Wednesday, 18 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు*

📍 *గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు* 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణ. ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించిన కేంద్రం. ఇప్పటికే పుష్కరాల కోసం రూ.100 కోట్లను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.

కడప

ప్రొద్దుటూరు టిడిపి పట్టణ అధ్యక్షుని ప్రమాణ స్వీకారం

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం టిడిపి పట్టణ అధ్యక్షునిగా చల్లా రాజగోపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారి ఆశీస్సులతో ఎన్నికయ్యారు పట్టణ అధ్యక్షునిగా ఆయన ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఈ పదవి తనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇకపై మరింత బాధ్యతాయుతంగా పనిచేసే పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: బోందుగుడ లో సంచార ఆధార్ కేంద్రం

డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీ, బోందుగుడ గ్రామంలో సంచార ఆధార్ కేంద్రం బుధ, గురువారాలు అందుబాటులో ఉన్నట్టు సర్పంచ్ పూజారి కొములు తెలిపారు. కావున చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆధార్ కేంద్ర సేవలను వాడుకోవాలన్నారు. కొత్త ఆధార్ నమోదు కు, పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ ఉండాలని, అప్డేట్ కు ఆధార్ కార్డ్, రైస్ కార్డ్, ఫోన్ నెంబరు, బ్యాంకు బుక్, పాన్ కార్డ్ / ఓటరు ఐడి ఉండాలని నిర్వహకులు తెలిపారు.

హైదరాబాద్

🗳️ తెలంగాణ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

పున్నమి ప్రతి నిధి మూడు విడతల్లో గ్రామపంచాయతీ పోలింగులు — ఈరోజు నుంచే కోడ్ అమలు హైదరాబాద్ : తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసారి ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నారు. పోలింగ్ అనంతరంగానే అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) వెంటనే అమల్లోకి వచ్చింది. ఖమ్మం జిల్లా లో ఎన్నికల నిర్వహణ వివరాలు: విడతల వారీగా ఎన్నికలు మొదటి విడత — డిసెంబర్ 11 వైరా, కొణిజర్ల మండలాల్లో పోలింగ్ జరుగనుంది. రెండవ విడత — డిసెంబర్ 14 కామేపల్లి మండలంలో ఎన్నికలు. మూడవ విడత — డిసెంబర్ 17 కారేపల్లి, ఏన్కూర్ మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడత నవంబర్ 27 డిసెంబర్ 11 రెండవ విడత నవంబర్ 30 డిసెంబర్ 14 మూడవ విడత డిసెంబర్ 3 డిసెంబర్ 17 పోలింగ్ & లెక్కింపు వివరాలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ పోలింగ్ రోజు సాయంత్రం నుంచే కౌంటింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు, అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. మండలాలవారీగా పోటీ ఉత్కంఠ రేకేతిస్తుంది.

అల్లూరి సీతారామరాజు

పాడేరు: సమగ్ర శిక్షా సీఆర్పీ లకు పాఠశాల సామాజిక తనిఖీ పై శిక్షణ

సమగ్ర శిక్షా సీఆర్పీ లు ఎప్పటికప్పుడు పాఠశాల పనితీరుపై మ్యూల్యాంకనం చేయాలని ఏపీసీ స్వామి నాయుడు సూచించారు. మంగళవారం సమగ్ర శిక్షా పాడేరు డివిజన్ సీఆర్పీలకు సామాజిక తనిఖీ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం పాడేరులో నిర్వహించారు. ఈ శిక్షణను ఉద్దేశించి ఏసీపీ మాట్లాడారు. సామాజిక తనిఖీపై అవగాహన చేసుకోవాలని సమగ్ర శిక్ష సీఎంఓ జ్ఞాన ప్రకాష్ అన్నారు. ఈ శిక్షణకు డిఆర్పీలుగా జి వాసుదేవ్, ఎస్ శ్యాంసుందర్, గంగరాజు వ్యవహరించారు.

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: రూ.1.5 లక్షలతో సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు

తుఫాను గాలులకు చెట్టు పడి ద్వంసం అయిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రానికి మరమ్మత్తులు చేపట్టాలని రాయపల్లి సెక్రటరీని అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ ఆదేశించారు. మంగళవారం రాయపల్లి పంచాయితీ సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీడీఓ పరిశీలించారు. మరమ్మత్తులకు ఇంజనీరింగ్ అధికారి అంచనా ప్రకారం పంచాయతీ 15వ ఆర్ధిక సంఘం నిధులు నుండి రూ.1.5 లక్షలు ఖర్చు చేసి వాడుకలోనికి తీసుకురావాలని ఎంపీడీఓ తెలియజేశారు. తడి, పొడి చెత్తలను వేరుచేయడం పై ప్రజలకు అవగాహణ కల్పించాలని కమ్యునిటీ రీసోర్స్ పర్సన్ కు ఎంపీడీఓ సూచించారు.

అల్లూరి సీతారామరాజు

సబ్ జూనియర్ జాతీయ ఆర్చరీ పోటీలకు అరకు విద్యార్ధి, సబ్ జూనియర్ ఆర్చరీ ఏపీ టీం కోచ్ గా అరకు క్రీడా పాఠశాల ఉపాధ్యాయడు

అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్ధి వంతాల లలిత్ సాయితేజ ఈ నెల 28న అరుణాచల్ ప్రదేశ్ లో జరగబోవు సబ్ జూనియర్ జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ విద్యార్ధిని అభినందిస్తూ, నగదు ప్రోత్సహకం అందించారు. జాతీయ స్ధాయిలో ప్రతిభ కనబరచి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాక్షించారు. లలిత్ సాయి తేజాను పాఠశాల ప్రిన్సిపాల్ పిఎస్ఎన్ మూర్తి, కోచ్ సూరిబాబు, ఇతర అధ్యాపకులు అభినందించారు. అలాగే సబ్ జూనియర్ ఆర్చరీ ఏపీ టీం కు కోచ్ గా అరకు క్రీడా పాఠశాల కోచ్ లకే సూరిబాబు ఎంపికయ్యారు.

అల్లూరి సీతారామరాజు

సంకల్ప అమలుతో పాస్ పర్సంటేజ్ పెంచాలి: ఆర్జేడీ శేఖర్ బాబు

సంకల్ప 50 రోజుల ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేసి ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలని ఆర్జేడీ టీ శేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులకు సంకల్ప పై దిశానిర్ధేశం చేశారు. ముఖ ఆధారిత అటెండెన్స్ తప్పనిసరి అని ఆయన తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డీపీజే కుమార్, ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ పార్వతి, సిబ్బంది ఉన్నారు.

విశాఖపట్నం

విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత.

విజయశ్రీ బ్లడ్ సెంటర్ సీజ్, తదుపరి ఆదేశాల వరకు కార్యకలాపాలు నిలిపివేత. *విశాఖ పట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలోని మహారాణి పేట బుధవారపు గార్డెన్స్ లో విజయశ్రీ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎం/ఎస్ విజయశ్రీ బ్లడ్ సెంటర్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసి బ్లడ్ బ్యాంక్ ను తాము సీజ్ చేసినట్టు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు తాము జరిపిన ఆకస్మిక తనిఖీలలో ఇక్కడ తీవ్రమైన నాణ్యతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయన్నారు. అర్హత లేని సిబ్బందితో పని చేయిస్తూ, సరైన వైద్య అధికారుల పర్యవేక్షణ లేకుండా రక్త సేకరణ చేస్తున్నారని, సరైన నాణ్యత ప్రమాణాలు కూడా పాటించడం లేదని తాము గమనించా మన్నారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మరియు లైసెన్సింగ్ అథారిటీ ఎం.పాండురంగ ప్రసాద్ ఆదేశాల మేరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బ్లడ్ సెంటర్ యొక్క అన్ని కార్యకలాపాలను తక్షణమే నిలిపివేసున్నా మన్నారు. రక్త సేకరణ లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే రక్త మార్పిడి సమయం లో రియాక్షన్స్ వచ్చి, ప్రాణాంతకం కావొచ్చన్నారు. అర్హత కలిగిన వైద్య అధికారులు మరియు సిబ్బంది సమక్షం లో మాత్రమే బ్లడ్ బ్యాంక్ కార్యకలాపాలు మరియు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఉల్లంఘించే లైసెన్సుదారులపై ఈ విధంగానే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

అమరావతి

సాధ్యమైనంత త్వరగా అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు: మంత్రి పార్థసారధి హామీ

సాధ్యమైనంత త్వరగా అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు: మంత్రి పార్థసారధి హామీ *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి * రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార మరియి గృహనిర్మాణ శాఖ మంత్రి కె పార్ఖసారధి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథి గారిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు మరియి పలవురు సీనియర్ జర్నలిస్టులు ఇక్కడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారంనాడు కలిశారు. జర్నలిస్టుల కోసం సిఆర్డీఎ ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల గృహ సముదాయాన్ని నాలుగు కేటగిరీలలో నిర్మించే నిమిత్తం 30 ఎకరాల భూమిని మందడం, తుళ్లూరు పరిధిలో అమరావతి హౌసింగ్ సొసైటీకి 2019లో కేటాయించటం జరిగిందని వారు వివరించారు. దానిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ సిఆర్డీఏ సంస్థనే డెవలపర్ గా దాని ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ నిర్మించాలని సొసైటీ గతంలో ప్రభుత్వాన్ని కోరింది. ఇందు నిమిత్తమే సొసైటీకి కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 107 ఇస్తూ హ్యాపీనెస్ట్ మోడల్ లో నిర్మిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరుతూ పార్థసారధి గారిని అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సీనియర్ జర్నలిస్టులు కోరడం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను మరియి హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తిని మంత్రి నారాయణ గారు మరియు సిఆర్డీఎ కమిషనర్ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు జరిగేలా అవసరమైన వారితో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మంత్రి సారధి గారు వెంటనే సమాచార శాఖ డైరక్టర్ శ్రీ విశ్వనాధ్ గారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సమాచార శాఖ డైరక్టర్ కూడ ఈ విషయంపై సత్వరమే సంప్రదింపులు జరుపుతామని ఆయనను కలిసిన జర్నలిస్టు సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంత్రి గారిని కలిసిన వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనినాసరావు, సొసైటీ డైరెక్టర్లు చావా రవి, టివి 9 ఈశ్వర్ , మహాటివి శ్రీనివాస్ మరియి సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రప్రభ బ్యూరోఛీఫ్ గోపీ, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాధ్, ఎస్ మల్లిఖార్జున్ , భి నాగేశ్వరరావు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.