Thursday, 12 March 2026

Blog

E-పేపర్

నత్త నడక సాగుతున్న రహదారి పనులు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం నుంచి భీమూలు వెళ్లే రోడ్డు పనులు సాగుతున్నయు . పనులు త్వరితగతిన మరియు నాణ్యత తో కూడిన పనులు చేయవలసిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. END

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రక్తదాన సేవకు ఘన సత్కారం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధ) గతరెండేళ్లుగా రక్తదానం ప్రాముఖ్యతను ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పి, అనేక మందిని స్వచ్ఛందంగా రక్తదానం చేయించినందుకు మనుబోలు ఎస్సై శివ రాకేష్ జిల్లా కలెక్టర్ ఘనంగా అభినందించారు. సమాజహితాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాల నిర్వహణ, యువత ప్రోత్సాహంలో చూపిన సేవలను ప్రశంసిస్తూ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు బీసీ కాలనీలో దొంగతనం, బట్టల దుకాణంపై కూడా దాడి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు బీసీ కాలనీలోని కొమరాల శ్రీకాంత్ ఇంటిలో అర్ధరాత్రి సమయంలో దొంగతనం జరిగింది. ఇంట్లోని రెండున్నర సవర బంగారం, సుమారు రూ.50 వేల నగదు, వెండి కుంకుమ భరిని, రెండు దీపపు స్తంభాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో కోదండరామపురంలోని ఒక బట్టల దుకాణంలో తలుపులు, కిటికీలు పగలగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామంలో భయాందోళన నెలకొంది.

E-పేపర్

రాజమండ్రి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. రాజమహేంద్రవరం, ప్రెస్ క్లబ్ ఎన్నికల వెంటనే నిర్వహించాలి * జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభం * ఏడేళ్ల కాలంగా ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలి గత ఏడు సంవత్సరాల కాలంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకుండా కొంత మంది అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి వ్యతిరేకంగా, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, అర్హులైన జర్నలిస్టులు అందరికీ సభ్యత్వ నమోదు ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాలని, ఏడేళ్ల కాలంగా ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని కోరుతూ జేఏసీ సభ్యులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గురువారం గణేష్ చౌక్ లో ఉన్న రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద స్థానిక 32 వ వార్డు కార్పొరేటర్ ద్వారా పార్వతి సుందరి దీక్షలు చేపట్టిన సభ్యులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుడా మాజీ చైర్మన్, గన్ని కృష్ణ దీక్ష శిబిరం వద్ద కు వచ్చి మద్దతు తెలిపారు. బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లబ్ధిక మల్లేష్ దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఎన్నికలు త్వరలో నిర్వహించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. మాజీ ప్రెస్ క్లబ్ కార్యదర్శి నామాబత్తుల రాంబాబు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యవర్గం నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రెస్ క్లబ్ ఎన్నికలు న్యాయబద్ధంగా నిర్వహించాలని, ఏడేళ్లుగా ప్రెస్ క్లబ్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని కోరారు. అర్హులైన విలేకరులకు సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో జేఏసీ చైర్మన్ చేబోలు రాజు, కన్వీనర్ డి.ఏ. లింకన్, వైస్ చైర్మన్ ఎం. సోమరాజు, వి. రవికుమార్, డి. విశాలాక్షి, పి. రామమూర్తి, పి. వెంకటేష్,కూడెల్లి రత్నం కిషోర్, రాఘవేంద్ర, ఎన్. సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మెంబర్ రాఘవేంద్రరావు, రమేష్, గిరీష్, సాయిరాం,పి. మహేష్, నాగరాజు, యాకోబు, మై టీవీ సాయి, వీరబాబు, నజీర్, యార్లగడ్డ నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. END Uploaded Video:

ఎలూరు

ఏలూరు కోర్టు లో బాంబు కలకలం

ఏలూరు జిల్లా కోర్టులో బాంబ్ కలకలం… ఏలూరు జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవో కు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కోర్టులో ఉన్న న్యాయమూర్తులను కోర్టుకు వచ్చిన వారిని బయటకు తరలిస్తున్నారు.. Coordinator Satya Manikanta Bhudeti Uploaded Video:

కామారెడ్డి

కామారెడ్డి పత్రికోద్యమానికి మైలురాయి.. 41 ఏళ్ల సీనియర్ రాజేందర్ సేవలకు ఘన సన్మానం

కామారెడ్డి, 08జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : తెలంగాణ గ్రామీణ పత్రికోద్యమంలో 41 సంవత్స రాలుగా అమిటిగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ రాజేందర్‌కు నెటి మనదేశం పత్రిక ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖులు, స్థానిక నాయకులు, సహజర్నలిస్టులు హాజరై, ఆయన అసాధారణ కృషిని అభినందిం చారు. 08-01-2026న ప్రచురితమైన 5వ పేజీలో ప్రత్యేకంగా చోటు చేసుకున్న ఈ వార్త గ్రామ ప్రజల్లో గర్వాన్ని రేకెత్తించింది.పంచాయతీ ఎన్నికల నుంచి రాజకీయ ఘటనలు, గ్రామీణ అభివృద్ధి వరకు.. రాజేందర్ కథనాలు ప్రజల సమస్యలను ప్రధాన పత్రికల్లోకి తీసుకెళ్లి మార్పు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక నాయకులు, రాజేం దర్ గారి సేవలు తెలంగాణ జర్నలిజంకు శాశ్వత వారసత్వం” అని పేర్కొన్నారు.గ్రామ స్థాయి నుంచి జాతీయ మాధ్యమాల వరకు.. అసాధారణ ప్రయా ణంరాజేందర్ పత్రికీయ జీవితం 41 ఏళ్ల క్రితం కామారెడ్డి, రామారెడ్డి ప్రాంతాల గ్రామాల్లో ప్రారంభ మైంది. స్థానిక పంచాయతీ వ్యవస్థలు, ఎన్నికల సమయంలో ఓటర్ లిస్టు తప్పులు, రాజకీయ ఘటనలపై ధృఢత్వంగా కవరేజ్ చేసి పేరు తెచ్చుకున్నారు. పంచాయతీ రిపోర్టింగ్: గ్రామ స్థాయి ఎన్నికలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణాత్మక కథనాలు రాసి ప్రజలకు అవగాహన కల్పించారు.రాజకీయ కవరేజ్ కామారెడ్డి ప్రాంతంలో జరిగిన ఎన్నికలు, రాజకీయ చర్చలపై పేజీల విస్తీర్ణంలో వార్తలు ప్రచురించారు. డిజిటల్ జర్నలిజం: యూట్యూబ్, వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని వేగంగా అందించి ఆధునికీకరణకు మార్గదర్శకులుగా నిలిచారు.ఆయన రచనలు అయన శైలీలో పెద్ద పత్రికల్లో చోటు చేసుకుని, పాలకులను ఆలోచింప జేశాయి. గ్రామీణ సమస్యలను జాతీయ స్థాయికి ఎదగలిగించిన ధైర్యం అపూర్వం. బహుముఖ ప్రతిభ.. సాంస్కృతిక, సంక్షేమ సేవలు జర్నలిజంతో ఆగకుండా రాజేందర్ సాంస్కృతిక రంగంలో కూడా కృషి చేశారు. ఫోక్ మ్యూజిక్, స్థానిక పండుగలపై పాటలు, కవితలు రచించి గ్రామీణ సంస్కృతిని ప్రచారం చేశారు. ఎన్‌జేయూ (ఐ) కార్యదర్శి: సహజర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసి, యూనియన్‌లో కీలక పాత్ర పోషించారు.ఆధ్యాత్మిక సేవలు: ఆలయాల అభి వృద్ధి, గ్రామ సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సేవలు అందించారు.డిజిటల్ టూల్స్ టాబ్లెట్‌లు, యాప్‌లతో కంటెంట్ క్రియేషన్ చేసి యువ జర్నలిస్టులకు మార్గం చూపారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావును ప్రశంసిస్తూ గ్రామీణ పత్రికోద్యమంలో వారి సేవలను ఎప్పుడూ పేర్కొనేవారు. ఆయన బహు ముఖ సేవలు ప్రాంతీ య మీడియాకు గర్వకారణం. సన్మాన సభలో హృదయస్పర్శి క్షణాలుఎల్లారెడ్డి డివిజన్ భవనం లో జరిగిన సభలో ప్రముఖ పిల్లల వైద్యులు, స్థానిక నాయకులు రాజేందర్‌ను శాలినగ్రంథి, సన్మానపత్రంతో సత్కరించారు. గ్రామ ప్రజల గొంతుకగా మారిన ఆయన కథనాలు మాత్రమే కాదు, సామాజిక సేవలు అభినందనీ యం అని హాజరైనవారంతా ప్రశంసించారు. కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు, ఎమ్మెల్యే లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. రాజేం దర్ మాట్లాడుతూ, “ప్రజల సేవకోసమే నా పత్రికో ద్యమం” అని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామంలో పెద్ద సంచలనం సృష్టించింది.తెలంగాణ జర్నలిజం కు శాశ్వత ఆదర్శంరాజేందర్ సేవలు కామారెడ్డి పత్రికోద్యమానికి మైలురాయి. యువతకు ప్రేరణ, ప్రజలకు మార్గదర్శకంగా ఆయన వారసత్వం నిలుస్తుంది. భవిష్యత్‌లో ఆయన రచనలు గ్రామీణ సమస్యల పరిష్కారానికి సహాయపడతాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు.

కామారెడ్డి

రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరికి జైలు, జరిమానా!

కామారెడ్డి, 08 జనవరి 🙁 పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి. చంద్రశేఖర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరు అభి యోక్తులకు ఒక్కరోజు జైలు శిక్షతో పాటు 1,000 రూపాయల జరిమానా విధించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులు రోడ్డు భద్రతపై హెచ్చరికగా మారాయి.అభియోక్తుల వివరాలుము.బాలనరసింహులు (55 సంవ., చక్కిలా కులం, వ్యవసాయి), బవానిపేట (వి), మచారెడ్డి (మ).రామావత్ రమేష్ (32 సంవ., ST-లంబాడ కులం, వ్యవసాయి), డోంకల (వి), ఇంద ల్వాయి (మ).SHO పి.రాజశేఖర్ నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు విషయం తెలిపారు.డ్రంక్ డ్రైవింగ్‌కు ఎటువంటి తప్పించుకో లేని శిక్షలు విధిస్తాం అని పోలీసులు స్పష్టం చేశా రు. స్థానికులు ఈ శిక్షలను స్వాగతించుతూ, రోడ్డు ప్రమాదాలు తగ్గాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు

కామారెడ్డి

విద్యార్థులు మానసిక అవరోధాలను అధిగమించాలి

జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ కామారెడ్డి, జనవరి ( పున్నమి ప్రతినిధి ) : టీనేజ్ వయసులో మానసిక ఒత్తిడి, మాదక ద్రవ్యా లు, సోషల్ మీడియా మోహం వల్ల భవిష్య త్తు వృధా చేసుకోకండి. ప్రణాళికాబద్ధ చదువు, కుటుం బ సహకారంతో లక్ష్యాలు సాధించండి అని జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ సూచించారు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలోని బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం మానసిక సమ స్యలు, పరీక్షా కాలంలో విద్యార్థుల వ్యవహారం, మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్ర మం జరిగింది. టీనేజ్ వయసు.. మానసిక దృఢత్వం కీలకం విద్యార్థులను ఉద్దేశించి డా.రమణ మాట్లాడుతూ, మానసికంగా దృఢంగా ఉండాలని, టీనేజ్ వయసు లో వచ్చే మానసిక అవరోధాలను అధిగమించాల ని సూచించారు. అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధ్యమని తెలిపారు. వయసు రీత్యా ఆకర్షణలకు లొంగి చదువుపై దృష్టి పోగొట్టుకుని చెడు వ్యసనా లకు లోనవ్వకూడదని హెచ్చరించారు. పరీక్షలు.. ఒత్తిడి కాకుండా ప్రణాళిక పరీక్షా కాలంలో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వాల ని, మానసిక ఒత్తిడి పెట్టుకోకూడదని పీఎచ్సీ డా . సురేష్ అన్నారు. మొబైల్‌ను కేవలం కమ్యూనికేష న్ కోసమే వాడాలని, సోషల్ మీడియా మోజులో పడి బంగారు భవిష్యత్తు కోల్పోకూడదని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు.. యువత బాధ్యత టీనేజీలు మత్తుపదార్థాలకు లోనై తమ విలువైన జీవితాలు వృధా చేసుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో అన్నయ్యలు, కుటుంబ సభ్యులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు వివరించాలని కోరారు. కుటుంబం, సమాజాన్ని కాపాడటం యువత బాధ్యత అని, మాదక నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.తల్లిదండ్రుల కలలు సాకారం చేయండిఅని అన్నారు.ఉన్నత లక్ష్యాలు చేరుకుని తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, చదువు సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించా లని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే తనను సంప్రదించాలని విద్యార్థులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మోహ న్, MLHP డా. రమ్యశ్రీ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పల్నాడు

శ్రీ‌వాణి దర్శన టికెట్ల న్యూ ప్రకటన

🙏 శ్రీ‌వాణి దర్శన టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు – ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ ప్రారంభం 🙏 📢 ప్రధాన ప్రకటనలు: 🌟 జనవరి 9, 2026 నుండి శ్రీ‌వాణి దర్శన టికెట్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోకి ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న శ్రీ‌వాణి టికెట్లను నిలిపివేస్తున్నారు. రోజువారీగా ఇచ్చే 800 ఆఫ్‌లైన్ టికెట్లను ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ కోటాలోకి మార్చారు. 💻 ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ టైమింగ్స్: ⏰ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల 🕑 మధ్యాహ్నం 2 గంటల వరకు బుకింగ్ అందుబాటులో 🕓 టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు రిపోర్టింగ్ ➡️ అదే రోజు దర్శనం 🔐 దుర్వినియోగాన్ని అరికట్టేందుకు: ఆధార్ ధృవీకరణ తప్పనిసరి సరైన మొబైల్ నంబర్ నమోదు అవసరం ఫ‌స్ట్ కమ్ – ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానం అమలు 👨‍👩‍👧‍👦 కుటుంబానికి పరిమితి: ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం 4 మంది) మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం. ✈️ ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలు: యథావిధిగా కొనసాగనున్నవి: శ్రీ‌వాణి టికెట్ల అడ్వాన్స్ ఆన్‌లైన్ బుకింగ్ తిరుపతి విమానాశ్రయంలోని ఆఫ్‌లైన్ కరెంట్ బుకింగ్ (రోజుకు 200 టికెట్లు) ఇప్పటికి రోజుకు ఇప్పటికే అడ్వాన్స్ విధానంలో 500 టికెట్లు విడుదల అవుతూనే ఉన్నాయి. 🧪 ప్రయోగాత్మక అమలు: ఈ కొత్త విధానాన్ని భక్తుల సౌకర్యార్థం నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఫలితాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. 🙏 భక్తులకు టీటీడీ విజ్ఞప్తి: ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని వినియోగించుకుని, ఆఫ్‌లైన్ క్యూలలో నిరీక్షణ లేకుండా సులభంగా స్వామివారి దర్శనం పొందాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.

వనపర్తి

*హిందీ భాషా నైపుణ్యాల పెంపొందించుటకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలి

*హిందీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి *జిల్లా తేదీ::08*/ */01/ 2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొన్నూరు మదనాపూర్ మండలం యందు హిందీ ఆరవ తరగతి పాఠశాల తరగతి గదిలో హిందీ భాష నైపుణ్యాలు మరియు అభ్యసన సామర్ధ్యాల ప్రక్రియను డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ విద్యార్థులకు సూచనలు ఇస్తు ఉపాధ్యాయులు హిందీ భాష నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే భాషా నైపుణ్యాలు మిగతా తరగతి అంశాలు సరళంగా అర్థం అవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు హిందీ జాతీయ భాష, సరళ భాష అని ఇది ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థుల కోసం అనేక అభ్యసన ప్రక్రియలు టిఎల్ఎం ప్రయోగాల ద్వారా అలీం గారి బోధన ప్రశంసనీయం అభినందనీయమని వారు అభినందించారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.