Saturday, 7 March 2026

Blog

పల్నాడు

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

⏰ విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి 🏫 రాష్ట్రవ్యాప్తంగా 1,537 కేంద్రాలు 👩‍🎓 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 10.57 లక్షలు 📅 పరీక్షలు మార్చి 24 వరకు ✍️ హాల్ టికెట్ తప్పనిసరి 📄 OMR వివరాలు తప్పక చెక్ చేయండి 🚫 అదనపు ఆన్సర్ షీట్లు ఇవ్వరు 🎥 ప్రతి గదిలో CCTV పర్యవేక్షణ

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ముగిసిన బ్రహ్మోత్సవ సంబరం- ఏకాంత సేవతో స్వామి, అమ్మవార్లకు విశ్రాంతి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికి అత్యంత భక్తిశ్రద్ధలతో “ఏకాంత సేవ” నిర్వహించారు. గత పది రోజులుగా వివిధ వాహన సేవలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించిన స్వామి, అమ్మవార్లకు బ్రహ్మోత్సవాల ముగింపు పర్వంలో విశ్రాంతి కల్పించడం ఈ సేవ ప్రత్యేకత. శనివారం రాత్రి ఆలయంలోని గర్భాలయం వద్ద వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. హారతి సమర్పించి, స్వామివారిని పవళింపు సేవకు సిద్ధం చేశారు. మహాశివరాత్రి పర్వదినం నుండి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాల్లో నంది వాహనం, రావణ వాహనం, లింగోద్భవ కాల అభిషేకాలు, రథోత్సవం వంటి ఘట్టాలు భక్తులను పరవశింపజేశాయి. శనివారం జరిగిన ఏకాంత సేవతో ఉత్సవాల సందడి శాంతించి, ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక నిశ్శబ్దం నెలకొంది. బ్రహ్మోత్సవాల చివరి రోజు కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. ఏకాంత సేవ అనంతరం ఆలయ నిత్య కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతాయని, ఆదివారం నుండి స్వామివారి దర్శన వేళల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు.ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దేవస్థానం బోర్డు, భక్తులకు కల్పించిన సౌకర్యాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడంతో శ్రీకాళహస్తి పురవీధులన్నీ శివనామస్మరణతో పునీతమయ్యాయి.

తిరుపతి

పరశురామేశ్వరామేశ్వరుని ఆలయంలో నిత్యన్నదాన భవననిర్మాణం

ఏర్పేడు,పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయంలో నూతన అన్నదాన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం శనివారంనాడు ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన భవనాన్ని మైత్రి ఇన్ఫ్రా అండ్ మైనింగ్ సంస్థ వారు తమ సొంత నిధులతో నిర్మించనున్నట్లు తెలిపారు. భక్తులకు నిత్య అన్నదాన సేవలు మరింత సక్రమంగా అందించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు గారు, ఆలయ పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొని భూమి పూజలో భాగమయ్యారు. అన్నదాన భవన నిర్మాణం పూర్తయితే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

తిరుపతి

బొజ్జల బృందమ్మని కలసిన నూతన టైలర్ కమిటీ సబ్యులు

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలోని టైలర్ కార్యాలయంలో ఆదివారం నాడు నూతన కమిటీ సభ్యులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తొట్టంబేడు బాలయ్య మాట్లాడుతూ….. ఈ నెల 28వ తేదీ టైలర్స్ డే సందర్భంగా ముఖ్య ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొనున్నారని, ఆయనతోపాటు మరికొందరు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని బాలయ్య తెలుపుతూ టైలర్స్ డే కి సంబంధించిన కార్యక్రమాలు గురించి టైలర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మని టైలర్ సోదరులు టైలర్స్ డే కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. అధ్యక్షులు బాలయ్య ఎమ్మెల్యే మాతృమూర్తి బజ్జల బృందమ్మ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సాలువాతో సత్కరించి టైలర్స్ డే ఆహ్వాన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షులు బాలయ్య , పోలూరు శ్రీనివాస రెడ్డి, చెంగయ్య, మౌలా, మనీ, రమేష్, వెల్సన్ టైలర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

చంద్రప్రభ వాహనంపై చందమామలా మెరిసిన శ్రీనివాసుడు

తొండమనాడు, పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: తొండమోన్ పుర క్షేత్రంలో వెలసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు శ్రీ స్వామివారు అత్యంత మనోహరంగా అలంకరించిన చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహన సేవకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. తెల్లటి మల్లెలు, రకరకాల పుష్పాలతో అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు కూర్చుని భక్తులను అనుగ్రహించారు. చంద్రుని చల్లని వెన్నెల వంటి కాంతులతో స్వామివారి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది.మంగళవాయిద్యాలు: ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణలతో తొండమోన్ పురం మారుమోగిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులందరికీ ప్రసాద వితరణ జరిగింది. ఈ చంద్రప్రభ వాహన సేవను దర్శించుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని, తాపత్రయాల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. బ్రహ్మోత్సవాలలో భాగంగా రానున్న రోజుల్లో జరగబోయే ఇతర వాహన సేవలకు కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు వెల్లడించారు.

తిరుపతి

అసెంబ్లీ క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ సబ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 26 వరకు విజయవాడలో నిర్వహించనున్న క్రీడా మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (SAP) చైర్మన్‌తో కలిసి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద క్రీడా వేదిక, మైదానం, ఇతర సదుపాయాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనేక మంది యువ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారని అలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రౌండ్ స్థాయిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల ద్వారా అవసరమైన సదుపాయాలు కల్పించాలని శ్రీకాళహస్తిలో సమగ్ర క్రీడా మైదానం (స్టేడియం) నిర్మాణానికి సహకారం అందించాలని, ఆర్ట్స్ కాలేజ్ మైదానాన్ని అభివృద్ధి చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని SAP చైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. క్రీడలు యువతకు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా నియమం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో రవి నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివిన ప్రతిఫలం తప్పకుండా మంచి ఫలితాల రూపంలో దక్కుతుందని అన్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పాలని కోరారు. భవిష్యత్తు లక్ష్యాలను సాధించేందుకు ఈ పరీక్షలు ఒక ముఖ్యమైన మెట్టని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి విజయపథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

తిరుపతి

పఠాన్ కాలేషాకి నివాళులర్పించిన కాటంరెడ్డి పవిత్ర రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫరీద్ తండ్రి పటాన్ కాలేషా కర్మక్రియల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె కాటంరెడ్డి పవిత్ర రెడ్డి కాలేషా చిత్రపటానికి నివాళులర్పించిన కాలేషా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించడం జరిగినది. ఈ కార్యక్రమంలో షేక్ సిరాజ్ బాషా, ఘోర, గఫూర్, ఫజల్, జిలానీ భాషా, అస్లాం, బావాజీ, కంట ఉదయ్, మున్నా రాయల్, పెరుమాళ్ చౌదరి, మణి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఆధ్యాత్మిక వక్త శ్రీ చాగంటి ప్రవచనాలు వినితరించండి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22:శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి ప్రముఖ ఆధ్యాత్మిక వక్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 23వ తేదీ విచ్చేయనున్న సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్యాత్మికవక్త చాగంటి ప్రవచనాలు వినితరించాలని పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…..చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి, ధార్మిక చైతన్యం, జీవన మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని వారి మాటలు సమాజంలో సద్భావన, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని శ్రీకాళహస్తి వంటి పవిత్ర క్షేత్రానికి ఇలాంటి మహానుభావులు విచ్చేయడం గొప్ప విషయమని, ఇది పట్టణానికి గౌరవప్రదమైన సందర్భమని భక్తులందరూ కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

తిరుపతి

వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం గోడపత్రిక ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తిలోని వన్నియకుల క్షత్రియులు మార్చ్ 8, వ తేదీన తిరుపతిలో జరగబోవు వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనము, వివాహ పరిచయ వేదిక కార్యక్రమమునకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ని ఆవిష్కరణ జరిగినది. ఈ సందర్బంగా వన్నెయకుల క్షత్రియ సంఘము నాయకులు మాట్లాడుతూ వన్నియకుల క్షత్రియులు ఐక్యంగా వున్నారు అని, మంచి అవగాహనతో అన్ని రంగములలో అభివృద్ధి చెందు చున్నారని వన్నియకుల బంధువులందరూ ఒకే వేదిక దగ్గర కలవడము చాలా సంతోషముగా ఉందని చెప్పారు. వన్నియకుల క్షత్రియులు గొప్ప వీరులు అని, 1000 ఏళ్ళ చరిత్ర గలవారు అని, అంకితభావం కలవారని చెప్పారు. తిరుపతిలో జరుగబోవు ఈ సమావేశమునకు వన్నియకుల క్షత్రియులు అందరు విచ్చేసి విజయవంతం చేయవలయును అని కోరారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్స్ మిన్నల్ రవి, బాలసుబ్రమణ్యం అయ్యంగారు, మునిరత్నం రెడ్డి, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, పేట బాలాజీ రెడ్డి, యం.యస్.రెడ్డి, జనార్థన్ రెడ్డి, రామారావు, కరుణాకర్ రెడ్డి, రుద్రా కిశోర్, రాము, మధు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.