Thursday, 12 March 2026

Blog

తిరుపతి

చిట్వేలిలో సేవ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తిరుపతి జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో అగ్నికుల క్షత్రియ, వన్నీ కుల క్షత్రియ, పల్లి రెడ్డి, పల్లి కాపు సేవ సంఘాల ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి తహసీల్దార్ స్పందన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక సేవలో కుల సంఘాలు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తిరుపతి

వైభవంగా అగ్నికుల క్షత్రియ సేవ సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

– క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చిట్వేలి తహసీల్దార్ స్పందన రెడ్డి – కుల సంఘాల ఐక్యతతోనే సామాజిక అభివృద్ధి సాధ్యం చిట్వేలు, జనవరి 05: పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో అగ్నికుల క్షత్రియ, వన్నీ కుల క్షత్రియ, పల్లి రెడ్డి, పల్లి కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ స్పందన రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, సంఘం ప్రతినిధులతో కలిసి నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -సామాజిక సేవలో ముందుండాలి ఈ సందర్భంగా తహసీల్దార్ స్పందన రెడ్డి మాట్లాడుతూ.. కుల సంఘాలు కేవలం పండుగలకు, వేడుకలకు పరిమితం కాకుండా, సమాజంలోని పేద ప్రజల ఉన్నతికి, విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ చేరవేసేలా సంఘం కృషి చేయాలని సూచించారు. క్యాలెండర్ రూపకల్పన ద్వారా సంఘం చేస్తున్న ప్రయత్నాలను ఆమె అభినందించారు. -ఘనంగా కార్యక్రమం – తరలివచ్చిన ప్రజలు ఈ కార్యక్రమంలో చిట్వేలిలోని బ్రాహ్మణ వీధి, పాత చిట్వేలి, కే.ఎస్. అగ్రహారం గ్రామాలకు చెందిన ప్రజలు మరియు కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం యొక్క ఐక్యతను చాటుతూ జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం సభ్యులు తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -పాల్గొన్న కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో సేవ సంఘం కమిటీ ప్రతినిధులు, వివిధ గ్రామాల పెద్దలు, యువకులు మరియు మహిళలు పాల్గొన్నారు. కుల సంఘం గౌరవం పెంపొందించేలా, రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు.

విశాఖపట్నం

బాబాతో బంధం బలమైనది వయసులు మరచి మనసులను తుల్లించిన మిత్రులు

మన చెడ్డి దోస్త్ బాబా బర్త్‌డే, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సమ్మేళనంగా బుధవారం ఉద్యోగ రీత్యా విదేశాలకు ప్రయాణం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని, బాల్యమిత్రులంతా ఒక్కటై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిన్ననాటి స్నేహ బంధాలు, స్కూల్ రోజుల ముచ్చట్లు, జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, నవ్వులు–సంతోషాలతో ఈ వేడుక ఒక మధుర జ్ఞాపకంగా మారింది. విదేశాలకు వెళ్లినా స్నేహం దూరం కాదని, మనసుల అనుబంధమే నిజమైన సంపదని ఈ సమ్మేళనం మరోసారి నిరూపించింది.

విశాఖపట్నం

స్నేహ బంధాల స్వర్ణోత్సవం… జ్ఞాపకాల జాతరగా మారిన హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్ 1988–89 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం

హిందుస్థాన్ షిప్ యార్డ్ హై స్కూల్‌లో 1988–89 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నగరంలోని ఒక పార్కులో అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాలను తిరగేసుకుంటూ, నవ్వులు–ముచ్చట్లు–మధురానుభూతులతో ఈ కార్యక్రమం నిజంగా ఒక జ్ఞాపకాల జాతరగా నిలిచింది. ఈ సమ్మేళనానికి అదే బ్యాచ్‌కు చెందిన, ప్రస్తుతం భారత్ సంచార్ లిమిటెడ్ (BSNL) సంస్థలో ఏజీఎంగా నాగాలాండ్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వానపల్లి కిషోర్ హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత బాల్య స్నేహితులతో కలసి గడిపిన క్షణాలు ఆయనకు కూడా అపారమైన ఆనందాన్ని ఇచ్చాయి. ఈ సందర్భంగా వానపల్లి కిషోర్ మాట్లాడుతూ, “చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకుంటూ ఇలా నవ్వుతూ హాయిగా బతకడం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇటువంటి సమావేశాలు మన జీవితానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి” అని అన్నారు. స్నేహం, అనుబంధం, జ్ఞాపకాల విలువను మరోసారి గుర్తు చేసిన ఈ సమ్మేళనం హాజరైన ప్రతి ఒక్కరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

E-పేపర్

ఘనంగా ప్రారంభమైన బ్రదర్ జోసెఫ్ తంబి నవదిన ప్రార్థనలు:

పున్నమి ప్రతినిధి సురేష్ ‘దైవసేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి’ జండా ఆవిష్కరణ గన్నవరం నియోజవర్గం జనసముద్రం ప్రతినిధి సురేష్ 2026 జనవరి 13 నుండి 15 వరకు జరుగు బ్రదర్ జోసెఫ్ తంబి 81 వ వర్ధంతి తిరునాళ్ళు సందర్భముగా జనవరి 4 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు తంబి సమాధి వద్ద ఫాదర్లు, కన్యాస్త్రీలు, బ్రదర్లు, గుడి పెద్దలు, సంఘస్తులందరి సమక్షంలో రెవ.ఫాదర్.బి.సురేష్ బాబు ఎంఎస్‌ఎఫ్‌ఎస్, ప్రొవిన్సియల్ (విశాఖపట్నం) పతాకావిష్కరణ చేసి నవదిన ప్రార్థనలు ప్రారంభించారు. నవదిన ప్రార్ధనలలో మొదటిరోజు ఫాదర్.బి. సురేష్ బాబు ప్రసంగిస్తూ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతూ దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడని, మానవులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారని, మనమందరం దేవుని ప్రేమ కలిగి వుండాలని, తంబి కూడా దేవుని ప్రేమకలిగి జీవించాడని, మనలని ప్రేమించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ఆయన మధ్యస్థ ప్రార్ధనల ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని, దైవ ప్రేమ కలిగిన తంబి లాంటి వ్యక్తి మన మద్యలో వుండటం మన అదృష్టమన్నారు. ప్రాన్సిస్కన్ కపూచిన్ సభకు చెందిన శ్రీ ప్రవీణ్ కుమార్ గోపు, ఓఎఫ్ఎం టోపీ. బ్రదర్ జోసెఫ్ తంబి జీవితం ఆధారంగా రచించిన “దైవసేవకులు బ్రదర్ జోసెఫ్ తంబి ” అనే పుస్తకాన్ని మేరీమాత కపూచిన్ ప్రావిన్స్ ప్రొవిన్సియల్ ఫాదర్ మరియదాసు ప్రత్తిపాటి ఆవిష్కరించారు. మొదటి రోజు ప్రార్ధనలను లూర్ధునగర్ వాసులు కొనియాడారు. నవదిన ప్రార్ధనలో పుణ్యక్షేత్ర రెక్టర్ జోసెఫ్ పాలడుగు, విచారణ గురువులు అభిలాష్ గోపు, సహాయక గురువులు, ఇతర గురువులు, మఠవాసులు, కన్యా స్త్రీలు, సంఘస్తులు, భక్తులు పాల్గొని తంబి తిరునాళ్ళు ఘనంగా జరగాలని ప్రార్ధనలు చేశారు.ప్రార్థనల అనంతరం పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జోసఫ్ పాలడుగు మాట్లాడుతూ దివ్య బలిపూజ సమర్పించిన ఫాదర్ సురేష్ బాబు కి దన్యవాదాలు తేలిపారు. నూతనంగా ఆవిష్కరించిన దైవ సేవకులుబ్రదర్ జోసెఫ్ తంబి పుస్తకం ప్రతి ఒక్కరు చదివి తంబి జీవితాన్ని ఆదర్శం గా తీసుకోని ఆయన అడుగు జాడల్లో నడవాలని, ఆయన సుగుణాలను మన జీవితాలలో కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. తిరునాళ్లకు కావలసిన అన్ని పర్మిషన్స్ తీసుకున్నామని, . తంబి పండగ అందరి పండుగ అని ప్రతి ఒక్కరు సహృదయం తో సహకరించాలని కోరారు. తదనంతరం దివ్య బలి పూజ సమర్పించిన ఫాదర్ బి సురేష్ బాబు ని సన్మానించారు.

విశాఖలో కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు – 10 మంది అరెస్ట్

విశాఖ, జనవరి – (పున్నమి ప్రతినిధి) విశాఖ నగరంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఒక వైపు షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపులు జనంతో కిటకిటలాడుతుండగా, మరో వైపు గుట్టుగా జూదం, కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. నగర పరిధిలోని కంచెరపాలెం డీఎల్బీ గ్రౌండ్స్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 మంది జూదరాయుళ్లను అరెస్టు చేసి, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. పండుగలను అడ్డుగా పెట్టుకుని అక్రమ జూదాలు, కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి కార్యకలాపాలను సహించేది లేదని స్పష్టం చేశారు.

అన్నమయ్య

చిట్వేల్‌లో అనుమానాస్పద వ్యక్తి సంచారం: అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తుల విజ్ఞప్తి

– మహిళలు, గృహిణులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక – అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి చిట్వేలు, జనవరి 05: పున్నమి ప్రతినిధి చిట్వేలు మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. తన పేరు వహీద్ ఖాన్ అని, పుల్లంపేట సమీపంలోని అప్పారాజుపేట తన స్వగ్రామమని చెప్పుకుంటున్న సదరు వ్యక్తి ప్రవర్తనపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -అనుమానాస్పద ప్రవర్తన ముఖ్యంగా ఉదయం వేళల్లో ఈ వ్యక్తి వీధుల్లో తిరుగుతూ, ఇళ్ల గేట్లు తెరిచి ఉంటే లోపలికి తొంగి చూడటం, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం వంటి పనులు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. సోమవారం ఉదయం కొత్త బస్టాండ్ ప్రాంతంలో సంచరిస్తుండగా, గమనించిన కొందరు యువకులు అతడిని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి పంపించివేశారు. -గృహిణులకు ప్రత్యేక సూచన తెల్లవారుజామున ఇళ్ల ముందు ముగ్గులు వేసే సమయంలో మరియు శుభ్రం చేసుకునే సమయంలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని గ్రామ పెద్దలు సూచించారు. గేట్లకు తాళాలు వేసుకోవాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు పదేపదే కనిపిస్తే అప్రమత్తం కావాలని కోరారు. -పోలీసులకు సమాచారం ఇవ్వండి గ్రామ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ నిఘా ఉంచాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా గ్రామ పెద్దలకు సమాచారం అందించాలని చిట్వేల్ గ్రామస్తులు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి: అక్కంపేటలో ఉత్సవ వాతావరణం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి ) నెల్లూరు జిల్లాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం స్వగ్రామం అక్కంపేటకు తొలిసారి రావడంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అభిమానులు, కార్యకర్తలు పూలవర్షం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామదేవత ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు. బీజేపీ విధానాలను విమర్శిస్తూ, రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల

ఆలయ అభివృద్ధికీ కలిసి పని చేస్తాం

ముస్తాబాద్ మండలంలోని పులి చేరుకుంటా గుడి కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణ లొ నిర్వహించారు ఎన్నికైన నూతన గుడి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి పూజ నిర్వహణ కు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని తెలిపారు గుడి కమిటీ అధ్యక్షులుగా తాళ్ల మల్లారెడ్డి వైస్ చైర్మన్ గా శీలా మల్లేశం రైటర్ గా బద్దిపడగ నందు క్యాషియర్ గా వేముల ఆంజనేయులు కార్యవర్గ సభ్యులుగా శ్రీల ప్రశాంత్ మల్లారపు ప్రశాంత్ గార్లను ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.