ఖమ్మం
ఖమ్మం జనవరి (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు వైరా లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ గ్రామీణ ముఖచిత్రం మారబోతోందని * ఉపాధి హామీ ఇక 125 రోజులు * కాంగ్రెస్ కుట్రలపై ‘కాషాయ’ కన్నెర్ర: అబద్ధాలను పాతరేస్తాం.. అభివృద్ధిని పరిగెత్తిస్తాం * రైతన్నకు భరోసా.. కూలీకి దిశానిర్దేశం. * మోదీ సర్కార్ సంచలన చట్టం ‘విబి జి రామ్ జి’ * గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట.. పంచాయతీలే ఇక సుప్రీం అని నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, గ్రామీణ పేదల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్): విబి జి రామ్ జి అధినియమ్, 2025’ చట్టం విప్లవాత్మకమైనదని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. వైరా లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వికసిత్ భారత్ – రోజ్ గార్ ఔర్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్): విబి జి రామ్ జి అధినియమ్, 2025’పై మాట్లాడారు. దశాబ్దాలుగా ఉపాధి హామీ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, అన్నదాతకు, కూలీకి ఇబ్బంది లేకుండా రూపొందించిన ఈ చట్టంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చేస్తున్న విషప్రచారాన్ని ఆయన తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు . ప్రతిపక్షాల ఆరోపణలను ఎండగట్టారు. గ్రామాల్లో గందరగోళం సృష్టించి, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన దుయ్యబట్టారు . ఉపాధి దినాలు పెంపు.. ఆలస్యం అయితే పరిహారం* గతంలో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కేవలం 100 రోజుల పని దినాలు మాత్రమే ఉండేవని, కానీ తమ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టం ద్వారా ఇకపై పేదలకు ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి గ్యారంటీ లభిస్తుందని కోటేశ్వరరావు స్పష్టం చేశారు . ఇది కేవలం పేరు మార్పు కాదని, గ్రామీణుల తలరాతను మార్చే చట్టమని ఆయన అభివర్ణించారు. పని అడిగిన నిర్ణీత సమయంలోగా ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భత్యం ఇవ్వడమే కాకుండా, ఒకవేళ వేతనాలు చెల్లించడంలో జాప్యం జరిగితే అదనపు పరిహారం కూడా చెల్లించేలా చట్టంలో కఠిన నిబంధనలు పొందుపరిచామని ఆయన వెల్లడించారు . పేదవాడి కష్టానికి తగిన ప్రతిఫలం సకాలంలో అందాలన్నదే మోదీ గారి సంకల్పమని ఆయన గుర్తు చేశారు. *ఢిల్లీ పెత్తనం లేదు.. పంచాయతీలదే అధికారం* కొత్త చట్టం వస్తే పథకాలన్నీ ఢిల్లీ నుంచే నిర్ణయిస్తారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంతైనా నిజం లేదని నెల్లూరి కోటేశ్వరరావు మండిపడ్డారు. గ్రామాల్లో ఏ పని చేయాలి, నిధులు ఎలా ఖర్చు చేయాలనేది ఇకపై గ్రామ సభలు, గ్రామ పంచాయతీలే నిర్ణయిస్తాయని ఆయన తేల్చిచెప్పారు . కేంద్రం పెత్తనం ఏమాత్రం ఉండదని, కుటుంబాల నమోదు నుంచి జాబ్ కార్డుల జారీ వరకు, పనుల ఎంపిక నుంచి అమలు వరకు సర్వాధికారాలు గ్రామ పంచాయతీలకే కట్టబెట్టామని తెలిపారు . ఈ చట్టం కింద మంజూరయ్యే పనుల్లో కనీసం 50 శాతం పనులను నేరుగా గ్రామ పంచాయతీల ద్వారానే అమలు చేస్తారని, దీనివల్ల స్థానిక అవసరాలకు తగిన మౌలిక సదుపాయాలు సమకూరుతాయని ఆయన వివరించారు . *రైతుకు మేలు చేసేలా ’60 రోజుల విరామం’* వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. విత్తనాలు వేసేటప్పుడు, నాట్లు, కోతల సమయంలో వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో రైతులకు అండగా ఉండేందుకు ఏడాదిలో 60 రోజుల పాటు ఈ పథకం పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించామని తెలిపారు . దీనివల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగదని, అటు రైతుకు, ఇటు కూలీకి ఉభయతారకంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు . *మహిళా సాధికారత.. పారదర్శకతకు పెద్దపీట* కేవలం మట్టి పనులకే పరిమితం కాకుండా, గ్రామీణ మహిళల నైపుణ్యాభివృద్ధికి ఈ చట్టం పెద్దపీట వేస్తోందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల కోసం షెడ్ల నిర్మాణం, సంతల ఏర్పాటు, నైపుణ్య కేంద్రాల స్థాపన వంటి పనులు చేపట్టి, మహిళలు గ్రామంలోనే గౌరవప్రదంగా జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు . అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ హాజరు, జిఐఎస్ ఆధారిత ధృవీకరణ వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, ప్రతి పనికి సోషల్ ఆడిట్ తప్పనిసరి చేశామని అన్నారు . ఈ పథకానికి వెన్నెముకగా నిలిచే ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నిర్వహణ వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచామని, తద్వారా వారికి సకాలంలో గౌరవ వేతనం అందుతుందని హామీ ఇచ్చారు . కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలుమానుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నెల్లూరి కోటేశ్వరరావు హెచ్చరించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు, ప్రతి గ్రామానికి వెళ్లి ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, విపక్షాల కుట్రలను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు . ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు , నల్గొండ జిల్లా ఇంచార్జ్ సన్నీ ఉదయ ప్రతాప్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి రమేష్ సీనియర్ నాయకులు,మందడపు సుబ్బారావు ,మనుబోలు వెంకటకృష్ణ సైదేశ్వర రావు ,మేకల నాగేందర్ ,ఆర్ వి ఎస్ యాదవ్ ,బోయల వెంకట్ ,చిన్ని కృష్ణ కళ్యాణ్ ,వరదరాజు , వెంకి తదితరులు పాల్గొన్నారు.