Sunday, 15 March 2026

Blog

విశాఖపట్నం

జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

జీవీఎంసీ పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ . *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూలు పై ప్రత్యేక దృష్టి సారించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో డి సి (ఆర్) ఎస్.శ్రీనివాసరావు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ మరో 4 నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులతో పాటు పాత బకాయిలను, నీటి చార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. కొన్ని జోనల్లో తక్కువగా పన్నుల వసూళ్లు చేస్తున్నారని వాటిపై దృష్టి సారించి పాత బకాయిలను కలుపుకొని పన్నులు వసూళ్ల చేయాలన్నారు. రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పన్నుల వసూళ్లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల యొక్క పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రతిరోజు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్ కార్యదర్శులతో సమీక్షించి రోజుకో సచివాలయం పరిధిలోని ఇండ్లను సందర్శించి ఆస్తి, ఖాళీ జాగా పన్నులను వసూలు చేయాలన్నారు. నగరంలో అదనంగా సౌకర్యం కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జోనల్ కమిషనర్లు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు సౌకర్యం కేంద్రాలను సందర్శించాలని సౌకర్యం కేంద్రాలు సరిగా పనిచేస్తేనే జీవీఎంసీ కి ఆదాయం వస్తుందని కమిషనర్ తెలిపారు. 98 వార్డులలో గల సహాయక ఇంజనీర్లు (వాటర్ సప్లై) ఎమినిటీ కార్యదర్శులను కలుపుకొని పనిచేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు ఆదేశించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఆస్తి పన్నులు చెల్లించని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ యొక్క ఆస్తి పన్నుల చెల్లించేందుకు సిడిఎంఏ వెబ్సైట్ అందుబాటులో వున్నప్పటికీ, జీవీఎంసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పన్నులు చెల్లించే విధంగా ఆస్తి పన్ను చెల్లింపు దారులకు అవగాహన కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. మొండి బకాయిలపై దృష్టి సారించి ఆస్తి పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకునేలా జోనల్ కమిషనర్ స్థాయిలో జప్తు నోటీసులు తయారుచేసి బకాయిదారుల భవనాల వద్ద నోటీస్ బోర్డులు పెట్టాలన్నారు. అలాగే ఆస్తి పన్నులు విధించని భవనాలను గుర్తించి వాటికి పన్నులను విధించాలన్నారు. కొన్ని సచివాలయాలలో పరిధిలో జీరో టాక్స్ కలెక్షన్ అవుతుందని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ సమీక్షలో టెలికాన్ఫెరెన్స్ ద్వారా వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది* * .

**విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది* *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. *విశాఖపట్నండిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి, వాటిని ఇతర ఫ్లాట్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ఫ్లాట్‌లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆరో అంతస్తులోని ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగిందా, లేదా వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందా అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.

విశాఖపట్నం

రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన తాతపూడి ప్రదీప్ కుమార్*

*రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన తాతపూడి ప్రదీప్ కుమార్* *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ​బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు,రాష్ట్ర మైనార్టీ మోర్చా సెక్రటరీగా మరోసారి బాధ్యతలను స్వీకరించినట్టు తాతపూడి ప్రదీప్ కుమార్ తెలిపారు ఈసందర్భంగా వారు పత్రికా విలేఖరులకు కృతజ్ఞతలు తెలియజేశారు.​తనపై విశ్వాసం ఉంచి మరో సారి ఈ బాధ్యతను అప్ప గించిన పి.వి.ఎన్. మాధవ్ కు హృదయపూర్వక ధన్య వాదాలు తెలిపారు రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జీ కి,రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సయ్యద్ భాషాకి,మాజీ అధ్యక్షులు షేక్ బాజీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ​బీజేపీ విశాఖ అధ్యక్షులు పరశురామ్,నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు,కాశీ రాజు పుట్ట గంగయ్య,మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి సహా రాష్ట్ర,జిల్లా స్థాయి నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కృత జ్ఞతలు తెలియజేశారు గత 15 సంవత్సరాలుగా పార్టీలో అనేక బాధ్యతలు అప్ప గించిన భారతీయ జనతా పార్టీకి తాను ఎప్పుడూ రుణ పడి ఉంటానని తాతపూడి ప్రదీప్ కుమార్ అన్నారు.

విశాఖపట్నం

నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రాలకు చేరిన కోటి సంతకాల పత్రాలు …

నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రాలకు చేరిన కోటి సంతకాల పత్రాలు … *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వై.యస్‌. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న “కోటి సంతకాలు” కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా నలుమూలల నుండి సేకరించిన సంతకాల పత్రాలను ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేశారు. విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో నరసింహా నగర్ పోర్ట్ స్టేడియం వెనుక గేటు నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు 95,500 సంతకాల పత్రాలు తీసుకువచ్చి అందజేయడం జరిగింది. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో హెచ్.బి. కొలనీలోని పార్టీ కార్యాలయం నుండి 83,000 సంతకాల పత్రాలు అందజేశారు. గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్ నుండి 65,000 పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. విశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ వాసుపల్లి గణేష్‌కుమార్ గారి ఆధ్వర్యంలో అశీల్ మెట్ట – ఆశోక్ నగర్ పార్టీ కార్యాలయం నుండి 60,000 పత్రాలు అందజేశారు. భీమిలి నియోజకవర్గంసమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గారి ఆధ్వర్యంలో కుమార్తె సిరిసహస్ర(సిరిమ్మ) నిర్వహణలో 60,000 పత్రాలు అందజేశారు. విశాఖపట్నం పశ్చిమం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మళ్ల విజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి 52,000 పత్రాలు జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ కె కె రాజు గారు మాట్లాడుతూ మా నాయకుడు గౌరవ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటేకరణకి వ్యతిరేకంగా విశాఖ జిల్లా లో చేపట్టిన సంతకాల సేకరణకు , ప్రజలు, విద్యార్థులు,మేధావుల నుండి అనూహ్య స్పందన లభించిందని అన్నారు.. జిల్లాలో ఎక్కడ సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టిన స్వచ్ఛందంగా ప్రజల తరలివచ్చి ప్రభుత్వం డిగ్రీ కాలేజీలు ప్రైవేట్ కరణ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారని , కూటమి ప్రభుత్వంపై ఇంతా తక్కువ కాలం లో ప్రజల నుండి వ్యతిరేకత ఎంత ఉందో తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటేకరణకి వ్యతిరేకంగా విశాఖ జిల్లా లో ప్రజలు, మేధావులు విద్యార్థులు నుండి ఇంత పెద్ద సంఖ్యలో సంతకాలు సేకరించిన నియోజకవర్గ సమన్వయ కర్తలకు ,మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు , కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు, జిల్లా, నియోజకవర్గాల అనుబంధ సంఘల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు ,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమలో మాజీ శాసన సభ్యులు తైనాలవిజయ కుమార్ ,చింతలపూడి వెంకట రామయ్య, నియోజక పరిశిలకులు, చింతకాయల సన్యాసి పాత్రుడు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు కోలా గురువులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గోలగాని హరి వేంకట కుమారి (మాజీ మేయర్) , బాణాల శ్రీనివాసరావు (ఫ్లోర్ లీడర్) డా. సిఎంఏ జహీర్ అహ్మద్ , పిన్నమరాజు సతీష్ , రాష్ట్ర పార్టీ అధికారిక ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లావరపు జాన్ వెస్లీ , పెర్లా విజయ్ చందర్ , రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షుడు ద్రోణం రాజు శ్రీ వాత్సవ్ , జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు నడింపల్లి కృష్ణరాజు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు శంకర్ రావు బాకి శ్యామ్ కుమార్ రెడ్డి , జిల్లా పార్టీ కోశాధికారి కటారి అనిల్ కుమార్ రాజు , జిల్లా పార్టీ అధికారిక ప్రతినిధిలు పల్లా దుర్గారావు , దొడ్డి రామనాధ్ , బి.ఎస్. కృష్ణ (ఆల్ఫా కృష్ణ) , జోనల్ అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి నాగ వినాయక శైలేష్ , ముట్టి సునీల్ కుమార్ జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు , పెడాడ రమణి కుమారి , బొని శివ రామకృష్ణ , బర్కత్ అలీ , కర్రి రామ రెడ్డి , శ్రీదేవి వర్మ పినంత్స , సకలభక్తుల ప్రసాద్ రావు , దేవరకొండ మార్కండేయులు , బొండ ఉమా మహేశ్వరరావు , జీలకర్ర నాగేంద్ర , మెరువు గణేష్ , కార్పొరేటర్లు, ZPTC, MPP, మండలం , వార్డు అధ్యక్షులు , రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు వార్డు కమిటి మరియు అనుబంధ కమిటీలు , పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

తెలుగుశాఖలో ఘనంగా కట్టమంచి రామలింగారెడ్డి 145 వ జయంతి వేడుకలు*

*తెలుగుశాఖలో ఘనంగా కట్టమంచి రామలింగారెడ్డి 145 వ జయంతి వేడుకలు* *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖలో కట్టమంచి 145 వ జయంతి వేడుకలు బుధవారం (10-12-2025) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, ఆర్ట్స్ కళాశాల ప్రినిపాల్ ఆచార్య అడ్డాడ నరసింహారావు కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్య క్రమానికి అధ్యక్షత వహించిన తెలుగుశాఖాధిపతి మాట్లాడుతూ- కట్టమంచి రామలింగారెడ్డి గారూ ముసలమ్మ మరణము, నవ యామిని, కవిత్వ తత్త్వ విచారము, పంచమి,వ్యాసమంజరి, అర్థశాస్త్రము మొదలైన గ్రంథాలు రాసి తెలుగు సాహిత్యములో తనకంటూ ప్రత్యేకమైన విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత మూర్తి కట్టమంచి అని ఆచార్య జర్రా అప్పారావు అన్నారు ఆంధ్ర విశ్వకళాపరిషత్ కి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఆయన ఉత్తమ పరిపాలనా దక్షుడు ఈరోజు ఈ విశ్వవిద్యాలయము ఇంత చక్కగా ఉండడానికి ఆ రోజు ఆయన వేసిన పునాదులే కారణం అని తెలుగు శాఖాధిపతి పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య ఏ. నరసింహారావు గారు మాట్లాడుతూ 100 ఏళ్లకు ముందే ఎంతో దూరదృష్టి తో ఈ విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఏర్పాటుకు ఆయన చాలా గొప్ప ప్రయత్నం చేశారు. ఈనాడు ఈ విశ్వవిద్యాలయం కోట్లమంది విదార్థులకు జ్ఞానాన్ని అందిస్తుంది అని పేర్కొన్నారు. ఆచార్య యోహన్ బాబు గారు మాట్లాడుతూ ఉత్తమ పరిపాలనా దక్షుడు, జ్ఞాన సంపన్నుడు అని అన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఈ రోజు ఇక్కడ ఉండి విద్యార్థులు కు జ్ఞానపు వెలుగులు పంచుతుందంటే కట్టమంచే కారణం అని పేర్కొన్నారు. డాక్టర్ దామెర వెంకట సూర్య రావు గారు మాట్లాడుతూ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర ఆవిర్భావ దశలో విద్యావేత్తగా, కవిగా, రాజనీతిజ్ఞుడుగా, విమర్శకుడిగా తనదైన విశిష్టమైన విలక్షణమైన స్థానాన్ని సంపాదించారు.మద్రాస్ క్రైస్తవ కళాశాలలో చదువు పూర్తయిన అనంతరం ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో అనుబంధమైనటువంటి సంస్థలో తత్వశాస్త్రము, ఆర్థిక శాస్త్రము ఆప్షనల్ గా తీసుకొని ఎంఏ పూర్తి చేశారు అని పేర్కొన్నారు. బరోడా, మైసూర్ సంస్థానాల్లో ఆచార్యుడిగా పని చేశారు కొంతకాలం రాజకీయ రంగంలో ప్రవేశించి జస్టిస్ పార్టీలో చేరి మద్రాసులో శాసనసభ్యుడుగా పని చేశారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా విద్యాసాహిత్య రంగాల వైపు పడింది రామలింగారెడ్డి గారు విమర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.ఆయన గొప్ప కవి కూడా 1899 లో క్రైస్తవ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు సమర్ధ రంగయ్య శెట్టి గారి ప్రోత్సాహంతో ఆ నిర్వహించిన పద్య కవిత కావ్యాల పోటీలో ఆయన రచించిన ముసలమ్మ మరణం కావ్యంగా తొలి ఖండకావ్యం గా ప్రసిద్ధి పొందింది. ఆ కావ్యానికి ఉత్తమ కావ్యంగా బహుమతి గెలిచింది. ఈ కావ్యం లో కొన్ని నవీనమైన పోకడలు బ్రౌన్ దొరగారు సేకరించినటువంటి అనంతపురం మండల చరిత్రలో ఇది ఉన్నది. అనంతపురం సమీపంలో ఉన్న బుక్కరాయి సముద్రం చెరువుకి కట్ట తెగి ఆ ఊరు మునిగిపోయి అపారంగా జన నష్టం జరిగే సందర్భంలో అక్కడి ప్రజలకు ఒక ఆకాశవాణి కలలో కనిపించి ఈ ఊళ్లో ఉండే ముసలమ్మ అనే స్త్రీ ఆ గట్టుకు అడ్డుగా పడితే నష్టం నివారించబడుతుంది అని చెప్పడం వల్ల ఆ ఊరి ప్రజలకు కోరిక మీద ఆవిడ ప్రాణం త్యాగం చేసింది స్త్రీ పాత్ర ప్రధానంగా చర్చించడం సాంఘిక ఇతివృత్తాన్ని స్వీకరించి నవయామిని కావ్యంగా రాశారు ఆ తర్వాత అంపకాలు మొదలైన ఖండకావ్యాలు కూడా రాశారు. రచనా విధానం అంతా కూడా సంప్రదాయ పద్ధతిలో సాగడం కొంత సంప్రదాయమైన విశ్వాసాలని ప్రతిపాదిస్తుంది అని కూడా విమర్శకులు చెప్పారు. తరువాత ఆచార్య వెలమల సిమ్మన్న మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్తును పోషించిన వారుగా దాని భవిష్యత్తును కాంక్షించినవారుగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు చిరస్మరణీయులు అని పేర్కొన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు కళలకు నిలయము ఆంధ్ర విశ్వకళాపరిషత్ . ఈ స్థాయికి ఈ విశ్వవిద్యాలయం రాడానికి ప్రధాన కారకులు ప్రేరకులు మంచి పరిపాలన దక్షులు కట్టమంచని ఆచార్య సిమ్మన్న అన్నారు. విమర్శలో విశ్వరూపాన్ని ప్రదర్శించినటు వంటి మహానుభావుడు విఖ్యాత విమర్శకుడు డాక్టర్ కట్టమంచి. అందుచేతనే కట్టమంచి తెలుగు సాహిత్య విమర్శకులకు ఆచార్యులకే ఆచార్యులు అయ్యారు. అంతేకాకుండా ప్రముఖ పండితుల చేత రచయితల చేత విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న మహా మేధావి కట్టమంచని సిమ్మన్న అన్నారు. కట్టమంచి అత్యంత ఆధునికుడు. భాష సనాతనం. 1926 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రారంభమైంది ఇప్పుడు ఏప్రిల్ 26 2026 కి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలుగు శాఖలో శాఖాధిపతి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ జరుగుతుంది.రెడ్డి గారు 1926 నుండి 1930 వరకు వైస్ ఛాన్స్లర్గా చేశారు. మరల 1936 నుండి 1949 వరకు వైస్ ఛాన్స్లర్గా చేశారు .ఆంధ్ర విశ్వ కళాపరిషత్తుకు రెడ్డి గారు రెండుసార్లు వైస్ ఛాన్సరగా పదవని స్వీకరించి ఉత్తమ పరిపాలనాదక్షుడు అనిపించుకున్నారు ఈ సభా కార్యక్రమంలో పరిశోధక విద్యార్థి ఇళ్ల మురళీధరరావు రచించిన పాడ చక్కని శతకం అనే పద్య గ్రంథాన్ని ప్రాచార్యులు నరసింహారావు గారు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ప్రథమ సంవత్సర విద్యార్థిని ఆశ ఆహ్వానంతో ప్రారంభం అయిన ఈ సదస్సు రత్నం చేసిన వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యాపకులు డా. ఎం.కృష్ణవేణి, డా. ఎం.దాసు, డా.బి.సూర్యనారాయణ, డా. ఎం.ప్రతాప్, డా. పి.శ్రీనివాసరావు, డా. ఎల్.గిరీష్ కుమార్, డా.ఆర్.శివయ్య,పితాని ప్రసాద్ మరియు సాహితి వేత్తలు, పుర ప్రముఖులు, భాషాభిమానులు, పరిశోధకులు విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

*ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త పెందుర్తి వెంక‌టేశ్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీల‌తో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు..

**ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్* *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త పెందుర్తి వెంక‌టేశ్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీల‌తో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. క‌లెక్ట‌ర‌ట్లో స‌మీక్ష అనంత‌రం నిర్వ‌హించిన ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యురిటీ లైజనింగ్)లో భాగంగా కార్య‌క్ర‌మాలు జ‌రిగే వేదిక‌ల‌ను సందర్శించారు. ముందుగా మ‌ధురువాడ ఐటీ హిల్స్ నెం.3 వ‌ద్ద హెలిప్యాడ్ వ‌ద్ద జ‌రుగుతున్న బారికేడ్ నిర్మాణ ప‌నుల‌ను, లెవెలింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం హ‌రిత రిసార్ట్స్ ప‌క్క‌నున్న స్థ‌లంలో కాగ్నిజెంట్ సంస్థ భూమిపూజకు సంబంధించిన వేదిక‌ను సంద‌ర్శించి అక్క‌డ ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, అధికారుల‌తో మాట్లాడి ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం రుషికొండ‌లోని ఏ-1 గ్రాండ్ క‌న్వెన్ష‌న్ హాలును ప‌రిశీలించారు. అక్క‌డ జ‌ర‌గ‌నున్న వైజాగ్ ఎక‌నామిక్ రీజియ‌న్ స‌మావేశం, ఇత‌ర అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వారి వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. *విశాఖ‌ప‌ట్ట‌ణం దివ్యదర్శిని న్యూస్* ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య‌మంత్రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో సంబంధిత ఏర్పాట్ల‌ను స‌మ‌న్వ‌య‌క‌ర్త పెందుర్తి వెంక‌టేశ్, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీల‌తో క‌లిసి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ ప‌రిశీలించారు. క‌లెక్ట‌ర‌ట్లో స‌మీక్ష అనంత‌రం నిర్వ‌హించిన ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యురిటీ లైజనింగ్)లో భాగంగా కార్య‌క్ర‌మాలు జ‌రిగే వేదిక‌ల‌ను సందర్శించారు. ముందుగా మ‌ధురువాడ ఐటీ హిల్స్ నెం.3 వ‌ద్ద హెలిప్యాడ్ వ‌ద్ద జ‌రుగుతున్న బారికేడ్ నిర్మాణ ప‌నుల‌ను, లెవెలింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం హ‌రిత రిసార్ట్స్ ప‌క్క‌నున్న స్థ‌లంలో కాగ్నిజెంట్ సంస్థ భూమిపూజకు సంబంధించిన వేదిక‌ను సంద‌ర్శించి అక్క‌డ ఏర్పాట్ల‌ను గ‌మ‌నించారు. కాగ్నిజెంట్ ప్ర‌తినిధులు, అధికారుల‌తో మాట్లాడి ఏర్పాట్లు ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చాయో అడిగి తెలుసుకున్నారు. స‌మ‌యం త‌క్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహ‌కులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏర్పాట్ల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. అనంత‌రం రుషికొండ‌లోని ఏ-1 గ్రాండ్ క‌న్వెన్ష‌న్ హాలును ప‌రిశీలించారు. అక్క‌డ జ‌ర‌గ‌నున్న వైజాగ్ ఎక‌నామిక్ రీజియ‌న్ స‌మావేశం, ఇత‌ర అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. వారి వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.

అమరావతి

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి

ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి *అమరావతి*డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- • ఉద్యోగులు నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి • పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికే నూతన సంస్కరణలు • గత ప్రభుత్వంలో పోస్టింగ్ కీ, ప్రమోషన్ కీ ఓ రేటు కార్డు ఉండేది • కూటమి పాలంలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం • గతంలో ఎన్నడూ లేని విధంగా 10 వేల మందికి పైగా పదోన్నతులు కల్పించాము • నేను జవాబుదారీతనంతో ఉంటా… మీరూ తప్పు చేయొద్దు • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల సాధకబాధకాలు నాకు తెలుసు. నా శాఖ పరిధిలో ఉన్న ఉద్యోగులకు ఏం చేయగలనని మొదటి నుంచి ఆలోచించాను. ఉన్నతాధికారులను అడిగితే తీసుకురావాల్సిన సంస్కరణలు చాలా ఉన్నాయని చెప్పారు. ఒక ప్రమోషన్ వస్తే ఉద్యోగి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వారు మరింత ప్రభావవంతంగా పని చేస్తారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారాన్ని బలంగా, పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్లామ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఈ రోజు ప్రమోషన్లతో మీరు ఎంత సంబరపడ్డారో.. మీరు అందించే సేవల ద్వారా ప్రజలు కూడా అంతే ఆనందపడాలన్నారు. ప్రజలకు సేవలు అందించే క్రమంలో మీరంతా నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిన్నర పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ఎన్నో నూతన సంస్కరణలు అమలు చేశాం.. మరిన్ని అమలు చేయబోతున్నామన్నారు. చట్టబద్దంగా మీకు చేయగలిగినవన్నీ చేస్తామని తెలిపారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇస్తామన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు, సిబ్బందితో మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పల్లెలు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకే గ్రామాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నా. అనుభవం ఉన్న అధికారి పర్యవేక్షణ కావాలని శ్రీ శశిభూషణ్ కుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా తీసుకున్నాం. ఉపముఖ్యమంత్రి హోదాలో ఎక్కడా నా సొంత తెలివితేటలు వాడలేదు. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు తీసుకోకుంటే ఒప్పు అన్న పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. శ్రీ శశిభూషణ్ కుమార్, శ్రీ కృష్ణతేజ, శ్రీ వెంకటకృష్ణ లాంటి నిబద్దతతో పని చేసే బలమైన అధికారులు నాతో ఉన్నారు. వారి అనుభవంతో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం. గత ప్రభుత్వ పాలనలో చాలా అంశాల్లో పారదర్శకత లేదన్న విషయాన్ని వీరు నా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు అభివృద్ధి చేయలేదు. కనీస మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించలేదు. ప్రతి పోస్టుకీ, బదిలీకి ఒక రేటు కార్డు ఉండేది. ఇలాంటి పరిస్థితులు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన వరకు ఉద్యోగులకు ఎంత పారదర్శకంగా వ్యవహరించగలమనే ఆలోచన చేశాం • పూర్తి పారదర్శకంగా పదోన్నతులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో ఔట్ సోర్సింగ్ తో కలిపి సుమారు రెండు లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరికి పదోన్నతులు కల్పించే వ్యవహారంలో కార్యాలయ అధికారులు వెన్నెముకలా నిలిచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వ్యవస్థ ప్రక్షాళణకు సంస్కరణలు అవసరం అని వారు చెప్పేవారు. సమీక్షల సమయంలో చిన్న చిన్న మార్పులు తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాం. పదోన్నతుల వ్యవహారంలో నేను కల్పించుకోను అని ముందే చెప్పా. అయితే పాదర్శకతతో కూడిన పాలన కావాలని మాత్రమే కోరుకున్నా. సీనియారిటీ, సిన్సియారిటీ ఆధారంగా నివేదికలు ఇవ్వాలని సూచించా. బదిలీలు, పదోన్నతులపై ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లెటర్లు ఇచ్చారు. సిఫార్సు పొందిన ఉద్యోగికి నిర్దేశిత ప్రమాణాలకు తగ్గ అర్హత ఉంటేనే దాన్ని ఆమోదించాలని స్పష్టంగా చెప్పాం. • ఆర్థిక వ్యవస్థ గాడినపడితే ఉద్యోగుల ఆకాంక్షలు తీరుతాయి ఈ రోజున మనం 10 వేల మంది పైచిలుకు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పదోన్నతుల వ్యవహారంలో ఇంత భారీ స్థాయిలో సంస్కరణలు అమలు చేయలేదు. నేడు పూర్తి పాదర్శకంగా మీకు పదోన్నతులు కల్పించాం. మేము ఎంత పాదర్శకంగా నిలబడ్డామో అదే స్ఫూర్తిని మీరు గ్రామాల్లోనూ ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు సంపద పెంచిన తర్వాత హక్కులు, జీతాల పెంపు గురించి మాట్లాడాలి. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా అన్నీ ఒకేసారి చేయలేమన్న విషయాన్ని గుర్తించాలి. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నాం. అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇప్పుడు సంస్కరణల ద్వారా పదోన్నతులు ఎలా వచ్చాయో అంతా చూశారు. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల వ్యవహారంలో అనేక సమస్యలు ఉండేవి. వి.డి.ఒ.లుగా నియమితులైన వారు అదే పోస్టులో పదవీ విరమణ పొందిన సందర్భాలు ఉన్నాయి. గ్రూప్ 1 ద్వారా ఎం.పి.డి.ఒ. గా నియమితులైన వారికి 22 ఏళ్ల పాటు పదోన్నతి లేని పరిస్థితి. దీంతో పని పట్ల అధికారుల్లో కొంత మేర నిర్లిప్తత ఉండేది. దీన్ని పోగొట్టేందుకు చట్టబద్దంగా అవకాశం ఉన్నంత వరకు సంస్కరణలు తీసుకువచ్చాం. గ్రూప్ 1 ద్వారా ఎం.పి.డి.ఒ. స్థానంలో నేరుగా డి.డి.ఒ.లుగా ఎంపికయ్యే వెసులుబాటు కల్పించాం. ప్రమోషన్ల వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అమలు చేయని నిర్ణయాలను మన ప్రభుత్వం అమలు చేస్తుంది. గతంలో జిల్లా పరిషత్ సీఈవో స్థాయిలో ప్రమోషన్లు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థాయిలో కూడా తొలిసారి 70 మందికి ప్రమోషన్లు ఇవ్వబోతున్నాం. ఇంజినీరింగ్ విభాగంలో ఇ.ఎన్.సి. స్థాయి అధికారిగా కూడా డిప్యూటీ ఇంజినీరు, ఎగ్జికూటివ్ ఇంజినీరు పోస్టుల్లో ఉన్న అధికారులే బాధ్యతలు నిర్వర్తించేవారు. మన ప్రభుత్వం వచ్చాక ఇ.ఎన్.సి. స్థాయికి కూడా రెగ్యులర్ ప్రమోషన్లు ఇస్తూ పదోన్నతులు కల్పిస్తున్నాం. • సంస్కరణలతో పల్లెల్లో పట్టణ స్థాయి అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ప్రక్రియలో భాగంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశాం. పంచాయతీల అధికారాలు పంచాయతీలకు బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా గతంలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేశాం. 13,350 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పాలనా యూనిట్లుగా మార్చాం. జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాం. క్లస్టర్ వ్యవస్థలో మూడు, నాలుగు పంచాయతీలకు ఒక గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించే వారు. నూతన విధానంతో గ్రేడ్ల వారీగా విభజించబడిన ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని నియమించాం. తద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు మరింత సులభతరం అవుతాయి. అలాగే పంచాయతీ కార్యదర్శి పేరును గ్రామ అభివృద్ధి అధికారి (విలేజ్ డెవలప్ మెంట్ ఆఫీసర్) గా మార్చాము. 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలను మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కలలను సాకారం చేసే దిశగా రూర్బన్ పంచాయతీలుగా గుర్తించాం. డిప్యూటీ ఎంపీడీఓ స్థాయి గెజిటెడ్ అధికారిని నియమించి మున్సిపాలిటీలతో సమాన అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. • పని చేసే పరిస్థితుల్లో మార్పు తెచ్చాం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితో గ్రామ స్థాయిలో పాలనను సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 77 డి.డి.ఒ. కార్యాలయాలు ప్రారంభించాం. గతంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో ఓ మూలన కూర్చుని విధులు నిర్వహించుకునే పరిస్థితి నుంచి పూర్తి స్థాయి సిబ్బందితో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈ కార్యాలయాల్లో ఆర్డీఓ స్థాయి అధికారిని నియమించి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాల డివిజినల్ అధికారులు అయిన DDO, DLPO, APD(డ్వామా) మరియు ఇతర అధికారులు ఈ కార్యాలయం నుంచే సేవలు అందిస్తారు. పౌర సేవలు విస్తృతం చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్గం దోహద పడుతుంది. • మహిళా ఉద్యోగులను వేధిస్తే కఠిన చర్యలు దీంతోపాటు ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను వ్యక్తిగతంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్తున్నాం. విధి నిర్వహణలో చిన్నపాటి ఉద్యోగికి ఇబ్బంది వచ్చినా అండగా నిలుస్తాం. మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడే వారిపై బలమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. రాజకీయ పరమైనదాడులను ఉపేక్షించం. అలాగే ఉద్యోగుల భద్రత, వారి హక్కుల పరిరక్షణ బాధ్యతను భుజస్కందాలపైకి ఎత్తుకున్నాం. ఉమ్మడి కడప జిల్లా, గాలివీడు ఎంపీడీఓ ఆల్ఫ్రెడ్ జవహర్ బాబు గారిపై ఓ పార్టీ వారు దాడి చేసినప్పుడు స్వయంగా వెళ్లి అండగా నిలిచాం. మా పర్యవేక్షణలో ఉన్న శాఖల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఉద్యోగులంతా ఒక వ్యవస్థగా పని చేయాలి. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీవంతు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. నేను జవాబుదారీతనంతో ఉంటాను. మీరు తప్పు చేయొద్దు” అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ కమిషనర్ శ్రీ ముత్యాల రాజు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఎంఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఇంజినీరింగ్ విభాగం చీఫ్ లు శ్రీ బాలూ నాయక్, శ్రీమతి గాయత్రిదేవి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ ఎగ్జిబిష‌న్*

*మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ ఎగ్జిబిష‌న్* *600 మంది ఎస్.హెచ్.జి. స‌భ్యుల‌ ఆధ్వ‌ర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు *డిసెంబ‌ర్ 15 నుంచి 26 వ‌ర‌కు నిరంత‌రాయంగా కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌ *విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాలు వెల్ల‌డించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ *విశాఖ‌ప‌ట్ట‌ణం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:-* మ‌హిళ‌ల స్వ‌యం సాధికార‌త‌కు దోహ‌ద‌ప‌డేలా స‌ర‌స్ (SARAS – Sale of Articles of Rural Artisans Society) ఎగ్జిబిష‌న్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. ఈ ప్రాంతీయ స‌ర‌స్ ప్రదర్శన–2025 డిసెంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో జ‌రుగుతుంద‌ని, ఈ మేర‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. బుధ‌వారం సాయంత్రం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, ఇత‌ర అంశాల గురించి వివ‌రించారు. పండ‌గ‌ల స‌మయం, ప్రజల రాకపోకలు అధికంగా ఉండటం, మెరుగైన రవాణా సదుపాయాలు, మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా ఉండ‌టం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఆదాయ వనరులను పెంపొందించడం, గ్రామీణ మహిళల జీవనోపాధిని బలోపేతం చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. *600 మంది ఎస్.హెచ్.జి. స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో 250 స్టాళ్లు ఏర్పాటు* ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుమారు 600 మంది ఎస్.హెచ్.జి. మహిళలు పాల్గొంటున్నార‌ని తెలిపారు. మొత్తం 250 స్టాళ్లలో హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, చీరలు, షాల్స్, కార్పెట్లు, బెడ్ షీట్లు, వెదురు, లోహ, గాజు ఉత్పత్తులు, సంప్రదాయ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు, మసాలాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు తదితర నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివ‌రించారు. దీని ద్వారా విశాఖవాసులకు దేశంలోని వివిధ రాష్ట్రాల నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు ఒకేచోట లభించనున్నాయ‌న్నారు. అదనంగా ఫుడ్ స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల వినోద ఆటపరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్.హెచ్.జి. మహిళలకు ఉచిత స్టాళ్లు, ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే పోలీస్ భద్రత, సీసీ కెమెరాల నిఘా, అగ్నిమాపక సదుపాయాలు, వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం, లైటింగ్, జనరేటర్ వంటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. *మ‌ద్ద‌తుగా నిలుస్తూ.. విజ‌య‌వంతం చేయాలి…* ఈ ప్రదర్శనకు ఎన్.ఆర్.ఎల్.ఎం., సెర్ప్, నాబార్డు, మెప్మా, ఆర్.వై.ఎస్.ఎస్.తో పాటు ఎస్.బి.ఐ., యు.బి.ఐ., పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏపీ గ్రామీణ బ్యాంక్ వంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, విశాఖ‌ప‌ట్ట‌ణం పోర్టు ట్ర‌స్ట్, ఐవోసీఎల్, గాయ‌త్రీ విద్యాప‌రిష‌త్ త‌దిత‌ర‌ సంస్థలు మద్ద‌తుగా నిలుస్తున్నాయ‌ని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారతకు దోహదపడే ఈ ప్రాంతీయ సరస్ ప్రదర్శనను విశాఖ‌ప‌ట్ట‌ణం, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన‌ ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి, ఉత్పత్తులను కొనుగోలు చేసి స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌ వారికి ప్రోత్సాహం అందించాలని, విజ‌య‌వంతం చేయాల‌ని ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌ర డీఆర్డీఏ పీడీ ల‌క్ష్మీప‌తి, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సంబంధిత పోస్ట‌ర్ను క‌లెక్టర్ చేతుల మీదుగా ఆవిష్క‌రించారు.

విశాఖపట్నం

స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు*

*స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం* *పార్టీని మరింత బలోపేతం చేయాలని గంటా పిలుపు* _*విశాఖపట్నo డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి*_ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి అనుగుణంగా పార్టీని మరింత బలోపేతం చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి రూరల్, పద్మనాభం, ఆనందపురం మండలాల ముఖ్యనేతలతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం ద్వారా ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో మూడు మండలాల్లో అన్ని గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వాహన మిత్ర వంటి సంక్షేమ పథకాల సొమ్ము కొంతమందికి జమ కాలేదని ఈ సందర్భంగా నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నప్పటికీ.. కొత్త పెన్షన్ల కోసం వినతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. పాత ప్రభుత్వం ఇచ్చిన కాలనీల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఇళ్ల స్థలాల కోసం తమను సంప్రదించాలని వైసీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని పద్మనాభం మండలం నేతలు తెలియజేశారు. సచివాలయం, రెవిన్యూ సిబ్బంది కొందరు ఆ పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. సమర్ధంగా పని చేసే సచివాలయం ఉద్యోగులను డిప్యుటేషన్ పై కలెక్టరేట్, జిల్లా పరిషత్ లకు తీసుకెళ్లిపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. జల్ జీవన్ మెషీన్ కింద రోడ్లన్నీ తవ్వేసి వదిలేయడంతో వాహన చోదకులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని 3 మండలాల నాయకులకు గంటా హామీ ఇచ్చారు. ప్రతి నెల జరిగే పార్టీ సమావేశాలకు వరుసగా మూడు సార్లు గైర్హాజరైతే, ఆయా పదవులకు అనర్హులవుతారని గంటా పార్టీ కమిటీలను హెచ్చరించారు. భీమిలి జెడ్.పి.టి.సి. గాడు వెంకటప్పడు, భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు సరగడ అప్పారావు, కోరాడ రమణ, తాట్రాజు అప్పారావు, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, బి.ఆర్.బి. నాయుడు, డి.ఎ.ఎన్.రాజు, కసిరెడ్డి దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కురుమిన లీలావతి, మజ్జి నందీష్, రామరాజు, కాకర వెంకట రమణ, వై. అనిల్ ప్రసాద్, బమ్మిడి ఉమాదేవి, కాకర్లపూడి శ్రీకాంత్ రాజు, కర్రి శ్రీనివాసరావు, కాళ్ల సత్యనారాయణ, బలిరెడ్డి మల్లిఖార్జునరావు, గండ్రెడ్డి సోమినాయుడు, ఎం.శివాజీ, సత్య వరప్రసాద్, చందవరపు కుమార్, గుడ్డాల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. *గ్రీవెన్స్ నిర్వహించిన గంటా* ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట ప్రతి సోమవారం తాను పి.జి.ఆర్.ఎస్.లో పాల్గొంటానని గంటా చెప్పారు. ఎప్పుడైనా కుదరని పక్షంలో మంగళవారం నుంచి శుక్రవారం మధ్యలో ఒక రోజు మండల కార్యాలయాల్లో గానీ జోనల్ కార్యాలయాల్లో గానీ నిర్వహిస్తానని ప్రకటించారు. శ్మశాన వాటిక.. డ్రెయిన్.. దివ్యాంగ పెన్షన్.. జల్ జీవన్ మెషీన్ నీటి సరఫరా, జిరాయితీ భూమిలో హౌసింగ్ చేపట్టడం తదితరాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈనెల 12 న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం.. జోన్ల పునర్వ్యవస్థీకరణపై మున్సిపల్ మంత్రి పి.నారాయణ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ లతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. భీమిలి ఎమ్మార్వో పి.రామారావు, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పేదల గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి*అధికారుల‌ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరేంధిర‌ ప్రసాద్

*పేదల గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి* *అధికారుల‌ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరేంధిర‌ ప్రసాద్ *విశాఖపట్నం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి *:- పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతి పై హౌసింగ్ అధికారులు, స్పెషల్ అధికారులు, జోనల్ కమిషనర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం స‌మీక్ష నిర్వ‌హించారు. జిల్లాలో వివిధ దశలలో ఉన్న పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై దిశా నిర్దేశం చేశారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులంరూ పేదల గృహ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజుకు 200 ఇళ్ల చొప్పున పూర్తి చేసి ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సూచించారు. మార్చినాటికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. అదన‌పు ఆర్థిక సహాయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్ కమిషనర్లు పురోగ‌తిపై దృష్టి పెట్టాలని, ప్రతి సచివాలయంలో జియో ట్యాగింగ్ పూర్తి చేయుటకు ప్రణాళిక రూపొందించాలని, లక్ష్యసాధనలో వెనుకబడిన వారిపై తగిన చర్యలు ఉంటాయ‌ని హెచ్చరించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ స‌త్తిబాబు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు, హౌసింగ్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.