Wednesday, 18 March 2026

Blog

రంగారెడ్డి

*జల్పల్లిలో మురుగునీటి శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేసిన..సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 :మహేశ్వరం నియోజకవర్గంలోని జలపల్లి మున్సిపాలిటీ – హుందాసాగర్ సమీపంలో 46 కోట్ల వ్యయంతో 23 ఎం ఎల్ డి (ఎస్.టి.పీ ) నిర్మాణ పనులకు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు మొత్తం 31 (ఎస్.టి.పీ )లు మంజూరు కాగా అందులో మహేశ్వరం నియోజకవర్గానికి 151 కోట్ల నిధులతో తో నాలుగు (ఎస్.టి.పీ) లు ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలు 2022లోనే సిద్ధమైనవని పేర్కొన్నారు.చెరువులు మురికి కూపాలుగా మారుతున్న నేపథ్యంలో, వాటిని మళ్లీ సస్యశ్యామలంగా మార్చేందుకు ఎస్.టి.పీల ద్వారా శుద్ధిచేసిన నీటిని చెరువుల్లోకి మళ్లించే పనులు చేపడుతున్నామన్నారు. ఎస్.టి.పీలు పూర్తికావడంతో నియోజకవర్గ చెరువుల పునరుద్ధరణకు, పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అంతేకాకుండా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఉన్నటువంటి చెరువుల కూడా అతి త్వరలోనే ఇట్టి ఎస్.టి.పీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్బి అధికారులు — సిజిఎం సుజాత, డీజీఎం రాజ్కుమార్, భానుచందర్, మేనేజర్ తదితరులు మరియు జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ మాజీ ఎంపీపీ కందుల గుండయ్య నాయుడు కన్నుమూత

​చిట్వేల్ మండలం మాజీ ఎంపీపీ, టిడిపి సీనియర్ నాయకులు, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన కందుల గుండయ్య నాయుడు మంగళవారం నాడు తన స్వగ్రామమైన కె.కందులవారిపల్లిలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో చిట్వేల్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ​ప్రజల నేతగా గుర్తింపు:- గుండయ్య నాయుడు ప్రజలకు అండగా నిలిచే నాయకుడిగా చిట్వేల్ పరిసర ప్రాంతాల్లో విశేష గుర్తింపు పొందారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి, విద్య, రోడ్లు – వసతుల విస్తరణ వంటి కీలక పనుల్లో ఆయన చేసిన సేవలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. ప్రజల కోసం జీవితాంతం పనిచేసిన నిస్వార్థ సేవా నేతగా పలువురు ఆయన సేవలను స్మరించుకున్నారు. ​నివాళులర్పించిన ప్రముఖులు: గుండయ్య నాయుడు అంత్యదేహాన్ని చివరిసారి చూడటానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఆయన స్వగ్రామానికి తరలివచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీ, మాజీ ఎంపీపీలు, మండల నాయకులు, పాఠశాల అధ్యాపకులు, గ్రామ పెద్దలు ఆయనకు నివాళులు అర్పించారు. ​అంత్యక్రియలు:- గుండయ్య నాయుడు మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సమాజ ప్రముఖులు గాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు బుధవారం ఉదయం10 గంటలకు గ్రామ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.

రంగారెడ్డి

* పేదల పాలిటి వరం సీఎంరి లీఫ్ ఫండ్ — ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలపాలిటీ వరమని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మీర్పేట్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి అన్నారు. మాజీ శాసనసభ్యులు కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు మీర్పేట్ చెందిన తల్లోజు బ్రహ్మచారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును సిద్ధేశ్వర చారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట్నే పద్మశ్రీ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ ఆలే శ్రీనివాస్ కాంటెస్ట్ కార్పోరేటర్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ కుతాడి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, శ్యామ్, వినోద్,రమేష్,శ్రీకాంత్,శివానంద, రాము, వెంకటేష్,శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

* పిల్లలు చిన్నతనం నుండి క్రీడలలో రాణించాలని..మాజీ మేయర్ పారిజాత *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ బడంగ్ పేట్ సిరిపురం యాదయ్య క్రీడా ప్రాంగణంలో మధుకర్ రెడ్డి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 40 స్కూళ్ల నుండి ఎంపిక చేసిన విద్యార్థులకు కబడ్డీ, కోకో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలు చిన్నతనం నుండి క్రీడలలో రాణించాలని మానసికంగా శారీరకంగా చురుకుగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ సీఐ శంకర్ నాయక్, ఎస్ ఐ సారంగపాణి, మాజీ కార్పోరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బొల్లపల్లి కుమార్, సూర్ణగంటి విజయ్, మధుకర్, మాధవి, సిబ్బంది నార్య, శంకర్, ఉపేందర్. తదితరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

చీరెల పంపిణీలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనాలి –కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని గడపగడపకు చేర్చాలి –ఆడపడుచుల అభ్యున్నతి కోసం ప్రజాపాలన: కిచ్చెన్న *

*పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : ఇందిరమ్మ చీరెల పంపిణీ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీలు పాల్గొనాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సూచించారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ ఆడపడుచుకు సారె పెడుతున్నామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి – ఉన్నతికి దోహదపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ సేనపై ఉందని లక్ష్మారెడ్డి తెలిపారు.మహిళా స్వయం సహాయ బృందాలకు ఇవాళ వడ్డీ లేని రూ.304 కోట్ల రుణాలను అందిస్తున్నామని ఆడపడుచుల అభ్యున్నతి, ఆత్మగౌరవం కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తొలివిడతలో నాణ్యమైన చీరెలను కోటిమంది ఆడబిడ్డలకు అందిస్తామని లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు.ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్ ఆర్టీసీ బస్సు ప్రయాణం, సోలార్ ప్లాంట్లు, బస్సుల కొనుగోళ్లు, సన్నబియ్యం అందిస్తున్నామని లక్ష్మారెడ్డి తెలిపారు

రంగారెడ్డి

* పేదల పాలిటి వరం సీఎంరి లీఫ్ ఫండ్ — ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 25 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలపాలిటీ వరమని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మీర్పేట్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ బావోజు సిద్దేశ్వర చారి అన్నారు. మాజీ శాసనసభ్యులు కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం నాడు మీర్పేట్ చెందిన తల్లోజు బ్రహ్మచారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కును సిద్ధేశ్వర చారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కాట్నే పద్మశ్రీ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ ఆలే శ్రీనివాస్ కాంటెస్ట్ కార్పోరేటర్ ఇందిరమ్మ కమిటీ కోఆర్డినేటర్ కుతాడి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు, శ్యామ్, వినోద్,రమేష్,శ్రీకాంత్,శివానంద, రాము, వెంకటేష్,శివ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

పెండ్యాల విజయ్ కుమార్ కన్యక పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం

మిత్రులకి, శ్రేయోభిలాషులకు నా సవినయ పూర్వక ఆహ్వానం 27 -11- 2025 గురువారం 11:07ని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మండపం నందు పెండ్యాల విజయ్ కుమార్ కన్యక పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మీ అందరి ఆశీర్వాద బలంతో ,అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. కార్యక్రమానంతరం విందును ఆరగించి మమ్మల్ని సంతోషింపజేయ ప్రార్థన: మీ విధేయడు శ్రీరాంసుబ్రహ్మణ్యం.

E-పేపర్

పెండాల విజయ్ కుమార్ కన్యక పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం

మిత్రులకి, శ్రేయోభిలాషులకు నా సవినయ పూర్వక ఆహ్వానం 27 -11- 2025 గురువారం 11:07ని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఉత్సవ మండపం నందు పెండాల విజయ్ కుమార్ కన్యక పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మీ అందరి ఆశీర్వాద బలంతో ,అమ్మవారి అనుగ్రహంతో కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన. కార్యక్రమానంతరం విందును ఆరగించి మమ్మల్ని సంతోషింపజేయ ప్రార్థన: మీ విధేయడు శ్రీరాంసుబ్రహ్మణ్యం.

E-పేపర్

మండలాల వారిగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 మండలాల వారిగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మూడు విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండో విడత, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్ మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి, మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు.

E-పేపర్

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఎన్నికలు డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండో విడత, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం కమిషనర్ మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి, రెండవ ఫేజ్ నామినేషన్ నవంబర్ 30వ తేదీ నుండి, మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి మొదలు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.