Thursday, 12 March 2026

Blog

వనపర్తి

డిజిటల్ విద్య ద్వారా హిందీ భాషను సులభతరం చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎమ్ ఎన్ విజయకుమార్

*భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎంఎన్ విజయకుమార్* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 7/ 1/ 2026* *జిల్లాలోని భాషా పండితులు భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలంలో జరిగిన తరగతిగది అభ్యసన సామర్ధ్యాల పరిశీలనలో భాగంగా తెలియజేశారు, పిల్లల్లో హిందీ భాషా పట్ల సరళతరం చేస్తూ తెలంగాణ రాష్ట్రం ద్వారా రూపొందించిన డిజిటల్ విద్య ద్వారా వారికి హిందీ విద్యా బోధనలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు*

వనపర్తి

దుప్పల్లి హైస్కూల్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు

*మదనాపూర్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు* *పున్నమి ప్రతి నిధి వనపర్తి జిల్లా:: 07/01/2026* *జిల్లా ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుప్పల్లి మదనాపూర్ మండలం యందు మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని శుచి శుభ్రతతో వంట ఏజెన్సీ వాళ్ళు నిర్వహణ భేష్ గా ఉందని టీం సభ్యులు తెలియజేశారు ఇందులో టీం సభ్యులు, శ్రీనివాసులు, వేణుగోపాల్ రెడ్డి, ఎంఎన్ విజయకుమార్, అక్బర్, రవి, నరసింహస్వామి, లక్ష్మీదేవి మరియు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం రమేష్ గౌడ్, శ్రీనివాసులు, నాగేందర్, కృష్ణవేణి, ఈశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు*

E-పేపర్

నందిపాడు సెంటర్ లో NH 565 BT రోడ్డు పనులు

ఉదయగిరి నందిపాడు Date:06-1-2026 నందిపాడు సెంటర్ పరిసర NH 565 రోడ్డు బిటి ఓవర్లయింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నయు . పనులు త్వరితగతిన మరియు నాణ్యత తో కూడిన పనులు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు

రంగారెడ్డి

విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది.. — ఏఎక్సెల్ ఫర్ ఎఫ్ ఎల్ ఎన్ ఏఐ బేసెడ్ లెర్నింగ్ క్లాస్ను ప్రారంభి..ఎం ఈ ఓ-బాసు నాయక్ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగిశెట్టి ధనుంజయ్ జనవరి 07 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యలో చేపట్టిన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఎ ఐ) లొ భాగంగా మంగళవారం మూసా నగర్ నందనవనం ఉన్నత పాఠశాలలో సరూర్నగర్ ఎం ఈ ఓ బాసు నాయక్ మరియు చంపాపేట్ జి హెచ్ ఎం విజయ ముఖ్యఅతులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శ్రవణ భాషణ సామర్ధ్యాలను మెరుగుపరచడానికి చదవడంలో దారాలతను పెంపొందించుటకు దోహదపడతాయని అలాగే గణిత కార్యకలాపాలలో నైపుణ్యాలను బలోపేతం చేయడానికి అనుకూలం మరియు ఆకర్షనీయమైన అభ్యాస కృత్యాలను అందిస్తుంది అన్నారు ఏ ఎక్సెల్ లొ ముఖ్యంగా రెండు అంశాలు ఉంటాయి 1) ఏ ఎల్ ఎల్ — అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, 2) ఏ ఎం ఎల్…అసిస్టెడ్ మాథ్స్ లెర్నింగ్ ఈ సాఫ్ట్వేర్ విద్యార్థుల ప్రసంగాన్ని విని వారి ఉచ్చరణ మరియు గ్రహణ శక్తిని అంచనా వేస్తుంది వాటిని సరిదిద్దీ అభిప్రాయాన్ని అందిస్తుంది పట్టణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి వ్యక్తిగత అభ్యాస కృత్యాలను వస్తుంది అన్నారు పాఠశాలలో అమలుపరచు విధానం :- 3,4,5 తరగతులకు వారానికి కనీసం 2 సెషన్స్ను ఏర్పాటు చేయాలి. ప్రతి సబ్జెక్టుకు వారానికి కనీసం 2 ఉండేలా చూసుకోవాలి. ఒక్కొక్క సెషన్ కి 20 నిమిషాల సమయం కేటాయించాలి. విద్యార్థులు పెన్ ఆధారంగా లాగిన్ లింక్:- https://ts:the-axl.ail లాగిన్ అవ్వాలి. దీనికి సంబంధించిన విద్యార్థుల హాజరు & వారి సాధన ఫలితాలను రిజిస్టర్లు లో రికార్డ్ చేసుకోవాలి, అంతిమ లక్ష్యం :- పునాది సామర్ధ్యాలను పెంపొందించడం ఇది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ప్రేరణ మరియు మెరుగైన అభ్యాస ఫలితాలను నిర్మిస్తుందనిఅన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ప్రభాకర్ రావు మండల అధ్యక్షుడు ఎస్ మధుసూదన్ గౌడ్ మండల కార్యదర్శి వినయ్ కుమార్ పాఠశాల ఏ ఏ పీ సి చైర్మన్ రేణుక పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు టి రజితమ్మ ఎల్ మాధవి రఘునందన్ రావు రజనీకాంత్ రెడ్డి సత్య రావు నరసింహారావు వీరన్న సునీత నిఖిల కవిత అంకుష్ ఫర్జానా పారిజాత పృథ్వీరాజ్ శ్రీలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

కామారెడ్డి

గ్రామ సర్పంచ్‌లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు మాత్తడి వాగు మరమ్మతులకు వినతి..!

ఎల్లారెడ్డి/రామారెడ్డి, 7 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : మాత్తడి వాగు కట్ట మరమ్మతులు, ఆన్‌లైన్‌లో చేర్చేందుకు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్‌, పాలక వర్గం సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్ల ను సమర్థించారు డివిజన్-4లోని మాత్తడి వాగు కట్ట గత కొన్ని సంవత్సరాలుగా దెబ్బతిని, ఇటీవలి వర్షాలతో మరింత దిగజారుతోందని చెప్పారు. ఈ కట్ట మరమ్మతు లేకపోతే గ్రామ ప్రజలకు తీవ్ర అసౌ కర్యం, వ్యవసాయ భూములకు నీటి సమస్యలు తప్పవు. అందుకే గ్రామ నాయకత్వం ఈ విషయా న్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్ మాట్లాడుతూ, మా వాగు కట్టను తక్షణ మరమ్మతు చేసి, ఆన్‌లై న్‌లో రిజిస్టర్ చేయాలి. ఇది గ్రామ ప్రజల భవిష్య త్తుకు కీలకం అని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ యశ్వంత్ రావు మాట్లాడుతూ,ఈవాగు వ్యవస్థను డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.ఈ వాగు ఆన్‌లైన్‌లో చేర్చబడితే ప్రజలు సులభంగా స్థితి తెలుసుకుని, మరమ్మతులు పార దర్శకంగా జరుగుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వినతి పత్రం ఇచ్చిన తర్వాత అధికారులు సానుకూలంగా స్పందిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వార్డు నాయకులు శగా నవీన్, పూర్మిశెట్టి హరీష్, దేమే రఘు సహా గ్రామ ప్రజలు పాల్గొని, తమ సమస్యలను వివరిం చారు. ఉపసర్పంచ్ యశ్వంత్ రావు, వార్డ్ నంబర్ 3 శగా నవీన్, పూర్మిశెట్టి హరీష్, గ్రామ ప్రజలు దేమే రఘు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పీఎస్ పరిధిలో ఘటన ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల వెల్లడి

పున్నమి ప్రతినిధి: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ పీఎస్ పరిధిలో ఘటన ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల వెల్లడి ప్రేమ వ్యవహారంలో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ బి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకా రం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రా మంలో పోతురాజు అలివేలు కూలిపని చేసుకుంటూ తన నాన్న సిద్ధగోని నారయ్య దగ్గర ఉంటూ జీవనం సాగిస్తుం ది. అలివేలు భర్త మహేష్ 16 ఏండ్ల క్రితమే చనిపోయాడు. ఈమె కూతురు పోతు రాజు పూజ (17) ఇబ్రహీంపట్నంలోని కార్తీకేయ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని మహేష్ పూజ ప్రేమలో పడింది. అతనినే పెండ్లి చేసు కుంటానని పూజ ఇంట్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు నిరాకరించారు. దాంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి పూజ అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

తిరుపతి

ఎన్నికల హామీ అమలుపై హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06 శ్రీకాళహస్తి నియోజిక వర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచమన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి అమలు చేసిన సమాచారాన్ని మీడియా ద్వారా సమాచారాన్ని ఎమ్మెల్యే వెలిబుచ్చారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎనలేనిదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో భాగంగా నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలపై రూ.4,498 కోట్ల విద్యుత్ భారం – పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – తప్పించారని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. 2019–24 – మధ్యకాలంలో ట్రూ అప్ చార్జీలు రూ.4498 7 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ భారాన్ని ప్రజలపై వేయొద్దని, ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించటం ప్రజలకు మేలు చేసే విషయంగా పేర్కొన్నారని చంద్రబాబునాయుడు చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఏపీఈ అర్సి ఏర్పాటు అయిన 1999 నుండి తొలిసారి ట్రూ డౌన్ చార్జీలు నమోదు అవుతున్నాయన్నారు. ట్రూ డౌన్ అమలు ద్వారా తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీల్లో ‘యూనిట్కు 13 పైనలు తగ్గించిందని తెలియజేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వేలకోట్ల ట్రూ అప్ ద్వారాన్ని ప్రజలపై పడకుండా చూడటం చారిత్రాత్మక నిర్ణయంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభివర్ణించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజున రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం లేకుండా చుస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి తన అయిదేళ్ళ అస్తవ్యస్త పాలన విధానాల ద్వారా 5 ఏళ్ళ పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. 2019లో మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు మొయలేని అప్పులు భారం మిగిల్చారని విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.3.50 చొప్పున వసూలు చేయగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకొని యూనిట్కు రూ.1.50 తగ్గించి ఆక్వా రైతులకు ఊరట కల్పించారని బొజ్జల గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ.5.19 లకు యూనిట్ విద్యుత్ ను కొనుగోలు చేయగా తమ ప్రభుత్వం రూ.4.70 కొనుగోలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వయనింపజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యమిస్తూ సోలార్, పవన విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. సోలార్ పవర్ ను ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్లు అందించడంతో పాటు బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20 వేలు కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే బొజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ కోతల నుండి ప్రజలను విముక్తి కల్పించడమే కాకుండా విద్యుత్ చార్జీల భారం కూడా పడకుండా తప్పించి రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారారని ప్రశంసించారు, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. Uploaded Video:

తిరుపతి

సంక్రాంతికి బొజ్జల టోర్నమెంట్ సీజన్ 2 ప్రారంభం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి నియోజకవర్గ యువతకు శుభవార్త ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో, సంక్రాంతి సంబరాల్లో భాగంగా బొజ్జల టోర్నమెంట్ సీజన్-2 అత్యంత ఘనంగా నిర్వహించబడుతోంది. టోర్నమెంట్ వివరాలు: వేదిక: శ్రీకాళహస్తి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్, ఫార్మాట్: ఓపెన్ గ్రౌండ్ క్రికెట్ (11 మంది ఆటగాళ్లు + 1 ఎక్స్ట్రా ప్లేయర్). జనవరి 8వ తేదీ, మధ్యాహ్నం 3:00 గంటలకు. ప్రారంభం: జనవరి 9వ తేదీ ఫైనల్ మ్యాచ్ బహుమతులు: గెలుపొందినవారికి రూ. 10,000 నగదు బహుమతి. పాల్గొన్న వారికి రూ.5,000 నగదు బహుమతి. క్రీడల్లో ప్రత్యేక పురస్కారాలు: మ్యాన్ ఆఫ్ ది సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హైయెస్ట్ రన్స్ (Best Batsman) హైయెస్ట్ వికెట్స్ (Best Bowler) క్రీడలు క్రమశిక్షణకు మార్గాలు. మన నియోజకవర్గ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే ఈ బొజ్జల టోర్నమెంట్. రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది ఫోన్ నెం. ఖాదర్ : 99513 44011, బాలాజీ : 7989397939, రంజిత్ : 7207143627 సంప్రదించాలి. Uploaded Video:

తిరుపతి

పాడి రైతుల మహజనసభలో పాల్గొన్న ఎమ్మేల్యే బోజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: శ్రీకాళహస్తి కో-అపరేటివ్ పాల సరఫరా సంఘం వారు మంగళవారం నాడు నిర్వహించిన పాడి రైతుల మహజనసభలో స్థానిక శ్యాసనసభ్యులు బోజ్జల వేంకటసుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఎమ్మేల్యే మాట్లాడుతూ.. సంక్రాతి కానుక పాడి రైతులకు పాల కొనుగోలు ధరను రూ.3 వంతున ఆవు పాల ధరను, రూ. 5 వంతున బర్రె పాల ధరను పెంచుటం జరిగినది. అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సంక్రాతి కానుకగా 2024-25 సంవత్సరముకు, 2025-26 వ సంవత్సరము రెండు బోనసులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కో-అపరేటివ్ సంఘం అద్యక్షులు మునగాల మధుసూధన్ రావు, రాష్ట్ర బిజేపి ఉపాద్యక్షులు కోలా ఆనంద్, వ్వవసాయ మార్కిటింకమీ చైర్మన్ రంగినేని చేచయ్య నాయుడు, వి బత్తిరేడ్డి, కామేష్ యాదవ్, కార్యవర్గసభ్యులు పాల్గ్నొరు. Uploaded Video:

తిరుపతి

ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షున్ని కలసిన జిల్లా ఎన్ జి జి వో సంఘ నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ఎన్ జి జి ఓ సంఘం అధ్యక్షులు ఏ విద్య సాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణని శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా ఏపీ ఎన్ జి జి వో సంఘం నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని 2003 వ సంవత్సరంలో కాంటాక్ట్ బేసిస్ మీద పంచాయతీ కార్యదర్శులుగా నియమింపబడి, రెగ్యులరైజ్ అయినటువంటి వారిని 2017 సంవత్సరం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రకారం సిపిఎస్ నుండి ఓ పి ఎస్ కు మార్చాలని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి అధ్యక్షులు చెంచురత్నం యాదవ్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్ బాబు, శ్రీకాళహస్తి ఆర్గనైజ్ సెక్రెటరీ వెంకట ముని, జాయింట్ సెక్రటరీ గోవిందస్వామి, రాయలసీమ పంచాయతీరాజ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ బాబులు పాల్గొన్నారు. Uploaded Video:

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.