శుభోదయం 🌅
పనులు బాగా జరిగితే అందుకు సంబంధించిన క్రెడిట్‌ను ఇతరులతో పంచుకునే వారు, పనులు సరిగా జరగకపోతే బాధ్యతను తమపై తీసుకునే వారే మంచి నాయకులు. — సైమన్ సినెక్ పున్నమి తెలుగు డైలీ
పనులు బాగా జరిగితే అందుకు సంబంధించిన క్రెడిట్‌ను ఇతరులతో పంచుకునే వారు, పనులు సరిగా జరగకపోతే బాధ్యతను తమపై తీసుకునే వారే మంచి నాయకులు. — సైమన్ సినెక్ పున్నమి తెలుగు డైలీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలో ఈరోజు కరంటోళ్ల జన బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ అనిల్ కుమార్, జేఈఈ రాంబాబు ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్మెన్ రమేష్, కిషోర్, జేఎల్ఎంలు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. గ్రామంలోని 11 కెవి, ఎల్‌టీ లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేసి, లోపాల నివారణతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడేలా చర్యలు చేపట్టామని తెలిపారు.
– పరీక్షల్లో అత్యధిక మార్కులే లక్ష్యంగా ఎస్టీయూ రూపకల్పన – రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో ఉచిత పంపిణీ చిట్వేలు, జనవరి 05: పున్నమి ప్రతినిధి రాబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా చిట్వేలు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. **రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన ఈ మెటీరియల్‌ను రాజుగుంట సర్పంచ్ గుత్తి నరసింహ ఆర్థిక సహకారంతో సోమవారం విద్యార్థులకు అందజేశారు. -నిష్ణాతులైన ఉపాధ్యాయులతో రూపకల్పన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందంచే తయారు చేయబడిన ఈ మెటీరియల్, పబ్లిక్ పరీక్షల్లో కీలకమైన ప్రశ్నలు మరియు సులభంగా అర్థం చేసుకునే పద్ధతులతో రూపొందించబడింది. మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులకు కూడా వీటిని అందజేశారు. -చదువే భవిష్యత్తుకు పునాది: దాత గుత్తి నరసింహ ఈ సందర్భంగా పుస్తక దాత, సర్పంచ్ గుత్తి నరసింహ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని సమాజంలో రాణించాలని ఆకాంక్షించారు. పదవ తరగతి ఫలితాల్లో చిట్వేలు మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి కందల హరినాథ్ మాట్లాడుతూ.. ఈ మెటీరియల్ చదవడం ద్వారా విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అధిక మార్కులు సాధించవచ్చని తెలిపారు. -ఉపయోగించుకోవాలని ఉపాధ్యాయుల పిలుపు చిట్వేలు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో పదవ తరగతి ఒక మలుపు వంటిదని, దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని అగ్రస్థానంలో నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు కామాటం వెంకటేశ్వర్లు, అమర్నాథ్ (పోల్లోపల్లి హెచ్ఎం), సూర్యనారాయణ, కేజీబీవీ ఎస్ఓ తులసి, భాస్కర్ రెడ్డి, శివ నారాయణ గౌడ్ మరియు ఇతర ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
– మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు దిశానిర్దేశం – మంగళగిరిలో ఘనంగా 07వ బ్యాచ్ శిక్షణా తరగతులు చిట్వేలు, జనవరి 5 పున్నమి ప్రతినిధి పార్టీకి వెన్నెముకగా నిలిచే మండల స్థాయి నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. సోమవారం జరిగిన 07వ బ్యాచ్ నూతన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణ పరిశ్రమల (ఖాదీ బోర్డు) చైర్మన్ కే.కే. చౌదరి ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. -అధ్యక్షుల విధులు – విధానాలపై అవగాహన “మండల పార్టీ అధ్యక్షుల విధులు – విధానాలు” అనే అంశంపై కే.కే. చౌదరి నాయకులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. మండల స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, కార్యకర్తలను ఎలా సమన్వయం చేసుకోవాలి అనే విషయాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. -ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా కే.కే. చౌదరి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో మండల స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను గ్రామస్థాయిలో చర్చకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -నాయకుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం ఈ శిక్షణా తరగతులు తమలో కొత్త ఉత్సాహాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని నింపాయని శిక్షణ పొందిన నాయకులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు కార్యాచరణకు ఈ తరగతులు ఒక దిశానిర్దేశంలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
తప్పుడు ఆన్‌లైన్ రికార్డులు, రెవెన్యూ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి అక్రమదారులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేయవద్దని మాజీ రాష్ట్ర టీడీపీ పార్టీ పరిశీలకుడు ఆరుముగం విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి సవితను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలోని ముఖ్యాంశాలు: సమగ్ర విచారణ: తప్పుడు ఆన్‌లైన్ ఎంట్రీలు ఉన్న భూములపై రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాతే పాస్ పుస్తకాలు ఇవ్వాలి. తహసీల్దార్లకు ఆదేశాలు: వివాదాల్లో ఉన్న భూములకు, రెవెన్యూ కోర్టు పరిధిలో ఉన్న భూములకు పాస్ పుస్తకాలు మంజూరు చేయవద్దని మండల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కబ్జాదారులకు అడ్డుకట్ట: భూకబ్జాదారులు తప్పుడు పత్రాలతో పాస్ పుస్తకాలు పొందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన హక్కుదారులకు రక్షణ: తరతరాలుగా సాగు చేసుకుంటున్న నిజమైన హక్కుదారులకు మాత్రమే పాస్ పుస్తకాలు అందేలా చూడాలని కోరారు. భూ రికార్డుల విషయంలో జరుగుతున్న అక్రమాల వల్ల అసలైన రైతులు నష్టపోతున్నారని, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆరుముగం విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించిన మంత్రి సవిత, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.
వరంగల్ పరిధి లోని మండి బజారులో రాత్రి గౌసియా బేగం అనే మహిళ తన మూడేళ్ల కూతురితో కలిసి వెళుతుండగా ఒకసారిగా బీపీ తగ్గి స్పృహ తప్పి పడిపోవడంతో అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఇంతే జార్ గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు గమనించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముద్దంపురు గ్రామంలో ఉదయం 3 గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా కోసం టోకెన్లు ఇస్తామని అధికారులు తెలపడంతో తెల్లవారుజామునే ఎముకలు కొరికే చలిలో క్యూ లైన్ లో వేచి చూస్తున్న రైతులు
నందిగామ పట్టణంలో గత 125 సంవత్సరాలుగా అనాదిగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఈ ఏడాది మరింత వైభవంగా సాగాయి. నందిగామ ముక్కోటి మహా మండపంలో నిర్వహించిన 126వ వైకుంఠ ఏకాదశి మహోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ చైర్‌పర్సన్ మండల కృష్ణకుమారి, వార్డు కౌన్సిలర్లు, కూటమి నేతలతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శతాబ్ద కాలంగా దివి రత్నమాచార్యుల వారి కుటుంబం ఈ పవిత్ర మహోత్సవాలను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ రావడం విశేషం. ఈ ఉత్సవాలు లింక్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించు కోవడం నందిగామ పట్టణానికి, అలాగే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న కుటుంబానికి గర్వకారణంగా నిలిచింది. కళలు, సంస్కృతి, ఆచారాలు, వైభవాలకు నిలయమైన ముక్కోటి మహా మండపంలో భక్తి సంగీతం, వేదపఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. పలువురు మహానుభావులు తమ కళా ప్రదర్శనలతో వేదికను ఆధ్యాత్మిక శోభతో నింపారు. నందిగామకు క్షేత్ర బిందువుగా నిలుస్తున్న ముక్కోటి మహా మండపం, ఈ మహోత్సవాల ద్వారా పట్టణానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న 63 పుణ్యక్షేత్రాల విశేషాలను వివరిస్తూ కెవిఆర్ కళాశాల తెలుగు విశ్రాంత ఉపాధ్యాయులు రవి ప్రసాద్ రచించిన ‘దివ్య క్షేత్రాలు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, కూటమి నేతలు, కళాకారులు, భక్తులు, ప్రజలందరికీ ఆమె పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నందిగామలో కొనసాగుతున్న ఈ శతాబ్దాల సంప్రదాయం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆమె ఆకాంక్షించారు.
కుమ్మర సంఘం రంగారెడ్డి జిల్లా యూత్ తరఫున క్యామ మల్లేష్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆడాల గణేష్ పున్నమి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు గౌరవ శ్రీ రామ మల్లేష్ అన్న కి జన్మదిన శుభాకాంక్షలు నా ప్రియమైన లీడర్ క్యామ మల్లేష్ అన్న కి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు మీ ఆడాల గణేష్ కుమ్మర సంఘం రంగారెడ్డి జిల్లా యూత్ తరఫున శుభాకాంక్షలు
వీరులపాడు మండలంపల్లంపల్లి గ్రామంలో సోమవారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లంపల్లి రెవిన్యూ పరిధిలోని 45 మంది రైతులకు ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, భూమిపై రైతులకు సంపూర్ణ హక్కులుకల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, రైతులు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ రాజ్యముద్రతో జారీ చేసిన పాసు పుస్తకాల ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అధికారులు, స్థానిక కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు కృతజ్ఞతలు తెలిపారు.