Tuesday, 17 March 2026

Blog

కడప

ఆరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషమం. . మానవత్వం చాటుకున్న అధికారులు

కడప జిల్లా : మైదుకూరు జాతీయ రహదారి పై కూలీల ఆటో ను డికొన్న కారు. . దగ్గర ఉండి క్షతగాత్రులకు సేవాలందించిన అర్బన్ CI రమణారెడ్డి మునిసిపల్ కమీషనర్ రంగస్వామి అరుమంది కూలీలకు గాయలు ,ఇద్దరి పరిస్థితి విషయం. . గాయపడిన వారిని అంబులెన్సు లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. . కూలీలు వెదురురు కు కూలి పనికి వెళ్లి వస్తుండగా ఘటన.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు

తెలంగాణ

క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్థ్యాలు, పెంపొందించుకొవడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) జిల్లాలో దివ్యంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడాస్పూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్ధ్య లు, పెంపొందించుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసం, పెరుగుతుందని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, దివ్యాంగుల ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చదువుకోవాలని, అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

రైతన్నకు ధైర్యం… సేంద్రియ సాగుకు సౌమ్య మద్దతు భూముల్లోకే దిగి రైతుతో మమేకం – పథకాలపై అవగాహన కల్పించిన ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య

ఆవిరిపన్లు తగ్గని వేళ… “రైతన్న మీకోసం” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సోమవారం రైతులతో కలసి భూముల్లోకి అడుగుపెట్టారు. స్థానిక రైతు సాగు చేస్తున్న సేంద్రియ పద్ధతులను పరిశీలించిన ఆమె, పంట పెంపకం నుంచి దిగుబడులదాకా సాగు విధానాలపై సవివరంగా ఆరాతీశారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పురుగుమందుల నియంత్రణ, వ్యయాలు, మార్కెటింగ్ అంశాలపై రైతుతో చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందని, సేంద్రియ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సౌమ్య స్పష్టం చేశారు. సబ్సిడీలు, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ మద్దతు తదితర పథకాలను రైతులకు వివరించారు. రైతు నిలబడితేనే రాష్ట్రం నిలబడుతుందని ఆమె స్పష్టంగా చెప్పి, సేంద్రియ సాగుతో భూమి సారానికి రక్షణ కలిగిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రైతు కుటుంబానికి అవగాహన కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పలువురు రైతులు, రైతు నాయకులు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాలా ప్రసాద్, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ

డిసెంబర్ 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసిబి వారోత్సవాలు!

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) లంచం అడగడం తీసుకోవడం నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె తన ఛాంబర్ లో లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. పరిపాలనలో పారాదర్శకత అవసరమని ఎవరైనా ప్రభుత్వ అధికారి ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1 0 6 4 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని ఆమె తెలిపారు. అవినీతిని అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వాట్సాప్ నెంబర్ 9 4 4 0 4 4 6 1 0 6, ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ, అలాగే పోస్టర్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కాకాని నగర్‌లో దివ్యాంగుల దినోత్సవం ఘనంగా ప్రతిభావంతులైన దివ్యాంగులకు సత్కారం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

దివ్యాంగుల దినోత్సవాన్ని నందిగామ పట్టణం కాకాని నగర్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు ఈ సందర్భంలో హాజరయ్యారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి సత్కరించిన సభలో ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ, “దివ్యాంగులు సమాజానికి భారమయ్యే వారు కాదు… సరైన అవకాశాలు లభిస్తే అసాధ్యాన్నే సాధ్యం చేసే శక్తి వారి సొంతం. వారిని ప్రోత్సహించడం ప్రభుత్వం మాత్రమే కాక సమాజం మొత్తం బాధ్యత” అని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగుల సంక్షేమ పథకాలపై ఆమె వివరించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన దివ్యాంగులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, మోమెంటోలు అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

ఏసీబీ వలలో గాజువాక సర్కిల్–3 ఏఎస్ఓ టీ. కృష్ణ

గాజువాక / పెదగంట్యాడ – (పున్నమి ప్రతినిధి) గాజువాక పెదగంట్యాడకు చెందిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి గాజువాక సర్కిల్–3 అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (ASO) టీ. కృష్ణను లంచం స్వీకరిస్తూ ఉండగా పట్టుకున్నారు. గత ఫిబ్రవరిలో పీడీఎస్ రైస్ తరలిస్తుండగా పోలీసులు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తరువాత వాహనాల విడుదలకు సంబంధించి హైకోర్టు నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నా కూడా, ఆ ఆదేశాలను అమలు చేయడానికి ఒక్కో వాహనానికి రూ.5,000 చొప్పున లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారు ఏసీబీకి తెలిపాడు. రెండు వాహనాల్లో ఒకటి ఫిర్యాదుదారుదిగా, మరొకటి అతని స్నేహితుడు ఆకాష్‌దిగా పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా ఏర్పాటు చేసిన ఉచ్చులో ఏసీబీ అధికారులు టీ. కృష్ణను లంచం స్వీకరిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత అధికారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు రమణమూర్తి వెల్లడించారు.

అనకాపల్లి

దేవయో మెడికల్ స్కూల్ (ఫిలిప్పీయన్స్) 24వ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో వేచలం గ్రామ యువకుడి అఖండ కీర్తి గానము

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వేచలం గ్రామానికి గర్వకారణంగా నిలిచిన స్వర్ణమయ క్షణం. దేవయో మెడికల్ స్కూల్ ఐఎన్‌సి, కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో, ఈ గ్రామానికి చెందిన రెడ్డి మోహన్ సాయి ఘనంగా డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా అందుకున్నారు. ఈ అద్భుత విజయంతో వేచలం గ్రామం ఆనంద తరంగాలలో తేలిపోతూ, పండగ పూటలా మోగింది. రెడ్డివారి కుటుంబంలో ఝిలుఝిలుమనే ఆనంద సంబరాలు మోహన్ సాయి మునితాతయ్య ప్రఖ్యాత రెడ్డి అప్పారావు నాయుడు (మునషబు), తండ్రి రెడ్డి అప్పారావు నాయుడు, తాతయ్య–నాన్నమ్మలు రెడ్డి కాళిదాసు, అమ్మనమ్మ—అందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ సాయి భవిష్యత్తు వైద్య ప్రయాణం మరింత ప్రతిష్ఠాత్మకంగా సాగాలని కోరుకుంటూ కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. మేనత్తల ప్రత్యేక సంబరాలు – కుటుంబ గర్వానికి ఎనిమిది రెట్లు వెలుగు ఈ విజయాన్ని కుటుంబం మొత్తంలో అత్యంత హర్షంతో స్వాగతించినవారు మేనత్తలు. ప్రతి ఒక్కరు తమ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తూ, మోహన్ సాయి విజయం తమ ఆనందాన్నే కాక కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా నిలిపిందని భావించారు. వేచలపు మహిత (ఉపాధ్యాయురాలు) చిన్నప్పటి నుంచే మోహన్ సాయితో అనుబంధం గల మహిత, ఈ విజయాన్ని ఆప్యాయతతో స్వాగతించి బంధువులందరికీ మిఠాయిలు పంచారు. భాగ్యలక్ష్మి – ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే ఈ వార్తను స్కూల్ అసెంబ్లీలో ప్రకటించి, మేనల్లుడు డాక్టర్ కావడం పట్ల కన్నీళ్లతో గర్వం వ్యక్తం చేశారు. దేవి – ప్రముఖ సంఘసేవకురాలు బాల్యం నుంచే సేవాభావం ఉన్నవాడని గుర్తుచేస్తూ, తన సేవా కార్యక్రమాల్లో ప్రజలతో కలిసి ప్రత్యేక వేడుకలు జరిపారు. ఉమా – ప్రిన్సిపాల్ తన విద్యాసంస్థలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు మోహన్ సాయి విజయం ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవాలని వివరించారు. వరలక్ష్మి – చిన్న అత్త భావోద్వేగంతో నిండిన ఈ మేనత్త, ఇంటిని దీపాలతో అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు జరిపారు. ముగ్గురు ప్రత్యేక మేనత్తలు – వల్లి, కవిత, రేణుక కనకవల్లి సేవాభావం గల వల్లి మేనల్లుడు డాక్టర్ కావడంతో తన పరిసరాల్లో పేద కుటుంబాలకు మిఠాయిలు పంచి, మానవతా సేవతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కవిత కవిత కుటుంబంలో ప్రేమాభిమానాలకు పేరుగాంచిన వ్యక్తి. మోహన్ సాయి విజయాన్ని స్వయంగా ఒక ఉత్సవంలా చేసుకుని, స్నేహితుల్లో ఆనందాన్ని పంచారు. రేణుక తన మేనల్లుడు విజయోత్సాహంలో భాగంగా రేణుక తమ ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబంతో కలిసి మధుర క్షణాలను ఆస్వాదించారు. మేనత్తల అందరి ప్రేమ, ఆశీస్సులు, సంబరాలు కలిసిపోయి కుటుంబ గౌరవం సాక్షాత్ పరవళ్లు తొక్కింది. గ్రామం మొత్తం ఆనందోత్సాహంతో మార్మోగింది “మా వేచలం గ్రామం నుంచి మరో డాక్టర్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది” అంటూ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతకు మోహన్ సాయి కొత్త ఆశలు, కొత్త లక్ష్యాల దిశగా ప్రేరణగా నిలుస్తున్నాడు. అభినందనల జలపాతం దేశమంతటినుండి, విదేశాల నుండి, బంధువులు, అభిమానులు, గ్రామ ప్రజలు—అందరూ మోహన్ సాయికి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, సందేశాల రూపంలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టా సాధించిన మోహన్ సాయి వైద్యరంగంలో మరిన్ని రికార్డులు సృష్టించాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

E-పేపర్

ప్రపంచ దివ్యంగా దినోత్సవ సందర్భంగా ఆటల పోటీలు

రౌతులపూడి, (పున్నమి )డిసెంబర్ 03 : ప్రపంచ దివ్యంగుల దినోత్సవ సందర్భంగా రౌతులపూడి భవిత సెంటర్లో విద్యార్థులకు ఆటల పోటీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమండ్ల రాజలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం భవిత సెంటర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీపీ గంటి మల్ల రాజలక్ష్మి చేతులు మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కర బాబు, వాసిరెడ్డి భాస్కర బాబు, మండల విద్యాశాఖ 2 అధికారి గాడి కొండబాబు, ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు భవిత సెంటర్ విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి

లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి అమృత రవళి రాజేందర్ మేనిఫెస్టో విడుదల

కామారెడ్డి, 3 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండలం, లింగం పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమృత రవళి రాజేందర్ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పోస్ట్ గ్రాజ్యువేట్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎకనామిక్స్, MBA, B.Ed విద్యార్హతలు కలిగిన ఆయన, గత 7 సంవ త్సరాలుగా సమాజ సేవలో నిమగ్నంగా ఉన్నారు. ఈ మేనిఫెస్టోలో గ్రామ అభివృద్ధి, సంక్షేమం, మౌలి క సదుపాయాలపై 25కి పైగా హామీలు ఇచ్చారు .కీలక సంక్షేమ హామీలు18 నుంచి 70 సంవత్సరా ల వయస్సు ఉన్నవారికి ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా.ఆడపిల్ల పుడితే రూ.2,000 బంగా రు తల్లి కింద ఆర్థిక సహాయం చేసి ఫిక్స్‌డ్ డిపాజి ట్‌లో పెట్టడం.కులాలు అతీతంగా ఎవరైనా చనిపో తే దహన సంస్కారాలకు రూ.5,000 సహాయం .ప్రతి కుటుంబానికి మినరల్ వాటర్ స్థాయి మంచి నీటి సౌకర్యం.మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్, వైకుంఠ ధామంలో మౌలిక సదుపాయాలు ఏర్పా టు.మురుగు నీటి డ్రైనేజ్ వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, శివాలయం వరకు రోడ్లు, సోలార్ లైట్లు. పాఠశాల ను పరిశుభ్రంగా మార్చడం, విద్యార్థులకు ఆటస్థలం, వ్యాయామ శాల, అన్ని సౌకర్యాలతో గ్రంథాల యం.పూర్తి వీధుల్లో సిమెంట్ రోడ్లు, పాడి ఉత్పత్తి సహకారం. ఆరోగ్యం, యువత, పర్యావరణంనెలకు ఒకసారి హెల్త్ క్యాంప్‌లు, నెహ్రూ యువ కేంద్రం సేవలు. యువతకు నైపుణ్య శిక్షణ, కృషి-ఉపాధి అవకాశా లు, స్వయం ఉపాధికి బ్యాంకుల సహకారం. పర్యా వరణ పరిరక్షణకు హరితవానలు, జలసంర క్షణ, ఆర్గానిక్ వ్యవసాయం ప్రోత్సాహం.పోటీ పరీక్షలకు ఉచిత వైఫై, పుస్తకాలు; పీఎం ఆవాస్ యోజనలు అమలు.పారదర్శకత, బాధ్యతహామీలు నెరపక పోతే ఓటర్లకు తనను నిలదీసే హక్కు ఇచ్చిన రాజేందర్ , పంచాయతీ నిధులపై 90 రోజులకు ఒకసారి గ్రామసభలు నిర్వహిస్తానని, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చేస్తానని చెప్పారు. పురాతన కట్టడాలు, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, CSR, స్వచ్ఛంద సంస్థల సహకారం తో నిధుల సమీకరణ చేస్తానని తెలిపారు. గ్రామా న్ని జిల్లాలో మొదటి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు తానని ప్రార్థించారు.

వనపర్తి

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్

*ఘనంగా పదవీ విరమణ మహోత్సవం* *పున్నమి ప్రతినిధి, 3 /12/ 2025* *దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేకమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ మద్దిలేటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనాపూర్ గారికి జిల్లా నలుమూలల నుంచి వారి శిష్య బృందం ఉపాధ్యాయ బృందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది వారితోపాటు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.