ఖమ్మం
ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భూదాన్ నిర్వాసితులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్ర రావు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ నిర్వాసితులను నారపరాజు రామచంద్ర రావు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల పరిస్థితిని స్వయంగా తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఓర్పుతో విన్న ఆయన, వారి సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా ఇంచార్జి బద్దం మహిపాల్ రెడ్డి, కిసాన్రా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ష్ రెడ్డి, రాష్ట్ర మహిళ నాయకురాలు ఉప్పల శారద కోశాధికారి దేవకీ వాసు దేవారావ్, నున్న రవికుమార్, అల్లిక అంజయ్య. గుత్త వెంకటేశ్వర్లు, శ్రీమతి పమ్మి అనిత, ఇవి రమేష్ల్, వల్లల రమేష్, తదితరులు పాల్గొన్నారు Uploaded Video: