Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సర్దార్ గౌతు లచ్చన్న స్పూర్తితో పని చేస్తా:రాధ కృష్ణ గౌడ్

నెల్లూరు,డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) నెల్లూరు నగరంలోని విజయ మహాల్ గేట్ సెంటర్ శ్రీనివాస అగ్రహారంలో గల జిల్లా గౌడ్ యువజన సంఘ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రాధాకృష్ణ గౌడ్ గారు సర్దార్ గౌతు లచ్చన్న స్పూర్తితో గౌడ్ కులస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వెంపులూరు భాస్కర్ గౌడ్, అన్నం దయాకర్ గౌడ్, దాసరి ప్రసాద్ గౌడ్, తిరకాల శివ గౌడ్, దద్దోలు పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

గ్రామాలే అభివృద్ధికి పునాది – స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభలో అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ, కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

అన్నమయ్య

సంక్రాంతి లోపు లైట్ సమస్యల పరిష్కారం: ముక్కా సాయి వికాస్ రెడ్డి

రైల్వే కోడూరు నియోజకవర్గంలో గ్రామాభివృద్ధిపై యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, సంక్రాంతి లోపు అన్ని గ్రామాల్లో వీధిలైట్ల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి వసతి, విద్యుత్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. వికసిత్ భారత్ జీఎంసీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమలో ONGC గ్యాస్ లీకేజీ: ఇరుసుమండలో భీకర మంటలు, అప్రమత్తమైన యంత్రాంగం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డ్రిల్లింగ్ ప్రాంతం నుంచి గ్యాస్ పైకి చిమ్ముతూ మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిమాపక దళాలు, ONGC సాంకేతిక నిపుణులు సహాయక చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. Uploaded Video:

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ONGC గ్యాస్ లీకేజీ: ఇరుసుమండలో ఎగసిపడిన మంటలు, ప్రజల తరలింపు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ONGC డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్ కావడంతో భారీగా మంటలు చెలరేగాయి. డ్రిల్లింగ్ ప్రాంతం నుంచి గ్యాస్ పైకి చిమ్ముతూ అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాలు భయాందోళనకు గురయ్యాయి. మంటల తీవ్రత కారణంగా చుట్టుపక్కల ఉన్న సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 5 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక దళాలు, ONGC సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని నియంత్రణ చర్యలు చేపట్టారు. గ్యాస్ లీకేజీని ఆపేందుకు ప్రత్యేక పరికరాలతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వైద్య సాయం, తాత్కాలిక ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పూర్తిగా అదుపులోకి తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కామారెడ్డి

*శ్రీ సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డిలో ఘనంగా పూర్వ విద్యార్థుల – ఆచార్యుల మహా సమ్మేళనం*

పున్నమి ప్రతినిధి కామారెడ్డి -05-01-2026 *శ్రీ సరస్వతీ శిశుమందిర్ కామారెడ్డిలో ఘనంగా పూర్వ విద్యార్థుల – ఆచార్యుల మహా సమ్మేళనం* కామారెడ్డి జిల్లాలో స్థానిక శ్రీ సరస్వతీ శిశుమందిర్ హైస్కూలు ప్రాంగణంలో ఆదివారం నాడు కాకతీయ నగర్ శిశుమందిర్ హైస్కూలు మరియ భగత్ సింగ్ నగర్ పాఠశాలల్లో చదివిన 600 మంది పూర్వ విద్యార్థులతో, బోధించిన 200 మంది ఆచార్యులతో, పాఠశాల వివిధ కమిటీల 80సభ్యులతో శిశుమందిర్ అధ్యక్షులు డా,, శ్యామ్ సుందర్ అధ్యక్షతన, కమిటి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల – ఆచార్యుల మహా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా పీఠం ఇందూర్ జిల్లా విభాగ్ కార్యదర్శి, పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హరిస్మరణ్ రెడ్డి గారు మాట్లాడుతూ సనాతన హైంధవ ధర్మం గురించి, ఋషుల విద్యావిధానం గురించి, గురు శిష్యుల సత్సంబంధాల గురించి, వేదాల వైభవాన్ని, ఇలాంటి చదువు కేవలం శ్రీ సరస్వతీ శిశుమందిర్ లలోనే దొరుకుతుందని, ఇక్కడ చదివిన మీరంతా అదృష్టవంతులని, శిశుమందిరాలు ఇంకా ఉన్నాయి కాబట్టే ధర్మం, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయని సభనుద్దేశించి చెప్పారు. శిశుమందిర్ హైస్కూలు అధ్యక్షులు డా,, శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతూ కార్పోరేట్ కు దీటుగా పాఠశాలను నడుపుతూ, మన సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను నేర్పుతూ, అందిస్తూ పాఠశాలలో నేడు దాదాపు 1500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, సంఖ్య పెరిగిన దృష్టా ఈ సంవత్సరం 260 అడ్మిషన్లు వాపసు పంపడం జరిగిందని తెలిపారు. ఈ బడిలో విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నాతమైన స్థాయిలో అన్ని రంగాలలో ఉన్నారని తెలుపుతూ ఈ విద్యామందిర్ ఉన్నతికి కారకులైన వారందరికీ ఈ సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పతకమూరి శ్రీనివాస్ తెలంగాణ సంఘటనా మంత్రి గారు మాట్లాడుతూ నేటి సమాజంలో దిగజారిపోతున్న కుటుంబ విలువలను, పద్ధతులను, నేటి యువత ఆచరించాల్సిన విధివిధానాలైన పంచ పరివర్తన గురించి తెలియజేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ తెలుగు విభాగాదిపతి ముఖ్యాతిథి ఆచార్య కసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ తేనె ఎంత మధురంగా ఉంటుందో అలాంటి మధురమైన విద్యను, శ్రీ సరస్వతీ శిశుమందిర్లు అందిస్తున్నాయని విద్య యొక్క గొప్పదనంను, సమాజంలో ఏ దానం చేసినా అది శాశ్వతం కాదని, విద్యాదానమే మహోన్నతమైన గొప్పదని, క్రమశిక్షణకు మారు పేరు శిశుమందిరాలని తెలియజేశారు. భగత్ సింగ్ నగర్ పాఠశాల అధ్యక్షులు శ్రీ ముప్పారపు ఆనంద్ గారు ప్రాథమిక పాఠశాల డెవలప్ మెంట్ గురించి మూతబడిపోతున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచిన విధానం గురించి సహకరించన పెద్దల గురించి కొనియాడారు. ఆసాంతం సాంస్కృతిక కార్యక్రమాలతో, సన్మానాలతో పూర్వ విద్యార్థుల-ఆచార్యుల మహా సమ్మేళనం విశేషవైభవంతో అత్యంత ఘనంగా జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్ గారు, గీరెడ్డి రాజారెడ్డి గారు, ప్రబంధ కారిని సభ్యులు, సంచలన సమితి సభ్యులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీ రణజిత్ మోహన్ గారు, మాజీ కౌన్సిలర్ ఆకుల భరత్ గారు, ప్రధానాచార్యులు నాగ భూషణం, నగేష్ గార్లు, విద్వత్ సమితి సభ్యులు రాజేంద్ర, మాతాజీలు, పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థుల సమ్మేళనం కమిటి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

E-పేపర్ జాతీయ అంతర్జాతీయ తెలంగాణ పిల్లలకు పెద్దపల్లి వరంగల్ విద్య విజ్ఞానం

జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల ప్రతిభ

9 బంగారు, 21 వెండి పతకాలు సాధించిన షిటోరియు సికో కాయి కరాటే విద్యార్థులు మంథని, జనవరి 05:హనుమకొండ జిల్లా పరకాలలోని మయూరి గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో జపాన్ షిటోరియు సికో కాయి కరాటే ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన మంథని విద్యార్థులు అలాగే దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు సబ్ జూనియర్స్, క్యాడేట్స్ కతా, కుమితే విభాగాల్లో 9 బంగారు, 21 వెండి పతకాలు సాధించారు. వీరిలో జోగుల అభిరామ్, మాచర్ల శివ, వాసంశెట్టి ఉదయ్ కుమార్, ఎలివేణి నిషిత్, జడగాల మనస్వి, శాన్వి, అరణ్య, సహస్ర, అక్షిత బంగారు పతకాలను, అదే విధంగా కేసరి సహస్ర, అంజలి, వైష్ణవి, బి. సహస్ర వెండి పతకాలు సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థులను షిటోరియు షికో కాయి కరాటే, కియో ఇండియా అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ ప్రతినిధి పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వాహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజర్ మాడ సంపత్, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున గౌడ్, దర్యాప్తూర్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కేసరి సంతోష్, శిక్షకులు, ఇన్‌స్ట్రక్టర్లు అభినందించారు.

జనగాం

నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లను సన్మానించిన ఇప్పగూడ ZPSS పాఠశాల యాజమాన్యం

ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పగూడెం లో నూతనంగా ఎన్నికయినా గౌరవ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులచే పాఠశాల కు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేయనైనది. సర్పంచ్ మందపురం రాణి అనిల్ గారు మరియు ఉపసర్పంచ్ లింగనబోయిన రాజుగారు మరియు వార్డుమెంబెర్స్ తమ సందేశాలలో గ్రామ ప్రజలు మా పై ఉంచిన అపారమైన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధి కోసం. గ్రామ భవిష్యత్తుకు పాటుపడుతాం ప్రతి సమస్యకు పరిష్కారంగా నిలిచి, ప్రతి వర్గానికి న్యాయం చేసి,ప్రతి ఒక్కరికి భరోసాగా నిలుస్తాం మా గ్రామ చరిత్రలో మార్పు తీసుకొచ్చిగతానికి భిన్నంగా నిలుస్తాం. పాఠశాలను ఆదర్శ వంత మైన పాఠశాలగ తీర్చిదిద్దు తాము అని అన్నారు… ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మీ సేవ గ్రామానికి వెలుగై మీ పాలన అభివృద్ధి కి దారి చూపాలని. పాఠశాల అభివృద్ధి దొహద పడాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ/శ్రీమతి మందపురం రాణి అనిల్ సర్పంచ్ లింగనబోయిన రాజు ఉపపర్పంచ్ వార్డు మెంబెర్స్ 1) మంద లావణ్య 2) పిట్టల లావణ్య 3) లింగనబోయిన హరిష్మ 4) అన్నెపు కల్పన 5) పోలాస పద్మాకర్ 7) నాగబండి సంతోష్ 8) కత్తుల రాజయ్య 09) జీడీ సంజీవ 10) సింగపురం యాకలక్ష్మి 11) మంద మహేందర్ 12) కత్తుల యాదమ్మ తదితరులు పాల్గొన్నారు

కామారెడ్డి

అన్నారం గ్రామంలో మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీ

కామారెడ్డి,05 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి తనిఖీ! కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల మధ్యాహ్న భోజనం నాణ్యతకు గ్రామ పాలకులు ఎలాంటి కాంప్రమైజ్ చేయరని నిరూపించేలా సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్ లత శ్రీనివాస్ , ఉపసర్పంచ్ మద్దికుంట దయానంద్, గ్రామ పెద్దలు గంగా రెడ్డి, కుమ్మరి మురళీలు కలిసి సీధిపోశకాలకు మొత్తం గ్రామం సమక్షంలో హెచ్చరిక ఇచ్చారు.మధ్యాహ్నం బడి ప్రాంగణంలోకి రహస్యంగా ప్రవేశించిన సర్పంచ్ లత శ్రీనివాస్ పిల్లలు తిన్న మధ్యాహ్న భోజన ప్లేట్లను, వంటగది, గోదామును పూర్తిగా తనిఖీ చేశారు. భోజనంలో వాడిన కూరగాయలు, అన్నం, పప్పు నాణ్యత, పరిశుభ్రతలు అందరి కళ్ల ముందే పరీక్షించారు. ఈ ఆకస్మిక చెక్‌కి సీధిపోశకులు ఆశ్చ ర్యంతో ఉత్తేజం చెందారు.పిల్లల ఆరోగ్యం మా మొదటి బాధ్యత, ప్రతి రోజూ ఇలాంటి తనిఖీలు చేస్తూ నాణ్యతను కాపాడతాం అని సర్పంచ్ లత శ్రీనివాస్ లు స్పష్టం చేశారు.ఉపసర్పంచ్ మద్దికుం ట దయానంద్ మాట్లాడుతూ, గ్రామ పిల్లల భవి ష్యత్తు మా చేతుల్లో ఎలాంటి లోపాలు ఉంటే అక్కడే సర్దుతాం” అన్నారు. గ్రామ పెద్దలు గంగా రెడ్డి, కుమ్మరి మురళీలు పిల్లలతో మాట్లాడి, భోజ నం ఎలా ఉందో తెలుసుకున్నారు. పిల్లలు సంతో షంగా “భోజనం చాలా బాగుందని సర్పంచ్ తెలి పారు.ఈ తనిఖీ గ్రామంలో మంచి చర్చనీయాంశ మైంది. ప్రజలు సర్పంచ్ లత శ్రీనివాస్ ల నాయక త్వాన్ని, గ్రామ పెద్దల సహకారాన్ని ప్రశంసిస్తు న్నారు. మధ్యాహ్న భోజన పథకం సడన్ చెక్‌లతో మరింత బలపడి, పిల్లల భవిష్యత్తును మెరుగు పరుస్తుందని అంచనా వేస్తున్నారు గ్రామస్తులు.

తిరుపతి

చిట్వేలిలో సేవ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తిరుపతి జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో అగ్నికుల క్షత్రియ, వన్నీ కుల క్షత్రియ, పల్లి రెడ్డి, పల్లి కాపు సేవ సంఘాల ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి తహసీల్దార్ స్పందన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె సామాజిక సేవలో కుల సంఘాలు ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.