Thursday, 12 March 2026

Blog

తిరుపతి

ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షున్ని కలసిన జిల్లా ఎన్ జి జి వో సంఘ నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షులు ఏ విద్య సాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణని శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా ఏపీ ఎన్ జి జి వో సంఘం నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని 2003 వ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిస్ మీద పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడి, రెగ్యులరైజ్ అయినటువంటి వారిని 2017 సంవత్సరం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం సిపిఎస్ నుండి ఓ పి ఎస్ కు మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి అధ్యక్షులు చెంచురత్నం యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు, శ్రీకాళహస్తి ఆర్గనైజ్ సెక్రెటరీ వెంకట ముని, జాయింట్ సెక్రటరీ గోవిందస్వామి, రాయలసీమ పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాబులు పాల్గొన్నారు. Uploaded Video:

తిరుపతి

పి.వి.ఆర్. కుటుంబం దాతృత్వంతో లైబ్రరీ రూమ్ ఏర్పాటు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని పి. వి. రామచంద్ర రావు, సరస్వతీ బాయ్ జ్ఞాపకార్థం, సరస్వతీ బాయ్ మున్సిపల్ హై స్కూల్, తెలుగు గంగ కాలనీ నందు పి.వి.ఆర్ గ్రూప్, వారిచే నిర్మించిన లైబ్రరీ రూమ్ ను మంగళవారం నాడు ప్రారంభీంచడం జరిగింది. అనంతరం స్వర్గీయ పి.వి.రామచంద్రరావు, స్వర్గీయ సరస్వతి బాయి చిత్రపటాలకు పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా పివిఆర్ గ్రూపు డైరెక్టర్లు పరమేశ్వర రావు వి.పవార్ మాట్లాడుతూ.. తమ తాత స్వర్గీయ పి.వి.రామచంద్రరావు సంకల్పంతో తమ నానమ్మ పేరిట ప్రారంభించిన పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని విద్యార్థులు పుస్తక పఠనం విలువ తెలుసుకొని పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ..తమ పాఠశాలకు పివిఆర్ కుటుంబం ఆది నుంచి అండగా నిలబడి ఉన్నతంగా అభివృద్ధి చెందేలా చేయూత ఇవ్వడం హర్షనీయమని పాఠశాలల్లో సదుపాయాలు కల్పన, మున్సిపల్ టీచర్లను నియమించి చిన్నారులు జ్ఞాన జ్యోతులు వెలిగించడానికి చేస్తున్న కృషి ఎనలేని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పివిఆర్ గ్రూపు డైరెక్టర్లు ప్రతాప్ రావు వి.పవార్, జనార్దన్ రావు జె.పవార్, ముకుందరావు జె.పవార్, పి.వి.శివశంకర్, స్థానిక ప్రముఖులు రిటైర్డ్ జడ్జి రాధాకృష్ణ, గురు దశరథన్, మోహన్ రావు, శెట్టిపల్లి సుబ్రహ్మణ్యం, శెట్టిపల్లి సురేష్, జీవి రమణ మూర్తి (స్వామి), మిన్నల్ రవి, డా.యం.ఉమేష్ రావు, షేక్ మహబూబ్ భాషా, రత్నం రెడ్డి, మహేశ్వర రావు పడోల్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

అన్నమయ్య

రాయలసీమ ప్రాంత పాలిట జగన్ రెడ్డి ఒక ‘శని’.. సాగునీటి రంగానికి గత వైసిపి పాలన ఒక పీడకల: రాము యాదవ్ ఘాటు విమర్శలు

రాయలసీమ అభివృద్ధిపై కపట ప్రేమ నటిస్తున్న వైసిపి నాయకులకు, ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదని మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఐదేళ్ల జగన్ పాలనలో సీమ ప్రాజెక్టులు ఎలా నాశనమయ్యాయో వివరించారు. ​సీమ ద్రోహి జగన్ రెడ్డి.. 102 ప్రాజెక్టుల రద్దు నిజం కాదా? ​”జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టులకు మరణశాసనం రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసిన 198 సాగునీటి పనుల్లో, ఒక్క సీమ ప్రాంతానివే 102 ప్రాజెక్టులు ఉండటం అన్యాయం కాదా? అభివృద్ధికి ఊపిరి లాంటి డ్రిప్ ఇరిగేషన్‌ను రద్దు చేసి రైతుల పొట్ట కొట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి?” అని రాము యాదవ్ ప్రశ్నించారు. ​మేనేజ్మెంట్ లోపం – అన్నమయ్య ప్రాజెక్టు బలి ​వైసిపి నేతల అజ్ఞానం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిందని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా హడావిడి చేసి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కోర్టు వివాదాల్లోకి నెట్టి నిలిపివేసింది వైసిపి ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైసిపి నేతలు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లే’ ఉందని ఎద్దేవా చేశారు. ​చరిత్ర సాక్షిగా.. చంద్రబాబే సీమ భాగ్యవిధాత ​రాయలసీమ రాతను మార్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తు చేశారు: ​ఎన్టీఆర్ విజన్: హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, తెలుగు గంగ, కేసీ కెనాల్ వంటి బృహత్తర ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ ది. ​బాబు మార్క్ అభివృద్ధి: 2014-2019 మధ్య కాలంలో కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ₹12,411 కోట్లు కేటాయించారు. ​నీటి సాధన: కృష్ణా జలాలను 750 కి.మీ దూరం తీసుకువచ్చి, కుప్పం చేరేలోపే 19 నియోజకవర్గాల్లోని 423 చెరువులను నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ​పులివెందులకు నీరు: చివరకు జగన్ నియోజకవర్గం పులివెందులకు కూడా సాగునీరు అందించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని స్పష్టం చేశారు. ​హెచ్చరిక ​తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రాయలసీమ ప్రజలు బుద్ధి చెప్తారని రాము యాదవ్ హెచ్చరించారు. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు, ప్రాజెక్టులు పూర్తి చేయడమని ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. ​

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో బుధవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నారు

ఉదయగిరి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణంలో బుధవారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నారు డీ ఈ ఏం భాను నాయక్ ఒక ప్రకటన విడుదలచేశారు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులు స్వికరిస్తామని చెప్పారు ఆత్మకూరు, ఉదయగిరి, కలిగిరి సబ్ డివిజన్ మండలాల ప్రజలు సమస్యలును అర్జీలా రూపంలో తెలియజేయలని వారు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఉద్యోగి రిటర్మెంట్

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎలక్ట్రిషన్ ఎన్ఎం యు మాజీ కార్యదర్శి కె. వెంకయ్య మంగళవారం స్వచ్ఛoద ఉద్యోగ విరమణ చేశారు తోటి ఉద్యోగులు, స్నేహితులు ఆయనకు శాలువా, పూలమాలతో సత్కరించారు పులువురు మాట్లాడుతూ వెంకయ్య ఎన్ ఎం యు ఉంటూ పలు సమస్యల సాధనకు కృషి చేసారన్నారు.

కడప

ఆక్సిడెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మరీనా ఈ స్పాట్ …….

ప్రొద్దుటూరు పట్టణం లోని కొర్రపాడు రోడ్ , శివ శంకర్ షాపింగ్ మాల్ వద్ద ఇటీవల కలం లో డేంజర్ స్పాట్ గా మరీనా రోడ్ సెంటర్ పిల్లర్, రోడ్ విండినింగ్ కి సహకరించని దుకాణ దారులు ఇలాగే ఐతే మరి ఇంకెన్ని యాక్సిడెంట్స్ చూడాల్సి వస్తుందో , దీనిని దృష్టి లో పెట్టుకుని ముంచిపాలిటీ రోడ్ వెడల్పు పనులను వేగం గా పూర్తి చయ్యాలి అని మున్సిపాలిటీ అధికారులని కోరుకుంటున్నాను .

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అంకితభావoతో పని చేయండి

ఉదయగిరి మండలంలోని గండిపాలెం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే నిర్వహించారు, డాక్టర్స్ శివ, కల్పన,వినీతా మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిచాలన్నారు కేటాయించిన లక్ష్యాలను నూరు శాతo పూర్తి చేయాలనీ సూచించారు అంకిత భావoతో విధులు నిర్వహించాలన్నారు.

కడప

ఉపముఖ్యమంత్రిని కలిసిన పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రొద్దుటూరు కు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని విన్నవించారు ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి తగినన్ని నిధులు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు కు సంబంధించిన టీడీపీ నేతలు పాల్గొన్నారు

కామారెడ్డి

రామారెడ్డి పీహెచ్సీలో హెచ్ఐవి, ఎయిడ్స్‌, టిబి, హెపటైటిస్‌పై అవగాహన

కామారెడ్డి, 6 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవి/ఎయిడ్స్, టిబి, ఎస్టీఐ, హెపటైటిస్ బి, సి, 1097 సేవలు, సిఫిలిస్ తదితర వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.ఈ సందర్భంగా ఇప్పటివరకు కొనసాగుతున్న ఐసీటీసీ సేవలతో పాటు, కొత్తగా ప్రారంభించిన సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా హెచ్ఐవి సేవలతో పాటు పైన పేర్కొన్న అన్ని వ్యాధులకు సంబంధిం చిన పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని అధికారులు తెలిపారు. అవసరమయ్యే వారికి రెండు సంవత్సరాల పాటు నిరంతర ఫాలోఅప్ చేస్తూ పరీక్షలు, చికిత్సలు, మందులు, కౌన్సెలింగ్, ఇతర అవసరమైన వైద్య సేవలు అందజేస్తామని వివరించారు.రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వ హించిన సదస్సు లో, ప్రస్తుత సేవలు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న సేవల గురించి ప్రజలకు వివరించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రజలు ఈ ఉచిత సేవలను వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్లు భీమన్న, జార్జ్, సూపర్వైజర్ జానకి, ఐసీటీసీ కౌన్సిలర్ నాగరాజు, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఎస్‌కే ORW, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

గాజువాక అభివృద్ధికి రోడ్‌మ్యాప్ వీఎంఆర్డీఏలో జివిఎంసీ పనులపై పల్లా సమీక్ష

విశాఖపట్నం జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాకను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు జివిఎంసీ పరిధిలో చేపట్టనున్న కీలక పనులపై వీఎంఆర్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ప్రధాన రహదారుల విస్తరణ, డ్రైనేజీ అభివృద్ధి, అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్, జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్స్, సర్వీస్ రోడ్ల నిర్మాణాలపై సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘ నిధులు, జివిఎంసీ ఫండ్స్, హామ్ విధానంలో చేపట్టే పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పల్లా అధికారులను ఆదేశించారు. కణితి గెడ్డ అభివృద్ధి ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసి వరదల నివారణకు శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. అలాగే ప్లేగ్రౌండ్లు, పార్కులు, గాజువాక జోనల్ ఆఫీస్ భవన నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. గాజువాక అభివృద్ధిలో జాప్యం ఉండదని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పల్లా స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.