Wednesday, 18 March 2026

Blog

అమరావతి

రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!*

*రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!* *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి* ▪️కుటుంబం ఆధారంగా అన్ని పథకాలు, సేవలు, సబ్సిడీలు ఒకే కార్డులో అందుబాటులోకి. ▪️రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు–అందరికీ ప్రత్యేక ప్రయోజనాలు. ▪️ఆధార్, రేషన్, బ్యాంక్, హెల్త్, ల్యాండ్ వివరాలు ఒకే ఫ్యామిలీ కార్డ్‌లో అందుబాటులోకి. ▪️వచ్చే జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ కార్డ్ అమలు. ▪️సేవల పారదర్శకత, వేగవంతమైన అమలు లక్ష్యం. ▪️ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా స్పష్టమైన గుర్తింపు. ▪️రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా కుటుంబాల వివరాల సేకరణ. ▪️ప్రభుత్వ పథకాలు & సేవల పంపిణీకి ఒకే కార్డ్. ▪️ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం.

విశాఖపట్నం

ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్

*ఈవీఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం నవంబర్ పున్నమి ప్రతినిధి *:- గ్రామీణ మండ‌లం చిన‌గ‌దిలిలో ఉన్న‌ ఈవీఎం గోదాముల‌ను జిల్లా కలెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ త‌నిఖీ చేశారు. నెలవారీ త‌నిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గోదాముల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు. సీసీ కెమెరాల ప‌నితీరును, ప్ర‌ధాన ద్వారానికి ఉన్న సీళ్ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై అక్క‌డ అధికారులకు, భ‌ద్ర‌తా సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విజిటింగ్ రిజిస్ట‌ర్లో సంత‌కం చేశారు. స్థానిక రెవెన్యూ, ఎల‌క్ష‌న్ సెల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

విశాఖపట్నం

అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ .

అనధికార భవనాల క్రమబద్దీకరణకు దరఖాస్తులు స్వీకరణ . *రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోండి జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ఎ. ప్రభాకరరావు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు నగరంలో 1985 నుండి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరణ చేయుటకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని,రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బి పి ఎస్ సదవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకర రావు మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. 1) Building Penalization Scheme (BPS) మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి, ప్రభుత్వం వారి జీవో ఎం.ఎస్.నెంబర్ 225 MA&UD (M) Dept., తేది..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/(urban Local Bodies) బిల్డింగ్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని, అనుమతి లేకుండా నిర్మించిన బిల్డింగ్స్, ఫ్లాట్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వము కల్పించిందని తెలిపారు. 1985 నుండి తేదీ 31-08-2025 మధ్య నిర్మించిన బిల్డింగ్స్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ,యుడిఏ, సిఆర్డీఏ, విఎంఆర్డీఏ, ఐఏఎల్ఎ పరిధిలో ఉన్నవారికి ఈ అవకాశం వర్తిస్తుందని, ప్రభుత్వ భూములు/ఎండోమెంట్స్/ సాగర్ / నది వాగు / ట్యాంక్ బెడ్, మాస్టర్ ప్లాన్ రోడ్/ ఓపెన్ స్పేస్ /పార్కు వినియోగించే భూములు, తేదీ 31-08-2025 తర్వాత కట్టిన నిర్మాణాలు, భూ వివాదం ఉన్నవాటికి అవకాశం లేదని తెలిపారు. వెబ్సైట్ www.bps.ap.gov.in ద్వారా రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాపీ, ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ప్లాన్ ,బిల్డింగ్ ఫోటోలు, స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్, ఇండెమ్నిటీ బాండ్ తదితర పత్రాలు అప్ లోడ్ చేయాలని, స్థలం యొక్క కొలతలు, డివియేషన్ విస్తీర్ణం, ల్యాండ్ మార్కెట్ విలువ, అలాగే BPS అప్లై చేయుట కొరకు రూ.10,000 ముందస్తు చెల్లింపు తప్పనిసరని తెలిపారు. తేదీ 31-12-1997 లోపల ఉన్న భవనాలకు 25% , మురికి వాడల ప్రాంతాల నిర్మాణాలకు 50% తగ్గింపు ఉంటుందని, నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 120 రోజుల్లోగా ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. 2)Land Regularization Scheme(LRS) అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020 ని సవరించిందని, G.O.Ms.No.10, MA&UD (M) Dept, తేదీ 01.01.2020. కటాఫ్ తేదీని పొడిగిస్తూ, 30.06.2025 కి ముందు రిజిస్టర్ చేయబడిన ప్లాట్లన్నింటినీ ఈ స్కీమ్ లో అవకాశము కల్పించిందన్నారు. తదుపరి ప్రభుత్వం G.O 134, MA&UD (M) Dept, తేదీ 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025 లోపు దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీగా సూచించి , మరలా తదుపరి జీవో RT .NO- 1173 MA&UD (M) Dept తేదీ 27- 10 -2025 కి పొడిగిస్తూ అవకాశాన్ని కల్పించడమైనదన్నారు . ఎల్ఆర్ఎస్ స్కీం లో స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించబడునని తెలియజేశారు. దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించడానికి LRS పోర్టల్ తేదీ 04.08.2025 నుండి అందుబాటులో ఉంచడమైనదని ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి తెలియజేశారు. ఇదే తుది అవకాశమని ప్రభుత్వ ఉత్తర్వుల లో పేర్కొన్నారని తెలిపారు.. కావున, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు, భవన నిర్మాణదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరని జీవీఎంసీ కమిషనర్ తరపున ఆయన తెలిపారు .

అమరావతి

మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్*

*మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్* *రాష్ట్రంలో 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య* *త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు* *కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, నూతనంగా ఒక మండలం* *ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరుమార్పు* *జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం* *కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు- అనంతరం నోటిఫికేషన్* *అమరావతి, విశాఖ పున్నమి ప్రతినిధి* రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. *మూడు జిల్లాల భౌగోళిక స్వరూపం ఇలా* *పోలవరం జిల్లా:* రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్ లో యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది. *మార్కాపురం జిల్లా :* యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్ లోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు,తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్ లోని హనుమంతుని పాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్తజిల్లాల్లో ఉండనున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. *మదనపల్లి జిల్లా:* మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్ లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11.05 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. *రెవెన్యూ డివిజన్లలో మార్పు చేర్పులివీ* శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్ లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేట- యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాకినాడ డివిజన్ లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, మండలాలను రాజమహేంద్రవరం డివిజన్ లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. దీంతో పాటు అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్ లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురంలను తిరుపతి జిల్లా గూడురు డివిజన్ లో విలీనం చేయనున్నారు. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యంను చిత్తూరు డివిజన్ లో కలుపనున్నారు. సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకి పురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. పలమనేరు డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు. కదిరి డివిజన్ లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్ లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్ లో కలపనున్నారు. నంద్యాల జిల్లా డోన్ రెవన్యూ డివిజన్ లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల నంద్యాల డివిజన్ లోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. *9 జిల్లాల్లో ఎలాంటి మార్పులూ లేవు* మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.g మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన విడుదల కానుంది.

విశాఖపట్నం

భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ల ఏర్పాట్ల పై అధికారుల సమీక్ష

భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ల ఏర్పాట్ల పై అధికారుల సమీక్ష *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* డిసెంబర్ 6వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా పురుషుల వన్డే మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం విశాఖపట్నం లోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంద్ర‌ ప్రసాద్, నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం లో మ్యాచ్‌కు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మైదానం నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి ప్రవేశ ద్వారాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతను నిర్ధారించడానికి పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం అప్ గ్రేట్ చేయబడిన కేంద్రీకృత పబ్లిక్ అడ్రెస్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు క్రికెట్ జట్లు వారి బృందాల భద్రత కోసం ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం జివిఎంసీ కమిషనర్ కెత‌న్ గార్గ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ జీరో వెస్ట్ మేనేజ్మెంట్ తో మ్యాచ్ ను నిర్వహించడానికి ఏసీఏ తో కలిసి సన్నాహాలు చేస్తున్నామని పారిశుద్ధ సమస్యలు ఎక్కడ తలెత్తకుండా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని స్టేడియంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విశాఖ నగరం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని జట్లు ప్రయాణించే మార్గాల్లోనూ ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ సుందరీ కారణంగా పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కౌన్సిల‌ర్ విష్ణు దొంతు , ఎసిఏ స్టేడియం చైర్మ‌న్ ప్రశాంత్, విశాఖపట్నం డిసిపి – 1 సిహెచ్ మణికంఠ , డిసిపి డి.మేరీ ప్రశాంతి, లా అండ్ ఆర్డ‌ర్, ట్రాఫిక్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎపిఈపిడిసిఎల్ విభాగం అధికారుల‌తో పాటు ఎసిఎ సిబ్బంది పాల్గొన్నారు.

అమరావతి

గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులపై అధ్యయనం

గ్రామ సచివాలయాల నిర్మాణం, ఉద్యోగుల పదోన్నతులపై అధ్యయనం *అమరావతి నవంబర్ విశాఖ పున్నమి ప్రతినిధి* • మార్చి నాటికి నివేదిక రూపొందించాలి • సచివాలయ సిబ్బంది పదోన్నతులపై మంత్రుల బృందం, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ సచివాలయాల పని తీరు, ఆ వ్యవస్థ నిర్మాణంపై పూర్తి స్థాయిలో అధ్యయనం జరపాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. గ్రామ స్థాయిలో వివిధ శాఖల నిర్మాణం, సచివాలయం ఉద్యోగులను ఆయా శాఖలకు ఎలా అనుసంధానించాలి అనే అంశంపైనా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం మంత్రుల బృందంతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరి నారాయణ గారు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ వంగలపూడి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయస్వామి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు మంత్రుల బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందికి పదోన్నతుల కల్పన, ఇతర శాఖల్లో అనుసంధానించడానికి ఉన్న అవకాశాలపై మంత్రుల బృందం, ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించినప్పటికీ సచివాలయ వ్యవస్థ నిర్మాణం దెబ్బతినకుండా ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే మార్చి నాటికి పూర్తి అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వాలని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు అవసరమైన పక్షంలో ప్రతి నెలా ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి లోటుపాట్లపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో జి.ఎస్.డబ్ల్యూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ, హోమ్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కొత్తవలస–ఆనందపురం రహదారిలో కృష్ణరాయుడు పేట వద్ద రైవాడ కాలువపై కల్వర్ట్ నిర్మాణానికి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన*

*కొత్తవలస–ఆనందపురం రహదారిలో కృష్ణరాయుడు పేట వద్ద రైవాడ కాలువపై కల్వర్ట్ నిర్మాణానికి నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శంకుస్థాపన* *విశాఖపట్నంనవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం నగరానికి నీటి సరఫరా అందిస్తున్న రైవాడ డ్యాం‌కు రవాణా సదుపాయాన్ని మరింత బలోపేతం చేయడానికి భాగంగా, కొత్తవలస నుండి ఆనందపురం వెళ్లే రహదారిలో కృష్ణరాయుడు పేట వద్ద రైవాడ కాలువపై కల్వర్ట్ నిర్మాణం పనులకు నేడు స్థానిక మాడుగుల ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు శ్రీ *బండారు సత్యనారాయణ మూర్తి* గారితో కలిసి నగర మేయర్ *పీలా శ్రీనివాసరావు* గారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ *పీలా శ్రీనివాసరావు* గారు మాట్లాడుతూ— “రైవాడ డ్యాం విశాఖ నగరానికి ప్రధాన నీటి వనరు. ఈ కాలువపై కల్వర్ట్ నిర్మాణం పూర్తయితే రహదారి రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, నగరానికి నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా పనులు సజావుగా కొనసాగుతాయి. ఈ రోజు స్వయంగా రైవాడ డ్యాంను పరిశీలించగా నీటి స్వచ్ఛత చాలా మంచి స్థాయిలో ఉందని గుర్తించారు. కల్వర్ట్ పనులు నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాను” అని తెలిపారు. ఎమ్మెల్యే *బండారు సత్యనారాయణ మూర్తి* గారు మాట్లాడుతూ— “విశాఖ నగర మేయర్ నాకు అత్యంత ఆప్తుడు. నేను కోరగానే ఈ కల్వర్ట్ నిర్మాణానికి 91 లక్షలు మంజూరు చేయడం గర్వకారణం. అలాగే జీవీఎంసీ నుండి ఇరిగేషన్ శాఖకు బాకీగా ఉన్న కోటీ రూపాయల నీటి చార్జీల చెల్లింపులు కూడా పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో నగరానికి నిరంతర త్రాగునీరు అందించే రైవాడ జలాశయం అభివృద్ధి పనులకు మేయర్ గారు పూర్తిగా సహకరించాలని మనవి చేస్తున్నాను” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్, కూటమి నాయకులు, సంబంధిత శాఖాధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న జీవీఎంసీ జోన్ 7 జోనల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కోరారు.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న జీవీఎంసీ జోన్ 7 జోనల్ కమిషనర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు డి రాజశేఖర్ రెడ్డి కోరారు. అనకాపల్లి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగి వెల్ఫేర్ సెక్రెటరీ నూకరాజు పని ఒత్తిడి మరియు జోనల్ కమిషనర్ పెడుతున్న ఇబ్బందులతో ఈ నెల 20న గుండె పోటుతో మరణించారని మీడియాకు తెలిపారు.గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కు మంగళవారం ఈ మేరకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.జోనల్ కమిషనర్ ఎక్కడ ఉన్నా ఇదే పద్ధతిగా ఉద్యోగులను వేధిస్తూ ఉంటారని, మహిళా ఉద్యోగుల సెల్ఫోన్ తీసుకొని చెక్ చేసి వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారని తమదృష్టికి వచ్చిందన్నారు. సదరు జోనల్ కమిషనర్ మీద ఎంక్వయిరీ చేసి కఠిన చర్యలు తీసుకొవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఎంక్వయిరీ వేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అండగా ఉంటుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

జనగాం

వందేమాతరం గేయ రచన 150 సంవత్సరాల పూర్తి:జనగామ జిల్లా బీజేపీ మహా ర్యాలీ

వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుండి రైల్వే స్టేషన్ వరకు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో వందేమాతర గేయం భారతీయులను ఐక్యం చేసిందని వందే మాతరం అంటే దేశాన్ని కీర్తించడమని సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మహాత్మా గాంధీ ఎందరో స్వాతంత్ర సమరయోధులను స్వాతంత్రం దిశగా పోరాట పటిమను భారతీయుల గుండెల్లో నింపి స్వాతంత్రాన్ని తీసుకురావడం లోపట కీలక పాత్ర వందేమాతరం గేయం వహించిందని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత రెడ్డి కే వి ఎల్ రెడ్డి బుడుగుల రమేష్ మహంకాళి హరిచంద్రగుప్త డాక్టర్ కర్నూల్ బిక్షపతి జిల్లా ప్రధాన కార్యదర్శి భాగాల నవీన్ రెడ్డి పట్టణ అధ్యక్షులుబొమ్మ కంటి అనిల్ సీనియర్ నాయకులు అంకుగారి శశిధర్ రెడ్డి బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు శివకృష్ణ హరి ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ బయట, లోపల ఉన్న మున్సిపాలిటీలు GHMC లో విలీనం కాబోయే మున్సిపాలిటీలు ఇవే

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ బయట, లోపల ఉన్న మున్సిపాలిటీలు…. GHMC లో విలీనం కాబోయే మున్సిపాలిటీలు ఇవే 1.పెద్ద అంబర్పేట్ 2.జెల్పెల్లి 3.శంషాబాద్ 4.తుర్కయంజాల్ 5.మణికొండ 6.నార్సింగి 7.ఆదిభట్ల 8.తుక్కుగూడ 9.మేడ్చల్ 10.దమ్మాయ్ గూడా 11.నాగారం 12.పోచారం 13.ఘట్కేసర్ 14.గుండ్లపోచంపల్లి 15.తుంకుంట 16.కొంపల్లి 17.దుండిగల్ 18.బొల్లారం 19.తెల్లాపూర్ 20.అమీన్పూర్ 21.బడంగ్పేట్ 22.బండ్లగూడ జాగీర్ 23.మీర్ పేట్ 24.బోడుప్పల్ 25.ఫిర్దాజిగూడ 26.జవహార్ నగర్ 27.నిజాంపేట్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.