Wednesday, 18 March 2026

Blog

జోగులాంబ గద్వాల

బ్రేకింగ్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.

*బ్రేకింగ్ న్యూస్ : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండో విడత, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్ మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి, మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు.

E-పేపర్

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల… మూడు దఫాల్లో ఎన్నికల నిర్వహణ… డిసెంబర్‌ 11న తొలి విడత పోలింగ్‌… డిసెంబర్‌ 14న రెండో విడత పోలింగ్‌… డిసెంబర్‌ 17న మూడో విడత పోలింగ్‌… తెలంగాణలో తక్షణమే అములులోకి ఎన్నికల కోడ్‌…

తెలంగాణ

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

సర్పంచ్​ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌(Telangana Local Elections Schedule)ను విడుదల చేసింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు పేర్కొంది. మొదటి విడత పోలింగ్ వచ్చేనెల​11న, రెండో విడత 14న, మూడో విడత 17న జరుగనుంది. ఓటింగ్​జరిగిన రోజునే ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 31 జిల్లాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు సైతం ఖరారు అయ్యాయి. కాగా, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. పోలింగ్ జరిగిన రోజే మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగనుంది. డిసెంబర్ 11న మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14న రెండో విడుత ఎన్నికలు, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ నుంచి రెండో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 3వ తేదీ నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. రాష్ట్రంలో కోటి 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారిణి రాణి కుముదిని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన

E-పేపర్

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం రైల్వేకోడూరు నవంబర్ 25 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు పట్టణంలోని పీఎంఆర్ కాంప్లెక్స్ లో సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ గురువారము రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మండపంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ డూండీ రాకేష్ పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి మా పాలకవర్గాన్ని ఆశీర్వదించి అనంతరం విందును ఆరగించాలని వారు కోరారు.

E-పేపర్

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం

ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం రైల్వేకోడూరు నవంబర్ 19 రైల్వేకోడూరు పట్టణంలోని పీఎంఆర్ కాంప్లెక్స్ లో సోమవారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ గురువారము రైల్వే కోడూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పెండ్యాల విజయ్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మండపంలో ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ డూండీ రాకేష్ పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారానికి అందరూ వచ్చి మా పాలకవర్గాన్ని ఆశీర్వదించి అనంతరం విందును ఆరగించాలని వారు కోరారు.

అన్నమయ్య

శబరిమల యాత్రకు కందుల శివప్రసాద్ చౌదరి – బుధవారం పయనానికి ఏర్పాట్లు పూర్తిచేసిన మండల ప్రముఖుడు

మండలంలోని ప్రముఖ సామాజిక సేవకుడు, రాజకీయ నేత కందుల శివప్రసాద్ చౌదరి ఈ ఏడాదికీ అయ్యప్ప మాలధారిగా శబరిమల యాత్రకు సిద్ధమయ్యారు. దీక్షను భక్తిభావంతో కొనసాగిస్తూ, వచ్చే బుధవారం (నవంబర్ 26) ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరనున్నారు. బుధవారం ఉదయం ఆయన నివాసంలో మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ప్రత్యేక పూజల మధ్య ఇరుముడి కట్టే కార్యక్రమం జరగనుంది. అనంతరం “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో శబరిమల యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుభాకాంక్షల సందడి శివప్రసాద్ చౌదరి యాత్ర సిద్ధత నేపథ్యంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మిత్రులు పెద్ద సంఖ్యలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయ్యప్ప స్వామివారి అనుగ్రహంతో యాత్ర సజావుగా సాగి, స్వామి దర్శనం చేసుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. భక్తి మార్గంలో ముందంజ వేస్తున్న శివప్రసాద్ చౌదరికి ప్రజలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన వైద్య ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్

25-11-25 మనుబోలు న్యూస్ సర్వేపల్లి నియోజకవర్గంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రి సత్తి కుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా మనుబోలు మండలంలో1.68 లక్షల తో నిర్మించబడిన నూతన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి నారు సత్తి కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరికీ అనుకూలంగా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడమే మాదేమని అన్నారు

E-పేపర్

నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి

నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు పట్టణo కు చెందిన నార్జాల త్రివిక్రమ్ తండ్రి నార్జాల గురు ప్రసాద్ మరణించారని తెలుసుకొని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు తాతంశెట్టి నాగేంద్ర, నార్జాల హేమరాజ్ మొదలగువారు వారి భౌతిక గాయానికి నివాళులర్పించారు.

అన్నమయ్య

ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో 150 మందికి కొత్త చూపు

రైల్వే కోడూరులో జరిగిన ఉచిత కంటి శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో శస్త్రచికిత్స అవసరమైన 150 మందిని ముక్కా ఫౌండేషన్ తిరుపతి అరవిందా ఐ హాస్పిటల్స్‌కు తరలించింది. వైద్యులు అత్యంత నైపుణ్యంతో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేశారు. రోగుల భద్రత కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కోడూరుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ముక్కా రూపానంద రెడ్డి, వరలక్ష్మి స్వయంగా రోగులను పరామర్శించి భోజన వసతి కల్పించారు. ఈ సేవా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అభినందించారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ధ్యేయంగా ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవలు విశేష ప్రశంసలు అందుకుంటున్నాయి.

అన్నమయ్య

రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం షురూ

‘ -రైతుల అభివృద్ధికి పంచ సూత్రాలను వివరించనున్న వీఏఏ, వీహెచ్‌ఏలు చిట్వేల్‌, నవంబర్ 25: పున్నమి ప్రతినిధి రాష్ట్ర రైతాంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమం ప్రారంభమైంది. వ్యవసాయ, ఉద్యానవన రంగాలలో రైతులకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.నవంబర్ 24, 2025 తేదీ నుంచి నవంబర్ 29, 2025 వరకు ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న వీఏఏలు (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్) మరియు వీహెచ్‌ఏలు (విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్)వారి పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి రైతులతో సమావేశం అవుతారు. -ముఖ్యమంత్రి పంచ సూత్రాలు: ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల అభివృద్ధికి సూచించిన పంచ సూత్రాలను’ గురించి క్షుణ్ణంగా వివరిస్తారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ పథకాలు, సాంకేతిక సహకారం, మెరుగైన దిగుబడుల కోసం పాటించాల్సిన పద్ధతులు తదితర అంశాలను తెలియజేస్తారు.రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.