Wednesday, 29 April 2026

Blog

తిరుపతి

పార్టీలకు అతీతంగా భవన నిర్మాణపూజలో పాల్గొన్న బలిజ సోదరులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలో బలిజ కాపు భవనం నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా బలిజ కులస్తులు హాజరయ్యారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన మన బలిజ సోదరులు నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. 5నెలలులో శ్రీకాళహస్తిలో బలిజ భవనం నిర్మాణం పూర్తవుతుందని నాయకులు తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో బలిజ భవనం కల ఈరోజు నెరవేరిందని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలిజ కమ్యూనిటీ ఎక్కువమంది ఉన్నా కూడా బలిజ భవనం నిర్మాణం జరగలేదని శ్రీకాళహస్తి ప్రాంతం బలిజ సోదరులు అందరూ ఒక తాటి పైకి వచ్చి బలిజ భవనం నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తున్నావారికి కార్యక్రమానికి హాజరైన బలిజ సోదరులకు బలిజ కమ్యూనిటీ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాలలో బలిజ కమ్యూనిటీ భవనాలు ఉన్నా శ్రీకాళహస్తి ప్రాంతంలో లేదు. కనుక అందరూ ఐకమత్యంగా బలిజ భవనం నిర్మించాలని కోరారు. విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, ప్రాంతాలలో బలిజ కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీ భవనాలలో బలిజ సోదరులకు సదుపాయాలు, భోజనాలు అవకాశాలు ఉన్నాయి. మన శ్రీకాళహస్తి ప్రాంతంలో కూడా బలిజ సోదరులకు కమ్యూనిటీ భవనంలో సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బలిజ నాయకులైన కోలా ఆనంద్, అంజూరు తారక శ్రీనివాస్, శెట్టిపల్లి సురేష్, ముత్యాల పార్థసారథి,కొట్టే సాయి ప్రసాద్, స్వర్ణ మూర్తి, ఉప్పు కిష్టయ్య, పూల కృష్ణమూర్తి, దేవస్థానం పాలక మండలి సభ్యులు దండి రాఘవయ్య, గరికపాటి చంద్ర, వెంకటేష్ డుమ్ము రాయల్, నరేంద్ర కండ్రిగ ఉమా, గాజులు సత్యం, కంట రమేష్, కాసరం రమేష్, పగడాలరాజు, మొగరాల గణేష్, వజ్రం కిషోర్, షణ్ముగం,ప్రభాకర్,పగడాల ప్రతాప్, చిలకా గోపి, హరీష్ రాయల్, వేణుగోపాల్, తుకారం, నాని, కంట ఉదయ్ కుమార్,జాజాల ముని, మున్నా రాయల్, తదితరులు నియోజకవర్గం బలిజ నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

ఘనంగా స్కౌట్స్ వ్యవస్థాపకుడు బేడన్ పావెల్ 100వ జన్మదినోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు బేడన్ పావెల్ 100వ జన్మదినోత్సవాన్ని స్థానిక కాసా గార్దన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కార్యాలయ కమీషనర్ టి. రమేష్ బాబు బేడన్ పావెల్ చిత్ర పటం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….బేడన్ పావెల్ ఆశయాలను ప్రతి ఒక్క స్కౌట్, గైడ్ నెరవేర్చాలని విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని అయన కోరారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణాధికారిణి సావిత్రి, యూత్ చైర్మన్ ఎస్ కె అజారుద్దీన్, గైడ్ కెప్టెన్ కుసుమకుమారి, స్కౌట్ మాస్టర్లు విద్యాసాగర్, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, స్కౌట్స్, గైడ్స్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా శ్రీ షిరిడి సాయి మందిర మహా కుంభాభిషేకం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డులో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాస శుద్ధ పంచమి తిధికి అనుగుణంగా ఆదివారం అన్నడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అశ్విని నక్షత్రయుక్త వృషభ లగ్నంలో మహా కుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీ చండికా పీఠం వ్యవస్థాపకులు సింగరాజు ప్రకాశం శాస్త్రి, శ్రీ సింగరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రిల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా వివిధ పూజలు, హోమాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి పరివార దేవతల అష్టబంధనం, దీక్షా హోమం, ప్రతిష్ఠా హోమం, శాంతి హోమం, పౌష్టిక హోమం, నాడీ సందానం, తత్వార్చన, తత్వ హోమం, స్పర్శాహుతి, మహా పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ఠ, మహా నైవేద్యం అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకంలో అశేష భక్తజనం పాల్గొని కర్పూర నీరాజనం సమర్పించి, స్వామివారికి పంచ హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

News

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ……అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం వేడుకలు….

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 21-2-2026 వ తేదీన తెలుగు విభాగం వారు ,అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. డాక్టర్. ఐ .శ్రీనివాస చక్రపాణి గారు, , నెల్లూరు. ముఖ్యఅతిథిగా విచ్చేసి *తెలుగు సాహిత్యం-పోతన కవిత్వం* అనే అంశం మీద వారు మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహించడం వల్ల భాషా వైవిద్యం అభివృద్ధి చెందుతుందని,బహుభాషా విద్య ప్రోత్సహించబడుతుందని, ప్రపంచవ్యాప్తంగా భిన్న సంస్కృతులపై అవగాహన పెరుగుతుందని భిన్నత్వంలో ఏకత్వం పరస్పరం గౌరవం, విలువలు పెరుగుతాయని తెలిపారు….మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ పోతన సాహిత్యం ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం ,పోస్టర్ ప్రజెంటేషన్ వంటి పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.వి.వి.ఎస్ .కుమార్ గారి అధ్యక్షతన జరిగింది. తెలుగు శాఖాధ్యక్షులు డా. కె .సరళ, డా. ఐ .మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు…. Uploaded Video:

ఆంధ్రప్రదేశ్

వరిగొండ జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో వనభోజన మహోత్సవం

22-02-2026 ఆదివారం వరిగొండ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో జంగమ సేవా సంఘం ఆధ్వర్యంలో 12వ వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. పూజలు, వైద్య శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహ పరిచయ వేదిక, వనభోజనం నిర్వహించగా వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ప్రముఖులు, వైద్యులు, సంఘ నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఖమ్మం

నారపరాజు రామచంద్రరావు అరెస్టు ఖండన ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఘనంగా ప్రెస్

పున్నమి ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి నారపరాజు రామచంద్ర రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాన్సువాడ, కామారెడ్డి ప్రాంతాల్లో బీజేపీ మరియు హిందూ నాయకులపై నమోదైన కేసులు, అరెస్టులను వ్యతిరేకిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వాసు దేవా రావు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య హక్కులను అణచివేసే విధంగా జరుగుతున్న అరెస్టులు తగవని మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంతోనే నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రెస్ మీట్‌లో నల్గొండ జిల్లా ఇంచార్జ్ ఉదయ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్ రావు, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులు రవి రాథోడ్, ఆఫీస్ సెక్రటరీ రవి గౌడ్, నాయకులు అల్లిక అంజయ్య, భద్రం, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ, బాన్సువాడ–కామారెడ్డి ప్రాంతాల్లో హిందూ, బీజేపీ నాయకులపై జరుగుతున్న అరెస్టులు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి సన్నాహాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి).ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ, మనుబోలులో ఫిబ్రవరి 23 నుండి మార్చి 18, 2026 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు లావణ్య లత తెలిపారు. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం 75 మంది, రెండవ సంవత్సరం 114 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా సాగేందుకు ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రసాద్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్‌గా నియమించినట్లు తెలిపారు. విద్యార్థులు నియమాలు పాటించాలని సూచించారు.

ఖమ్మం

పగడాల నాగరాజు ఇంటికి పోటెత్తిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

ఖమ్మం ఫిబ్రవరి (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా ఇంచార్జి) ఖమ్మం: అక్రమ అరెస్టుతో 22 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైలులో ఉన్న ఖమ్మం నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన తర్వాత ఆయన నివాసానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఆదివారం కూడా ఆయన ఇంటి వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ నాయకులు కూరాకుల నాగభూషణం, బత్తుల మురళి తదితరులు నాగరాజును కలిసి పరామర్శించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నాగరాజుపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆరోపించారు. పార్టీ కోసం పోరాటం చేసిన నాయకుడికి అండగా నిలుస్తామని తెలిపారు. కార్యకర్తలు “బీఆర్ఎస్ జిందాబాద్” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. నాగరాజు మాట్లాడుతూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాజన్న సిరిసిల్ల

రైతు అప్పుల బాధతో ఆత్మహత్య… దిక్కుతోచని స్థితిలో కుటుంబం

పోతుగల్ గ్రామంలో అప్పుల భారాన్ని తట్టుకోలేక రైతు అనమేని ఆంజనేయులు (42) ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు మరియు స్థానికుల వివరాల ప్రకారం, ఆయన భార్య రజిత (35) వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి కుమారుడు చరణ్ (11), కుమార్తె సహస్ర, అలాగే మానసిక వికలాంగురాలైన మరో కుమార్తె (6) ఉన్నారు. కుమార్తె అనారోగ్య సమస్యల కారణంగా కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. చికిత్స ఖర్చులు, జీవనోపాధి కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోవడంతో ఆంజనేయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్వగ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో జీవనోపాధి కోసం హైదరాబాద్ నగరానికి వెళ్లి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అయితే అప్పుల ఒత్తిడి, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైతులపై పెరుగుతున్న అప్పుల భారం, సరైన ఉపాధి అవకాశాల లేమి కారణంగా ఇలాంటి విషాద ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్

తణుకు డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా

తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి కోట రామ ప్రసాద్ మాతృభాష తెలుగు ప్రాముఖ్యతను వివరించారు. వివిధ భాషా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ డా. రవీంద్రబాబు అధ్యక్షతన అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో కోట రామ ప్రసాద్‌ను సత్కరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.