Monday, 16 March 2026

Blog

నిర్మల్

మైనార్టీ నాయకులను కలిసిన సర్పంచ్ అభ్యర్థి ఒస కవిత రాజు

పున్నమి డిసెంబర్05 నిర్మల్ జిల్లా లక్ష్మణా చందా కేంద్రంలో శుక్రవారం రోజున మైనార్టీ నాయకులను కలిసిన ఓస కవిత రాజు సర్పంచ్ అభ్యర్థి లక్ష్మణ్ చందా అభివృద్ధి కొరకై తోడు పడతానని నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు బాలు మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని కోరారు end

ఆంధ్రప్రదేశ్

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0

రాష్ట్ర వ్యాప్తంగా 5- 12-2025 న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ను అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు టీచర్ మరియు పేరెంట్ మీటింగ్ లో విద్యార్థుల యొక్క విద్యా ఎలా సాగుతుంది టీచర్స్ యొక్క బోధన మరియు ఇతర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రకటించింది .ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చేరుకున్న మంత్రులు

Blog

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్* *కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ ప్రసాదరావు న్యూఢిల్లీడిసెంబర్ 4 ( విశాఖ పున్నమి ప్రతినిధి:-) తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు డిమాండ్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్ళారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. అంతకు ముందు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ అంశాన్ని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు.., చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావుతో సమీక్షించారు. దీనికి స్పందించిన పార్లమెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దగ్గుమళ్ళ.., ముందుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు ఫ్లోర్ లీడర్ లావు కృష్ణదేవరాయలతో చర్చించారు. అనంతరం వారు తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్లతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ను కలిసి,తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ డిమాండ్ ను అంశాన్ని తెలియజేశారు. అలాగే వినతి పత్రాన్ని కూడా అందజేసారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , లావు కృష్ణదేవరాయలు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వే మంత్రికి వివరించారు. ఏళ్లుగా నెలకొన్న డిమాండ్ ను పరిష్కరించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా యాత్రికుల తాకిడి పెరిగిన దృష్ట్యా తిరుచానూరు, రేణిగుంట రైల్వే స్టేషన్ లను అభివృద్ధి చేయాలని కోరారు. శ్రీ సిటీ పారిశ్రామిక అభివృద్ధి రీత్యా అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కడప- బెంగుళూరు రైల్వే లైన్ సర్వే పూర్తి కాగా, పనులు వేగవంతం చేయాలన్నారు. నడికుడి- శ్రీకాళహస్తి పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తి చేశారు. నాయుడు పేట, గూడూరు, తడ, పుత్తూరు, నగరి, సత్యసాయి ప్రశాంత నిలయం రైల్వే స్టేషన్లను తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. రద్దీ దృష్ట్యా తిరుపతి- గూడూరు మధ్య మూడవ లైన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రికి సూచించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, పీ.సి. రాయల్, కే.వి.చౌదరి, బుచ్చిబాబు నాయుడు, రామచంద్రా రెడ్డి పాల్గొన్నారు.

తిరుపతి

నేడు ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బొజ్జల ప్రజాదర్బార్

శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వాటి పరిష్కారానికై ప్రత్యేకంగా ప్రజాదర్బార్ ఏర్పాటు చేయబడింది. శుక్రవారం నాడు ఉదయం 9:00 గంటలకు రేణిగుంట పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార మార్గాలు చూపడం లక్ష్యంగా ఈ దర్బార్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి వెల్లడించారు. ప్రజల వద్దకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తోందని అయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బొజ్జల సుధీర్ రెడ్డి చేపడుతున్న ఈ కార్యక్రమం స్థానికంగా ప్రజాదరణ పొందుతుంది.

తిరుపతి

వర్షాలతో మా ఎస్సీ కాలనీ పట్టిన దుస్థితి కాస్తా చూడండి అయ్యా

తొట్టంబేడు మండలంలో వారం రోజులగా కురుస్తున్నవర్షాలకు పొయ్య ఎస్సీ కాలనీ అతలా కుతలం విధరోడ్డుల్లో వర్షపు నీరు ఎటు పోలేక చెరువుల తలపిస్తున్న వర్షపు నీరు, ఇబ్బంది పడుతున్న, గ్రామ ప్రజలు, స్కూల్ పిల్లలు, వీధిలైట్లు, అదేవిధంగా ఈ వర్షాలకు సుమారు 40 ఇల్లు లు స్లాబ్ పైపుచ్చులు ఊడి ఇళ్లల్లో వర్షపు నీరు నిలబడి ఎప్పుడు కూలిపోతుందో భయభ్రాంతులతో జీవిస్తున్న కుటుంబాలు.. సంబంధిత అధికారులు ఇకనైన స్పందించి పొయ్య ఎస్సీ కాలనీని పర్యటించి, వీధి రోడ్లపై నీళ్లు నిలవకుండా తగు చర్యలు తీసుకుని, శిధిలావ్యవస్థకి చేరుకున్న పాత ఇల్లను ప్రభుత్వం పట్టించుకుని, నష్టపోయిన బాధితులకు నిత్యవసర సరుకులు అందజేస్తే బాగుంటుందని, బాదిత ప్రజలు ఆశా భావంవ్యక్తం చేశారు.

తిరుపతి

కార్తికేయ స్వామి వారికి మార్గశిర మాస కృత్తిక విశేష పూజ

శ్రీకాళహస్తి పట్టణంలోని తేరి వీధిలో వెలిసినటువంటి షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గురువారం నాడు నెలవారి కీర్తిక విశేషమైన రోజుగా భావించి స్వామివారికి విశేషా అలంకరణ, ప్రత్యేక పూజలు, అన్నదానాలు హారతులు అభిషేకాలు నిర్వహించారు ఆలయ వేద అర్చకులు ప్రసాద్ స్వామి మాట్లాడుతూ.. ఈ యొక్క మార్గశిర మాసం వచ్చేటటువంటి కృత్తిక ఎంతో విశేషమైన రోజుగా మార్గశిర మాసం అంటే శివయ్య కుమారుడు అయినటువంటి సుబ్రమణ్యశ్వర స్వామి కనుక ఈనాడు యొక్క దేవాలయం ఎదుట మార్గశిర మాసం పౌర్ణమి దీపాలు వలిగేస్తామని అదేవిధంగా కృత్తిక నాడు స్వామివారికి శేష వస్త్రం దివ్య పత్రములతో అలంకరించి పూల మాలలతో అలంకరించామని స్వామివారికి భక్తులు తెచ్చినటువంటి తీర్థ ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్య రూపంలో సమర్పించామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం సేవకులుగా ప్రియాంక, భవ్య, యామిని, లక్ష్మమ్మ, సురేష్ , భువన, ఉమాపతి , శెట్టి గారు, బుజ్జమ్మ. సేవకులు భక్తులు ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

జనసేనానికి ఎమ్మెల్యే బొజ్జల ఘన స్వగతం

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్బంగ ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకారు.

తిరుపతి

భారీ వర్షాలతో నీటమునిగిన 100 ఎకరాల వరి పంట

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని తంగేళ్లపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు గౌడు మాల, కత్తి వారి కండ్రిగ, బసవన్న గుంట, తిక్కల్తూరు గ్రామాలలో వారం రోజులగా కురిసిన భారీ వర్షాలకు సుమారు 100 ఎకరాల పైన వరి నాట్లు మునిగిపోయిన పరిస్థితి.. అప్పులు చేసి నాటుకున్నామని, ఇప్పుడు మునిగిపోయిందని, రైతన్న లు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి, మునిగిపోయిన పంట పొలాల దగ్గరికి వెళ్లి పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తెలియపరచి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

తిరుపతి

తుఫాన్ సెంటర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టిన టిడిపి నాయకులు

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారం రోజులుగా తుఫాను ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా..శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలుమేరకు శ్రీకాళహస్తి దేవస్థానం గిరిప్రదక్షిణ రోడ్డు సమీపంలో ఉన్న తుఫాన్ సెంటర్ కాలనీ వాసులకు జడ్పిటిసి సుబ్బారెడ్డి కాంట్రాక్టర్ చిట్టెం శ్రీకాంత్, యువ శేఖర్ ఆధ్వర్యంలో తుఫాన్ సెంటర్ కాలనీలోని సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా తుఫాన్ సెంటర్ నివాసులు మాట్లాడుతూ.. వారం రోజుల కురుస్తున్న వర్షాలకు మమ్మల్ని గుర్తుపెట్టుకుని తమకు అన్నదానం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బారెడ్డి, కాంట్రాక్టర్ చిట్టెం శ్రీకాంత్, యువ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రాజీవ్ నగర్ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి

శ్రీకాళహస్తి డిసెంబర్ 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టనశివరుల్లోని రాజీవ్ నగర్ సమస్యల పరిష్కారానికి ఆ ప్రాంతంలోని మహిళలు, పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ ఏకమై సంతకాలు సేకరించి, తమ సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కలవడానికి గురువారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోసం ప్రజలు అక్కడే ఎదురుచూస్తూ, తమ సమస్యలను ప్రత్యక్షంగా వివరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సమస్యలను పరిష్కరించేందుకు ఆయన జోక్యం అవసరమని వారు కోరారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో, ఎమ్మెల్యే సూచన మేరకు ప్రజల వినతి పత్రాన్ని పట్టణ PA ప్రవీణ్, మైనారిటీ అధ్యక్షుడు, రాజీవ్ నగర్ వాసి కరీం భాయ్ కి అందజేశారు. ఈ సమస్యను తప్పక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.