కృతిని కొత్తగా అనుభూతి చెందారు. మనలాంటి విభిన్నత కలిగిన ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తి తన విశ్వాసాలపై స్వతంత్రుడు. ఎవరినీ నొప్పించకుండా, నిజాయితీగా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం ప్రజాస్వామ్య బలం. ఆ స్వేచ్ఛను కాపాడటం, గౌరవించడం మన బాధ్యత. నిజంగా ముఖ్యం ఆయన విశ్వాసం ఏదో కాదు—ఆయన భారతీయ సినిమాకు తెచ్చిన ఖ్యాతి, విలువలు, అంకితభావం. రాజమౌళి గారి వ్యక్తిగత నమ్మకాన్ని రాజకీయరంగంలోకి లేదా మతపరమైన వాదనలలోకి లాగడం సముచితం కాదు. ఆయన చూపిన సృజన, కృషి, ప్రొఫెషనలిజం—ఇవే మనం నేర్చుకోవాల్సినవి, ఇవే మనం అభినందించాల్సినవి. చైతన్య

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వతంత్ర హక్కు

రాజమౌళి వ్యక్తిగత విశ్వాసం ఆయన స్వంత హక్కు భక్తి, నమ్మకం అన్నవి వ్యక్తిగత అంశాలు. ఆయన దేవుడిని నమ్మినా, నమ్మకపోయినా—అది ఆయన భారతీయ సినిమాకు చేసిన అసాధారణ సేవలను ఏమాత్రం తగ్గించదు. సంస్కృతి, చరిత్ర, పురాణ గాథలను ప్రపంచానికి చేరవేసిన వెజినరీ దర్శకుడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయంపై వివాదం సృష్టించడం అనవసరం; ఆయన సృజనాత్మకతను, కృషిని గౌరవించడం అవసరం. నీరుకొండ వీరన్న చౌదరి

వరంగల్

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు రాంబాయి చిత్ర యూనిట్*_

_వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజు వెడ్స్ రంబాయి చిత్ర యూనిట్ ముందుగా వల్లభ గణపతిని దర్శించుకొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ మా చిన్న సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు అమ్మవారి అనుగ్రహంతో ఈ సినిమా మంచి విజయం తో దూసుకెళుతుందని భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త తోను పు నూరి వీరన్న అర్చకులు నాగరాజ్ శర్మ సిద్దయ్య గారు సూపర్డెంట్ క్రాంతి కుమార్ కటకం రాములు ధర్మకర్త తదితరులు పాల్గొన్నారు._

ఖమ్మం

సత్తుపల్లి ఏసిపిగా వసుంధర యాదవ్ బాధ్యతల స్వీకారం. అనంతరం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్త ఏసిపి

పున్నమి ప్రతి నిధి కల్లూరు సబ్ డివిజన్‌కు కొత్తగా నియమించబడిన ఏసిపి వసుంధర యాదవ్ ఈరోజు సత్తుపల్లిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుని, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల సూచకంగా పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సునీల్ దత్ గారు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ సబ్ డివిజన్‌లో చట్టం-శాంతి పరిరక్షణ, ప్రజా భద్రత, నేర నియంత్రణలో మరింత కృషి చేయాలని సూచించారు. వసుంధర యాదవ్ మాట్లాడుతూ ప్రజల నమ్మకం పొందే విధంగా, పారదర్శకతతో పోలీసింగ్ అందిస్తానని తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంచికచర్ల, పెండ్యాల, నందిగామలో వైభవంగా వివాహ వేడుకలు; తంగిరాల సౌమ్య పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

*కంచికచర్ల* కంచికచర్ల పట్టణం కన్వెన్షన్ హాల్‌లో సోమవారం బండ్లమూడి గోవర్ధన్ రావు కుమారుడి రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించబడింది. మాజీ మంత్రి, రాష్ట్ర తెదేపా ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కుటుంబ సభ్యుల సమక్షంలో నూతన వధూవరులను అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, కూటమి నేతలు, స్థానికులు పాల్గొన్నారు. *పెండ్యాల* పెండ్యాల గ్రామంలో సోమవారం పైడిమర్రి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై, కుటుంబ సభ్యులతో కలిసి వధూవరులను అక్షింతలు వేయించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సర్పంచ్, కూటమి నేతలు మరియు స్థానికులు ఈ వేడుకలో పాల్గొన్నారు. *నందిగామ* నందిగామ మండలం కొత్త బస్టాండ్ సెంటర్ SDA చర్చ్‌లో సోమవారం కురగంటి వెంకయ్య కుమారుడు వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కూడా తంగిరాల సౌమ్య కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నేతలు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

**చిన్న–మధ్య తరహా పత్రికల హక్కుల కోసం

విజయవాడలో కీలక కార్యవర్గ సమావేశం** విజయవాడ, నవంబర్ (పున్నమి ప్రతినిధి): స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం విజయవాడలో సోమవారం అధ్యక్షులు రంగ సాయి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో సంఘానికి చెందిన ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, సహాయ కార్యదర్శులు సహా అన్ని కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. చిన్న మరియు మధ్య తరహా పత్రికలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అక్రిడిటేషన్ జీవో నిబంధనలపై విపులంగా సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్ జీవోలో పేర్కొన్న కొన్ని నిబంధనలు చిన్న, మధ్య తరహా పత్రికలకు అనుకూలంగా లేని అంశాలు ఉన్నాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నిబంధనలను పునర్విమర్శించి, పత్రికల పరిమాణం, సర్క్యులేషన్, ఆర్థిక స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాల్సిన అత్యవసరత ఉందని సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. అర్హత కలిగిన చిన్న–మధ్య తరహా పత్రికలను ఎంపానెల్మెంట్‌లో చేర్చడం ఆలస్యం అవుతుండటంపై కూడా అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎంపానెల్మెంట్ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటినీ రాష్ట్ర సమాచార–పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సవరణలు చేయించే దిశగా అసోసియేషన్ ఒక ప్రతినిధి బృందాన్ని నియమించాలని నిర్ణయించారు. అంతేకాక, పత్రికల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, ప్రకటనల పంపిణీ విధానం, సమాచార శాఖతో సమన్వయం, రిపోర్టర్ అక్రిడిటేషన్ సంబంధిత జాప్యాలు వంటి విషయాలపై కూడా చర్చించారు. చిన్న పత్రికలు ప్రజలకు సమీపంగా ఉండి, గ్రామీణ ప్రాంతాల వార్తలను వెలుగులోకి తెచ్చే కీలక బాధ్యత వహిస్తున్నందున, వాటిని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సభ్యులు ఒక స్వరంతో కోరారు. సమావేశంలో ఉపాధ్యక్షులు కె. అనిల్ కుమార్ రెడ్డి, కార్యదర్శి బి. గోపీనాథ్ రావు, కోశాధికారి డి. రమణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, సహాయ కార్యదర్శులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొని ఈ నిర్ణయాలకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

అన్నమయ్య

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఉచిత ఐ క్యాంప్‌కు ‘రికార్డు’ స్పందన

ప్రజా సేవకు, ప్రజల అభివృద్ధికి అంకితమైన ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరులో నిర్వహించిన ఆరో ఉచిత కంటి శిబిరం (ఐ క్యాంప్)కు అనూహ్య స్పందన లభించింది. వేలాది మంది ప్రజలు భారీగా తరలివచ్చి ఈ శిబిరాన్ని విజయవంతం చేశారు. రైల్వే కోడూరు ప్రజల అభివృద్ధిని ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముక్కా రూపానంద రెడ్డి సేవలకు ప్రజలు ఘనంగా అభినందించారు. ​రికార్డు స్థాయిలో సేవలు: ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో విజయవంతంగా కంటి శిబిరాలు నిర్వహించిన ఫౌండేషన్, ఈరోజు నిర్వహించిన శిబిరం ఆరోవది. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ​ఉచితంగా శతాధిక ఆపరేషన్లకు ఏర్పాట్లు:- కంటి ఆపరేషన్ అవసరమైన సుమారు 200 నుండి 300 మంది రోగులను ఆదివారం సాయంత్రం ప్రత్యేక బస్సుల ద్వారా తిరుపతికి తరలించారు. అక్కడ అరవింద ఐ హాస్పిటల్లో మరిన్ని పరీక్షలు పూర్తి చేసిన అనంతరం సోమవారం వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించనున్నారు. ఆపరేషన్ల అనంతరం తిరిగి కోడూరుకు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ​పరీక్షలు, కళ్లద్దాలు, తిరుపతి ప్రయాణం, ఆపరేషన్లు, వసతి, ఆహారం – ఈ మొత్తం వ్యయాన్ని పూర్తిగా ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ భరించడం విశేషం. ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ​పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్:- ఈ బృహత్తర సేవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ​సేవలో ముక్కా కుటుంబం:- ఈ శిబిరం వ్యవహారాలను రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, వారి సతీమణి ముక్కా వరలక్ష్మి, యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. వారు రోగులను పరామర్శిస్తూ, వారికి ధైర్యం చెప్పి నమ్మకాన్ని పెంపొందించారు. ప్రజల సేవ కోసం ముక్కా కుటుంబం చేస్తున్న కృషి పట్ల స్థానికులు అపారమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.