Wednesday, 18 March 2026

Blog

కడప

ప్రకాష్ నగర్ స్మశానం కు సిసి రోడ్డు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ప్రకాష్ నగర్ వాసులు గత 50 సంవత్సరాల నుండి స్మశాన వాటికకు కనీసం రోడ్డు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయం విధితమే. గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు నాయకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఈసమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, యువనాయకుడు నంద్యాల కొండారెడ్డి అలాగే కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి దృష్టికి స్థానిక ప్రకాష్ నగర్ వాసులు తమ సమస్యను తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి ప్రకాష్ నగర్ స్మశాన వాటికకు రోడ్డును ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపినందున, స్థానిక ప్రకాష్ నగర్ టిడిపి నాయకులు సింహం దేవదాసు, తుపాకుల మధు, స్థానిక యువత, ప్రకాష్ నగర్ ప్రజలు కలిసి స్మశాన వాటిక రోడ్డుకు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువనాయకుడు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

విశాఖపట్నం

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్.

వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్. – సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం వేయడం జరిగిందని జీవీఎంసీ సిటీ వెటర్నరీ అధికారి డాక్టర్ ఎల్.రవికుమార్ గురువారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా సిటీ వెటర్నరీ అధికారి మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలోగల 50 మంది వీధి కుక్కలను పట్టుకునే సిబ్బంది కి, శస్త్ర చికిత్సలు నిర్వహించే వారికి రాబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్ టీకాను జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యుల తో కలిసి వేయించడం జరిగిందని తెలిపారు. జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది వీధి కుక్కలను పట్టుకునేటప్పుడు, శస్త్ర చికిత్సలు నిర్వహించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రవర్తించి పట్టుకోవాలని సిబ్బందికి ఆదేశించడమైనదని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వీధి కుక్కలకు ఆహారం పెట్టే సమయంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు పాటించాలని జంతు సంరక్షణ సేవా సంఘ ప్రతినిధులకు, సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ వైద్యాధికారి డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్, జంతు సంరక్షణ సేవా సంఘం సభ్యులైన శారద, ప్రమోద్, కుసుమ, శ్రీదేవి, రవి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

భవిష్యత్ వైసీపీ దే* — *వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

*భవిష్యత్ వైసీపీ దే* — *వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* భవిష్యత్ వైసిపి దేనని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు.*రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పార్టీకి మరింత బలం పెరిగిందన్నారు*.ఇప్పటికిప్పుడు పోటీ జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి పార్టీ సంచలనం సృష్టిస్తుందని వెల్లడించారు.*27వ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అనుబంధ సంఘాల నాయకులను వార్డు, బూత్ కమిటీలో చేర్చినందుకు వాసుపల్లి గణేష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు*. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి *ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపించారు.ఇచ్చిన హామీలను పక్కనపెట్టి తమ సొంత ఎజెండాతో ముందుకు వెళుతుందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో వైసిపి రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిందని చేశారు. పార్టీ ప్రతిష్టకు పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.

విశాఖపట్నం

బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం.

బయో సి ఎన్ జి , బయోమైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తికరం. *ఫిబ్రవరి ఆఖరుకు బయోమైనింగ్ కార్యాచరణను పూర్తి చేయండి. -కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ లో గల బయో సి ఎన్ జి (బయో గ్యాస్), బయో మైనింగ్ ప్లాంట్ల నిర్వహణ సంతృప్తినిచ్చిందని, బయో మైనింగ్ ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖా, స్వచ్ఛభారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ రూపా మిశ్రా అధికారులకు సూచించారు. గురువారం ఆమె మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ కాపులుప్పాడ లో గల డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ నిర్వహిస్తున్న బయో గ్యాస్ , బయో మైనింగ్ ప్లాంట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ మాట్లాడుతూ కాపులుప్పాడలోని బయో గ్యాస్ ప్లాంట్ ఎప్పుడు మొదలైందని, రోజులో ఎన్ని టన్నులు గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని, గ్యాస్ రేటు ఏ విధంగా ఉందని, బయో గ్యాస్ ప్లాంట్ కు వ్యర్ధాలను ఏ విధంగా సేకరిస్తున్నారని ఆరా తీశారు. బయో గ్యాస్ ప్లాంట్ నిర్వహిస్తున్న వైజాగ్ బయో ఎనర్జీ ఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కేఎస్ రాజు మాట్లాడుతూ రోజుకు 30 టన్నుల వెజిటబుల్ , ఫుడ్ వేస్ట్ ప్లాంట్ కు వస్తుందని , వాటి ద్వారా సుమారు 1000 కేజీలు బయో సి ఎన్ జి ( కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ) ఉత్పత్తి జరుగుతుందని, 30 వేల లీటర్లు లిక్విడ్ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ఉత్పత్తి జరుగుతుందని, అది రైతులకు , నగరంలో జీవీఎంసీ అభివృద్ధి చేస్తున్న గార్డెన్ లకు సరఫరా చేయడం జరుగుతుందని ,అలాగే రోజుకు నాలుగు టన్నుల వరకు సాలిడ్ మెన్యూర్ ఉత్పత్తి అవుతుందని అది కూడా రైతుల ఆర్గానిక్ ఫార్మింగ్ కొరకు రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని , అదనంగా ట్రైల్ బేసిస్ లో ఫాస్ఫరస్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ ( PROM) మార్కెట్లో విడుదల చేయుట కొరకు డెవలప్ చేయబడుతుందని జాయింట్ సెక్రటరీకు , కమిషనర్ కు వివరించగా…, జాయింట్ సెక్రెటరీ బయోగ్యాస్ ప్లాంటు లో కలియతిరిగి జరుగుతున్న వేస్ట్ ప్రాసెస్ ను , అక్కడ ఉత్పత్తి అయిన పలు ఆర్గానిక్ మెన్యూర్ లను, లిక్విడ్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ ను పరిశీలించి ప్లాంట్ నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ కు సూచించారు. అనంతరం జాయింట్ సెక్రెటరీ బయోమైనింగ్ ప్లాంట్ ను సందర్శించి ,బయో మైనింగ్ ఇప్పటివరకు ఎన్ని లక్షల టన్నులు చేశారని అడిగి తెలుసుకుని, మొత్తం 14 లక్షల టన్నుల వ్యర్ధాలలో ఆఖరు దశలో మూడు లక్షల టన్నులు నిర్వహిస్తే పూర్తవుతుందని అధికారులు తెలపగా బయో మైనింగ్ ఇంకా మెరుగైన విధంగా నిర్వహించాలన్న దానిపై ఆలోచించాలని, బయో మైనింగ్ నిర్వహణ సంతృప్తినిచ్చిందని ,బయోమైనింగ్ నిర్వహణ 2026 ఫిబ్రవరి నెల ఆఖరకు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని , జీవీఎంసీ కమిషనర్ కు జాయింట్ సెక్రటరీ సూచిస్తూ… బయోగ్యాస్ ,బయోమైనింగ్ ప్లాంట్లు నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ ఎన్ వి నరేష్ కుమార్, పర్యవేక్షక ఇంజనీర్ గోవిందరావు, సహాయక వైద్యాధికారి డాక్టర్ ఎల్ .రవి కుమార్, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ పి ఎస్ ఆర్ మూర్తి, శానిటరీ సూపర్వైజర్ రాజు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* – టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది – మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై వేధింపులా? – ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు – న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానం – మంత్రి సంధ్యారాణి తన పీఏను సమర్ధించడం సిగ్గుచేటు : తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదుకళ్యాణి విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. – ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ – అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలంటూ వేధింపులు – ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం – మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు – మీ కేబినెట్ మంత్రి పీఏ పై చర్యలేవీ? : చంద్రబాబుని నిలదీసిన వరుదు కల్యాణి – ఆడపిల్లలను వేధిస్తే తాటతీస్తామన్న పవన్ కళ్యాణ్ గారూ – మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? – ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు? : డిప్యూటీ సీఎం పవన్ ను ప్రశ్నించిన వరుదు కళ్యాణి – వేధింపులకు పాల్పడ్డ మంత్రి పీఏను అరెస్టు చేయాలి – మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి భర్తరప్ చేయాలి : వరుదు కల్యాణి డిమాండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ అధికార పార్టీ నేతలపై మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిందని ఆమె మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… మహిళా సంక్షేమశాఖ మంత్రి పీఏ ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగిని వేధిస్తే.. పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సరికదా… న్యాయం చేయాలని మంత్రిని ఆశ్రయిస్తే బదిలీ బహుమానంగా ఇవ్వడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఉద్యోగం కోసం పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్న మంత్రి పీఏ.. డబ్బులు అడిగితే టీడీపీ నేతల పక్కలోకి రావాలని వేధించం దారుణమన్నారు. మహిళలను వేధిస్తే అదే ఆఖరి రోజు కావాలన్న సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగిని వేధిస్తున్న తన కేబినెట్ మంత్రి పీఏను తక్షణమే అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ● సంధ్యారాణి- మహిళా వేధింపుల శాఖా మంత్రి… సాక్షాత్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు దిగడం అత్యంత దుర్మార్గం.. అధికార తెలుగుదేశం పార్టీ దండుపాళ్యం బ్యాచ్ గా మారిందనడానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులుకు ఇదే నిదర్శనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదు సరికదా… ఆ రక్షణ లేకుండా చేస్తున్నది, వేధిస్తున్నది కూడా అధికార పార్టీ నేతలే అన్నదానికి మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఉదంతమే నిదర్శనం.తనకు జరుగుతున్న అన్యాయంపై సాక్షాత్తూ మంత్రికే ఫిర్యాదు చేస్తే… బాధితురాలికి అండగా నిలబడాల్సింది పోయి తన పీఏకే వత్తాసు పలుకుతూ సభ్యసమాజాం సిగ్గుపడేలా వ్యవహరించారు. ఒక మహిళగా, స్త్రీశిశు సంక్షేమశాఖా మంత్రిగా సాటి మహిళలకు అండగా నిలబడాల్సింది పోయి తన పీఏను వెనకేసుకుని రావడం సిగ్గుచేటు. మంత్రి సంధ్యారాణి స్త్రీ శిశు సంక్షేమశాఖా మంత్రా? లేక స్త్రీల వేధింపుల శాఖ మంత్రా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ పూర్తిగా దిగజారిపోయాయి. ● న్యాయం అడిగితే పక్కలోకి రమ్మంటున్న టీడీపీ నేతలు… మంత్రి సంధ్యారాణి పీఏ… బాధిత మహిళ దగ్గర డబ్బులు తీసుకోవడంతో పాటు, ఆమెను పక్కలోకి రావాలని వేధింపులకు గురిచేయడంతో పాటు మరింత బరితెగించి ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కలోకి కూడా రావాలని ఒత్తిడి చేయడం అత్యంత అమానుషం. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. మంత్రి గారి పీఏ కు మంత్రి అండ ఉంది కాబట్టి వారు పట్టించుకోలేదు. గత్యంతరం లేక నేరుగా మంత్రికే బాధితురాలు ఫిర్యాదు చేస్తే.. ఆమెకు అండగా నిలవాల్సిన మంత్రి బాధిత మహిళపై కక్ష సాధింపు ధోరణిలో రూరల్ ప్రాంతానికి బదిలీ చేశారు. ఇది మంత్రి సిగ్గుపడాల్సిన విషయం. ఇదేమి సంస్కారం మంత్రిగారూ? మీ పీఏ వేధింపులకు తలొగ్గకపోతే సాలూరు నుంచి ఏకంగా గుమ్మలక్ష్మీపురం బదిలీ చేస్తారా? మీ వేధింపులపై సాక్ష్యాలతో సహా బాధితురాలు చెబుతుంటే ఆమెకు కనీస రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వమిది. పోలీసులు, మంత్రి సంధ్యారాణి పట్టించుకోకపోవడంతో మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసినా కూడా నిందితుడు సతీష్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. పైగా బాధిత మహిళలనే తిరిగి వేధిస్తున్న దుస్థితి. ● కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ గాల్లో దీపం… కూటమి ప్రభుత్వంలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాల్లా తయారయ్యాయి. అయినా మహిళల రక్షణ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం నిలువెత్తు నిర్లక్ష్యంతో ఉంది. మహిళలను ఎవరైనా వేధిస్తే… వారికి అదే చివరి రోజు అని చెప్పే సీఎం చంద్రబాబు.. తన కేబినెట్ లో మహిళా మంత్రి పీఎ వేధింపులకు గురైన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆ పీఏను తక్షణమే అరెస్టు చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వానికి లేదా చంద్రబాబుగారూ? పీఏ వేధింపులకు కొమ్ముకాస్తూ.. బాధితురాలు ఆవేనను పట్టించుకోని మీ మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలి. మహిళలను వేధిస్తే.. తాటతీస్తానంటూ ఆవేశంగా డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… మీ సహచర మంత్రి మహిళలను వేధిస్తుంటే మీరు ఎవరు తాట తీశారు? మీ సహచర మంత్రి తాట ఎప్పుడు తీస్తారు? ఆమె పీఏ తాట ఎప్పుడు తీస్తారు? మహిళల గౌరవం గురించి గొప్పగా ట్వీట్లు చేసే మంత్రి లోకేష్ గారు.. .బాధిత మహిళ తన రక్షణ కోసం మిమ్మల్ని కూడా ఆశ్రయించింది. అయినా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీరు మాటలకు మాత్రమే పరిమతం అవుతారా? మహిళల రక్షణ మీకు పట్టదా? ప్రభుత్వ మహిళా ఉద్యోగి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే.. హోంమంత్రి ఎందుకు కనీస చర్యలు తీసులేదు? మీరు మాటలు తప్ప.. మహిళల రక్షణ ఎప్పుడో గాలికొదిలేశారని మరోసారి నిరూపితమైంది. మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మంత్రి సంధ్యారాణి పీఏను అరెస్టు చేయాలి. మరోవైపు బాధిత మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళలకు రక్షణ కల్పించారు. ● కూటమి పాలన- దిగజారిన శాంతిభద్రతలు… కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత… శాంతిభద్రతల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ 36వ స్ధానానికి దిగజారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద రోజుకు 70-80 ఘటనలు నమోదు కాగా…. గంటకు 3-4 సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మహిళల మీద నేరాలు 4శాతం, మహిళల మీద రేప్ లు 9శాతం, గంజాయి, డ్రగ్స్, మద్యం వినియోగం 31 శాతం పెరిగింది. ఇంత దారుణమైన సంఘటలు చూస్తున్నాం. బీఎన్ఎస్ యాక్ట్, బీ ఎస్ ఎస్ ఎస్ యాక్ట్ ఏ రాష్ట్రాల్లో పక్కాగా అమలు చేస్తున్నారన్న దానిపై సర్వే చేస్తే మన రాష్ట్రం చిట్టచివరి 36 స్ధానంలో ఉంది. ఒక బాధితుడు పీఎస్ లో ఫిర్యాదు చేస్తే.. ఎంతవరకు అఫ్ లోడ్ చేస్తున్నారు, సీన్ ఆఫ్ అఫెన్స్ ని ఎంత వేగంగా అప్ లోడ్ చేస్తున్నారన్నదాన్ని పరిశీలిస్తే.. అది మన రాష్ట్రంలో ఆ డేటాను అప్ లోడ్ చేయడం లేదు . దీనికి కారణం అక్రమ కేసులు, తప్పుడు కేసులే కారణం. డేటా వెంటనే అప్ లోడ్ చేస్తే అక్రమ కేసులు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి… ఆ పని చేయడం లేదు. ఫలితంగా మన శాంతిభద్రతల నిర్వహణలో 36వ స్ధానానికి దిగజారిపోయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. ప్రతి ఘటనలోనూ టీడీపీ నేతల హస్తం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, డ్రగ్స్ ఏరులై పారుతున్నాయి. ఏ కేబినెట్ మీటింగ్ లోనూ మహిళల రక్షణ గురించి చర్చించిన పాపాన పోలేదు. ● వైయస్.జగన్ ప్రభుత్వం- మహిళా రక్షణకు పెద్ద పీట గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో దిశయాప్ ద్వారా 1.30 కోట్ల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని.. పెద్ద సంఖ్యలో ఉపయోగించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కాపీ కొడుతూ.. శక్తి యాప్ అని తీసుకొచ్చారు. మంత్రి పీఏ వేధింపులపై నేరుగా పోలీస్ స్టేషన్ కు, మంత్రులు సంధ్యారాణి, లోకేష్ లకు ఫిర్యాదు చేసినా స్పందించకపోతే…శక్తి యాప్ ఏం చేస్తుంది.? వైయస్.జగన్ హయాంలో దిశ యాప్ ద్వారా వేలసంఖ్యలో మహిళలు రక్షణ పొందారు. దిశ యాప్ ను చట్టం చేయడం కోసం అసెంబ్లీలో ఆమోదించి.. దాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం ఆమోదించేలోగా.. దిశ లోని అంశాలన్నీ అమలు చేశారు. మహిళలకు పెద్ద పీట వేశారు. ప్రతి నెలా మహిళా భద్రతపై సమీక్ష నిర్వహిస్తూ. .వారి భద్రత కోసం అనేక పటిషమైన చర్యలు తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కిచ్చిన ఏ హామీలు అమలు చేయలేదు సరికదా.. వారి రక్షణను గాలికొదిలేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపధ్యంలో బాధిత మహిళలకు వైయస్సార్సీపీ అండగా ఉంటుందని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. తక్షణమే ఆమెను వేధించిన నిందితుడు సతీష్ ను అరెస్టు చేయడంతో పాటు మంత్రి సంధ్యారాణిని కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి , లో జిల్లా అంగన్వడి విభాగం

విశాఖపట్నం

ఉత్పత్తితో వేతనాలు ముడిపెడితే ప్రతిఘటిస్తాం

ఉత్పత్తితో వేతనాలు ముడిపెడితే ప్రతిఘటిస్తాం *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తితో వేతనాలు ముడిపెడుతూ ఇచ్చిన సర్కులర్ ను రద్దు చేయాలని లేకుంటే ప్రతిఘటిస్తామని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని హెచ్చరించారు. నేడు స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ నేడు స్టీల్ కార్మికులు పొందుతున్న వేతనాలు యాజమాన్యం ప్రభుత్వాలు దయాదాక్షణ్యాలతో ఇచ్చినవి కాదని ఆయన అన్నారు. కార్మికులపై ప్రభుత్వ దాడి,యాజమాన్య నిరంకుశత్వానికి పరాకాష్ట వేతనం పై దాడి అని ఆయన వివరించారు. గత సంవత్సర కాలంగా పూర్తి వేతనాలు చెల్లించకుండా కార్మికులను అర్ధాకలితో పస్తులు పెడుతూ ఉన్నారని ఆయన అన్నారు. కార్మికుల హక్కుగా ఉన్న హెచ్ ఆర్ ఎ వాయిదా వేసి సుమారు 6000 మందిని, ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు కరెంటు చార్జీలు పెంచి ఆర్థికంగా నష్టపరిచారని ఆయన వివరించారు. పూర్తి జీతాలు సకాలంలో చెల్లించాలని యాజమాన్యాన్ని కార్మికులు కోరుతుంటే దానికి విరుద్ధంగా నేడు యాజమాన్యం చట్ట విరుద్ధమైన, దుర్మార్గమైన సర్కులర్ ను విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని తక్షణమే రద్దు చేయాలని లేని పక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఐ ఎన్ టి యు సి జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉత్పత్తి హెచ్చుతగ్గులకు ఉద్యోగులు బాధ్యులు కాదని, ప్రణాళికలు రూపొందించేది అమలు చేసేది ప్రభుత్వ, ఉన్నత యాజమాన్యాలే అని ఆయన అన్నారు. ప్లాంటులో యంత్రాలు పాతవి అయిపోయాయని వాటి మరమ్మత్తులు సకాలంలో చేయలేదని, రా మెటీరియల్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేదని ఈ పరిస్థితుల నడుమ పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. అధికారులు చెబుతున్న వినకుండా ఇన్చార్జి సిఎండి ఏకపక్ష నిర్ణయాలతో నియంతలా వ్యవహరిస్తూ ఉత్పత్తి పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన వివరించారు. ఏమాత్రం ప్రణాళిక లేకుండా నియంతలా ఉద్యోగులను తొలగించి కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలను వీధులు పాలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రా మెటీరియల్ అందుబాటులో లేని కారణంగానే అధిక ధరకు కోక్ మరియు పెలెట్స్ కొనుగోలు చేస్తున్నారని వీటి నాణ్యత లేని కారణంగానే స్టీల్ తిరస్కరణకు గురి అయిందని ఆయన అన్నారు. యాజమాన్యం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని లేకుంటే ఐక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎ టి యు సి ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ గడచిన 4 సంవత్సరాలుగా కార్మికుల హక్కులను ఈ యాజమాన్యం కాలరాసోంతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన తాబేదారులకు ఈ ప్లాంట్ ను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని నేడు రాష్ట్రంలోని ప్రభుత్వం మద్దతు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని ఆయన వివరించారు. అందులో భాగంగానే జరుగుతున్న పరిణామాలను కార్మిక వర్గం ఐక్యంగా త్రిప్పికొడుతూ ఉద్యమించాలని మరింత ఉధృతం చేస్తామని ఆయన యాజమాన్యాన్ని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు ఎం రామారావు, స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు జె అయోధ్య రామ్, రమణమూర్తి, డివి రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, సిహెచ్ సన్యాసిరావు, పాడి త్రినాథ్, శ్రీనివాస్, సంపూర్ణం తదితరులు మాట్లాడుతూ ఉన్నత యాజమాన్యం చేతకాన్నితనాన్ని అధికారుల, ఉద్యోగులపై నెట్టి, ప్రశ్నించిన అధికారులను సస్పెండ్, ట్రాన్స్ఫర్ చేస్తూ షో కాజు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. ప్లాంట్ లో స్ట్రక్చర్స్ అన్నీ కుప్పకూలిపోయే విధంగా ఉన్న కనీసం మెయింటెనెన్స్ చేయకుండా ప్లాంటును అధోగదిపాలు చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఉన్నత యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. అవమానాలు భరిస్తూ, భద్రత లేక ప్రాణాలు కోల్పోతున్నా, పని భారం పెరిగిన మనోధైర్యాన్ని కోల్పోకుండా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల యాజమాన్యం తన పద్ధతిని మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, కె ఎస్ ఎన్ రావు, బి యన్ రాజు, గణపతి రెడ్డి, పరంధామయ్య, డేవిడ్, జి ఆర్ కె నాయుడు, నీరుకొండ రామచంద్రరావు, టి వి కె రాజు, బి అప్పారావు, బి తౌడన్న తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు,నూతన కార్మికులు, రిటైర్డ్ కార్మికులు అధిక సంఖ్యలో వివిధ సంఘాల కార్యకర్తలు మరియు కార్మికులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి* — *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్*

*అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి* — *మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని వైసీపీ నాయకులు, దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. గురువారం వాసుపల్లి గణేష్ కుమార్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉండాలని అభిలాషించారు. ఎదుటివారికి సహాయం చేయాలనే సద్గుణం కూడా ఉండాలని పేర్కొన్నారు. కోరిన వరాలు ఇచ్చే కనకమాలక్ష్మి అమ్మవారు ఎంతోమంది జీవితాలలో తన అద్భుత మహత్యాలతో కొత్త వెలుగులు నింపారని కొనియాడారు. ఆమె చల్లని చూపు అందరి మీద ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో తమ కుటుంబాలతో ఆనందంగా గడపాలని, ఆ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తప్పకుండా ఈసారి అమ్మవారిని దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందిన ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుందని అభిలాషించారు.

వికారాబాద్

*ర రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు మండల శాఖ ఎన్నికలు

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు మండల శాఖ ఎన్నికలు* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ 27/ 11/ 2025* పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాల పండిత పరిషత్తు మండల కమిటీల ఎన్నికలు ఘనంగా నిర్వహించబడినాయి. వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో, ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాజాగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి అందజేశారు. అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ— భాషా పండితులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు కల్పించేందుకు రాష్ట్ర శాఖ కృషి చేస్తున్నదని, అందరూ ఇందుకోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 1/2005 ఆక్ట్ రద్దుకు న్యాయపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చినదని తెలిపారు. ఉన్నత పాఠశాలలో భాషా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం వంటి అంశాల్లో పండిత పరిషత్తు మాత్రమే నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. జీవో 190 సవరణ ద్వారా భాషా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుకున్నారు. భాషా పండితులుగా పనిచేసిన కాలానికి నోషనల్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా ఎన్నుకోబడిన మండల కమిటీలు పరిగి మండలం: అధ్యక్షులు: ఎస్. రాములు ప్రధాన కార్యదర్శి: వీరానందం చారి కోశాధికారి: అనిత మహిళా ప్రతినిధులు: అనంతలక్ష్మి, బీబీ పూడూరు మండలం: అధ్యక్షులు: ఉమర్ ఖాన్ ప్రధాన కార్యదర్శి: టీ. మౌనిక కోశాధికారి: షఫి కుల్కచర్ల మండలం: అధ్యక్షులు: పల్లె సీనయ్య ప్రధాన కార్యదర్శి: చిగుర్లపల్లి ప్రసాద్ కోశాధికారి: జి. యాదగిరి మహిళా అధ్యక్షురాలు: గంగా దోమ మండలం: అధ్యక్షులు: ఆర్. బుచ్చిబాబు ప్రధాన కార్యదర్శి: ఎం. నరసింహ మహిళా అధ్యక్షురాలు: శాంతి మ కోశాధికారి: వెంకట చారి చౌడాపూర్ మండలం: అధ్యక్షులు: నగేషన్ ప్రధాన కార్యదర్శి: భాస్కర్ మహిళా అధ్యక్షురాలు: బి. రమాదేవి కోశాధికారి: బసయ్య ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులుగా జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా సహా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫారూఖ్ పటేల్, జిల్లా కోశాధికారి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నయీమోద్దిన్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాషా ఉపాధ్యాయులు జి.మంజుల, పి.బాలమణి, కే.అమృత, జాకీర్ అలీ, ఎం.లక్ష్మణ్, ఆర్.బాలకృష్ణ, కే.జయంతి, ఐ.అమృతమ్మ, ఈ.స్వర్ణ, సి.హేమ, రుక్మిణి, టిఆర్.కవిత, ఎస్.రాములు, జె.హరి చందర్, కే.బుచ్చయ్య, బి.నరసింహ తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్

*ర రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు మండల శాఖ ఎన్నికలు

*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు మండల శాఖ ఎన్నికలు* *పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ 27/ 11/ 2025* పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాల పండిత పరిషత్తు మండల కమిటీల ఎన్నికలు ఘనంగా నిర్వహించబడినాయి. వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో, ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తాజాగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి అందజేశారు. అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ— భాషా పండితులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు కల్పించేందుకు రాష్ట్ర శాఖ కృషి చేస్తున్నదని, అందరూ ఇందుకోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 1/2005 ఆక్ట్ రద్దుకు న్యాయపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చినదని తెలిపారు. ఉన్నత పాఠశాలలో భాషా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం వంటి అంశాల్లో పండిత పరిషత్తు మాత్రమే నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. జీవో 190 సవరణ ద్వారా భాషా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుకున్నారు. భాషా పండితులుగా పనిచేసిన కాలానికి నోషనల్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా ఎన్నుకోబడిన మండల కమిటీలు పరిగి మండలం: అధ్యక్షులు: ఎస్. రాములు ప్రధాన కార్యదర్శి: వీరానందం చారి కోశాధికారి: అనిత మహిళా ప్రతినిధులు: అనంతలక్ష్మి, బీబీ పూడూరు మండలం: అధ్యక్షులు: ఉమర్ ఖాన్ ప్రధాన కార్యదర్శి: టీ. మౌనిక కోశాధికారి: షఫి కుల్కచర్ల మండలం: అధ్యక్షులు: పల్లె సీనయ్య ప్రధాన కార్యదర్శి: చిగుర్లపల్లి ప్రసాద్ కోశాధికారి: జి. యాదగిరి మహిళా అధ్యక్షురాలు: గంగా దోమ మండలం: అధ్యక్షులు: ఆర్. బుచ్చిబాబు ప్రధాన కార్యదర్శి: ఎం. నరసింహ మహిళా అధ్యక్షురాలు: శాంతి మ కోశాధికారి: వెంకట చారి చౌడాపూర్ మండలం: అధ్యక్షులు: నగేషన్ ప్రధాన కార్యదర్శి: భాస్కర్ మహిళా అధ్యక్షురాలు: బి. రమాదేవి కోశాధికారి: బసయ్య ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులుగా జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా సహా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫారూఖ్ పటేల్, జిల్లా కోశాధికారి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నయీమోద్దిన్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాషా ఉపాధ్యాయులు జి.మంజుల, పి.బాలమణి, కే.అమృత, జాకీర్ అలీ, ఎం.లక్ష్మణ్, ఆర్.బాలకృష్ణ, కే.జయంతి, ఐ.అమృతమ్మ, ఈ.స్వర్ణ, సి.హేమ, రుక్మిణి, టిఆర్.కవిత, ఎస్.రాములు, జె.హరి చందర్, కే.బుచ్చయ్య, బి.నరసింహ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

పడిగెల శ్రీను ను ఆశీర్వదించండి. మొరపెట్టుకున్న అభ్యర్థి

కామారెడ్డి, 27 నవంబర్, (పున్నమి ప్రతినిధి) : రామారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతు న్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి న నేపథ్యంలో సర్పంచ్ పదవికి నేడు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైంది.ఈ సందర్భంగా అభ్య ర్థి రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అప్ప గించగా, సంబంధిత అధికారుల సమక్షంలో దాన్ని స్వీకరించారు. అభ్యర్థి సందేశం… గతంలో సర్పంచ్‌గా సేవలందిం చిన తన భార్య శైలజకు గ్రామ ప్రజలు ఇచ్చిన అపారమైన ఆశీర్వాదం, విశ్వాసమే తనకు ప్రేర ణగా నిలిచిందని అభ్యర్థి పేర్కొన్నారు.అదే ఉత్సా హంతో, మాట తప్పకుండా ప్రజలకు అందుబాటు లో ఉంటూ, అభివృద్ధి–సేవలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చా రు. ఓటర్లకు పిలుపు రామారెడ్డి గ్రామ ప్రజల ఆశీ స్సులు, మద్దతు లభిస్తే రత్నాకర్ సేటు కొడుకుగా మీ అందరి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నిరంత రం సేవ చేస్తాను అంటూ ప్రజలను అభ్యర్థి కోరా రు. జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను గెలిచేలా ప్రతి ఓటు అమూల్యమైందని, అభివృద్ధి కొనసాగేందుకు అందరూ సహకరించాల ని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.