Thursday, 12 March 2026

Blog

తిరుపతి

నామినేట్ పదవులు పొందిన వారికి ఘన సన్మానం చేసిన ముదిరాజ్ సంఘం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: నామినేట్ పదవులు పొందిన తెదేపా నాయకులకు పట్టణంలోని స్థానిక సరోజినీదేవి కళ్యాణ మండపంలో ముదిరాజ్ సంఘం ఆద్వర్యంలో ఘనసత్కారం చేపట్టారు. ముదిరాజ్ సంఘం తరఫున గురుమూర్తి నేతృత్వంలో వారికి తరఫున పూలమాలాలు వేసి దుశ్యాలవులతో జ్ఞాపికలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడుతూ… పదవులను పొందిన నాయకులు ప్రజలకు మంచి సేవలను అందించి వారి మన్ననలను పొంది భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిలోకి తీసుకురావాలన్నారు. వివిధ పదవులు పొందిన నాయకులు తిరుపతి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమణయ్య, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లారి.బత్తినయ్య, తంగేళ్ళపాలెం సింగిల్ విండో చైర్మన్ భీమాల.భాస్కర్, తొట్టంబేడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు.బాలసుబ్రమణ్యం, కట్టపుట్టాలమ్మ చైర్మన్ పాడి.రాజేంద్ర, రాష్ట్ర ముదిరాజ్ సంఘం కార్యదర్శి అల్లిపూడి.వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సామ.అంకయ్య, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ కూనాటి.నాగరాజు, అఖిల భారతీయ కూలీ ముదిరాజ్ తిరుపతి చైర్మన్ కుర్రకాల్వ వేణు, వడమాలపేట మండల వీఆర్వోల సంఘం ప్రెసిడెంట్ పి.చంద్రబాబు, ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు స్టేట్ డైరెక్టర్ తేరని.జయరాం రెడ్డి, రేణిగుంట మండల టీఎన్టియుసి అధ్యక్షులు కుట్రపాక.శీను తదితరులు వారి యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

తిరుపతి

కార్యకర్త మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 02: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని కారకొల్లు SC కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త రమణయ్య ఆకస్మిక మృతి చెందారు. కార్యకర్త మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రమణయ్య పార్థివ దేహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, అడ్వకేట్ గల్లా సుదర్శన్ నాయుడు, చంద్ర, గ్రామస్తులు ఉన్నారు.

అన్నమయ్య

నందలూరు: టీడీపీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన గంటా గోపికి ఘన సన్మానం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంటా గోపాలకృష్ణ (గోపి) టీడీపీ జిల్లా కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఆయనను నందలూరులో ఘనంగా సత్కరించారు. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా సర్పంచ్ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ.పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గంటా గోపికి జిల్లా స్థాయిలో గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ కార్యదర్శి సయ్యద్ అమీర్, టీడీపీ నాయకులు తుమ్మాది శివకుమార్, బెస్త సుబ్రమణ్యం, మారే శివకుమార్, అరవ క్రాంతి కుమార్, శివ, నరసింహం, దాదా పీర్ మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

నందలూరు సింగల్ విండో డైరెక్టర్‌గా ఆండ్ర శివారెడ్డి బాధ్యతల స్వీకరణ ​ ​శివారెడ్డి నియామకం రైతులకు కొండంత అండ: బీజేపీ నేత రాచూరి మురళి.

కడప జిల్లా నందలూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగల్ విండో) త్రీమెన్ కమిటీ డైరెక్టర్‌గా భారతీయ జనతా పార్టీ నాయకులు ఆండ్ర శివారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సమక్షంలో ఆయన అధికారికంగా సంతకాలు చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు హాజరయ్యారు. ​రైతులకు సేవ చేసే అవకాశం: ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాచూరి మురళి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ రైతు సంక్షేమ ఫలాలను ప్రతి రైతుకు చేరవేయడంలో ఆండ్ర శివారెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శివారెడ్డి నాయకత్వంలో నందలూరు మండలం వ్యవసాయ పరంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ​అంకితభావంతో ముందుకు: వీరబల్లి జయకుమార్ రెడ్డి బీజేపీ నేత వీరబల్లి జయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న శివారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం సంతోషకరమన్నారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విత్తనాలు, ఎరువులు మరియు సకాలంలో రుణాలు అందేలా త్రీ మెన్ కమిటీ ప్రత్యేక చొరవ చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల స్థాయి బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆండ్ర శివారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

E-పేపర్

ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

పున్నమి ప్రతినిధి: ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు మండల ప్రజా పరిషత్ ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలోని శుక్రవారం స్థానిక హెడ్ మాస్టర్ బి.కల్పన ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ బి.కల్పన మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఆనందం కలిగి అనుకున్న విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఎస్జిటీ సయ్యద్ రూహి, టి.వర్షా తదితరులున్నారు

E-పేపర్

రవీంద్ర భారతి వద్ద సిగ్నల్ కనపడకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

పున్నమి ప్రతినిధి : రవీంద్ర భారతి వద్ద సిగ్నల్ కనపడకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు నిమిషాల్లో తీసివేసే జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫ్లెక్సీలు కనిపించవా అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు

పిల్లలకు

శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం

శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది. Art by, ఆర్. యామిని ప్రియా

యాదాద్రి భువనగిరి

టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి *

నూతన సంవత్సరం (2026) పురస్కరించుకుని రాష్ట్ర *టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని* మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు *దేప భాస్కర్ రెడ్డి * Uploaded Video:

E-పేపర్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు ఎస్ ఐ రమేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 2025 అక్టోబర్ 17 న పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు కేసు నుంచి తప్పిస్తామని లారీ ఓనర్ ను లంచం అడిగిన కొల్లూర్ ఎస్ ఐ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన లారీ ఓనర్ పోలీస్ స్టేషన్ లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్ఐ రమేష్ బదిలీ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రమేష్ రమేష్ కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరిన్ని పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్న ఏసీబీ అధికారులు..

కామారెడ్డి

కన్నాపూర్ గ్రామంలో జీపీ వర్కర్ తల్లి హఠాత్ మరణం..

– మాజీ సర్పంచ్ రాజ నర్సు ఆర్థిక సహాయం కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింలు తల్లి ఆకస్మికంగా మరణించడంతో కుటుంబం దిగ్భ్రాం తి చెందారు.నిరుపేద కుటుంబానికి మాజీ సర్పంచ్ రాజనర్సు వెంటనే రూ.2,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ మానవతా దృక్పధం గ్రామంలో మంచి సందేశాన్ని పంచింది.మాజీ సర్పంచ్ సానుభూతి రాజనర్సు కుటుంబాన్ని సందర్శించి తక్షణమే రూ.2,000 నగదును అందజేశారు.గ్రామ పంచా యతీ వర్కర్‌ గా కృషి చేస్తున్న నర్సింలు కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి ఆయన సహాయం చేశారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చర్యలు పెద్ద మార్పును తీసుకు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.గ్రామంలో కన్నాపూర్ గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ సేవలను అభినందించారు.ఇటీవల ఇక్కడ జీపీ వర్కర్ కుటుంబానికి పంచాయతీ పాలకులు ఆర్థిక సహా యం చేసిన సందర్భం గుర్తుచేశారు. ఈ సహాయా లు రామారెడ్డి మండలంలో సంక్షేమ భావనను పెంచుతున్నాయని పలువురు అభిప్రాయాలు తెలుపుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.