Saturday, 14 March 2026

Blog

వనపర్తి

విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం

*విజేతలకు బహుమతుల ప్రధాన ఉత్సవం* *పున్నమి ప్రతినిధి తేదీ 23/ 12/25 వనపర్తి జిల్లా* *జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు క్విజ్ పోటీలు గణితం పై కిట్స్ వ్యాసరచన స్పీచ్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఇందులో గెలుపొందిన విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు ఉపాధ్యాయ బృందం విజేతలకు బహుమతులను అందించడం జరిగింది పిల్లల్లో గణితం పట్ల ఆసక్తిని జిజ్ఞాసను పెంచేందుకు గణిత ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు కోరారు గణితం అంటేనే జీవితం జీవితం అంటేనే గణితం నిజ జీవితంలో కూడా గణితం అంతర్లీనమై ఉన్నదని ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు శ్రీనివాస రామానుజన్ గారి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయని వారు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో విద్యాభిమాని చాంద్ పాషా గారు హాజరయ్యారు*

బాలికలపై లైంగిక వేధింపుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం, బాలికలపై లైంగిక వేధింపుల నిర్మూలనపై అవగాహన,  టోల్ ఫ్రీ నంబర్ల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలపై జరుగుతున్న వేధింపులను నిరోధించే చట్టాలపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సమాజంగా బాధ్యత తీసుకొని ఈ అకృత్యాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. నేటి సమాజంలో బాలికలు, యువతులపై జరుగుతున్న వేధింపులు, ఆత్మహత్యాయత్నాలు, బలవన్మరణాలు వంటి సంఘటనలపై మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో బాలికలపై జరుగుతున్న అకృత్యాలను తక్షణమే అరికట్టాలంటే అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. అవసర సమయంలో 1098 (చైల్డ్ హెల్ప్ లైన్), 112 (దిశా హెల్ప్ లైన్), 181 (ఉమెన్ హెల్ప్ లైన్), 100 (ఏపీ పోలీస్ డయల్), 108 (ఎమర్జెన్సీ సేవలు), 104 (మెడికల్ హెల్ప్ లైన్) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించి రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.  పోక్సో సవరణ చట్టం-2012లోని సెక్షన్ 17 ప్రకారం బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఐసిడిఎస్ పీడీ లీలావతి ఆధ్వర్యంలో అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్లకు, టీచర్లకు  సాంసంగ్ ఫైవ్–జీ సెల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు

Blog

వైయస్సార్ నగర్ నందు ఘనంగా ‘సఫోజ్ గ్రాండ్ క్రిస్మస్ సంబరాలు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఎండి ఫయాజ్

నంద్యాల పట్టణంలోని 38 వార్డ్ వై.ఎస్.ఆర్ నగర్‌లో తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ‘సఫోజ్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు’ అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్ఎండి. ఫయాజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే యేసుక్రీస్తు కేవలం ఒక్క మతానికే పరిమితం కాదని, ఆయన మానవాళి మొత్తానికి మార్గదర్శి. సమాజంలో ద్వేషాన్ని వీడి, ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన బోధించారని. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, తోటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి” అని ఫయాజ్ అన్నారు. నంద్యాల గడ్డ ఎప్పుడూ మత సామరస్యానికి నిలయమని, ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదరభావంతో మెలుగుతారని ఆయన కొనియాడారు. ఇలాంటి పండుగలు మన మధ్య ఉన్న బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, విభజన రాజకీయాలకు తావులేకుండా అందరూ అభివృద్ధి పథంలో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఈ భారీ క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేసిన తాటికొండ బుగ్గరాముడు (యేసుదాసు) ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల కోసం పోరాడుతూనే, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడం సంతోషకరమని పేర్కొన్నారు. పేదలకు, అణగారిన వర్గాలకు అండగా నిలవడమే క్రిస్మస్ పండుగ యొక్క అసలైన పరమార్థమని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు తాటికొండ బుగ్గ రాముడు ( యేసుదాసు) మాట్లాడుతూ ప్రతి ఇంటా క్రిస్మస్ వెలుగులు నిండాలని ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప దైవం యేసుక్రీస్తు అని. ఆయన చూపిన ప్రేమ, కరుణ, సహనం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. నంద్యాల పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ క్రిస్మస్ వేడుకలు ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. ఈ వేడుకలకు కేవలం ఒక వర్గానికో, పార్టీకో పరిమితం కాకుండా, పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను, రాజకీయ నాయకులను మరియు ఆత్మీయులను సాదరంగా ఆహ్వానించమన్నారు . వై.ఎస్.ఆర్ నగర్‌లోని నా నివాసం వద్ద జరిగిన ఈ భారీ బహిరంగ సభలో దైవజనులు ఇచ్చే దైవ సందేశం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక మార్పు తీసుకువస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ సభను జయప్రదం చేయడానికి తరలివచ్చిన నాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఈ వేడుకలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్ రెవరెండ్ జి. పెద్ద సోమ్లా నాయక్, పి.పాల్ కిషోర్ , కన్వీనర్ డి.పాల్ జోసెఫ్ దైవ సందేశాన్ని అందించారు అనంతరం నిర్వాహకుడు తాటికొండ బుగ్గ రాముడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పాస్టర్లకు నూతన వస్త్రాలు, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం తాటికొండ మహేష్ బాబు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, సాయిరాం, కృపాకర్ ,జార్జ్, మిద్దె హుస్సేన్, నందం బాబురావు, గోవింద్ నాయుడు, నాగేశ్వరావు, ప్రసాద్ రెడ్డి, షాకీర్ మరియు పాస్టర్లు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

E-పేపర్

మాలమహానాడు ఆధ్వర్యంలో పీవీ.రావుగారి వర్ధంతి

మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 20 వ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో మాల మహానాడు కార్యాలయంలో స్వర్గీయ పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీ పుల్లయ్య మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి ఇరువురు మాట్లాడుతూ పివి రావు వర్గీకరణ ఉద్యమంలో తన ఉద్యోగ సైతం లెక్కచేయకుండా ప్రాణాలను అర్పించారని మాల సోదరులందరూ పివి రావు బాటలో ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షుడు బి మద్దిలేటి మాల మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు రాజేంద్ర మద్దూరు మాజీ సర్పంచి మద్దిలేటి నంద్యాల జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఇల్లూరి భూపాల్ తదితర మాల మహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

అడ్డతీగల: ముగిసిన పెసా శిక్షణ కార్యక్రమాలు

గిరిజన ప్రాంత సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణలో పెసా చట్టం పాత్రను అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ తెలిపారు. సోమవారం తో ముగిసిన 4 రోజుల పెసా శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడారు. పెసా చట్టం ఆవశ్యకత, గ్రామస్ధాయి తగాదాలు, భూ వివాదాల పరిష్కారంలో, స్ధానిక వనరులు వినియోగంలో పెసా గ్రామసభ అధికారాలను ట్రైనర్ వివరించారు. పెసా కమిటీలకు పెసా పుస్తకాలను అందించారు.

అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: రోడ్డు కి ఇరువైపుల ఉన్న తుప్పల తొలగింపు

డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీలో రహదారికి ఇరువైపుల గుబురుగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమం సోమవారం చేపట్టారు. తుప్పలు తొలగింపు పనులను పంచాయతి సర్పంచ్ పూజారి కొములు దగ్గరుండి పర్యవేక్షించారు. అరకు గ్రామం నుండి కొల్లాపుట్టు పంచాయతీ సరిహద్దు వరకు రహదారికి ఇరువైపుల ఉన్న తుప్పలను తొలగించారు. తుప్పలు తొలగించడంతో వాహన ప్రమాదాలు అరికట్టవచ్చని ఆయన అన్నారు.

Blog

పోలీస్ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి 94 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఫిర్యాదిదారుల నుంచి 94 ఫిర్యాదులను స్వీకరించారుఈ సందర్భంగా ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఆదేశించారు ఈ ఫిర్యాదులలో కుటుంబ కలహాలు,సివిల్ తగాదాలు, మొదలగునవి ఉన్నాయి ఫిర్యాదులలో కొన్ని రెండు సెంట్లు స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తామని వెంకటేశ్వర్లు, అశోక్, రమణయ్యలు 3,50,000/- నగదు తీసుకొని స్థలం రిజిస్ట్రేషన్ చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ కు చెందిన లక్ష్మీదేవి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు పొన్నాపురం గ్రామానికి చెందిన పసుపుల రూపేంద్ర, నీరజాక్షి నుండి 2024 లో 3.952 స్థలం కొనుగోలు చేయడం జరిగింది. సదరు స్థలాన్ని కొద్ది రోజుల క్రితం శుభ్రం చేసుకున్నందుకు వెళ్లగా రూపేంద్ర నీరజాక్షి మరికొందరు వచ్చి అదనంగా డబ్బులు చెల్లిస్తేనే స్థలం లోకి రాణిస్తాం అని ఆటంకం కలగజేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నాకు న్యాయం చేయండని పొన్నాపురం గ్రామానికి చెందిన సత్యవతి జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు నేను వ్యవసాయం వలన జీవనం చేయుచున్నాను.నావద్ద జిల్లెల్ల గ్రామానికి చెందిన మద్దిలేటి అను వ్యక్తి సుమారు 40 రోజుల క్రితం పాలు ఇచ్చే ఒక బర్రెను కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళినాడు. ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడుగగా నాపై దౌర్జన్యం చేయుచున్నాడు. నాకు న్యాయం చేయండని అయ్యలూరు గ్రామానికి చెందిన వెంకటరమణ జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో సర్వే నంబర్ 718/2 నందు మా పూర్వీకుల నుంచి సంక్రమించిన 1.09 సెంట్ల పొలం కలదు.సదరు స్థలం మాది అనే మహేష్ నాగిరెడ్డి అనువారు మాపై దౌర్జన్యం చేసి బెదిరిస్తున్నారని మాకు న్యాయం చేయండని బేతంచర్ల మండలం గోరుగట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.