Sunday, 15 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

కళాశాలల నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలింది గత ప్రభుత్వమే పీపీపీతో పేదలకు ఉచిత వైద్యం–విద్య అందుతుందని స్పష్టం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నాయకత్వ ఘాటైన స్పందన

ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంపై నిన్న మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు చేసిన విమర్శలను నందిగామ టీడీపీ నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులు కానని, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. “తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చేం దుకే దుష్ప్రచారం” టీడీపీ నేతల వివరాల ప్రకారం— 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం, మిగతా నిధులను ఇతర పనులకు మళ్లించడం వల్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయా యని ఆరోపించారు. “గతప్రభుత్వ పనితీరుతో వెళ్లి ఉంటే ఈ కళాశాలలు పూర్తవడానికి కనీసం 20–23 సంవత్సరాలు పట్టేది. పేదలకు వైద్యం, యువతకు వైద్య విద్య అందుబాటులోకి రాకుండా ఆలస్యం చేసింది ఇదే ప్రభుత్వమే” అని టీడీపీ నాయకులు విమర్శించారు. “నిజమైన ప్రైవేటీకరణ చేసిందెవరు?” వైద్య విద్యలో ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుంచి ₹20 లక్షలకు పెంచిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్’ మోడల్‌ను గత ప్రభుత్వమే తీసుకొచ్చిందని గుర్తుచేశారు. “అది నిజమైన ప్రైవేటీకరణ. ఇప్పుడు పీపీపీపై అబద్ధాలు చెప్పడం నిస్సిగ్గు రాజకీయమే” అని నేతలు వ్యాఖ్యానించారు. *పీపీపీతో లభించే ప్రయోజనాలు* ప్రభుత్వం స్పష్టంచేసిన పీపీపీ విధానం వివరాలను టీడీపీ నేతలు మీడియాకు తెలియజేశారు: కళాశాలలు 100% ప్రభుత్వ యాజమాన్యంలోని వారేనని సీట్లలో 50%పేద–మధ్యతరగతి విద్యార్థులకు పూర్తిగా ఉచితమని, ఆసుపత్రులలో 70% బెడ్లు ఆరోగ్యశ్రీ కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయించనున్నారని, ఆలస్యాలను నివారిస్తూ ఆధునిక మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నమని చెప్పారు. “పీపీపీ అంటే ప్రజల భాగ స్వామ్యం ప్రైవేటీకరణ కాదు” ప్రజల ఆరోగ్యం, విద్యను బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో లేనివేననిఅర్ధమవుతోందన్నారు.

విశాఖపట్నం

*విశాఖ క్వీన్ మేరీ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల అపూర్వ ఆత్మీయ కలయిక!*

విశాఖపట్నం, డిసెంబర్, 12: విశాఖపట్నం పాత పట్నం పాటపట్నం క్వీన్ మేరీ హై స్కూల్ కి చెందిన పూర్వ విద్యార్థులంతా నగరంలో ఆర్ కె బీచ్ తీరాన ఓ ప్రముఖహోటల్ లో కలసి సందడి చేసారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము,చదువుల చెట్టు నీడలో అంటూ 1968 సం లో క్వీన్ మేరీ హైస్కూల్ లో చదివిన పూర్వ విద్యార్ధులు 15 మందీ .. అందరూ ఓ చోటచేరిన తమ ఆత్మీయ కలయిక వారి జీవితాల్లో మధుర ఘట్టంగానిలిచిపోయింది. పూర్వ విద్యార్థులంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆట,పాటలతో మైమరచిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకేచోట తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ యోగక్షే మాల అడిగి తెలుసుకున్నారు. అమెరికా, బెంగులూరు, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల్లో వైద్య తదితర ఉద్యోగాలలో స్ధిరపడి, రిటైర్ట్ అయిన ఉద్యోగులు కూడా ఈ ఆత్మీయ కలయికలో పాల్గోని మధురానుభూతిని పొందారు. ఈ సందర్బంగా బాలభాను విద్యాలయం ట్రస్టీ, క్వీన్ మేరీ హై స్కూల్ పూర్వ విద్యార్థిని వారణాసి పార్వతి మాట్లాడుతూ అమెరికా నుంచి గొల్లపూడి లక్ష్మి రాక సందర్బంగా తామంతా కలిశామని, ఇప్పటి వరకూ 8 సార్లు కలిసి తమ జ్నాపకాలను గుర్తు చేసుకున్నామని అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*పెనుగంచిప్రోలు మండలంలో రోడ్ల పరస్థితి అద్వానం* *సంవత్సరకాలంగా ఇదే దుస్థితిలో రోడ్లు* *ఈ రోడ్లు కాస్త పట్టించుకోండి సారో అంటూ అధికారులకు ప్రజలు, ప్రయాణికుల మొర*

పెనుగంచిప్రోలు మండలంలో సంవత్సరం పైబడి పాడైపోయి ఉన్న గుమ్మడిదుర్రు నుండి అనిగండ్లపాడు మీదుగా పెట్రోల్ బంక్ వరకు, అలాగే పెనుగంచిప్రోలు నుండి వేమవరం వెళ్లేదారిలో కాలువ కట్ట నుండి వేమవరం వరకు, ముచింతల రోడ్డు, ముళ్లపాడు రోడ్ల దుస్థితిని గూర్చి అధికారులు మర్చిపోయారేమో అనిపిస్తుంది. గత సంవత్సరం వరదల సమయంలో వచ్చిన వరద ప్రవాహానికి రోడ్లన్నీ తీవ్రంగా కొట్టుకొని పోయాయి. అయితే వాటికి తాత్కాలికంగా వాహనాలు తిరిగేలా మట్టి రోడ్లను ఏర్పాటు చేశారు కానీ నిత్యము ఈ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో కొన్ని చోట్ల అయితే అడుగు లోతు గుంటలు పడి నాలుగు చక్రాల వాహనాలపై ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రాణ సంకటంగా మారింది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం వచ్చిన వరదకు ఆ రోడ్లు ఇంకాస్త పాడైపోయి ఈ పరిస్థితి ఇంకాస్త ఎక్కువైంది నిత్యము రద్దిగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణికులు ఇంత ఇబ్బందిపడుతున్న ఇంతకాలంగా ఈ రోడ్లు మరమ్మత్తులపై దృష్టి పెట్టకపోవడంపై ఈ రోడ్డు మరమ్మత్తు పనులు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మత్తులు కొరకై ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను నియోజకవర్గంలోని రెండు రోడ్ల నిర్మాణాల కొరకు ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూనే వాటితో పాటు నిత్యం రద్దీగా ఉంటూ ప్రాణ సంకటంగా మారిన పెనుగంచిప్రోలు మండలంలోని ముళ్లపాడు, ముచింతల గుమ్మడిదూరు అనిగండ్లపాడు రోడ్డు అలాగె పెనుగంచిప్రోలు పాత వేమవరం రోడ్లపై కూడా దృష్టిని సారించాలని అధికారులను ప్రయాణికులు బలంగా కోరుతున్నారు

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

విశాఖపట్నం

విశాఖ స్టీల్ ప్లాంట్‌ డంప్‌యార్డ్‌లో భారీ పేలుడు

గాజువాక ఉక్కునగరం డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలోని డంప్‌యార్డ్‌లో ఈ ఉదయం జరిగిన భారీ పేలుడు కలకలం రేపింది. మెటల్ వ్యర్థాలను ప్రత్యేక పిట్‌లో వదిలే సమయంలో అకస్మాత్తుగా గట్టి శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై పరుగులు తీశారు. పేలుడుతో పిట్‌లో మంటలు చెలరేగగా, వెంటనే సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నీటితో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పేలుడుకు గల కారణాలను స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం దర్యాప్తు జరుపుతోంది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్త చర్యలు చేపడతామని సంబంధిత విభాగాలు వెల్లడించాయి.

కామారెడ్డి

పంచాయతీ వీరులకు పెద్దన్న శుభాకాంక్షలు!!

కామారెడ్డి, 12 డిసెంబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లుగా గెలిచిన అందరికీ హార్దిక అభినందనలు! ప్రజల నమ్మకంతో ఓట్లు పోసి గెలిపించిన మీరు, రాబోయే రోజుల్లో గ్రామాల సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి రంగంలో ముందడుగు వేయాలి!గ్రామాల్ని ఆదర్శ పల్లెలుగా, మండలాన్ని టాప్ మోడల్‌గా, దేశవ్యాప్తంగా ఉత్తమ పంచాయతీలుగా మలిచి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అధికారులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వ సలహాదారుల సహకారంతో గ్రామ బాధ్యతలు నిర్వహించి, ప్రజలకు నిజమైన సేవ చేయాలి. మీ బాధ్యత తీర్చిపెట్టి, గ్రామాల్ని స్వర్ణోత్సవాలకు చేర్చండి!

కామారెడ్డి

పోసానిపేటలో టీఆర్ఎస్ గెలుపు

సుద్దాల లింగం సర్పంచ్‌గా భారీ గెలుపు.. జాజాల సురేందర్ సన్మానం సందడి! కామారెడ్డి 12 డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో 11.12.2025న సర్పంచ్ ఎన్నికలు జరిగి, టీఆర్ఎస్ అభ్యర్థి సుద్దాల లింగం భారీ మెజారిటీతో గెలిచారు. గ్రామ ప్రజలు జోష్‌లో మునిగి ఉన్నారు. విజయోత్సవంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సర్పంచ్ లింగం , వార్డు మెంబర్లను సన్మానం చేశారు. స్థానికుల సంతోషం: “లింగం గెలిచారు, ఇక గ్రామం గెలిచింది” అంటూ అందరూ చెప్పుకుంటు న్నారు. రోడ్లు, నీరు, విద్యుత్ సమస్యలకు త్వరిత చర్యలు, రైతులకు సహకారం..ఇవన్నీ ప్రాధాన్యత అని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్ర మంలో మాజీ ఎంపీపీ ఎన్ దశరథ్ రెడ్డి, కాలభైరవ స్వామి, మాజీ చైర్మన్ గంజి సతీష్ గుప్తా, కిరణ్ కుమార్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు టంకరి రవి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా జీజీహెచ్‌లో న్యాయ సేవాధికార సంస్థ అవగాహన కార్యక్రమం

నెల్లూరు జిల్లా — పున్నమి ప్రతినిధి హైకోర్టు ఉత్తర్వుల మేరకు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే సందర్భంగా శుక్రవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కే.వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ ద్వారా ప్రతి పౌరుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందగలడని తెలిపారు. అలాగే వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయసహాయం అందించేందుకు 1987 న్యాయ సేవాధికార సంస్థల చట్టం అమలులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ హెచ్‌ఓడీ కళారాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్‌కే మస్తాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఈశ్వరీదేవి ఊరేగింపు: శాంతిభద్రతలపై పోలీసుల సమీక్ష

-కేఎస్ అగ్రహారం ఉత్సవాల దృష్ట్యా చిట్వేలి పీఎస్‌లో శాంతి కమిటీ సమావేశం -శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని కోరిన కోడూరు రూరల్ సీఐ చిట్వేలి, డిసెంబర్ 12 పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం, కేఎస్ అగ్రహారంలో వెలసి ఉన్న ఈశ్వరీదేవి ఊరేగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు చిట్వేలి పోలీస్ స్టేషన్‌లో కోడూరు రూరల్ సీఐ ముఖ్య నేతలు, అధికారులతో కలిసి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈశ్వరీదేవి ఊరేగింపును అత్యంత శాంతియుత వాతావరణంలో, ఇతర మతాల మనోభావాలకు భంగం కలిగించకుండా నిర్వహించాలని సీఐ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు.ఊరేగింపు నిర్ణీత మార్గాల్లో మాత్రమే జరిగేలా చూడాలని, ప్రజలు ఎవరూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ పాటించాలని సూచించారు.సమావేశానికి హాజరైన గ్రామ పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు మరియు ఊరేగింపు కమిటీ సభ్యులు పూర్తి సహకారం అందిస్తామని, పోలీస్ శాఖ ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.శాంతి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఉత్సవాల నిర్వహణలో కచ్చితంగా అమలు చేయాలని, ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సీఐ తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.