Wednesday, 11 March 2026

Blog

ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భోగి సంక్రాతి, కనుమ శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బీజేపీ శ్రేణులకి భోగి, సంక్రాతి, కనుమ పండుగ శుభాకాంక్షలు.. మీ గల్లా సత్య నారాయణ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. ఖమ్మం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇరుసుమండలో బ్లోఔట్ నియంత్రణ! కంట్రోల్ టీమ్‌కు ఘన సత్కారం

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఇటీవల సంభవించిన బ్లోఔట్‌ను అతి తక్కువ సమయంలోనే సమర్థవంతంగా నియంత్రించిన కంట్రోల్ టీమ్‌ను దుశ్శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమం అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రాంతీయంగా అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించి, బ్లోఔట్ ప్రివెంటర్ (బీఓపీ)ను వేగంగా అమర్చి వెల్‌లోని ప్రమాదకర పరిస్థితిని పూర్తిగా నియంత్రించడం ద్వారా కంట్రోల్ టీమ్ తమ నైపుణ్యాన్ని నిరూపించింది. ఈ ఘటన వల్ల స్థానిక ప్రజలకు ఏర్పడిన ఆందోళన తొలగి, గ్రామంలో భద్రతా వాతావరణం నెలకొంది. ప్రజా భద్రతకు కట్టుబడి పనిచేసిన టీమ్ సేవలను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసించారు.

ఖమ్మం

ధనియాకుల ఆధ్వర్యంలో 53వ డివిజన్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ శ్రీమతి శ్రీ లత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు డివిజన్‌లోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం

ధనియాకుల ఆధ్వర్యంలో 53వ డివిజన్‌లో సంక్రాంతి ముగ్గుల పోటీలు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ శ్రీమతి శ్రీ లత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మహిళలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు డివిజన్‌లోని ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆహ్వానించారు. పండుగ వాతావరణంలో సామాజిక ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

LHMS యాప్ ను ప్రజల సద్విని యోగం చేసుకోOడి

సంక్రాంతి పండుగకు ప్రజలు సురక్షితంగా జరుపుకోవాలని నెల్లూరు ఎస్పీ డా, అజిత వెజండ్ల కోరారు ఊర్లకు వెళ్లే ప్రతీ ఒక్కరు ఇళ్ల భద్రత కోసం LHMS యాప్ ను వాడాలని సూచించారు రహదారులపై రద్దీ దృష్ట్యా తనిఖీలు పెంచమన్నారు మైనర్లు వాహనాలు నడపకుండ చూడాలని తల్లిదండ్రులకు హెచ్చరించారు సంప్రదాయం పేరుతో కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు స్పష్టం చేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రూ.358 కోట్ల అభివృద్ధి బాటలో సర్వేపల్లి: పిడూరు–కాగితాలపూరులో త్రీఫేజ్ విద్యుత్ పనుల ప్రారంభం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి 12( పున్నమి ప్రతినిధి ). సర్వేపల్లినియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం పిడూరు, కాగితాలపూరులో ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా త్రీఫేజ్ విద్యుత్ లైన్లు ప్రారంభించారు. పిడూరులో రూ.1.50 కోట్లు, కాగితాలపూరులో రూ.3.80 కోట్లతో పనులు పూర్తయ్యాయి. కాగితాలపూరులో రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 18 నెలల్లో రూ.358 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని తెలిపారు.

విశాఖపట్నం

గాజువాక 87వ వార్డులో సంక్రాంతి ప్రీమియర్ లీగ్–2

గాజువాక జనవరి (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంక్రాంతి ప్రీమియర్ లీగ్–2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాధం పాల్గొని టోర్నమెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు.టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.బొండా జగన్నాధం మాట్లాడుతూ సిద్ధార్థ నగర్‌కు ఆనుకుని నాలుగున్నర ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీవీఎంసీ నిధులు మంజూరు చేయించడంలో పల్లా శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఇచ్చిన మాట ప్రకారం ఈ సంక్రాంతి సంబరాలను అదే కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు,సెక్రటరీ బొట్టా ప్రకాష్,ఇతర నాయకులు,గ్రామస్తులు,క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశం

దుత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వ సభ సమావేశం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేజర్ల జయంత్ రెడ్డీ ఎంపీడీఓ చెంచమ్మ పాల్గొన్నారు విద్యుత్ శాఖ ఏఈ ప్రతిసారి నిర్వహించే సాధారణ సమావేశానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీతో పాటు పలువురు ఎంపీటీసీ లు,సర్పంచులు ఆయన ఫై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను వారు కోరారు అనంతరం మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఫై సమిక్షిoచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

1.20 కోట్ల విలువైన లగ్జరి కార్లు స్వాధీనం చేసుకున్న నెల్లూర్ ఎస్పీ

అంత రాష్ట్ర కార్ల దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూర్ ఎస్పీ జి అజిత వెజoడ్ల వెల్లడించారు ఆమె మాట్లాడుతూ నిందితులు ఇతర రాష్ట్రల్లో ల గ్జరీ కార్లను దొంగలించి నకిలీ నెంబర్ ప్లేట్స్, డూప్లికేట్ పత్రాలతో విక్రయిస్తున్నారు వారిని దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు 1.20 కోట్ల విలువైన 2 కార్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

అనకాపల్లి

సంక్రాంతి పేరుతో కోడిపందాలు వద్దు – చట్టవిరుద్ధ బెట్టింగ్‌లపై కఠిన చర్యలు: ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరిక..!

జనవరి 12, అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఎలమంచిలి రూరల్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాటలు వంటి చట్టవిరుద్ధ బెట్టింగ్ గేములు నిర్వహించరాదని ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరించారు. రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చందర్రావు పాల్గొన్నారు. “సంక్రాంతి పండగ ముద్దు… కోడిపందాలు వద్దు” అనే నినాదంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.