Wednesday, 18 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ రైతుపేటలో అంగరంగ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం

నందిగామ రైతుపేటలోని సుబ్రహ్మణ్యేశ్వర ఎస్టేట్ కాలనీలో బుధవారం ఉదయం 9 గంటలకు శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దేవాలయ ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, పండితులు ఫణికుమార్, వెంకటాచార్యులు, కోదండ రామాచార్యులు, యోగానందాచార్యులు, కేశవాచారి, శ్రీనివాస్, మణికంఠలు వేద మంత్రోచ్ఛారణలతో భక్తులను ఆశీర్వదించారు. స్వామివారి నామస్మరణలు “నమో సుబ్రహ్మణ్యేశ్వర”తో ప్రాంతమంతా మార్మోగిపోగా, భక్తుల జయజయధ్వానాల మధ్య కళ్యాణం కనుల పండుగగా కొనసాగింది. కళ్యాణం అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున హాజరై సుబ్రహ్మణ్య ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రాంతంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు సిబ్బంది వ్యవస్థాపకంగా పనిచేశారని దేవాలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

గూడూరు

ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

గూడూరు ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు రాజ్యాంగ పీఠికను పటించారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు (వక్తృత్వం, క్విజ్, పాటల పోటీలు మొదలైనవి) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకుడు రవిరాజు, డాక్టర్ ఝాన్సీ వాణి, డాక్టర్ గోవిందు సురేంద్ర, డాక్టర్ శైలజ, కృపా కరుణ వాణి, డాక్టర్ పీర్ కుమార్, లక్ష్మీ హిమబిందు తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

NSS PROGRAMME OFFICERS Dr. BR. AMBEDKAR విగ్రహానికి పూలమాలను సమర్పించుట.

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ . ప్రత్యేక శిబిరం. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలోఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పాల్గొన్నారు.

కర్నూలు

పున్నమి ప్రతినిధి కర్నూలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని MPDO ఆఫీసులో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగాMPDO గారు మాట్లాడడం జరిగింది

పున్నమి ప్రతినిధి కర్నూలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని MPDO ఆఫీసులో ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా MPDO మేడమ్ మణి మేడం గారు వెలుగు ఆఫీసర్లు రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడడం జరిగింది అలాగే క్లీన్ & గ్రీన్ విలేజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలాగే జాతీయ ప్రచారం జెండర్ సమానత్వం కోసం అవేర్నేష్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది

ఎన్ టి ఆర్ జిల్లా

అనాసాగరం పొలాల రహదారి దెబ్బతిని… రైతులకు నానా ఇబ్బందులు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు జనసేన బద్రి వినతి

అనాసాగరం గ్రామ పరిధిలోని వందల ఎకరాల మాగాణి పొలాలకు వెళ్లే ప్రధాన రహదారి రైతులకు తలనొప్పిగా మారింది. ఇటీవల కురిసిన అకాల వర్షాల ప్రభావంతో రహదారి గుంతల మయం అవడంతో రోజూ వందలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు, ట్రాక్టర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. పంట దిగుబడి సమయం సమీపిస్తుండటంతో పండిన పంటను ఇంటికి తరలించడంలో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశ ముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఈ సమస్యను గమనించిన నందిగామ జనసేన నాయకుడు కొట్టె బద్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం బోర్డు మెంబర్ తంబళ్ళపల్లి రమాదేవి ఆదేశాల మేరకు గ్రామ రైతులను ఏకం చేసి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రైతాంగ ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను కలసి రహదారి దుస్థితిని వివరించి, తక్షణ పరిష్కారం కోసం అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టె బద్రి, నల్లగొండ మురళీ కృష్ణ, టీడీపీనాయకులు దుగ్గిదేవి గోపి కృష్ణ, గ్రామ పెద్దలు, కూలీలు, రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

బిక్కవోలులో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురందేశ్వరి.

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, నవంబర్ 26 (పున్నమి ప్రతినిధి) : బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో “షష్ఠి” మహోత్సవం సందర్బంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజానగరం నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, తెలుగు మహిళలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో NSS ప్రత్యేక శిబిరం

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ . ప్రత్యేక శిబిరం. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం వారు 1,2 యూనిట్స్ వారు 26 -11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ , Save Girl Child మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలు, అనే అంశం మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీ మరియు సర్వే నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాటి కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

సాహితీ

“రాజ్యాంగం” కవిత – డాక్టర్ బద్రి పీర్ కుమార్

మన పరిపాలనయంత్ర పవిత్ర గ్రంథంగా భావించే రాజ్యాంగం ఆమోదించుకున్న రోజు (26-11-1949) ను 2015 నుండి మన భారత ప్రభుత్వం అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించి అమలుపరుస్తున్న సందర్భంగా… “రాజ్యాంగం” *రా* – రాజ్యములోని ప్రజల జీవన దారిలో *జ్యాం*- జామ్ కాకుండా క్రమ పద్ధతిలో *గం* – గంట మ్రోగించే ప్రభుత్వ పాలన సూత్ర గ్రంథం రాజ్యాంగం

ఆంధ్రప్రదేశ్

ఇందుకూరుపేట పి.వి. కండ్రిగ పాఠశాలలో స్వచ్ఛ & హరిత విద్యాలయ పరిశీలన

నెల్లూరు జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు పి.వి. కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్ పరిశీలనను జిల్లా సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజర్ గోగుల రమణయ్య నిర్వహించారు. పాఠశాల పచ్చదనం, పరిశుభ్రత, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లు, వంటగది తదితరాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎం.ఇ.ఓ సునీల్ కుమార్ విద్యార్థుల ఆరోగ్యం కోసం పచ్చదనం, పరిశుభ్రత కీలకమని సూచించారు. ఎం.ఐ.సి కోఆర్డినేటర్ మల్లికార్జున విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించాలని తెలిపారు. సర్పంచ్ సుధీరమ్మ, కమిటీ చైర్మన్ విజయ, హెచ్‌.ఎం. రామచంద్రయ్య పాల్గొన్నారు.

హైదరాబాద్

భారత రాజ్యాంగ స్పూర్తి సకల జన సంక్షేమం, 230వ వారం బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్

పున్నమి: ప్రతినిధి హైదరాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో గల నవభారత నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత దేశ కార్మికుల తలరాతను మార్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ,ఎస్టీ, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బహుజన ఆర్టిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ మాట్లాడుతూ ప్రతి మంగళవారం రోజున జ్ఞాన పూలమాల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్నారు బహుజన కార్మికులు ఏకమై కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది230వారం పూలమాలము ఇప్పిచ్చినవారు డి రామచందర్ డ్రైవర్, కే బాబురావు కండక్టర్, జీవన్ శ్రామిక్, మం గోపి పూలమాలలు వెయ్యడం జరిగినది వారం వారం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాన పూలమాల వేయవచ్చును అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టిసి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.