Tuesday, 17 March 2026

Blog

అన్నమయ్య

నారాయణ తపోవన ఆశ్రమంలో గీతా జయంతి దివ్య వైభవం

అన్నమయ్య జిల్లా, చిట్వేల్ మండలం, తిమ్మాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద కొలువై ఉన్న నారాయణ తపోవన ఆశ్రమం నందు గీతా జయంతి వేడుకలు (డిసెంబర్ 1) న అత్యంత భక్తి వాతావరణంలో, కనుల పండుగగా జరిగాయి. ​ఆశ్రమానికి చెందిన పెద్దలు, దాదాపు 50 మందికి పైగా బాలలకు భగవద్గీత సారాంశాన్ని, దాని గొప్పదనాన్ని వివరించారు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన పవిత్ర శ్లోకాలను వారికి తెలియజేయడం జరిగింది. చిట్వేలి మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన ఈ ఆశ్రమం నిత్యం భక్తి కార్యక్రమాలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానానికి నిలయంగా నిలుస్తోంది. ​గీతా పారాయణం కార్యక్రమం పూర్తయిన అనంతరం, ఆలయ ధర్మకర్తలు మధ్యాహ్నం పాల్గొన్న భక్తులందరికీ భోజన వసతిని కల్పించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బాలలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ​ఈ వేడుకల గురించి ఆలయ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మరియు చంద్రశేఖర్ మీడియాకు తెలియజేశారు.

తూర్పు గోదావరి

బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా ఆకట్టుకున్న స్థానిక “కూచిపూడి కళాధామం” విద్యార్థుల నృత్య ప్రదర్శన

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 29 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి మహోత్సవములలో భాగంగా స్థానిక “కూచిపూడి కళాధామం” నాట్యాచారిణి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు మూషిక వాహన, ఆలోకమే శ్రీ, సూర్యాష్టకం, ముద్దుగారే యశోధ, శివాష్టకం, తరంగం, అరయులు కురియగ, పలుకే బంగార, బ్రహ్మమోక్కటే, భామనే సత్యభామనే, గణేష్ పంచరత్నం, చక్కని తల్లికి, పుష్పాంజలి, అఖిలాండేశ్వరి, కులుకుగ నడవరో, బ్రహ్మాంజలి, ఓం నమః శివాయ, నారాయణాయ, మూషిక వాహన – 2, అన్నమయ్య పదాలు వంటి పాటలకు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా నాట్యాచారిణి పి.జాహ్నవి మాట్లాడుతూ కూచిపూడి అనేది మన తెలుగు వారి ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన శాస్త్రీయ నృత్య రీతి. ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, శారీరక, మానసిక వికాసానికి దోహదపడే ఒక గొప్ప వ్యాయామం మరియు విద్య కూడా. చిన్నప్పటి నుండి పిల్లలు కూచిపూడి నేర్చుకోవడం వల్ల వారిలో అనేక సానుకూల లక్షణాలు అలవడతాయి. వారి వ్యక్తిత్వంలో శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యం, చురుకుదనం, మానసిక వికాసం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ, భావోద్వేగ మరియు సాంస్కృతిక వికాసం, భావ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం, భాష మరియు సంస్కృతి అలవడుతుందని, కూచిపూడి నేర్చుకోవడం అంటే కేవలం డ్యాన్స్ నేర్చుకోవడమే కాదు, అది ఒక జీవన విధానం ఇది పిల్లలను శారీరకంగా బలవంతులుగా, మానసికంగా విజ్ఞులుగా, మరియు సాంస్కృతికంగా సంపన్నులుగా తీర్చిదిద్దుతుందిని తెలియజేసారు. షష్టి ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లి శ్రీనివాస రెడ్డి నాట్యాచారిణి పి.జాహ్నవిని సత్కరించి, చిన్నారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాలచర్ల శివ ప్రసాద్ చౌదరి, చాగంటి సాయిబాబా రెడ్డి, పల్లి రాజా రెడ్డి, నందిపాటి కిషోర్ పాల్గొన్నారు.

విశాఖపట్నం

అర్జీలు రీ-ఓపెన్ కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి*

*అర్జీలు రీ-ఓపెన్ కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి* *పీజీఆర్ఎస్ లో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ *వివిధ స‌మ‌స్య‌ల‌పై 237 విన‌తులు స‌మ‌ర్పించిన ప్ర‌జ‌లు *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * ఒకే స‌మ‌స్య‌పై అర్జీలు రీ-ఓపెన్ కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాలి, విన‌తులకు నాణ్య‌మైన రీతిలో ప్ర‌త్యేక శ్రద్ధ వ‌హించి ప‌రిష్కారం చూపాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ఫిర్యాదుదారుల‌తో సంబంధిత అధికారి లేదా సిబ్బంది త‌ప్ప‌ని స‌రిగా ఫోన్ ద్వారా సంప్ర‌దించాల‌ని, త‌గిన విధంగా ఎండార్స్మెంట్ వేసి ఇవ్వాల‌ని చెప్పారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో జ‌రిగిన ప్రజా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, విశాఖ‌ప‌ట్ట‌ణం ఆర్డీవో సుధాసాగ‌ర్ల‌తో క‌లిసి ఆయ‌న‌ ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. ఫిర్యాదుదారులు వివిధ స‌మస్య‌ల‌పై 237 విన‌తులు అంద‌జేశారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 89, జీవీఎంసీ 67, పోలీస్ శాఖ‌వి 15 ఉండ‌గా, మ‌రొక 69 ఇత‌ర అంశాల‌కు చెందిన‌వి ఉన్నాయి. దీనిలో భాగంగా క‌లెక్ట‌ర్ గ‌త వారం జ‌రిగిన పీజీఆర్ఎస్ పై స‌మీక్ష చేశారు. కాల్ సెంట‌ర్ ఫీడ్ బ్యాక్ మ‌రింత మెరుగుప‌డాల‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదు నమోదైన రెండు, మూడు రోజుల్లో ఆన్లైన్ లాగిన ఓపెన్లో ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లకు ఉక్ర‌మించాల‌ని సూచించారు. రీఓపెన్ అవుతున్న వాటిపై ప్ర‌త్యేకంగా ఆర్డీవో స్థాయి అధికారి ప‌రిశీలించి నాణ్యమైన రీతిలో ప‌రిష్కారం చూపాల‌ని, ప్ర‌త్యేక ఎండార్స్మెంట్ ఇవ్వాల‌ని చెప్పారు.

విశాఖపట్నం

పిల్లల ఆక‌లి తీర్చ‌డానికి ఓ చిన్న ప్ర‌య‌త్నం…”మార్నిం

*పిల్లల ఆక‌లి తీర్చ‌డానికి ఓ చిన్న ప్ర‌య‌త్నం…”మార్నింగ్ న్యూట్రిష‌న్”* *అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ స‌హకారంతో కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌ జిల్లా క‌లెక్ట‌ర్ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పాఠ‌శాల చిన్నారుల కోసం మ‌ధ్యాహ్నం భోజనం ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని… దానికి అనుబంధంగా వారంలో మూడు రోజుల పాటు ఉద‌యం పూట అందించేందుకు గాను “మార్నింగ్ న్యూట్రిష‌న్” పేరుతో ఓ చిన్న ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఉద‌యాన్నే అల్పాహారం తీసుకోకుండా త‌ర‌గ‌తుల‌కు వ‌చ్చిన విద్యార్థుల‌ను గ‌మ‌నించిన‌ప్పుడు కొంచెం బాధ క‌లిగింద‌ని, అప్పుడే వారి కోసం ప్ర‌త్యేకంగా బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని, అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ వారిని సంప్ర‌దించ‌గా సానుకూలంగా స్పందించార‌ని గుర్తు చేసుకున్నారు. వారి స‌హకారంతో జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాలల చిన్నారుల‌కు ఉద‌యం పూట అందించేందుకు ఉద్దేశించిన మార్నింగ్ న్యూట్రిష‌న్ కార్యక్ర‌మాన్ని సోమ‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో ప్రారంభించిన స‌మ‌యంలో ఆయ‌న పైమేర‌కు స్పందించారు. తొలి విడ‌త‌లో 178 పాఠ‌శాలల్లోని విద్యార్థుల‌కు అందజేస్తామ‌ని, రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు అందిస్తామ‌ని పేర్కొన్నారు. దీనిలో త‌న పాత్ర పెద్ద‌గా ఏమీ లేద‌ని, అక్ష‌య‌పాత్ర వారి పెద్ద మ‌న‌సు ఉంద‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో ముందుగా పిల్ల‌ల చేత బ‌ల‌వ‌ర్ధ‌క ప‌దార్థాల‌నున్న బాక్సుల‌ను ఓపెన్ చేయించిన ఆయ‌న వారికి అందులో ప‌దార్థాల‌ను అంద‌జేశారు. ఇలాంటి కార్య‌క్ర‌మం రాష్ట్రంలో మ‌రెక్క‌డా లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాలో మాత్ర‌మే అమ‌లు చేస్తున్నామ‌ని డీఈవో ఎన్. ప్రేమ్ కుమార్ ఈ సంద‌ర్బంగా తెలిపారు. కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్*

*వికలాంగుల హక్కుల చట్టం తెలుగు ప్ర‌తిని ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి:- * విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, సౌక‌ర్యార్థం తెలుగులో రూపొందించిన విక‌లాంగుల‌ హ‌క్కుల చ‌ట్టం-2016, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ నియ‌మావ‌ళి -2023 ప్ర‌తుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ఆవిష్క‌రించారు. అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో వారి హక్కుల‌ను కాపాడే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, చ‌ట్టాన్ని ప‌టిష్టంగా అమ‌లు చేయాలని ఈ సంద‌ర్బంగా అధికారుల‌కు సూచించారు. అనంత‌రం సంబంధిత ప్ర‌తుల‌ను జిల్లా అధికారుల‌కు అంద‌జేశారు. విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 03వ తేదీన వీఎంఆర్డీఏ చిల్డ్ర‌న్ ఎరీనాలో జ‌రిగే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలని ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు చెప్పారు. వికలాంగుల హ‌క్కుల చ‌ట్టం తెలుగు ప్రతుల ఆవిష్క‌ర‌ణ‌లో ఆ శాఖ ఏడీ కె. క‌విత‌, ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమ సంఘాల ప్ర‌తినిధులు, ఇత‌ర విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ కామెంట్స్

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ విఎంఆర్డిఎ ద్వారా పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నాం సందర్శకులను,పర్యాట కుల్ని ఆకర్షించేలా పలు ప్రాజెక్టులు రూపకల్పన చేస్తున్నాం విశాఖ పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నాం ఇందులో భాగంగానే దేశంలో మొదటిసారిగా కైలాసగిరి పై సాహస క్రీడల్లో భాగంగా సుమారు రూ.7 కోట్ల రూపాయలతో గ్లాస్ బ్రిడ్జి ను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో 40 ఎంఎం మందం గల గాజుతో ఈ వంతెన నిర్మాణం జరిగింది ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా హూద్ హూద్ వంటి తుఫాన్ సమయాల్లో, గంటకు 250 కి మీ వేగంతో గాలులు వీచిన సరే తట్టు కునేలా ఈ గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేయటం జరిగింది. ఈ గ్లాస్ బ్రిడ్జి పై సుమారు 100 మంది వరకు ఒకేసారి వెళ్ళవచ్చు కానీ పర్యాటకులు సందర్శకులు భద్రత పరంగా ప్రస్తుతం ఒకేసారి 40 మందికి మాత్రమే అనుమతి ఇవ్వటం జరుగుతోంది. గ్లాస్ బ్రిడ్జి మొదటి నుంచి చివర వరకు నడవటానికి 5 నుంచి 7 నిమషాలు సమయం పడుతుంది. అలానే త్వరలో కైలాసగిరి పై త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందు బాటులోకి తీసుకువస్తున్నాం. సందర్శకులను, పర్యాట కుల్ని ఆకర్షించేలా ఇప్పటికే బీచ్ రోడ్ హేలీ మ్యూజియం అందుబాటులో తీసుకు వచ్చాం మరిన్ని ప్రాజెక్టులు కూడా తీసువస్తాం గ్లాస్ బ్రిడ్జ్ లో పాల్గొన్న ఎంపీ భరత్ మేయర్ పీలాశ్రీనివాస్ ఎమ్మెల్యే వెలగపూడి రామ కృష్ణ బాబు,గ్లాస్ బ్రిడ్జ్ నిర్వాహకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం.

జీవీఎంసీలో ఘనంగా “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం. *గ్రేటర్ విశాఖగా జీవీఎంసీ లో 20 వసంతాల వేడుకలు. *విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ కి సకాలంలో ఆస్తి , ఖాళీ స్థలాల పన్నులు, నీటి చార్జీలు చెల్లించిన పన్నుదారులకు సన్మానాలు, కృతజ్ఞతలు. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ గా ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీలో 20 వసంతాల వేడుకలను జరుపుకోవడమైనదని, విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీకి సకాలంలో బాధ్యతతో ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను చెల్లించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున అభినందించి ,ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించుకోవడం జరిగినదని , వారందరికీ జీవీఎంసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలను విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో “విశాఖ ప్రగతి బంధు” అభినందన కార్యక్రమం నిర్వహించి సకాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్ను దారులకు సన్మానం నిర్వహించిన అనంతరం 20 వసంతాల వేడుకలు సందర్భంగా నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, డిసిఆర్ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో కలసి కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖపట్నం అభివృద్ధి దిశగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ కు సహకరిస్తున్న ఆస్తి పన్ను చెల్లింపుదారులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గ్రేటర్ విశాఖపట్నం గా జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తయినందున జీవీఎంసీలో “విశాఖ ప్రగతి బంధు” కార్యక్రమం ద్వారా సకాలంలో పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరిస్తున్న ఆస్తి పన్నుదారులను సన్మానించుకోవాల్సిన అవసరం జీవీఎంసీకి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో విశాఖ ప్రగతి పథములో ముందు ఉందని విశాఖ ఎంతో అందమైన నగరమని, ఇక్కడ ప్రజలు బాధ్యతతో నిర్ణీత కాలంలో జీవీఎంసీకి ఆస్తి ,ఖాళీ స్థలాల పన్నులు ,నీటి చార్జీలు చెల్లించి సహకరిస్తున్నందుకు జీవీఎంసీ ప్రజలందరికీ రుణపడి ఉందన్నారు. గ్రేటర్ విశాఖపట్నం 3వేల 600 కిలోమీటర్ల రోడ్లు, కాలువలు విస్తరించి ఉందని, వాటిని నిత్యం పరిశుభ్రతతో తీర్చిదిద్దడం వలన విశాఖ నగరం మరింత అందంగా కనబడుతుందన్నారు. అధికారులు పాలకమండలి ముందస్తు చర్యలతో అనేక విపత్తులను సమర్దవంతంగా ఎదుర్కొందని తెలిపారు. ముఖ్యంగా జీవీఎంసీ అభివృద్ధికి రెవిన్యూ ఎంతో అవసరమని అందుకు ప్రతి ఒక్కరు సకాలంలో తమ ఆస్తి పన్నులను చెల్లించి విశాఖ నగర అభివృద్ధికి సహకరించాలన్నారు. జీవీఎంసీ కమిషనర్ తో పాటు అధికారులు అందరూ రోజులో అధిక సమయం విధులు నిర్వహించడం వలన నగరం ఎంతో పరిశుభ్రతగా ఉందని అన్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజులు మాట్లాడుతూ జీవీఎంసీ ఆవిర్భవించి 20 వసంతాల వేడుకలను జరుపుకోవడం అలాగే మొదటిసారి గా ఆస్తి చెల్లింపు దారులను అభినందించడం ద్వారా వీరిని ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు వచ్చి ఆస్తి పన్ను చెల్లించడం ద్వారా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరింత ఆర్థిక పరిపుష్టికి చేరుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ” విశాఖ ప్రగతి బంధు ” కార్యక్రమం నిర్వహిస్తున్న అధికారులు, పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు కష్టించి పని చేయడం వలన విశాఖ నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నగరంలో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నందున విశాఖకు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరాలలో మొదటిది ఢిల్లీ అని, 2వ నగరం మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పలు రాష్ట్రాలే కాకుండా కొన్ని ఇతర దేశాల కంటే కూడా జీవీఎంసీ పెద్దగా విస్తరించి ఉందని తెలిపారు. ఇంత పెద్ద నగరంలో ప్రజలకు సంక్షేమము, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం కొరకు జీవీఎంసీ కి రెవెన్యూ ఎంతో అవసరం అని తెలిపారు. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టికి ఎంతో బాధ్యతతో నిర్ణీత కాలంలో పన్నులను చెల్లించిన ఆస్తి పన్నుదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ విశాఖ 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ సకాలంలో పన్నుల చెల్లించిన 6 క్యాటగిరీలుగా గుర్తించిన ఆస్తిపన్ను దారులను “విశాఖ ప్రగతి బంధు” పేరున వారిని అభినందించి, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను, అందించి సన్మానించడం జరిగిందని తెలిపారు. విశాఖ అభివృద్ధికి నగర మేయర్ ఎంతో కృషి చేస్తున్నారని కౌన్సిల్, స్థాయి సంఘాలలో ఎక్కువ అభివృద్ధి పనుల అంశాలను పెట్టి విశాఖ నగర అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రజా ఆరోగ్య అధికారులు ఉదయం 6 గంటలకు విధులకు వచ్చి తమ విధుల్లో పాల్గొంటారని, ప్రస్తుతం రెవిన్యూ అధికారులు కూడా 6 గంటలకే విధులకు వచ్చి జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు నిరంతరం బాధ్యతతో విధులు నిర్వహిస్తున్నారని కమీషనర్ తెలిపారు. జీవీఎంసీ కి వచ్చే ఆదాయం తో పాటు కేంద్ర ,రాష్ట్రాల నిధులను విశాఖ అభివృద్ధికి తోడ్పాటును అందించడం జరుగుతుందన్నారు. జీవీఎంసీ ఆదాయం పెంచి ఆస్తి పన్ను చెల్లింపు కొరకు 8 సౌకర్య కేంద్రాలకు బదులు ప్రస్తుతం 20 సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సి ఎస్ ఆర్ ఫండ్స్ ద్వారా విశాఖ అభివృద్ధికి సహకరిస్తున్న కార్పొరేట్ సంస్థలకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్ మాట్లాడుతూ జీవీఎంసీ ప్రగతికి ఏకైక మార్గం రెవిన్యూ అని దానికి ఆస్తి పన్నుల ద్వారా సమకూర్చుకోవచ్చు అన్నారు. కార్పొరేట్ సంస్థలు సి.ఎస్.ఆర్ ఫండ్స్ తో సహకారం అందించి విశాఖ అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, ప్రజలు, ఆస్తి పన్నులు చెల్లింపుదారుల నిర్ణీత సమయంలో పన్నులు చెల్లిస్తూ సహకారం అందించడం ద్వారా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో 56వ వార్డు కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జివిఎంసి అధికారులు, కొరమోఁడల్, ఎస్సార్ స్టీల్, టెక్ మహీంద్ర సంస్థల ప్రతినిధులు, ఎ.పి.పెర్వాస్ కార్యదర్శి, జె.ఆర్.నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి డా.కె.ఎస్.ఆర్.మూర్తి, పరువురు సన్మాన గ్రహీతలు, ఎస్.ఆర్.యు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, జివిఎంసి ఉద్యోదులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖపట్నంలోని వాల్టేర్ మండల రైల్వే ఆసుపత్రిలో ఈ రోజు నిర్వహించిన ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమం

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖపట్నంలోని వాల్టేర్ మండల రైల్వే ఆసుపత్రిలో ఈ రోజు నిర్వహించిన ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు అనంతరం మండల రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా అధ్యక్షతన డీఆర్‌ఎం సమావేశ హాల్‌లో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాలను చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డా. డి. శరత్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, సీనియర్ వైద్యులు, రోగులు, సిబ్బంది, అధికారు లు మరియు ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. అదనంగా ఏడీఆర్‌ఎం (ఇన్‌ఫ్రా) శ్రీ ఈ. సంతోష కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన పెంచడం, హెచ్‌ఐవీ సంబంధిత వ్యాధుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించడం మరియు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో జీవిస్తున్న వారికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా జరుపుకుంటారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మండల రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు సమిష్టి కృషి అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ సంవత్సరం యొక్క థీమ్ “అడ్డు తగుల్లను అధిగమించడం, ఎయిడ్స్ ప్రత్యుత్తరాన్ని మార్పు చేయడం” అని తెలిపారు, ఇది ఇప్పటివరకు సాధించిన పురోగతిని కాపాడుతూనే సేవలను మరింత బలంగా, న్యాయసమ్మతంగా, సమాజ ఆధారితంగా మార్చడంపై దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు. డా. శరత్ బాబు మాట్లాడుతూ, మహమ్మారులు, ఘర్షణలు, అసమానతలు వంటివి చికిత్స మరియు సంరక్షణకు ప్రాప్తిని అడ్డుకుంటున్న నేపథ్యంలో వచ్చిన అంతరాయాలను ఎదుర్కొనే అత్యవసరతను ఈ థీమ్ స్పష్టం చేస్తోందని తెలిపారు. ఆయన, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) మార్గదర్శకత్వంలో వైద్య విభాగం ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, సమాజ అవుట్‌రిచ్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలపరుస్తోందని వివరించారు. వాల్టేర్ సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డా. ఎల్. మంగీలాల, ఎయిడ్స్ పై ఉపన్యాసం ఇచ్చి, నాకో మార్గదర్శకాల ప్రకారం అవగాహన మరియు సంరక్షణలో జరిగిన స్థిరమైన పురోగతిని వివరించారు.

విశాఖపట్నం

వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం​ఆన్‌లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ పరిశీలన

శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం, *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- ​ఆన్‌లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ పరిశీలన ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలు మరియు గౌరవనీయులైన కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలను అనుసరించి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానమునందు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నందు పలు గదులు, దర్శనములు, అభిషేక పూజలు, ఇతర సేవలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనములు, టికెట్లు మరియు ప్రసాదములు బుక్ చేసుకునే భక్తులను ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనం చేసుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్ల కొరకు సోమవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి శ్రీమతి ఎన్. సుజాత , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ, సహాయ కార్యనిర్వాహణాధికారి తిరుమలేశ్వరావు, ఏ ఇ రవి రాజు గారి బృందము ఆన్‌లైన్‌లో స్వామివారి దర్శనం నకు టికెట్ తీసుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్‌లైన్ టికెట్ కలిగిన భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ.వో. గారు అధికారులకు సూచించారు.

విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 111 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 111 వినతులు. – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-*: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 111 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 111 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 2వ జోన్ కు 18, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 09, 5వ జోన్ కు 11, 6వ జోనుకు 15, 8వ జోన్ కు 11, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 31 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 13, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 07, పట్టణ ప్రణాళిక విభాగమునకు 48, ఇంజినీరింగు విభాగమునకు 21, మొక్కల విభాగమునకు 05, యుసిడి విభాగమునకు 04 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం కమిషనరు వీడియో కాన్పరెన్స్ ద్వారా జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులతో మాట్లాడుతూ జివిఎంసి పి.జి.ఆర్.ఎస్ లో అన్ని విభాగాలలో ప్రతివారం నమోదు చేసిన ఫిర్యాదులే తిరిగి నమోదు అవుతున్నాయని, అధికారులు స్వయంగా పి.జి.ఆర్.ఎస్ అర్జీదారులతో సంప్రదించి సమస్యలను పరిష్కరించాలనన్నారు. పట్టణ ప్రణాళికా విభాగం లో ఎక్కువగా పిర్యాదులు నమోదు అవుతున్నాయని, అధికారులు పి.జి.ఆర్.ఎస్ పై ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. ప్రభుత్వం ప్రజలు సౌలభ్యం కోసమే పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని, ప్రజలకు పురమిత్ర యాప్ డౌన్ లోడ్ చేసుకొనేవిధంగా అవగాహన పరచాలని, పురమిత్ర యాప్ లో ప్రజలు సమస్యలు నమోదు చేసుకోవడం ద్వారా వారి సమస్యలు పరిష్కారం మవుతాయని తెలియజేయాలని సచివాలయ కార్యదర్శిల ద్వారా ప్రజలకు అవగాహణ పరిచేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు. తద్వారా వారు నేరుగా పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమానికి వచ్చి సమస్యలు తెలియజేసే శ్రమను వారికి తగ్గుతుందని అవగాహన పరచాలని కమిషనరు తెలిపారు. జివిఎంసి ప్రధాన కార్యాలయం సిటీ ఆఫరేషన్ సెంటర్ కు టోల్ ఫ్రీ నెం.180042500009 కు ఫోన్ ద్వారా, అలాగే అన్ని పని దినాలలో ఉ.గం.10.30 ని.ల నుండి సా.గం.5.00 ల వరకు జివిఎంసి ప్రధాన కార్యాలయం ప్రంగణం పిర్యాదుల కేఁద్రం లో ప్రజలు ఫిర్యాదులు, వినతి పత్రాలు సమర్పించవచ్చునని ప్రజలకు తెలియజేయాలని కమిషనరు తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు పి.వి.వి.సత్యనారాయణరాజు, అదనపు కమీషనర్ డి.వి.రమణ మూర్తి, సిసిపి ఎ.ప్రభాకారరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి.నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, సెక్రటరీ బి.వి.రమణ, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎం.దామోదరరావు, పర్యవేక్షక ఇంజనీర్లు పల్లమరాజు, గోవింద రావు, ఏడకొండలు, కె.శ్రీనివాసరావు, గోవిందరావు, సంపత్ కుమార్, శాంతిరాజ్, బయోలజిస్ట్ సాంబమూర్తి, స్పోర్ట్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, ఆర్.ఎఫ్.ఒ హనుమంతురావు, డిసిపిలు హరిదాసు, రామమోహన్, ఎసిపి లు, యుసిడి పి.ఒ ప్రేమ ప్రసాన్న వాణి, డిపిఒ శాంతి కుమారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.