Friday, 6 March 2026

Blog

తిరుపతి

8వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పట్టణంలోని 8వ వార్డులో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పేదలకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని పేదలకు, వృద్దులకు, వికలాంగులకు, ఆర్తులకు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందంజలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నీకుల క్షత్రియ డైరెక్టర్ మిన్నల రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య, రాష్ట్ర బీసీ విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఉమేష్ రావు, పట్టణ అధ్యక్షులు విజయకుమార్, బిఎల్ఎ కె సుజాత, కో యూనిట్ ఇంచార్జ్ సి సుజాత, పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

తిరుపతి

సైన్స్ మానవాభివృద్ధికి మూలం-తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ వద్ద వున్నా శ్రీ చైతన్య పాఠశాల ప్రాంగణంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూపా దేవి, ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. సైన్స్ అనేది మానవుల అభివృద్ధికి మూలంమని విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకొని, భవిష్యత్ అవసరాలు దృష్ట్యా ప్రతి ఒక్క విద్యార్థి ప్రయోగాలు చేపట్టి భవిష్యత్తుకు అందజేయాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతో….విద్యార్థులు కేవలం విద్యలోనే కాక మానవతా విలువల పట్ల, వారి ఆరోగ్యం పట్ల చైతన్య పరుస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బీజాలు వేస్తూ కృషి చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, ముని కృష్ణయ్య, నాగరాజు, మహేష్, చరణ్, జోసెఫ్, అల్లావుద్దీన్ మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

మంత్రి నాదెండ్లతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి అద్యక్షులు కొట్టేసాయి ప్రసాద్ తిరుపతి పార్లమెంట్ పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, జనసేన పార్టీ PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పగడాల మురళి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఐసర్ విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్న శ్రీకాళహస్తి ది స్కూల్ విద్యార్థులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ది స్కూల్ విద్యార్థులు సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు భారతీయ విజ్ఞాన శిక్షణ, పరిశోధన సంస్థ,(IISER) తిరుపతి చే ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ యూనివర్సిటీ, కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. విజ్ఞాన శాస్త్రానికి అనుబంధమైన రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, బయాలజీ, గణిత పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉపయుక్తంగా ఉన్నాయని భవిష్యత్తు ఉన్నత విద్యకు తమకు మార్గదర్శనంగా ఉన్నాయన్నారు. ఐసర్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను సందర్శించడం తమకు ఎంతో ఆనందంగా విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి.విశాల, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

తిరుపతి

దర్జీ సోదరులు ఐక్యతతో ముందుకు సాగాలి – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముత్యాలమ్మ గుడి వీధి కోర్టు సమీపంలో ఉన్న టైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో హాజరైనారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, టైలర్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం టైలర్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ….గతంలో తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో టైలర్లు పెద్ద వారుగా గుర్తించి, ప్రతి టైలర్ సోదరుడికి సొంతిల్లు కల్పించాలని సంకల్పించి గోపాలకృష్ణారెడ్డి బృందావన టైలర్ కాలనీలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయాన్ని స్మరించుకున్నారు. టైలర్ సోదర సోదరీమణులు నైపుణ్యాభివృద్ధి సాధించి, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. టైలర్స్ సంక్షేమానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ట్రైలర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని పూలమాలవేసి దృశ్యాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు తోట్టాంబేడు బాలయ్య, ఉపాధ్యక్షులు చెంజి సుబ్రహ్మణ్యం (మణి), మౌలా, రమేష్, కార్యదర్శి చెంగయ్య, ఖజాంచీ చరణ్ టైలర్, గౌరవ కమిటీ సభ్యులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, జీవి అమర్నాథ్ తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిధులు లీగల్ అడ్వైజర్ కండ్రిగ ఉమా, పట్టణ టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్, మునిరాజు నాయుడు, చెంచయ్య నాయుడు, అంజూరు చక్రధర్ (జనసేన నాయకులు) తదితరులు పాల్గొన్నారు. టైలర్ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేసిన టిడిపి పట్టనాధ్యక్షుడు విజయ్ కుమార్

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 28: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఒక రోజు ముందే పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చిన టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట తప్పకుండా ప్రతి నెల 1వ తారీఖున లేదా ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని భారత దేశంలో ఎక్కడా లేని విధంగా 4000/-,6000/-,10000/-15000/- రూపాయలు అర్హులైన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తూ ఉండాదని ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి పాలకమండలి సభ్యులు గాదిపాకల గోపీనాథ్, మధు, హర్ష సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జడ్పీ బాలుర పాఠశాలలో నేషనల్ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహణ

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం C. V. Raman ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్‌ను స్మరించుకుంటూ నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రవేత్తల జీవిత విశేషాలను వివరించగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సైన్స్ ఫెయిర్ నిర్వహించి విద్యార్థుల తయారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి, ఉపాధ్యాయులు మాధవరావు, కామేశ్వరి, జ్యోతిలక్ష్మి, మంజువాణి, శ్యామల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మార్చి 15లోపు ఇంటి పన్నులు చెల్లించాలి – మనుబోలులో ఎంపీడీవో జలజాక్షి గారు సూచనలు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవో జలజాక్షి ఆధ్వర్యంలో అధికారులు గ్రామంలో పర్యటించారు. పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు మార్చి 15లోపు ప్రతి ఇంటి పన్ను చెల్లించాలని సూచించారు. మండల వ్యాప్తంగా రూ.79 లక్షలు బకాయిలు ఉన్నట్లు, లైసెన్సులు సహా మొత్తం రూ.1.2 కోట్లు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికి డిమాండ్ నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, గరుడయ్యలు పాల్గొన్నారు.

ఖమ్మం

ఎంపీ ఈటెల రాజేంద్రకు ఘన స్వాగతం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ నివాసులను పరామర్శించేందుకు ఖమ్మం నగరానికి విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్రకు ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వచ్చిన ఈటెల రాజేంద్రకు స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భూక్యా శ్యాం సుందర్ నాయక్, శ్రీమతి విజయా రెడ్డి, నున్న రవికుమార్, జాటోతు మధు నాయక్, నాగేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు. వెలుగుమట్ల భూదాన్ బాధితుల పరిస్థితిని పరిశీలించి వారికి అండగా నిలవాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.

ఖమ్మం

భూదాన్ భూముల బాధితులకు భరోసా ఇచ్చిన ఈటెల రాజేందర్

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను బీజేపీ జాతీయ నేత, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ శనివారం పరామర్శించారు. ఖమ్మం చేరుకున్న ఆయనకు బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ వరంగల్ క్రాస్‌రోడ్ వద్ద సాధర స్వాగతం పలికారు. వెలుగుమట్లకు చేరుకున్న ఈటెల రాజేందర్ బాధితుల సమస్యలను స్వయంగా తెలుసుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ — మొత్తం 62 ఎకరాల భూదాన్ భూములు ఉండగా ప్రభుత్వం కేవలం 30 ఎకరాలను మాత్రమే గుర్తించి పేదలను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించడం దారుణమని విమర్శించారు. మిగిలిన 32 ఎకరాల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో జరుగుతున్న చర్యలు ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని ఆరోపించారు. లేని వారి దగ్గర గుంజి ఉన్నవారికి ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ భవన్‌లో నివసిస్తున్న బాధితులకు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్, ఆయన సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, ధనియాకుల వెంకట్ నారాయణ, రుద్రగాని మాధవ్, రామకృష్ణ, నాగేశ్వరావు, మిర్యాల రామకృష్ణ, మధునాయక్, భూక్యా శ్యాం తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.