Saturday, 7 March 2026

Blog

తిరుపతి

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఘనంగా విలువల విద్యా సదస్సు

విలువలు లేని విద్య వ్యర్థం** జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పున్నమి ప్రతినిధి,తిరుపతి, విలువలు లేని విద్య వ్యర్థం అని సమగ్ర అభివృద్ధికి విలువలతో కూడిన విద్య అవసరమని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సు లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, బ్రాహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు రేపటి సమాజ నిర్మాణ శిల్పులని పేర్కొన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు నైతిక విలువలను పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఒక చక్కటి ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మానవతా విలువలు తగ్గిపోతున్నాయని ముఖ్యంగా చిన్నపిల్లల స్థాయి నుండే వీటిని అలవర్చుకోవాలన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు వీటిని నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కానీ పాఠశాలలో విద్యార్థుల మధ్య పోటీ తత్వం పెరిగిపోవడంతో మానవతా విలువలను పక్కన పెడుతున్నారన్నారు. ఎక్కువ ప్రాధాన్యత పోటీ తత్వానికే ఇస్తూ విలువలను విస్మరిస్తున్నారన్నారు. ఈ అంశంలో ఉపాధ్యాయులు కూడా వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు రావడం వల్ల సమాజంలో ఎన్నో అరిష్టాలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈమధ్య సోషల్ మీడియా వైపు పిల్లలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రద్ధ పెట్టి విద్యా వ్యవస్థలో మానవతా విలువలను మరళా తీసుకురావాలని పాఠ్యాంశంలో వీటిని ఎలా భాగం చేయాలి అనే దానిపై ఆలోచన చేసి మంచి కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారని తెలిపారు. అందులో భాగంగా సోమవారం మనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావుని అడ్వైజర్ గా నియమించి విద్యా విలువలను పెంపొందించడానికి అర్థమయ్యే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. పిల్లలు మంచి విలువలను అలవర్చుకొని సమాజాన్ని విలువలతో తీర్చిదిద్దుతారని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నానన్నారు. ఇప్పటికే మూడు జిల్లాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ రోజున తిరుపతిలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామన్నారు. విలువలతో కూడిన విద్య నేటి సమాజానికి ఎంతో అవసరమని భవిష్యత్తు తరాలకు చాలా ఉపయోగకరమని అన్నారు. పిల్లల్లో సమయపాలన, ఆత్మస్థైర్యం సరిగా ఉండడం లేదని, వాటన్నింటినీ అధిగమించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ యం వి కృష్ణారెడ్డి, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీమతి ఆర్.ఉష, తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె వి ఎన్ కుమార్, తిరుపతి అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష జి.గౌరీ శంకర్ రావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పెద్ద సంఖ్యలో ఆధ్యాత్మికాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

సెవెన్ హిల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాతీయ సెమినార్ విజయవంతం

పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం రామచంద్రపురం మండలం వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం నాడు “వినూత్న ఔషధ పంపిణీ కోసం లిపిడ్ ఆధారిత సూత్రీకరణలు” అనే అంశం పై ఒక రోజు జాతీయ సెమినార్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సెమినార్కు అమెరికా దేశంలోని ఆబర్న్ విశ్వవిద్యాలయంకు చెందిన హారిసన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెసర్ డా. జే బాబు రామాపురం గారు వక్తగా హాజరై ఉపన్యాసం అందించారు. లిపిడ్ ఆధారిత ఔషధ రూపకల్పనలో ఆధునిక పద్ధతులు, నూతన ఔషధ పంపిదీ సాంకేతికతలు, బయో అవైలబిలిటీ మెరుగుదల వంటి అంశాలపై అయిన సమగ్రంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఐ క్యుఏసిఆధ్వర్యంలో, ఐఐసీ మరియు ఆర్2డి సెల్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ మరియి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రసన్నరాజు, బోధన సిట్టింది.

కడప

సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి

కడప జిల్లా.. పులివెందుల సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి ఉలిక్కిపడిన కడప పోలీసు శాఖ.. రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ ఇద్దరినీ సింహాద్రిపురం స్టేషన్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు. లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ సింహాద్రిపురం రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐ లను అరెస్టు చేసిన ఎసిబి డిఎస్పి . చైన్ స్నాచింగ్ దొంగతనంలో ఒక ద్విచక్ర వాహనదారున్ని గుర్తించిన పోలీసులు ద్విచక్ర వాహనం అమ్మిన వ్యక్తి వద్ద నుంచి నాలుగు లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన పోలీసులు.. గత శనివారం లక్ష లంచం రూపంలో అందజేసిన కదిరికి చెందిన ఏజెంట్ బ్రహ్మం.. మిగిలిన డబ్బుకోసం వత్తిడి తేవడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బ్రహ్మం.. నేడు లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడిన పోలీసు అధికారులు.. లంచం సొమ్మును సీజ్ చేసిన ఏసీబీ. మూడు గంటలుగా సీఐ, ఎస్సై లను విచారిస్తున్న ఎసిబి అధికారులు.. డీఎస్పీ, రూరల్ సీఐ ఆదేశాలతోనే బాధితుడు బ్రహ్మం ను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.. కాశ్మీర్ లో చోరీ అయిన టు వీలర్ ను ఏపీలో నెంబర్ ప్లేటు మార్చి విక్రయించిన అక్రమార్కులు.. నెంబర్ ప్లేట్ మార్చిన టు వీలర్ లో చైన్ స్నాచింగ్.. సుమారు 15 లక్షలు చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ వ్యవహారంలోనే టు వీలర్ అమ్మిన ఏజెంట్ బ్రహ్మంను డబ్బులు డిమాండ్ చేసిన పోలీసులు..

రాజన్న సిరిసిల్ల

ఆశ వర్కర్ల ముందస్తు అరెస్టును ఖండించిన ముస్తఫా సర్పంచ్.

ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండలానికి చెందిన ఆశ వర్కర్లు పెండింగ్ వేతనాలు. పనికి తగ్గ వేతనం చెల్లించాలని రాష్ట్ర ఆశా వర్కర్ల సంఘం ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర ఆరోగ్య కమీషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ముస్తాబాద్ మండల ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గారు సిఐతో ఫోన్లో మాట్లాడి వారి విడుదల చేయించి అల్పాహారం అందించారు.

రాజన్న సిరిసిల్ల

భయంకర శబ్దాలతో ఉరుములతో అకాల వర్షం

ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు మధ్యాహ్నం భయంకర శబ్దాలతో ఉరుములతో సుమారు రెండున్నర గంటల పాటు వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రజలు మాత్రం ఈ వర్షంతో వరి పంట మంచిగా రావాలని ఆశిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల

భయంకర శబ్దాలతో ఉరుములతో అకాల వర్షం

ముస్తాబాద్ ఫిబ్రవరి 23 పున్నమి ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈరోజు మధ్యాహ్నం భయంకర శబ్దాలతో ఉరుములతో సుమారు రెండున్నర గంటల పాటు వర్షం పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ప్రజలు మాత్రం ఈ వర్షంతో వరి పంట మంచిగా రావాలని ఆశిస్తున్నారు.

E-పేపర్

అబ్దుల్లాపూర్ మెట్ మండలం అక్రమ కట్టడాలను కూల్చివేత

పున్నమి న్యూస్ ప్రతినిధి 23 ఫిబ్రవరి 2026 9640204826 తహసీల్దార్, అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఆదేశానుసారం, గౌరెల్లి గ్రామంలో సర్వే నంబర్ 206 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలని,రెవెన్యూ సిబ్బంది మరియు GPO,గౌరెల్లి గ్రామంతో కలిసి కూల్చివేయటం జరిగింది. ఇట్లు మండల రెవెన్యూ గిర్దావర్.

E-పేపర్

మల్కాజ్గిరి MMC నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన — మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

పున్నమి న్యూస్ ప్రతినిధి 23 ఫిబ్రవరి 2026 అలంపల్లి దుర్గేష్ 9640204826 మల్కాజ్గిరి MMC నూతన కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన — మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి తార్నాక పాత HMDA కార్యాలయంలో ఏర్పాటు చేసిన MMC కమిషనర్ కార్యాలయంలో మల్కాజ్గిరి నూతన కమిషనర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి (IAS) * మర్యాదపూర్వకంగా మాజీ GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కలసి మొక్కను అందజేసి వారికి శుభాభివందనాలు తెలియజేసి, అనంతరం డివిజన్లోని కొనసాగే పనులను మరియు సమస్యలను వారితో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మా రెడ్డి మాట్లాడుతూ…. మన్సూరాబాద్ సహారా ఎస్టేట్స్ రోడ్డు నుండి కామినేని హాస్పిటల్ వెళ్లే మార్గం రోజు రద్దీగా ఉండడంతో రోజు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఉప్పల్,నాగోల్,ఎల్బీనగర్ నుండి ఇటువైపుగా చాలా వాహనాలు వెళ్లడంతో జంక్షన్ ఇంప్రూవ్మెంట్ తో పాటు 100 ఫీట్ల రోడ్డును తొందరగా నిర్మించే ప్రయత్నం చేయాలని దానికి సంబంధించిన అన్ని ఎస్టిమేషన్స్ సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలియజేశారు. హయత్ నగర్ బొమ్మల గుడి రోడ్ నుండి డబల్ బెడ్ రూమ్ వర్క్ ఉన్న దాదాపు 20 కాలనీలకు అనుసంధానంగా ఉండే రోడ్డు రూ: 2.00 కోట్ల నిధులతో సాంక్షన్ కావడం జరిగిందని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఇంకా పనులు మొదలు కాలేదని తెలియజేయడంతో మరో రెండు, మూడు రోజుల్లో రోడ్ పనులు ప్రారంభిస్తారని తెలియజేశారు. దాదాపు రూ: 10.00కోట్ల నిధులతో టెండర్ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇంకా పెండింగ్లో ఉన్న పనులను తొందరగా ప్రారంభించాలని, ఇంకా డివిజన్లోని కొనసాగే పనులు మరియు సమస్యలను MMC కమిషనర్ తెలియజేయడంతో వారు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలియజేసి తొందర్లోనే పనులు ప్రారంభిస్తారని శుభవార్తను తెలియజేశారు.

E-పేపర్

రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్

పున్నమి న్యూస్ ప్రతినిధి 23 ఫిబ్రవరి 2026 భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది *పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు* సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు

ఖమ్మం

బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు, హిందువులపై అకృత్యాలు ఖండిస్తున్నాం: సుదర్శన్ మిశ్రా

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతుండగా, మరోవైపు హిందువులపై దారుణమైన అకృత్యాలు కొనసాగుతున్నాయని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు సత్తుపల్లి లో బీజేపీ కార్యా లయం లో జరిగిన సమావేశం లో సుదర్శన్ మిశ్రా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపనేని రామచంద్ర రావు సహా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై దాడులను లక్ష్యంగా పెట్టుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోందని ఆయన విమర్శించారు. గాంధీ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించడం బాధాకరమని, కానీ తెలంగాణ రైతులకు, రైతు కూలీలకు న్యాయం జరగడం లేదని ప్రశ్నించారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడు గాంధీ కుటుంబానికి నిధులు కేటాయిస్తామని చెప్పడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ అరాచకాలకు ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సుదర్శన్ మిశ్రా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు బీమి రెడ్డి బాలకృష్ణ రెడ్డి, నాయుడు రాఘవ, పడిగల మధు, సురేంద్ర సాలి శివ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.