Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యూని ఫైడ్ ఫ్యామిలీ సర్వే

ఉదయగిరి మండలంలో జరుగుతున్న యూని ఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రోగ్రస్ కార్యక్రమాన్ని GSWS ఎంపిడిఓ కరిముల్లా పరిశీలించారు పరిశీలించారు మండలంలో ని నేలటూరు , శకునాలపల్లి , కృష్ణంపల్లి , ఉదయగిరి బిట్ -1 సచివాలయాలు సందర్శించి సిబ్బంది హాజరు ఈ కె వై సి వాట్స్ అప్ గ్రవరెన్స్ కార్యక్రమాలను పరిశీలించారు జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను ప్రగతి రథంలో తీసుకురావాలని సూచించారు

మహబూబ్ నగర్

దేవరకద్ర నియోజకవర్గ బేడ బుడగ జంగాల నూతన కమిటీ ఎన్నిక దేవరకద్ర నియోజకవర్గ అధ్యక్షులుగా సిరివాటి జంగం రవి నియామకం

పున్నమి: జనవరి 5 మహబూబ్ నగర్ జిల్లా: దేవరకద్ర నియోజకవర్గం బేడ బుడగ జంగాల అధ్యక్షుల నూతన కమిటీని ఏకగ్రీవంగా శనివారం రోజు ఎన్నుకోవడం జరిగింది.దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షుడు సిరివాటి జంగంరవి,దేవరకద్ర మండలం అధ్యక్షుడు పోన్నకంటి శ్రీనివాస్,చిన్నచింతకుంట మండలం అధ్యక్షుడు గగనం శంకర్,కౌకుంట్ల మండల మండలం అధ్యక్షుడు ‌సిరివాటి తిరుపతయ్య.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజే హెచ్ పి ఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు,జిల్లా అధ్యక్షులు పోన్నకంటి రాంబాబు,మహిళా అధ్యక్షురాలు సిరిగిరి పారిజాతమ్మ,మాజీ జిల్లా అధ్యక్షులు రాచూరి శ్రీనివాసులు, గగనం మన్యం,మాజీ దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షులు సిరిగిరి శీను,సిరివాటి కర్ణాఖర్ మరియు వివిధ మండల నాయకులు సిరిగిరి పరుశురాం,సిరిగిరి వెంకటేష్,సిరిగిరి మహేందర్,వెంకటగిరి సర్పంచ్ పొన్నగంటి లక్ష్మయ్య,సిరిగిరి కురుమన్న,మరియు కుల సంఘాలు పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పల్లెల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయం

గూడూరు మండలం, లేళ్ళగరువు గ్రామంలోపల్లెపండుగ 2.0 లో భాగంగా 75లక్షల రూపాయల MGNREGS నిధులతో లేళ్ళగరువు గ్రామం నుండి షాబ్ధుల్లపాలెం రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణము మరియు ఆకులమన్నాడు గ్రామంలో 15th ఫైనాన్స్ కమిషన్ 36 లక్షల రూపాయల నిధులతో విలేజ్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, పారిశుధ్య అభివృద్ధి సాధ్యమవుతుందని,పల్లెల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

పల్నాడు

సంక్రాంతి వేడుకలు

ఈనెల 12న మాచర్లలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు మాచర్లః పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం 6 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో 23వ తెలుగు రాష్ట్రాల స్థాయి సినిమా పాటల పోటీలు “మనమూ పాడుదాం” అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ అధ్యక్షులు డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.8000 వేలు,రెండవ బహుమతి రూ. 5000 వేలు,మూడవ బహుమతి రూ. 3000 వేలు ఇవికాక మరో పదిమందికి రూ. 500 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ పోటీలలో పాల్గొనదలచిన గాయనీ గాయకులు 12వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు జరిగే పరిశీలనలో ఎంపిక అయిన వారు మాత్రమే అదే రోజు సాయంత్రం జరిగే పోటీలకు అర్హులన్నారు.ఈ కార్యక్రమం లయన్స్ జిల్లా సాంస్కృతిక శాఖాధ్యక్షులు డాక్టర్ ముటుకుల కమలాసన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గాయనీ గాయకులకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, వయోభేదం లేదని,ప్రతి పాటకు సంగీత సహకారం ఉంటుందని, ఉచిత భోజన సదుపాయం కలదని అన్నారు. పూర్తి వివరాలకు డాక్టర్ ముటుకుల కమలాసన్ రావు సెల్ నెంబర్ 9441065681ను సంప్రదించవచ్చన్నారు.

తిరుపతి

తిరుపతి జిల్లాలో విలీనం.. మా మారుమూల మండలాల దశ మారేనా

– ప్రజాప్రతినిధులు చొరవ చూపకుంటే వెనుకబాటు తప్పదు – ‘కోడూరు’ను రెవెన్యూ డివిజన్ చేయకుంటే ఉద్యమం పునరావృతం – ‘చిట్వేలి జేఏసీ’ నేత ఇంతియాజ్ అహ్మద్ విశ్లేషణాత్మక హెచ్చరిక చిట్వేలు, జనవరి 06: పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లాలో విలీనమైన చిట్వేలి, పెనగలూరు వంటి మారుమూల మండలాలు ఇకనైనా అభివృద్ధి పథంలో పయనిస్తాయా? లేక ఆధ్యాత్మిక రాజధాని అనే మహాసముద్రంలో మా ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందా? అని చిట్వేలి మండల జేఏసీ సభ్యులు, సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గ భౌగోళిక మార్పులు, అభివృద్ధి అవకాశాలు మరియు ప్రజాప్రతినిధుల బాధ్యతపై ఆయన విశ్లేషణాత్మక ప్రకటన విడుదల చేశారు. చరిత్రలో పౌరుషం.. అభివృద్ధిలో శూన్యం! చరిత్ర పుట్టినప్పటి నుండి కడప జిల్లాలో భాగమైన మా ప్రాంతం, పేరుకు పౌరుషాల గడ్డ అనిపించుకున్నా అభివృద్ధిలో మాత్రం ఎప్పుడూ వెనుకబడే ఉందని ఇంతియాజ్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి రాజకీయ స్వలాభాల కోసం రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చడంపై ఆయన మండిపడ్డారు. “అన్ని విధాల అర్హతలు ఉండి, ప్రభుత్వ భూములు మెండుగా ఉన్న మదనపల్లి లేదా రాజంపేటను జిల్లా కేంద్రాలుగా చేసి ఉంటే బాగుండేది. కానీ రాజు చేతిలో కలం ఉన్నప్పుడు నిమిత్తమాత్రులమైన ప్రజలు చేసేదేమీ లేకపోయింది” అని వ్యాఖ్యానించారు. తిరుపతి జిల్లాలో చేరడంపై మిశ్రమ స్పందన రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎంతో ఆశగా పోరాటాలు చేశామని, తీరా ఇప్పుడు తిరుపతి జిల్లాలో విలీనం కావడం ఒక విచిత్రమైన పరిస్థితి అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి జిల్లాలో చేరడం వల్ల, అక్కడ ఉన్న టీటీడీ నిధులు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, కర్మాగారాలు మరియు అత్యాధునిక ప్రభుత్వ ఆసుపత్రులలో మా ప్రాంత యువతకు స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయని ఆశలు చిగురించాయని తెలిపారు. అయితే, ఇప్పటికే అభివృద్ధి చెందిన తిరుపతి నగరం ముందు, మా చిట్వేలి, పెనగలూరు మండలాలకు తగిన న్యాయం జరుగుతుందా? లేదా అనేది అనుమానంగా ఉందని పేర్కొన్నారు. వనరులు మెండు.. ఉపాధి ఎక్కడ? రైల్వే కోడూరు నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన సంపద అపారమని ఇంతియాజ్ గుర్తు చేశారు. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా వ్యాపారం సాగే పండ్ల తోటలు, మార్కెట్ యార్డులు మన దగ్గర ఉన్నాయి.మంగంపేట బైరటీస్ నిక్షేపాలు మరియు ఎర్రచందనం వంటి సహజ వనరులు మన సొంతం. “ప్రజాప్రతినిధులు చొరవ చూపి, పండ్ల ద్వారా తయారయ్యే జ్యూస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అప్పుడే జీవనోపాధి కోసం ఎడారి దేశాలకు (గల్ఫ్) వలస వెళ్తున్న నిరుపేదలకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది” అని ఆయన సూచించారు. అంతిమ డిమాండ్: రెవెన్యూ డివిజన్ రైల్వే కోడూరును తక్షణమే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఐదు మండలాలకు కలిపి డివిజన్ కేంద్రం లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. నూతన జిల్లాల ఏర్పాటులో నాలుగు మండలాలు ఉన్న నియోజకవర్గాలను కూడా డివిజన్లుగా మార్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. “ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలను గుర్తించి, వారి పక్షాన నిలబడాలి. అప్పుడే వారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. లేనిపక్షంలో ఉద్యమాలు పునరావృతం కాక తప్పదు” అని ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు.

వనపర్తి

మదనాపూర్ హైస్కూల్ తరగతి గదిలో హిందీ అభ్యసన సామర్ధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్

*జిల్లాస్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం మదనాపూర్ హై స్కూల్ ని సందర్శించి తరగతి గది అభ్యసన ప్రక్రియను పరిశీలిస్తున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా 06/01/2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధునాపూర్ జిల్లా స్థాయి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు హిందీ ఎంఎన్ విజయ కుమార్ సందర్శించి ఏడవ తరగతి ఇంగ్లీష్ తెలుగు మీడియం తరగతి గది పరిశీలన అభ్యసన ప్రక్రియ విద్యార్థుల నోటు పుస్తకాలు, వార్షిక ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక తరగతి ప్రణాళిక టీ ఎల్ఎం తదితర అంశాలను పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్న టీం సభ్యులు, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెబుతున్న హిందీ పాఠ్యాంశాలని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు పొందాలని టీం సభ్యులు విద్యార్థులను ద్వేషించి మాట్లాడారు*

శుభోదయం 🌅

పనులు బాగా జరిగితే అందుకు సంబంధించిన క్రెడిట్‌ను ఇతరులతో పంచుకునే వారు, పనులు సరిగా జరగకపోతే బాధ్యతను తమపై తీసుకునే వారే మంచి నాయకులు. — సైమన్ సినెక్ పున్నమి తెలుగు డైలీ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిడూరు పాలెంలో కరంటోళ్ల జన బాట

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)మనుబోలు మండలం పిడూరు పాలెం గ్రామంలో ఈరోజు కరంటోళ్ల జన బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఈ అనిల్ కుమార్, జేఈఈ రాంబాబు ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ శేషయ్య, లైన్మెన్ రమేష్, కిషోర్, జేఎల్ఎంలు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. గ్రామంలోని 11 కెవి, ఎల్‌టీ లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లను తనిఖీ చేసి, లోపాల నివారణతో పాటు భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.