Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్యకు పరామర్శించిన బీజేపీ పాలేరు అసెంబ్లీ కంటెస్ట్ ఏం ఎల్ ఏ నున్నా రవికుమార్

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) నేలకొండపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య గారి మాతృమూర్తి ఉన్నం అచ్చమ్మ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలిసిన వెంటనే, భారతీయ జనతా పార్టీ పాలేరు అసెంబ్లీ కంటెస్టడ్ ఏం ఎల్ ఏ నున్నా రవికుమార్ ముజ్జుగూడెం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అచ్చమ్మ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఉన్నం బ్రహ్మయ్య గారికి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేలకొండపల్లి మండల ప్రధాన కార్యదర్శి మల్లబోయిన గోవిందరావు, మైనార్టీ మోర్చా నాయకులు మొహియుద్దీన్, యువ మోర్చా నాయకులు సురేష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూర్ కలెక్టరేట్ తిక్కన ప్రంగాణంలో గ్రీవెన్స్ డే

నెల్లూర్ కలెక్టరేట్లోని తిక్కన ప్రంగాణంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు జాయింట్ కలెక్టర్,వెంకటేశ్వర్లు ఇతర అధికారూలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు, భూ సమస్యలు, పెన్షన్లు,రేషన్ కార్డులు, ఇతర వ్యక్తిగత సమస్యలు ఫై ప్రజలు వినతలు అందజేశారు వచ్చిన ప్రతీ అర్జీ ని క్షుoన్నగా పరిశీలించి నిర్ణత గడువు లోగ పరిష్కరిస్తామని తెలియజేసారు

ఖమ్మం

ఖమ్మం గిరిజన సమస్యలపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌కు వినతి

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యామ్ సుందర్ నాయక్ హైదరాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోట్ హుస్సేన్ నాయక్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గిరిజనుల హక్కులు, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు శ్యామ్ సుందర్ నాయక్ తెలిపారు.

కామారెడ్డి

మోషంపూర్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ నిధులు ఎక్కడా!!

కట్ట మట్టి పోసినా నీళ్లు వృధాగా పోతున్నాయి ప్రజలు ఇబ్బంది! నిధులపై విచారణ చేస్తారా లేదా?!? కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలోని పెద్ద చెరువు మిషన్ కాకతీయ పథకం కింద బాగా మట్టిపోసినా, కట్టలో చీలికల వల్ల నీళ్లు ఉదకొచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న తుమ్ వద్ద నీళ్లు వృధాగా పోతున్నాయి, బతుక మ్మ మెట్లు కట్టలేదు. గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తన్నారు. నీటిపారుదల అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు రాజేం దర్ ఎక్స్ లిఖించిన లేఖలో, “చెరువు కట్టపై మట్టి పోసారు కానీ, చిన్నతూమ్ వద్ద నీళ్లు ఉదగొచ్చి పోతున్నాయి. బతుకమ్మ మెట్లు కూడా కట్టలేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ నిధులు ఎప్పుడు, ఎంత ఖర్చు చేశారు? ఇంకా ఎంత నిధులు మిగిలాయి? వివరాలు రాతపూర్వకంగా ఇవ్వండి” అంటూ మనవి చేశారు. లేఖలో మోషం పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నా రు. మిషన్ కాకతీయలో చెరువులు బలోపేతం చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ కట్టలో చీలికలు, మెట్లు లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు వృథా అవుతున్నాయి. వ్యవసాయానికి, తాగునీటికి ఆధారమైన చెరువు ఇలా వదిలిపెట్టడం దారుణం. అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలి.అంటు నీటిపారుదల అధికారులు స్పందించకపోవడంతో, గ్రామస్తులు మండిపడుతున్నారు. మండల అధికా రి కామారెడ్డి ఆఫీసుకు లేఖ ఇచ్చిన రాజేందర్, పూర్తి వివరాలు రాకముందు పనులు పూర్తి చేయా లని డిమాండ్ చేశారు.ఈ సమస్య పరిష్కారం కాకపోతే, గ్రామస్తులు పెద్ద కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మిషన్ కాకతీయ నిధులు సరి గ్గా ఉపయోగించాలని, ప్రజల ఆవేదనలు తీర్చాల ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఖమ్మం

సంక్రాంతి వేళ ఖమ్మం రోడ్లు నిర్మానుషం.. బస్టాండ్‌లో మాత్రం ప్రయాణికుల కిటకిట

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఖమ్మం నగరం నిర్మానుషంగా మారింది. పండుగ కోసం ప్రజలు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లడం, విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సోమవారం నుంచే ఖమ్మంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సాధారణ రోజుల్లో ట్రాఫిక్‌తో కిటకిటలాడే ప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారాయి. అయితే నగర రహదారులు ఖాళీగా ఉన్నప్పటికీ, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతోంది. పండుగ ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సమయంలో తెలంగాణలో ముందుగా ఖాళీ అయ్యే నగరంగా హైదరాబాద్ ఉంటే, రెండవ స్థానంలో ఖమ్మం నిలుస్తుందని చెప్పుకోవచ్చు.

ఖమ్మం

దొంగతనాలు నియంత్రణకు పటిష్టమైన రక్షణ చర్యలు సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి: – ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారా మరింత పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు. ఊరికి వెళ్లే ప్రజలు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా.. బ్యాంకు లాకర్ లో అయినా దాచి పెట్టుకోవాలని సూచించారు. దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో పెట్రోలింగ్, బీట్ గస్తీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దొంగతనాల నివారణకు రాత్రి పూట కాలనీలతో పాటు కమిషనరేట్ పరిధిలోని బస్టాండ్, ఆటో అడ్డా, రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు. పోలీసుల సూచనలు.. 👉 ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలి. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి.. పక్క డోర్లకు తాళం వేయడం మంచిది. 👉 ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్ట కూడదు. బ్యాక్ లాకర్లలో దాచుకోవడం మంచిది. 👉 విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు. 👉 బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదు. 👉 ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. 👉 రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూ ఉండేలా ఆన్ చేసి ఉంచాలి. 👉 అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి. 👉 మీ మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చేలా.. ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలి. ఇంటి బయట 4 దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు పెట్టాలి. 👉 స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్‌ను తమ ఫోన్లలో ఉంచుకోవడం మంచిది 👉 చుట్టుప్రక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. 👉 ఇంట్లో ఎవరైనా మహిళలు, వృద్దులు వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని చెప్పాలి. 👉 ప్రతీ ఒక్కరు ఈ సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలి: గల్లా సత్య నారాయణ

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు శాశ్వత ఆదర్శమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఆలోచనలు, సందేశాలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

ఖమ్మం

ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి*

ఖమ్మం జనవరి (పున్నమి జిల్లా స్థాఫర్) ఖమ్మం నగరంలో బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యా సాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. యువతకు వివేకానందుని ఆదర్శాలు మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో అల్లిక అంజయ్య యాదవ్, జ్యోతుల యుగంధర్ నాయుడు, డీకొండ శ్యాం, గజ్జల శ్రీనివాస్, పాశం శ్రీనివాస్ రెడ్డీ, దాసరి మధు, దాసరి వీరభద్రం (రిటైర్డ్ సీఐ), ఉపేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

కామారెడ్డి

ఇసన్నపల్లి గ్రామంలో ఇంత ఘోరమా??!!

కామారెడ్డి, 12 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : ఇసన్నపల్లి గ్రామంలో ఇంత ఘోరమా? అని చర్చించుకుంటున్నారు గ్రామస్తులు, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం ఇస్న్నపల్లి గ్రామం 19 పంచాయతీల్లో ఒకటి. గ్రామపంచాయి తీ ఇమెయి ల్: gpissannapally@gmail.com, ఫోన్: 9347995602. వైకుంఠ ధామం, కంపోస్ట్ షెడ్ ఉన్నా ప్రాథమిక సదుపాయాలు లోపం, డ్రైనేజీ దుస్థితి రోడ్ల ఇరువైపులా డ్రైనేజీలు ఉన్నా మురికి పీదకలు కారణంగా నీరు రోడ్లపైనే ప్రవహి స్తోంది. మహిళలు బట్టలు ఉతకడం, మంచి నీరు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.వాటర్ పైప్ లీకేజీలు కాలనీల్లో వాటర్ పైప్లైన్‌లకు క్యాపులు లేకుండా ఘోరంగా నీరు ప్రవహిస్తోంది.ఈ లీకేజీలు డ్రైనేజీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. తాగునీరు వృథా అవుతూ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సిబ్బంది వైఖరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఈ లీకేజీలను అదుపు చేయలేకపోతు న్నారు.ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవట్లే దు. “ఏం చేస్తున్నారు?” అని గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు.అధికారులపై ఒత్తిడి మండలాధికారి నాగేశ్వరావు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మధన్ మోహన్ దృష్టికి తీసుకువెళ్ళాలని గ్రామస్తులు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కథనం ప్రచురితమైన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశపడుతు న్నారు. గ్రామస్తులు తక్షణ పరిష్కారాలు పైప్లైన్‌ల కు క్యాపులు వేసి మరమ్మత్తులు చేయాలి. డ్రైనేజీ లు శుభ్రం చేసి రోడ్లు పట్టించాలి. గ్రామ సభలో చర్చించి బడ్జెట్ కేటాయించాలి. అధికారులు వెంట నే స్పందించాలి. జిల్లా అధికారులు వెంటనే ఇస్స న్నపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితులు చక్కది ద్దాలని వేడుకుంటున్నారు.

E-పేపర్

నూతన సంవత్సరం సందర్బంగా…. నవ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా

నూతన సంవత్సరం సందర్బంగా…. నవ తెలంగాణ క్యాలెండర్ నీ విడుదల చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహా మరియు మేడిపల్లి గ్రామ శాఖ కార్యదర్శులు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.