Thursday, 12 March 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ఆలయ అభివృద్ధికీ కలిసి పని చేస్తాం

ముస్తాబాద్ మండలంలోని పులి చేరుకుంటా గుడి కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణ లొ నిర్వహించారు ఎన్నికైన నూతన గుడి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి పూజ నిర్వహణ కు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని తెలిపారు గుడి కమిటీ అధ్యక్షులుగా తాళ్ల మల్లారెడ్డి వైస్ చైర్మన్ గా శీలా మల్లేశం రైటర్ గా బద్దిపడగ నందు క్యాషియర్ గా వేముల ఆంజనేయులు కార్యవర్గ సభ్యులుగా శ్రీల ప్రశాంత్ మల్లారపు ప్రశాంత్ గార్లను ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు

తెలంగాణ

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్

క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందజేసిన.. వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్ వెల్దండ జనవరి 4 : గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని వార్డు సభ్యులు లస్కర్ అఖిల వెంకటేష్ తన సొంత డబ్బుతో క్రీడాకారులకు వాలీబాల్ కిట్ ను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చల్ల వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఉప సర్పంచ్ చొప్పరి రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసోజు బ్రహ్మచారి, వెల్దండ వాసవి క్లబ్ అధ్యక్షులు ఆలంపల్లి కృష్ణ, వార్డు సభ్యులు అందోజు శిరీష శ్రీనివాస్ చారి, బుడ్డం వెంకటయ్య, పోలే అర్జున్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, గ్రామ యువకులు ,క్రీడాకారులు పాల్గొన్నారు.

తిరుపతి

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో టీటీడీ చర్యలు ప్రశంసనీయం

తిరుపతి, జనవరి 4 పున్నమి ప్రతినిధి (రోసి రెడ్డి) బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న సంక్షేమ చర్యలు ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ వసంత స్పష్టం చేశారు. ఆదివారం టిటిడి పరిపాలన భవనంలో కార్యనిర్వహణాధికారి అశోక్ సింఘాల్ ను బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ తో పాటు మరియు సభ్యులు కలిసి పలు అంశాలపై చర్చించారు. బాలికల సంక్షేమ వసతి గృహంలోని పిల్లలకు పలు అంశాలలో పలు అంశాలలో శిక్షణ ఇవ్వడంలో టిటిడి చర్యలు అభినందనీయమని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. వసతి గృహంలోని పిల్లలు తయారుచేసిన పూల మాలలు మరియు బ్యాగులు టీటీడీ కొనుగోలు చేయడం వల్ల వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించడం పట్ల హర్షం ప్రకటించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం భవిష్యత్తులో టీటీడీ తగిన ప్రోత్సాహం అందిస్తుందని ఈ సందర్భంగా ఈవో స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, మురళి మోహన్, కృష్ణమ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

రామచంద్రపురం లో మన శివశంకర వర ప్రసాద్ సినీ యూనిట్ సందడి

రామచంద్రపురం మండలం పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం బలిజపల్లె గ్రామంలో ఆదివారం మన శివశంకర వరప్రసాద్ సినీ యూనిట్ సందడి చేశారు. తిరుపతిలో సినిమా ట్రైలర్ లంచ్ ప్రోగ్రాం సందర్భంగా తిరుపతికి విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావుపూడి, చిరంజీవి పెద్ద కుమార్తె, ప్రొడ్యూసర్ సౌందర్య ముందుగా చిరంజీవి వీరాభిమాని మండలంలోని బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ కుటుంబాన్ని సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన సినీ యూనిట్ కు గ్రామస్తులు అభిమానులు భారీగా ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. వినిలో భాగంగా ముగ్గుల పోటీలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు తయారీ , కోలాటాలు, గొబ్బెమ్మలతో ఘనంగా ముందుగానే సంక్రాంతి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ జనవరి 12న సంక్రాంతికి వస్తున్న చిత్రం మన శివశంకర వరప్రసాద్ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రొడ్యూసర్ కొణిదల సుస్మిత తో కలిసి పిలుపునిచ్చారు. మన పల్లె సంక్రాంతి ముందే వచ్చినట్లు అనిపించిందన్నారు బలిజపల్లె గ్రామానికి ఒక ప్రత్యేకత అన్నారు మోగాస్టార్ వీరాభిమాని ఈశ్వర్ గురించి కథలు కథలుగా విన్నానన్నారు. మన మెగాస్టార్ చిరంజీవి కోసం తిరుమలకు పొర్లుదండాలతో, కరోనా సమయంలో సైకిల్ యాత్ర చేసినఈశ్వర్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మన సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. Uploaded Video:

E-పేపర్

జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరం రూరల్ బుర్రి లంక తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి * పూజారులకు, ఇమామ్ లకు, పాస్టర్లకు ఇస్తున్నట్లే జర్నలిస్టులకు గౌరవ వేతనం ఇవ్వాలి * జర్నలిస్టులపై దాడులు అరికట్టాలి * జే.డి.ఆర్.ఎఫ్. జోనల్ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో వక్తలు పిలుపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జే.డి.ఆర్.ఎఫ్. ( జర్నలిస్ట్ డెమెక్రటిక్ రైట్స్ ఫారం ) అధ్యక్షులు పూల తోట కృష్ణ, ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్, బుర్రిలంక గ్రామం, గోకుల్ నర్సరీ ప్రాంగణంలో జే.డి.ఆర్.ఎఫ్. జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా బుర్లంక గ్రామంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జోనల్ కార్యాలయానికి చేరుకొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడిఆర్ఎఫ్ అధ్యక్షులు, ప్రజా కాంక్ష దినపత్రిక ఎండి పూల తోట కృష్ణ, ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కేత శ్రీనివాసరావు, విశిష్ట అతిధిగా జెడిఆర్ఎఫ్ కార్యదర్శి బేతాళం సుదర్శనం, జెడిఎఫ్ ఉపాధ్యక్షులు, ప్రజాకాంక్ష చీఫ్ బ్యూరో జనపిరెడ్డి సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గోపిశెట్టి రామచంద్రుడు, జోనల్ ఉపాధ్యక్షులు దండు బోయిన వీర వెంకట సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎక్విడేషన్లు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అంటూ వ్యత్యాసం చూపడం తగదని అన్నారు. కార్పొరేట్ శక్తులు జర్నలిస్టులను బలి పశువులుగా చేస్తుందని విమర్శించారు. భారత రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్టులకు జీతాలు లేవని, మిగిలిన మూడు రంగాలకు జీతభత్యాలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వాలు జర్నలిస్టులను పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించే చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇమామ్ లకు, పూజారులకు, పాస్టర్లకు ఇస్తున్నట్లే అర్హులైన జర్నలిస్టులకు రూ 18 వేల రూపాయలు గౌరవ వేతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికల మనుగడ కోసం సబ్సిడీపై రుణాలు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టి, దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సభ్యుల, భద్రత సంక్షేమమే ముఖ్యంగా జెడిఆర్ఎఫ్ ఏర్పడిందని అన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా జే డి ఆర్ ఎఫ్ ముందుండి ఆదుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా సభ లో కొన్ని తీర్మానాలను ఆమోదించారు. * అర్హత గల విలేకరులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని. *జర్నలిస్ట్, వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రతకు రూ.10 లక్షలకు తక్కువకాని విధంగా కార్పొరేట్ వైద్య సేవలకై ఉచిత హెల్త్ కార్డులు జారీ చేయాలని. *విలేకరులు వారి కుటుంబ భద్రతకై ప్రత్యేక భద్రత చట్టాలు రూపొందించి అమలుపరచాలని. *విలేకరుల భద్రతకై వారి సంక్షేమం కొరకు జర్నలిస్ట్ కార్పొరేషన్ ను 100 కోట్ల తో ఏర్పాటు చేయాలి. 5. తగు విఖితపూర్వక, శాస్త్రీయపరమైన ఆధారాలతోనే విలేకరులపై చట్టపరమైన విచారణకు ఆదేశించాలని. * విలేకరులపై తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు బనాయించే అధికారులపై కాలయాపన లేని చర్యలు చేపట్టాలని. * మూడేళ్లు అనుభవం గల విలేకరులను ప్రభుత్వం గుర్తించి రూ. 5 వేలు కు తక్కువకాని విధంగా సైఫండ్ చెల్లించాలని. * ఐదేళ్ల అనుభవం గల విలేకరులకు ఉచితంగా గృహాలు మంజూరు చేయాలని. * విలేకరుల పిల్లల చదువుల కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో 50% ఫీజు రాయితీ ఇచ్చే విధంగా ప్రత్యేక జీవో విడుదల చేయాలని. *విలేకరుల కార్పొరేషన్ ద్వారా న్యూస్ ప్రింట్ ను ఉచిత సరఫరాతో పాటు ఉచిత విద్యుత్తును అమలు చేయాలని. * స్త్రీ విలేకరుల సంక్షేమం కోసం 100 కోట్లతో విలేకరుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని. * వార్తా సేకరణలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు భద్రతతో గల ప్రత్యేక సౌకర్యాలు అమలు చేసే విధంగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని. * ఉచితంగా టోల్ ప్లాజా రుసుం సౌకర్యం కల్పించాలని. * 55 ఏళ్లు దాటిన సీనియర్ జర్నలిస్టులకు రూ. 5 వేలు కు తక్కువ కాకుండా పెన్షన్ అమలు చేయాలని. * చిన్నపత్రికల యాజమాన్యం పైన, విలేకరుల పైన అధికార పక్షాలు ఇతర రాజకీయపక్షాలు దాడులు, దౌర్జన్యాలపై ప్రత్యేక రక్షణ కల్పించాలని. *విలేకరుల నిబద్ధతగల వృత్తి సేవలపై ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు తో పాటుగా ఆర్ధిక సహాయం అందించాలని. * ఇన్వెస్టిగేటెడ్ జర్నలిస్టు సేవలను ప్రభుత్వం ప్రోత్సాహంతో వారి సేవలను వినియోగించుకోవాలని. *పత్రిక యాజమాన్యం కోరిన వెంటనే కాలయాపన లేని విధంగా వివిపిల ఆపాయింట్మెంట్ కేటాయించాలని. *విలేకరుల కోసం ప్రతి జిల్లాకు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ను ఏర్పాటు చేయాలని. * అర్హత గల విలేకరులకు లక్షరూపాయలకు తక్కువ కాకుండా ఏ విధమైన గ్యారంటీ లేని రుణం 25పైసలకే వడ్డీకే అందించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జె.డి.ఆర్.ఎఫ్. జిల్లా అధ్యక్షుడు మారంపూడి సోమరాజు, ఉపాధ్యక్షులు గొర్రెల రాజు, యార్లగడ్డ నరేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి కుడెల్లి రత్న కిషోర్, ప్రచార కార్యదర్శి గిరీష్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సనమండ్ర లాజర్, సిర్రా చిట్టిబాబు, మీడియా కోఆర్డినేటర్ ఎం.వీ.ఎస్. రమేష్, ట్రెజరర్ పిచ్చుక మహేష్ తదితరులు పాల్గొన్నారు. END

విశాఖపట్నం

ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలపై భిక్షాటనతో నిరసన – గాజువాకలో కార్మికుల ఆగ్రహం

విశాఖ గాజువాక , జనవరి (పున్నమి ప్రతినిధి): విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసి ప్రైవేటు కార్పొరేట్లకు కట్టబెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గాజువాకలో కార్మికులు రోడ్డెక్కారు. 2026 జనవరి 4వ తేదీ ఉదయం 9 గంటలకు గాజువాక లంకా గ్రౌండ్ నందు విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్ట్ లేబర్ యూనియన్‌ల ఆధ్వర్యంలో భిక్షాటన కార్మికం నిర్వహించారు. ఏళ్ల తరబడి కష్టపడి నిలబెట్టిన విశాఖ ఉక్కును అమ్మే ప్రయత్నాలను కార్మికులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని, పాలక కూటమి నేతలు ఉక్కు పరిరక్షణ పేరుతో మాటలకే పరిమితమయ్యారని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. “ఉక్కు పరిరక్షణ పేరిట నాటకాలు ఆడొద్దు”, “ఉక్కు అమ్మకం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం అమ్మినట్లే” అంటూ నినాదాలతో గాజువాక దద్దరిల్లింది. ఈ భిక్షాటనలో కార్మికులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని విరాళాలు అందించారు. ఉద్యమం కొనసాగించేందుకు ప్రజలే ముందుకు రావాల్సిన పరిస్థితి పాలకుల వైఫల్యానికి నిదర్శనమని నాయకులు విమర్శించారు. భిక్షాటన ద్వారా సేకరించిన నిధులను ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి వినియోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, వేలాది కుటుంబాల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రాజకీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తామని హెచ్చరించారు. ఉక్కు ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్లిందని, గాజువాక నుంచి మొదలైన ఈ నిరసన రాష్ట్రవ్యాప్తంగా విస్తరించబోతోందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.

E-పేపర్

రామశింగరం గ్రామంలో చెక్కుల పంపిణీ

పున్నమి ప్రతినిధి గోపాలపురం మండలం ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా ద్వారకతిరుమల మండలం రామశింగరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ గారి చేతుల మీదుగా రామశింగరం గ్రామపంచాయతీలో పదిలం దేవి, జడ కృష్ణ, పాకిరం విమల గార్లకు చెక్కుల పంపిణీ జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు , బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోప్పసాని బాబురావు, బూత్ కన్వీనర్ ఉందుర్తి రమణ మహర్షిగారు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. END Uploaded Video:

విశాఖపట్నం

విశాఖ నౌకాదళంలో తెలంగాణ గవర్నర్ పర్యటన… INS హిమగిరి, ఖండేరీ పరిశీలన

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళంలో కీలక పాత్ర పోషిస్తున్న INS హిమగిరితో పాటు, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని ఆయన పరిశీలించారు. భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా జరుగుతున్న ప్రగతికి ఈ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. నౌకాదళ సిబ్బంది పనితీరును ఆయన అభినందిస్తూ, దేశ భద్రతకు వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్

కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు :కృత్తివెన్ను ఎస్. ఐ

సంక్రాంతి సందర్భంగా కృత్తివెన్ను మండలం లో ఎటువంటి జూద క్రీడలకు అనుమతులు లేవని కృత్తివెన్ను ఎస్.ఐ.A. పైడిబాబు అన్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు పలు సూచనలు చేసినారు. జూద క్రీడలు అయిన కోడి పందెములు, పేకాట, గుండాట నిర్వహించకూడదని అలా జూదం నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద క్రీడల వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాటికి బదులుగా వాలీబాల్, క్రికెట్ లాంటి టోర్నమెంట్లు నిర్వహించుకుంటూ రాబోయే సంక్రాంతిని ఆహ్లాద వాతావరణంలో కుటుంబీకులతో జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే మండలంలో ఎటువంటి జూద క్రీడల గురించి సమాచారం తెలిసిన ఈ ఫోన్ నెంబర్ కి 9440796420 కి సమాచారం ఇవ్వాలని,అట్టి సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క సమాచారం గొప్యం గా ఉంచుతామని తెలియపరిచినారు.

కామారెడ్డి

తాగునీరు బోరు ఆక్రమణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ స్కీల్ నాయకుడు ఆందోళన

కామారెడ్డి, 04 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కళ్లెం రాజేందర్ మాట్లాడు తూ, మోషంపూర్ గ్రామానికి సంబంధించిన తాగు నీటి బోరు మోటర్‌ను ఒక వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆ వ్యక్తి ఇటీ వల ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసి, ఆ భూమి లోని బోర్ మోటర్‌ను ఆక్రమించాలని చూస్తున్నా డని వాపోయారు. ఇది గ్రామ తాగునీటి సౌకర్యా నికి చెందినదని, అధికారులు తక్షణ చర్యలు తీసు కుని గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వేడుకున్నారు.మోషంపూర్ శివారులో గల అసైన్డ్ భూమి 203 అసైన్డ్ పట్టా మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతవరకు ఎంత ఆక్రమించబడింది, మిగిలిన భూమి ఎంత ఉందో రెవెన్యూ శాఖ వివ రాలు గ్రామపంచాయతీ, గ్రామస్తులకు అందించా లని కళ్లెం రాజేందర్ డిమాండ్ చేశారు. మోషంపూర్ గ్రామ పంచాయతీ గోదాంల సందర్శన.. టాక్స్ వసూల్, లేబర్ సమస్యలపై చర్చ మోషంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జార లక్ష్మీరాజయ్య, ఉపసర్పంచ్ వంగ సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ జిపిఓ, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి గ్రామ శివారులోని గోదాంలను సంద ర్శించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకుని, జిపి టాక్స్ వసూల్, గత రెండు సంవత్సరాల్లో ఎంత వరకు టాక్స్ చెల్లించారో వివరాలు సేకరించా రు. జిపిఓ ఆధ్వర్యంలో 17వ నంబర్ గోదాముకు కొలతలు తీశారు. మా గ్రామ ప్రజలు గోధుములలో పనులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేరే ఊర్ల నుంచి లేబర్ తీసుకురాకుండా, స్థానికులకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.గోదాం ఇన్‌చా ర్జ్ సందీప్‌తో ఇతర విషయాలు చర్చించారు. ప్రస్తు తం సిబ్బంది వేరే ఊర్లకు వెళ్లడం వల్ల పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నామని, 2-3 రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని సందీప్ హామీ ఇచ్చా రు. అక్కడి లేబర్లకు సమయానికి జీతాలు చెల్లిస్తు న్నారా, ఇతర సమస్యలు ఉంటే తెలియజేయాలని ఆరా తీశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.