గూడూరు
గూడూరు @ 22 డిసెంబరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్గీయ శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, గణిత శాస్త్ర అధ్యాపకురాలు మరియు కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి కిరణ్మయి, అధ్యాపకులు శ్రీధర్ శర్మ, తదితరులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడుతూ 2012 ఫిబ్రవరి 26న మద్రాస్ విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ 125వ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని, శ్రీనివాస రామానుజన్ గారు ప్రపంచ గణిత మేధావి అని, గణితం లేకపోతే ప్రపంచం పురోగతి సాధించలేదని, వ్యాపారంలోను, ఆర్థిక నిష్పత్తులు లెక్కించడానికి, సమాచార డేటా విశ్లేషించడానికి, భవిష్యత్తు ఆర్థిక ధోరణులను అంచనా వేయడానికి గణిత నైపుణ్యాన్ని ఉపయోగిస్తారని, ప్రపంచములో అందరు ఏదో ఒక రూపంలో గణితాన్ని తమ జీవితాలలో వాడటం జరుగుతుందని, గణిత ప్రాధాన్యాన్ని వివరించారు. రామానుజన్ గణిత శాస్త్రంలో విశేషమైన పరిశోధనలు చేసిన ప్రతిభావంతుడని, మన దేశమే కాకుండా ప్రపంచ మానవాళి గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి రామానుజన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ శైలజ, కృపా కరుణ వాణి, భీమవరపు లక్ష్మి, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవిరాజు, హిమబిందు, శైలజ, శ్రీలత, ఉష, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.