Wednesday, 18 March 2026

Blog

విశాఖపట్నం

కనక మహాలక్ష్మి అమ్మవారి దీవెనలు నగర ప్రజలపై ఉండాలి

కనక మహాలక్ష్మి అమ్మవారి దీవెనలు నగర ప్రజలపై ఉండాలి – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన 4 వ జోన్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని నగర మేయర్ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ కనకమాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మార్గశిర మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు చేకూరుతాయని తెలిపారు. నేడు అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఆలయ అధికారులు మేయర్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు.

విశాఖపట్నం

కేజీహెచ్ లో వరుస ఘటనలు కూటమి వైఫల్యమే*..

*కేజీహెచ్ లో వరుస ఘటనలు కూటమి వైఫల్యమే*.. * *ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్నా పని చేయలేదు*.. * *వైసిపి హయంలో రూ. 500 కోట్లతో కేజీహెచ్ నీ మోడర్న్ గా తీర్చిదిద్దాం!* * *కార్డియాలజీలో అగ్నిప్రమాదంపై ఆరా తీసిన వాసుపల్లి గణేష్ కుమార్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 12 గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉదాంతం మరిచిపోక ముందే కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం జరగడం కూటమి ప్రభుత్వం వైఫల్యమేనని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. *శనివారం కేజీహెచ్ కార్డియాలజీ లో జరిగిన ఘటన స్థలాన్ని దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. వైద్య సిబ్బంది రోగుల బంధువులతో జరిగిన ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయంలో 500 కోట్ల రూపాయలతో కేజీహెచ్ అన్ని విభాగాలు అభివృద్ధి చేశామన్నారు. గత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న విడుదల రజిని పేరుతో ఉన్న శంకుస్థాపన శిలాఫలకాలే దీనికి నిదర్శనం అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి కేజీహెచ్ ఆసుపత్రి మోడరన్ గా తీర్చిదిద్దారని అన్నారు*. నాణ్యమైన అధునాతన పరికరాలు కూడా వైసిపి ప్రభుత్వం లో కేటాయించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి కేజీహెచ్ ను పట్టించుకునే నాధుడే లేరన్నారు. ఫైర్ సేఫ్టీ యూనిట్స్ ఉన్న పనిచేయకపోవడం దారుణం అన్నారు. కేజీహెచ్ లో ఫైర్ ఇంజన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్, కేజీహెచ్ సూపరిండెండెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మధ్య సమన్వయం లేదన్నారు. కేజీహెచ్ పై నిర్లక్ష్యం వరుస ఘటనలతో తేటతెల్లమవుతుందన్నారు. కలెక్టర్ తక్షణమే దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలన్నారు. రోగులకు అసౌకర్యం కలిగితే వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేజీహెచ్ లో ఎలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. కనకమహాలక్ష్మి అమ్మవారే కేజీహెచ్ ను , రోగులను కాపాడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మరియు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్,జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ రాజు, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్, వార్డు అధ్యక్షులు పీతల వాసు,రాష్ట్ర సాంస్కృతి విభాగం కార్యదర్శి కంటుముచ్చు సాగర్ గారు, జిల్లా వాణిజ్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చోడిపల్లి శివ గారు, దక్షిణ నియోజకవర్గం సోషల్ మీడియా అధ్యక్షులు బెవరా మహేష్ గారు , 38వ వార్డు యూత్ ప్రెసిడెంట్ చేపల నూకరాజు (బుడ్డి) గారు, స్టేట్ మేధావులు విభాగం సెక్రటరీ ఈతలపాక విజయ్, సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యాం,జిల్లా sc విభాగం వైస్ ప్రెసిడెంట్ కోన శంకర్, జిల్లా యూత్ సెక్రటరీ సంతోష్, వేణు, జిల్లా సెక్రటరీ రామరాజు, 30వ వార్డు మహిళ ప్రెసిడెంట్ రాము , సౌత్ స్టూడెంట్ ప్రెసిడెంట్ VT కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* ఓం నమో వేంకటేశాయ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ V 004J గవర్నర్ An BVN Kamalasri గారి అధ్యక్షతన టీటీడీ కళ్యాణమండపం MVP విశాఖపట్నం నందు విశ్వశాంతి కోసం కలియుగ దైవం అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగినది సదరు కార్యక్రమానికి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అధ్యకుడు తిరువీధి వేణుగోపాల్ కార్యదర్శి నాగసూరీ మురళీ డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ చక్కా బంగార్రాజు , కోశాధికారి మానేపల్లి సుగుణకుమార్, వైస్ గవర్నర్ లు KS Ramarao, P సాంబమూర్తి , ICC officers Ve Ve Gupta, A Sunitha devi, RC లు ZC లు clubs PST లు మరియూ పలువురు రాజకీయ నాయకులు సదరు కార్యక్రమానికి హాజరు అయి స్వామి వారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగినది

విశాఖపట్నం

పోలీస్ కమీషనర్ నవంబర్ నెల రివ్యూ మీటింగ్

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఏడీసీపీలు నుండి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన ఈ నెల రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ల పనితీరును పరిశీలించారు.* ◼️నగరంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టీవ్ గా ఉన్న రౌడీ షీటర్లు,వారిపై పెడుతున్న నిఘా చర్యలను ఆరా తీశారు, నిన్నటి వరకూ నమోదు చేసిన NDPS కేసు వివరాలను సమీక్షించి, నగరం గుండా ఏటువంటి NDPS రవాణా జరగకుండా పూర్తిగా నిరోధించాలని తెలిపారు. ◼️ ట్రాఫిక్, క్రైమ్, లా అండ్ ఆర్డర్ లకు నిర్వహించిన ఈ నెల రివ్యూ మీటింగ్ నందు ఆయా విభాగాల పనితీరును సీపీ గారు పూర్తిగా సమీక్షించారు. ◼️ నగరంలో పోలీస్ స్టేషన్లో లాంగ్ పెండింగ్ లో ఉన్న కేసులు యొక్క వివరాలు, కేసు పెండింగ్ ఉండడానికి గల కారణాలు తెలుసుకొని సదరు పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించివలసిందిగా ఆదేశించారు, కోర్టు తీర్పు వెలువరించిన కేసుల వివరాలు తెలుసుకున్నారు. ◼️ సిపి గారి ఇచ్చిన నంబరు కు వచ్చిన ఫిర్యాదులు ఆధారముగా పలు సమస్యాత్మక ప్రాంతాలను సిపి గారు తెలియజేసి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో ఆయా సమస్యలకు పూర్తి అడ్డుకట్ట వేసేలా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ◼️ ప్రతీ స్టేషన్ పరిధిలో యెటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, ఆయా స్టేషన్ పరిధిలో గల నిర్మానుష్యప్రాంతాలను, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పీకేట్, అవసరం మేరకు డికొయ్ టీంలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ◼️ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉండాలనీ, గంజాయి ఎక్కడా ఉండరాదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఏమైనా ఉన్నచో తనకు తెలియజేయాలని తెలిపారు. ◼️ నగరంలో అన్ని పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదు చేస్తున్న తీరు, అధికారులు ఫిర్యాదుదారులతో ప్రవర్తిస్తున్న తీరు పై ఆరా తీసి, తగు ఆదేశాలు జారీ చేశారు. ◼️ పొక్సో కేసుల పైన ఆరా తీశారు, నగరంలో క్రైమ్ రేటు తగ్గు ముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలనీ తెలిపారు. ◼️ VMS(విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్) ను పూర్తిగా లా & ఆర్డర్ మరియు క్రైమ్ సిబ్బంది అందరూ వినియోగిస్తూ నిందితులను మరింత వేగముగా గుర్తించాలని తెలిపారు. ◼️ సైబర్ క్రైమ్ పై మరింత బలోపేతం చేసే చర్యలపై చర్చించారు, ప్రజలకు పూర్తి అవగాహన అయ్యేలా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు, పలు కొత్త సాఫ్ట్ వేర్ లను తీసుకొని వినియోగించాలని సూచించారు. ◼️ ఉమెన్ సేఫ్టీ కు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళల పైన వేదింపులు, మహిళ మిస్సింగ్ సంబంధిత కేసులలో జాప్యం లేకుండా తక్షణమే స్పందించి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో వారితో వ్యవహరించాలన్నారు,పొక్సో కేసుల పైన ఆరా తీశారు. ◼️ కోర్టు నందు కేసులు ఎటువంటి జాప్యం లేకుండా, కన్విక్షన్ పడే కేసులు సంఖ్య పెరిగే విధముగా చేయుటకు, అధికారులు మరియు సిబ్బంది సందేహలను నివృత్తి చేసేందుకు ◼️ లోక్ ఆధాలత్ నందు గతంలో కంటే మరిన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ◼️ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఆహ్వానించి పలు న్యాయ సంబంధిత అంశాలపై పరస్పరం చర్చించి, పోలీసు అధికారులు పలు న్యాయ సంబంధిత అంశాలలో తమ సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ను అడిగి నివృత్తి చేసుకున్నారు. ◼️ వచ్చే నెల నిర్వహించబోవు రివ్యూ మీటింగ్ నందు ప్రతి పోలీస్ స్టేషన్ గత నెల కంటే మెరుగ్గా, క్రైమ్ తగ్గు ముఖం పట్టే విధముగా పోలీసింగ్ ఉండాలని తెలిపారు. ◼️నగర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పూర్తి పారదర్శకముగా తమ విధులు నిర్వర్తించాలని, విధులలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠిన చర్యలు ఉంటాయనీ తెలిపారు. ఈ సమావేశంలో డి.సి.పి-01(ఎల్& ఓ) వి.ఎన్. మణికంఠ చందోలు,ఐ.పీ.ఎస్.,గారు, డి.సి.పి-02(ఎల్& ఓ) డి.మేరీ ప్రశాంతి, ఐ.పి.ఎస్., గారు, డి.సి.పి(క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి,ఐ.పి.ఎస్., గారు, నగర ఏ.డి.సి.పి లు, ఏ.సి.పి లు, స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు

విశాఖపట్నం

సూడో సెక్యులర్ పార్టీలకు భారీ షాకిచ్చిన సుప్రీంకోర్ట్

సూడో సెక్యులర్ పార్టీలకు భారీ షాకిచ్చిన సుప్రీంకోర్ట్ న్యూఢిల్లీ (విశాఖ పున్నమి ప్రతినిధి):- భారత పౌరసత్వానికి ఆదార్ కార్డ్ ఫ్రూఫ్ కానేకాదు. ప్రస్తుతం దేశం లో లక్షల సంఖ్యలో ఫేక్ ఆధార్ కార్డులు దొరుకుతున్నాయి. అక్రమ వలసదారులకు ఈ ఫేక్ ఆదార్ కార్డులు లభిస్తుమండటం తీవ్రమైన అంశం. ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారన చేపట్టాలి. అలాగే ఆదార్ కార్డు కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆదార్ కార్డు ఉన్నప్పటికీ, ఓటు హక్కును ఇవ్వటానికి వీలులేదు. ఓటు హక్కు అనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోని విషయం అంటూ అద్భుతమైన తీర్పును ఇచ్చిన మన సుప్రీంకోర్ట్ కొత్త చీఫ్ జస్టీస్ “సూర్యకాంత్”..

E-పేపర్

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి జేఏసీ సభ్యుల రౌండ్ టేబుల్ సమావేశం

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి జేఏసీ సభ్యుల రౌండ్ టేబుల్ సమావేశం రైల్వేకోడూరు మేజర్ న్యూస్ జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశంముఖ్యఅతిథిగా హాజరైన రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ రైల్వే కోడూరు పట్టణంలోని సిద్దేశ్వర కళ్యాణ మండపంలో శనివారం సాయంత్రం రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని రాజంపేట రైల్వే కోడూరు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు అరవ శ్రీధర్ , రాష్ట్ర కార్యదర్శి తాతం శెట్టి నాగేంద్ర హాజరయ్యారు, ఈ కార్యక్రమంలో విచ్చేసిన శాసన సభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ప్రకటించాలని అంతేకాకుండా అన్ని వనరులు సమతుల్యంగా ఉన్నటువంటి కేంద్రం రాజంపేట అని ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రాజంపేట, రైల్వే కోడూరు ప్రజల యొక్క మనోభావాలను వారికి తెలియపరచి న్యాయం జరిగే విధంగా చూస్తానని ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ తెలియజేశారు,, రాష్ట్రంలోని రెండవ ఆదాయ కేంద్రంగా ఉన్న మంగంపేట ఏపీఎండిసి మన నియోజకవర్గంలో ఉండడం మనకు కలిసి వచ్చే అంశమని తాను ఒక ఎమ్మెల్యే గానే కాకుండా సామాన్య ప్రజలలో ఒకరిగా రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి విన్నవిస్తానని సమావేశంలో అరవ శ్రీధర్ తెలియజేశారు, అనంతరం జేఏసీ సభ్యులు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కి వినతి పత్రం అందజేసి సమస్యలను తెలియపరిచారు.ఈ కార్యక్రమం లొ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నార్జాల హేమరాజ్ ,పోతురాజు నవీన్, చంద్ర, డాక్టర్ సయ్యద్ భాష, ముత్యాల కిషోర్, అమర, హేమంత్, విక్టరీ స్కూల్ నరసింహారెడ్డి, సిల్వర్ బెల్స్ కుమార్, కూటమి నాయుకులు మొదలగు వారు పాల్కొన్నారు.

E-పేపర్

తెలంగాణ రాష్ట్ర RMP PMP వైద్యుల సంఘం *రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్ సంతాపం వ్యక్తం చేశారు.

పున్నమి ప్రతినిధి అలంపల్లి దుర్గేష్ 9640204826 సిపియం పార్టీ సీనియర్ నాయకులు యాచారం మండల సిపియం మాజీ కార్యదర్శి పెండ్యాల బ్రహ్మయ్య గారు కొద్దిసేపటి క్రితం అకాలమరణం చెందారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. నిరంతరం పేద ప్రజల కోసం తపించిన బ్రహ్మయ్య గారి మరణం చాలా బాధాకరమని తెలంగాణ రాష్ట్ర RMP PMP వైద్యుల సంఘం *రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కుల అశోక్* గారు సంతాపం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. *నాగార్జున శ్రీనివాస్ చారి* కార్యదర్శి రంగారెడ్డి జిల్లా తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్ వైద్యుల ఐక్య వేదిక.

విశాఖపట్నం

పట్టాభి రెడ్డి తోటలో కార్ఖానా అల్లర్లు జనావాసాల మధ్య వెలువడుతున్న ధూళి—స్థానికుల ఆరోగ్యం ప్రమాదంలో

విశాఖపట్నం 49 వ వార్డు ప్రాంతంలోని పట్టాభి రెడ్డి తోట లో కార్పెంటర్ వర్క్‌షాప్‌ను అనధికారికంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేయడంతో, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెక్క పనిలోనుంచి వెలువడుతున్న నిరంతర ధూళి, పొగ, చిప్స్ వల్ల ఇళ్లలోపలికే కాలుష్యం చేరుతుండగా, ప్రయాణికులు సైతం దారిలో నడవటానికి ఇబ్బంది పడుతున్నారు దానికి తోడు రోడ్డున ఆక్రమించి రోడ్డుపైనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా దారి తీస్తుంది పగలు–రాత్రి నిరంతరం నడుస్తున్న ఈ కార్ఖానా నుంచి వచ్చే మైక్రోపార్టికల్స్ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ శ్వాసకోశ సమస్యలను తెస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గు, జలుబు, కంటి మంట, ఆస్థ్మా లక్షణాలు తీవ్రంగా పెరిగాయని ఆరోపిస్తున్నారు. పిల్లలు బహిరంగ ప్రదేశాల్లో ఆడుకోవడమే ప్రమాదంగా మారింది. కార్ఖానా యజమాని భౌగోళిక పరిస్థితులు, పర్యావరణ భద్రత, ప్రజా ఆరోగ్య నిబంధనలను పూర్తిగా పట్టించుకోకుండా నియమ విరుద్ధంగా వర్క్‌షాప్ నడుపుతున్నారని స్థానికుల ఆరోపణ. పర్యావరణ శాఖ, గ్రామపంచాయతి అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు: “జనావాసాల మధ్య కార్ఖానా ఎలా అనుమతించారు? ప్రతిరోజూ మా ఇళ్లలోకి వచ్చే ధూళి, శబ్ద కాలుష్యాన్ని ఎవరు ఆపాలి?” స్థానికులు వెంటనే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కార్ఖానాను నివాసాల నుంచి దూరంగా మార్చాలని, లేకపోతే తీవ్ర నిరసనలు చేపట్టడమే మార్గమని హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ కార్ఖానాపై చర్యలు ఎప్పుడు?—అన్నది ఇప్పుడు అక్కడి ప్రజల పెద్ద ప్రశ్నగా మారింది.

విశాఖపట్నం

కైలాసపురం – అయ్యప్ప భక్తి నడుమ బిక్షణతో జగద్గురి అనుగ్రహం

కైలాసపురం వాసులు వసంత కుమార్ ఎల్లపు, వారి మిత్రబృందం కలిసి ధర్మశాస్త్ర దేవాలయం గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప మాలలు ధరించి నియమ నిష్ఠలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. భగవంతుని అనుగ్రహంతో నేడు దేవాలయంలో జరిగే నిత్య అన్నదాన సేవలో భాగంగా బిక్షణ సమకూర్చే అదృష్టం లభించడం తమ మిత్రబృందానికి దైవకృపగా భావిస్తున్నామని వసంత కుమార్ పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి కరుణాకటాక్షంతో అనేక పర్యాయాలు దీక్ష చేపట్టి సేవ చేసే అవకాశం లభించడం తమకు అతి పెద్ద భాగ్యమని ఆయన తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమంలో అనేకమంది మాలధారీ స్వాములు పాల్గొని భక్తి భావంతో బిక్షణ స్వీకరించగా, “అన్నదాత సుఖీభవ” అంటూ ఆశీర్వచనాలు అందించారు. భక్తి పూర్వకంగా, నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వసంత కుమార్ మిత్రబృందాన్ని పలువురు స్వాములు ప్రశంసలతో అభినందించారు. సేవ, సమర్పణ, సత్సంకల్పాల స్ఫూర్తిగా నిలిచిన ఈ భక్తి యాత్ర కైలాసపురం ధర్మశాస్త్ర దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మంగళమయం చేసింది.

తెలంగాణ

నామినేషన్ సేకరణ కేంద్రాలను తనిఖీ చేసిన : కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) తిప్పర్తి మండలం లో తిప్పర్తి, మామిడాల, పజ్జుర్, గ్రామపంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో బ్యాంకు ఖాతా, కుల దృవీకరణ పత్రాలు, సమర్పించని పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు సమర్పించవచ్చని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.