Monday, 16 March 2026

Blog

విశాఖపట్నం

బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్ల ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.*

**బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్ల ప్రాజెక్టు పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి.* **కొత్త టవర్స్ ఏర్పాట్లలకు స్థల స్థల పరిశీలన పరిశీలన చేయాలి.* – *జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్* అల్లూరి డిసెంబర్ 10 విశాఖ పున్నమి ప్రతినిధి:- ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు ) డిసెంబర్ : 09 అల్లూరి జిల్లా ఏజెన్సీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్ టవర్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశిచారు. మంగళవారం కలెక్టరేట్ విసీ హాల్ నుండి నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్ టెల్, మండల తాసిల్దార్లు, అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తయిన ప్రాంతాల్లో టవర్స్ ఏర్పాటు చేసి 4జి సిగ్నల్స్ అందించాలని ఆదేశించారు. జిల్లా లో పాడేరు డివిజన్ కు సంబంధించిన bsnl టవర్స్ 561 సెంక్షన్ కాగ 457 పూర్తి కాగ 104 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని, రంపచోడవరం డివిజన్ లో బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ 364 సెంక్షన్ అయిందని అందులో 355 పూర్తి చేసామని మిగిలిన 9 టవర్స్ వివిధ దశలలో ఉన్నదని త్వరలో పూర్తి చేస్తామని బి ఎస్ ఎన్ ఎల్ ఏ జి ఏం తెలియజేశారు. జిల్లాలో అదనంగా 101 బి ఎస్ ఎన్ ఎల్ టవర్స్ ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని అందుకు సంబంధించి స్థల పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ మండల తాసిల్దార్ కు ఆదేశించారు. జిల్లాలో జియో టవర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి 509అనుమతులు పొందగ అందులో 445 టవర్స్ పూర్తి చేసామని, 64 వివిధ దశలలో ఉన్నదని జియో ఏజిఏంతెలియజేశారు. జిల్లాలో ఎయిర్ టెల్ టవర్స్139 అనుమతులు పొందగా అన్ని పనులు పూర్తి చేసామని ఎయిర్ టెల్ అధికారులు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయు టవర్స్ కు ఆర్ ఓ ఎఫ్ ఆర్ క్లియరెన్స్ అనుమాతలు, పర్మిషన్లు పూర్తి చేసుకుని సిగ్నల్ టవర్స్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రహదారి సదుపాయము లేని (కనెక్టివిటీ) ప్రాంతాలకు టవర్స్ ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రిని తరలించుటకు అంతరాయం లేకుండా ప్రత్య న్యాయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ వార్చ్ వాల్ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమనికి బిఎస్ఎన్ఎల్ ఏజీఎం శ్రీకాంత్, జిఓ ఏజీఎం సత్యప్రసాద్ ఎయిర్ టెల్ అధికారులు, మండల తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం.

అవినీతి నిర్మూలనపై జీవీఎంసీ కమిషనర్ ఉక్కు పాదం. • జీవీఎంసీ లో అవినీతిరహిత విధానం దిశగా చర్యలు. విశాఖపట్నం డిసెంబర్మ 10 పున్నమి ప్రతినిధి :-మహా విశాఖపట్నం నగరపాలక సంస్థలో అవినీతి నిర్మూలనకు తావు లేకుండా , అవినీతి రహిత విధానం అమలు దిశగా కఠిన చర్యలు చేపట్టడం జరుగుచున్నదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. జీవీఎంసీ లో అవినీతి నిర్మూలన దిశగా కఠినమైన విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామని, జీవీఎంసీలో ఎవరైనా అవినీతికి పాల్పడినట్లయితే కఠిన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగునని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే పలు ఆరోపణలపై ఒక ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ సేవలను సరెండర్ చేశామని, ఒక సహాయక ఇంజనీర్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేసామని, ఒక టీపీవో (Town Planning Officer) సేవలను కూడా సరెండర్ చేయడం జరిగిందని తెలిపారు. పౌర సేవల్లో పారదర్శకత, నిష్పాక్షికత కోసం జీవీఎంసీ ఎటువంటి అవినీతి చర్యలను ఉపేక్షించదని కమిషనర్ స్పష్టం చేశారు. అవినీతిలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హితవు పలికారు. జీవీఎంసీ అధికారులు ,ఇంజనీర్లు ,ఉద్యోగులు ,సిబ్బంది అవినీతి రహితంగా, విశాఖ నగర అభివృద్ధి దిశగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడమైనదని కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజాతీర్పుకు కుటమిప్రభుత్వం తలవంచాలి :

మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై ప్రజాతీర్పుకు కుటమిప్రభుత్వం తలవంచాలి : *మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ ప్రసాద్* విశాఖపట్నం డిసెంబర్ పున్నమి ప్రతినిధి:- * మింది లో గల పశ్చిమ నియోజకవర్గం క్యాంప్ కార్యాలయంలో *మాజీ శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ మాజీ శాసనసభ్యులు పార్టీ పరిశీలికలు *చింతలపూడి వెంకటరమణయ్య సమక్షంలో పశ్చిమ నియోజకవర్గం 14 వార్డులలో ప్రజల వద్ద నుంచి స్వీకరించిన కోటిసంతకాల పత్రాల box లను ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో పబ్లికేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్ల విజయప్రసాద్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ చేయొద్దంటూ పశ్చిమ నియోజకవర్గ 14 వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ప్రజల నుండి సేకరించిన పత్రాలను రేపు పశ్చిమ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు సమక్షంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు కేకే రాజు గార్కి అందించడం జరుగుతుందని అక్కడ నుంచి త్వరలోనే అధిష్టానానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు,వార్డ్ పార్టీ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు,జిల్లా అనుబంధం భాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధం భాగాల అధ్యక్షులు, వార్డ్ అనుబంధం భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

శ్రద్ధాంజలి

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పెడసనగంటి బాలకృష్ణ గారు సిపిఐ ఏలూరు జిల్లా సమితి సభ్యులు ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు స్వర్గస్తులైనారు ఏలూరు జిల్లా సమితి సభ్యులు సిపిఐ నాయకులు ఆయనకు నివాళులర్పించారు END

E-పేపర్

సత్య సాయి బాబా మందిర 29వ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు లోని శ్రీ సత్య సాయి బాబా మందిర 29వ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం వార్షికోత్సవ తేదీ 10/12/2025.(బుధవారం). కార్యక్రమం వివరాలు. ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ఓంకారము 21 సార్లు, ధ్యానం, సుప్రభాతం, అష్టోత్తర శతనామావళి, తదనంతరం నగర సంకీర్తన. 9:30 గంటలకు సాయి వ్రతం. 11:30 గంటలకు భజన మరియు నారాయణ సేవ. (అన్నదానం) సాయంత్రం 4 గంటలకు చిన్మయా ఆశ్రమం. పూజ్యశ్రీ స్వామిని శ్రేయానంద సరస్వతి గారి చే భగవద్గీత పారాయణం తదనంతరం బాలవికాస్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమం 6:00 గంటల నుండి భజన 7:00 గంటలకు మంగళహారతి తదనంతరం ప్రసాద వితరణ. ఓం శ్రీ సాయిరాం కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సత్య సాయి నాధుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవిత్వం ఆవిష్కరణ

—————————————- నెల్లూరుకు చెందిన ఆంగ్ల కవి మైదవోలు వెంకట శేష సత్యనారాయణ రచించిన శ్రీ రుక్మిణి కళ్యాణం ఆంగ్ల కవితా సంపుటి సుజాతమ్మ కాలనీ లోని కృష్ణ మందిరం లో జరిగింది. దేవాలయ ట్రస్టీ డాక్టర్ సర్వేపల్లి అజయకుమార్, బాలాజీనగర్ పూర్వ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గ్రంధం ఆవిష్కరణ చేశారు. గ్రంథ సమీక్ష అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పెరుగు రామకృష్ణ చేశారు. మహతి కలం పేరుతో నెల్లూరు నుండి భక్తి పరంపరలో రాసిన 8వ ఈ పుస్తకంకు ముందు మాట రాసే భాగ్యం తనకు కలిగింది, అందుకు రచయితకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా రచయిత గ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన టంగుటూరు గోపాల్ రెడ్డి ,డా సర్వేపల్లి అజయ్ కుమార్ ,ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, డా పెరుగు రామకృష్ణ , డా నదీమ్ లను సత్కరించారు. రచయిత మహతి దంపతులను ట్రస్టీ డాక్టర్ అజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు..!

తిరుపతి

ఏడు గంగమ్మలకు ముక్కంటి పట్టు వస్త్రాల సమర్పణ

శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున మంగళవారం నాడు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుండి ఏడు గంగమ్మలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి రిషితమ్మ, దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కొట్టె సాయి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి సబ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ఏడు గంగమ్మలకు ముక్కంటి తరుపున పట్టు వస్త్రాల సమర్పణ చేసారు. వీరికి గంగమ్మ జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేసి తీర్ధ ప్రసాదలు అందజెశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.