Thursday, 12 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు సెంట్రల్ జైలును తనిఖీ చేసిన హోం మంత్రులు అనిత

వెంకటాచలం మండలం చెముడు గుంట లోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు జైల్లోని వసతులను పరిశీలించారు ఖైదిలతో మాట్లాడారు వారు ఎదురుకొంటున్న సమస్యలను అడిగి తెలుసు కున్నారు జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నేల్లి రామ కృష్ణ రెడ్డీ రిమాండ్ ఖైదీ గా ఉన్నారు వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ ఆవుతున్న నేపథ్యంలో ఆమె అకస్మికంగా తనిఖీలు ప్రాథన్యతను సంతరించుకుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పుల్లాయ పల్లి స్కూల్లో సంక్రాంతి సంబరాలు

ఉదయగిరి మండలం పుల్లాయ పల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం నిర్వహించారు ఇంచార్జి హె చ్ ఎం ప్రశాంతి కుమారి అధ్యర్యoలో ముగ్గులు పోటీలు నిర్వహించారు విద్యార్థులుకు సంక్రాంతి విశిష్టతను వివరించారు అనంతరం కోలాటం నిర్వహించి వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులు అందజేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎంపీడీఓ చెంచమ్మ అధ్యర్యలో వీధి దీపాలు ఏర్పాటు

దుత్తలూరు మండలం ఎంపీడీఓ చెంచమ్మ ఆదేశాల మేరకు అన్ని గ్రామల్లో వీధి దీపాలు ఏర్పాటుకు శుక్రవారం చర్యలు చేపట్టారు ఆయా పంచాయతీలా కార్యదర్శిలకు ఈ మేరకు ఆదేశాల జారీ చేశారు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్తకుప్పలు తొలగించాలని సూచించారు పారిశుధ్యం మెరుగు పరిచి బ్లీచింగ్ చల్లి మౌలీక వసతులు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడిలో మన్నెమాల భాస్కర్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, టీడీపీ నాయకుడు మన్నెమాల భాస్కర్ రెడ్డి 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హరిజనవాడ కాలనీలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మన్నెమాల భాస్కర్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో 400 మందికి అన్నదానం చేశారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు, టేబుల్స్, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో రేపు విద్యుత్ కు అంతరాయo

ఉదయగిరి లో రేపు అనగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎఈ చెంగయ్య ఓ ప్రకటనలో తెలిపారు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర ఫరా నిలిపి వేస్తామని చెప్పారు ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

క్రమ శిక్షణతో చదవండి

ఉదయగిరి మండలం SMGR ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులుకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరిచయ వేదిక కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు డి న్ కృష్ణారెడ్డీ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి కళాశాల విద్యా బ్యాసం చాలా కిలకమని చెప్పారు క్రమ శిక్షణ పట్టుదలతో చదివితేనే ఉన్నత శిఖరాల అది రోహించగలరని తెలిపారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నందిపాడు పశువైద్య శాల తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ రావు

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో పశు వైద్య శాలను కందుకూరు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ రావు శుక్రవారం సందర్శించారు కార్యలయం లోని రికార్డులు,సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పై పశుపోషకులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు.

విశాఖపట్నం

సౌర విద్యుత్‌పై అవగాహన తప్పనిసరి

పెదగంట్యాడ: జనవరి (పున్నమి ప్రతినిధి) సౌర పలకల ద్వారా స్వయంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయని ఏపీఈపిడీసీఎల్ ఈఈ బికే నాయుడు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు వికాస్‌నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు అధ్యక్షతన ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ కాలుష్య రహిత శక్తి వనరని పేర్కొన్నారు. దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువుల విడుదల జరగదని, తద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించవచ్చని తెలిపారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో దీర్ఘకాల ప్రయోజనం ఉంటుందని, ప్రభుత్వం కల్పించే రాయితీలను పొందుతూ ఇంటికి కావాల్సిన విద్యుత్తును స్వయంగా వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో కరెంటు బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించినట్లవుతుందని తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ మాధవి, గాజువాక, పెదగంట్యాడ ఏఈలు ఆర్.వి. రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, వార్డు టీడీపీ అధ్యక్షుడు రట్టి వాసు, ఇన్‌చార్జి బైపిల్లి గాంధీ, సీఓ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నేటి నుంచి నర్రవాడలో ఆరేటి ఎల్లమ్మ కొలువులు

దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామం లో ఉన్న పులి వర్తి వారి ఆ రేటి ఎల్లమ్మ కొలువులు శుక్రవారం వారం నుంచి గురువారo వరకు జరుగుతాయిని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు శుక్రవారం దిబ్బేం పెట్టుట కార్యక్రమం తో ప్రారంభంమై గురువారం దీవెన బండారు పూజ కార్యక్రమలతో ముగుస్తాయన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ న్యాయవాది యర్రమరెడ్డి విజయ మోహన్ రెడ్డి మృతికి సానుభూతి

నెల్లూరు, (మన పున్నమి ప్రతినిధి): నెల్లూరు బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, జనవిజ్ఞాన వేదిక మాజీ నాయకులు యర్రమరెడ్డి విజయ మోహన్ రెడ్డి గారు అనారోగ్యంతో కన్నుమూశారు. కమ్యూనిస్టు పార్టీలో బలమైన అనుబంధం, పేదల పట్ల అపారమైన సానుభూతితో ఈ కుటుంబం ప్రత్యేకంగా నిలిచింది. వారి అంతిమయాత్ర 10వ తేదీ మద్యాహ్నం బాలాజీ నగర్ గ్యాస్ గోడాం పక్కనుండి ప్రారంభం కానుంది. NIFAA సభ్యులు సైతం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి ధైర్యం కలగాలని అందరు కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.