Sunday, 15 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం చైర్మన్‌గా మల్లెల సీతమ్మ, వైస్ చైర్మన్‌గా అడుసుమల్లి ప్రభాకర్

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం ఏర్పడింది. పట్టణం విలియంపేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/o మల్లెల కొండయ్య)ని చైర్మన్‌గా, మండలం బండిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి ప్రభాకర్ ని వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగ్గయ్యపేటలోని నెట్టెం రఘురాం నివాసంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ యార్డులు పనిచేయాలని, రైతులకు న్యాయమైన ధరలు కల్పించడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి దళితులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నెట్టెం రఘురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ మారేపల్లి సౌరి తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

స్వర్ణాంధ్ర @ 2047లో లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఈ–వాహనాలు పంపిణీ

జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు (డీపీ) తండాలోని రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర @ 2047 – P4 కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పాన్సర్‌గా వ్యవహరించగా, ఫ్యాక్టరీ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రారంభించిన స్వర్ణాంధ్ర @ 2047 కార్యక్రమం రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లే మహత్తర ప్రణాళికగా అభివర్ణించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని తెలిపారు. రామ్‌కో సిమెంట్స్ ఫ్యాక్టరీ ఏర్పాటైన నాటి నుంచి సిఎస్ఆర్ నిధులతో చుట్టుపక్కల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, మౌలిక వసతుల కల్పనలో ముందుండటం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ముఖ్యంగా కుట్టు మిషన్లు, ఎలక్ట్రికల్ ఆటోలు అందించడం ద్వారా లబ్ధిదారుల జీవనోపాధికి తోడ్పాటు లభిస్తోందని పేర్కొంటూ ఫ్యాక్టరీ యాజమా న్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బాలకృష్ణ, రామ్‌కో సిమెంట్స్ యాజమాన్య ప్రతినిధులు ఎస్‌వీఆర్‌కే మూర్తి రావు, ఫరూక్ తదితరులుపాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖలో వైసిపి భారీ ర్యాలీ ర్యాలీకి భారీగా తరలివచ్చిన 41 వ వార్డు కార్యకర్తలు నాయకులు

విశాఖలో వైసీపీ భారీ ర్యాలీ ర్యాలీకి తరలివచ్చిన 41వ వార్డు కార్యకర్తలు, నాయకులు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమానికి ప్రజా మద్దతు తక్షణమే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవాలని డిమాండ్ 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంత కాల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీలో భారీగా 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ,వార్డు అధ్యక్షులు శ్రీధర్ ఆద్వర్యంలో భారీగా కార్యకర్త లు,నాయకులు తరలివచ్చారు. జీవిఎంసీ నుంచి మద్దిలపాలేం తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగింది.ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేకరించిన కోటి సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ సెంట్రల్ కార్యా లయానికి తరలించారు.ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్ధులు నష్టపోయే ప్రమాదం ఉందని,తమ ప్రభుత్వ హయాంలో సాదించిన అభివృద్దిని కూటమి ప్రభుత్వ క్రెడిట్ లో వేసు కుంటున్నారని ఎద్దెవ చేశారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

E-పేపర్

రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు*

*రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు* *వైసీపీ నుంచి దాదాపు 200 కుటుంబాలు జనసేనలోకి – ఘనంగా స్వాగతించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు* *బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారి తో పాటుగా 200 కుటుంబాలు..జనసేన లోకి భారీ చేరికలు..* రైల్వే కోడూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా మరో కీలక అడుగు పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ అనుచరులు, ఆయన వర్గానికి చెందిన దాదాపు 200 కుటుంబాలు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి* నాయకత్వంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ, బీసీ నాయకుడు బత్తిన గంగన్న యాదవ్ గారికి పార్టీ కండువా కప్పి, కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*. అదే విధంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పలువురు నాయకులను కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. మహిళా నాయకురాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పగడాల వరలక్ష్మి గారు* కండువాలు వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సభను ఉద్దేశించి *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ…* జనసేన పార్టీ అధ్యక్షులు *శ్రీ పవన్ కళ్యాణ్ గారి* ఆశయాలు, పేదల పట్ల ఆయన చూపే ప్రేమ, సమస్యలను పరిష్కరించే నిజాయితీ నచ్చి పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వెనుకబడిన వర్గాలకు పవన్ కళ్యాణ్ గారు దేవుడిలాంటి నాయకుడని పేర్కొంటూ, తనను రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమించడం బలహీన వర్గాల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐకమత్యంతో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి *తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ…* రాబోయే రోజుల్లో చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు అన్నీ జనసేన పార్టీయేనని ధీమా వ్యక్తం చేస్తూ, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారు,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

E-పేపర్

రాజంపేట కేంద్రసాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్

రాజంపేట కేంద్రసాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో నిరసన తెలుపుతున్న ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు పట్టణం లోని రాజంపేట కేంద్ర సాధన కోసం మోకాళ్ళపై కూర్చొని నిరసనకారులతో కలిసి నిరసన తెలియజేసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు ముక్కా వరలక్ష్మి. రాజంపేట కేంద్ర సాధన కోసం శాంతియుతంగా సాగిన నిరసన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పిల్లల అన్నమయ్య వేషధారణ అన్నమయ్య వేషధారణతో నిరసన ర్యాలీ, రాజంపేట కేంద్ర డిమాండ్‌కు మద్దతునిస్తూ నిరసనలో పాల్గొన్న అరవ శ్రీధర్ , వరలక్ష్మి. అన్నమయ్య జిల్లా రాజంపేట కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం రైల్వే కోడూరు పట్టణంలో శాంతియుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జేఏసీ నాయకులతో, పిల్లలతో కలిసి మోకాళ్లపై కూర్చొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్‌కు మద్దతుగా తమ వంతు నిరసన తెలిపారు. రాజంపేటకు ఉన్న చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యతను గుర్తించి జిల్లా కేంద్ర హోదా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో అన్నమయ్య వేషధారణలో పాల్గొన్న చిన్నారులు రాజంపేట విశిష్టతను చాటిచెప్పేలా నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని రాజంపేట కేంద్ర సాధన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నిరసన ర్యాలీలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ , కాలేజ్ విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

విశాఖపట్నం

41వ వార్డులో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులు

41వ వార్డులో రూ.2.63 కోట్ల అభివృద్ధి పనులు కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల కృషితో వేగం విశాఖ నగరం 5వ జోన్ పరిధిలోని 41వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కార్పొరేటర్ కోడిగుడ్లు పూర్ణిమ–శ్రీధర్ దంపతుల నిరంతర కృషి ఫలితంగా సుమారు రూ.2 కోట్ల 63 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం జ్ఞానాపురం ప్రాంతంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌లతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టారు. జీవీఎంసీ నిధులతో హిందూ స్మశాన వాటిక వద్ద రక్షణ గోడ, సీసీ కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.185.08 లక్షలు, కొండవీటి గడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.78.81 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కాలనీలో రూ.24.85 లక్షలతో నిర్మించిన జీవీఎంసీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరంలోని ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు ప్రతిపాదించడంలో కార్పొరేటర్ పూర్ణిమ కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దక్షిణ నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. త్వరలో ఎండోమెంట్‌కు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనతా బజార్, నెహ్రూ బజార్, పూర్ణ మార్కెట్, ఎస్‌ఎల్ కెనాల్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న మేయర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాము, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు, 41వ వార్డు కూటమి అధ్యక్షులు అంతోని శేఖర్, మదు, సంజీవరావు, కూటమి నేతలు సునీత, గవర రమణ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా 41వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల వెనుక కార్పొరేటర్ పూర్ణిమ–శ్రీధర్ దంపతుల చొరవ, సమన్వయం కీలకంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

కామారెడ్డి

మూడవ వార్డు ఎన్నికల విజయం!!

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

కామారెడ్డి

మూడవ వార్డు ఎన్నికల వోజయం!!

కామారెడ్డి, 15 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం కేంద్రంలో 3వ వార్డు ఎన్నికల విజయం!కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ 3వ వార్డు ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిప్పరి లింబాద్రి రామరెడ్డి ఘన విజయం సాధించారు. 6 మంది అభ్యర్థుల పోటీలో సమీపి తోకల ప్రభాకర్‌ ను ఓడించి ప్రజాదరణ పొందారు. ప్రచారంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకు న్న రామారెడ్డి, మోర్ల నిర్మాణం, వీధి లైట్లు, సీసీ రోడ్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పింఛయాలు.. ప్రతి సమస్యకు పరిష్కారం హామీ ఇచ్చారు. ఎప్ప టికీ అందుబాటులో ఉంటానని చెప్పి ప్రజల ఆశలకు అంగీకారం పొందారు.ఈ విజయం తో గ్రామంలో ఉత్సవ సంఘటన. కాంగ్రెస్ నాయకులు అభినందాలు తెలిపారు.

నారాయణపేట

కున్సి గ్రామంలో ఎంఎల్ఏ శ్రీహరి భార్య ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం

కున్సి గ్రామంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భార్య లలితమ్మ పాల్గొన్నారు. గడపగడప కు తిరుగుతూ ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి తమ అభ్యర్థికి మద్దతు కోరారు. సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రచారానికి పాల్గొని స్పందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఊరిలో ఎటువంటి సమస్య వచ్చిన ముందుంటానని హామీ ఇచ్చారు ఊరి యొక్క ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది

విశాఖపట్నం

అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొబైల్ ఫోన్లు

గాజువాక, డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయ వేదికగా అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్లను అందజేశారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డి. నీలవేణి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని 113 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు ఒక్కోటి సుమారు రూ.12,500 విలువ గల నాణ్యమైన మొబైల్ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కొత్త భవనాల నిర్మాణంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గాజువాక తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.