Thursday, 5 March 2026

Blog

తిరుపతి

వాయులింగేశ్వరుని సేవలో త్రిపుర ముఖ్యమంత్రి

శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనార్ధం త్రిపుర ముఖ్యమంత్రి మనీష్ షా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల, ప్రత్యేక దర్శనం చేయించి దర్శనానంతరం ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి శ్రీ స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్నదే వైకాపా లక్ష్యం- తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి నియోజికవర్గ తెలుగుదేశంపార్టీ నాయకులు టీటీడీ పాలకమండలి అధ్యక్షులు బీ. ఆర్. రెడ్డి పై జరుగుగున్న అసత్యప్రచారంపై వ్యతిరేకిస్తూ ఆదివారం నాడు పత్రిక ప్రకటన ద్వారా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్బంగా తెదేపా రాష్ట్ర బిసి విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, మాట్లాడుతూ…. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల చేత పూజలందుకుంటూ, హిందువుల కోర్కెలు తీర్చే కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ధార్మిక సంస్థ అయిన టిటిడి పైన జగన్ ముఠా పగబట్టిందని ఆరోపించారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బి.ఆర్.నాయుడును వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేసి, తద్వారా టిటిడి ప్రతిష్టను దిగజార్చాలన్న లక్ష్యంతో ఈరోజు కొందరు బి.ఆర్.నాయుడు పైన ఫేక్ వీడియోలు రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడి ఛైర్మన్ లుగా పనిచేసిన వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నాటి ఈవో ధర్మారెడ్డి లు తిరుమల తిరుపతిలలో కొలువైయున్న దేవాలయాలలో సాగించిన అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజల ముందుకు తీసుకొని వచ్చారన్న కక్షతో ప్రస్తుత టిటిడి ధర్మకర్తల మండలిపైన జగన్ రెడ్డి ముఠా అనైతిక చర్యలకు పాల్పడుతూ, దుశ్చర్యలకు దిగుతున్నదని కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకొని నకిలీ వీడియోలు, ఫోటోలను సృష్టించి టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పైన మానసికంగా దాడి చేసి, ఆయన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూడటం దుర్మార్గపు చర్య, ఇదేవిధంగా ఇటీవల సియం చంద్రబాబు నాయుడు పైన కూడా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ట్రోల్ చేయడం వైసిపి వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం మన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత వైసిపి ప్రభుత్వ పాలనాకాలంలో టిటిడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టిన జగన్ బృందం వరుసగా టిటిడికి చెందిన గోశాల పైన, క్యూలైన్ల పైన, వైకుంఠ ఏకాదశి ముందు టికెట్ జారీ ప్రక్రియ పైన, ధర్మకర్తల మండలి సభ్యుల పైన దుష్ప్రచారానికి దిగుతూ ఈరోజు ఛైర్మన్‌గా ఉన్న బి.ఆర్.నాయుడు పైనే అనైతిక దాడులకు తెగబడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఐకమత్యంతో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ గుడి కళ్యాణమండపంలో వన్నెకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నిర్వహించారు. ఈ సమావేశంలో వన్నే కుల క్షత్రియ నాయకులు మాట్లాడుతూ….వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఆద్వర్యంలో ఈనెల 8 వ తేదీ తిరుపతిలో జరుగు వన్నెకుల క్షత్రియ యువతి యువకుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని విజయవంతం చేసి మార్గదర్శకంగా ఉండాలని, ఆ సమావేశాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. మనమందరం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మనం ఎన్నికల్లో పార్టీ తప్ప మిగతా అప్పుడు అంతా ఏకతాటిపై ఉండి ఐకమత్యంతో మన కులంలో ఉన్నటువంటి అందరిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా రేపు రాబోవు రోజుల్లో మన వన్నెకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ద్వారా కూడా స్థలాన్ని, నిధులను సాధించి పూర్తి చేసి అది మన కులస్తులకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఐక్యమత్యంతో ఒక రాజకీయమే కాకుండా సామాజిక దృక్పథంతో మన యువకులు బాగా చదువుకొని వారు ముందుకు పోయే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదో తారీకు జరుగుతున్నటువంటి సమావేశాన్ని పార్టీలకతీతంగా అందరూ కూడా విజయవంతం చేసి మనం ఇంకా కూడా ముందుకు పోవాలని కోరారు.అనంతరం వధూవరుల పరిచయ వేదిక సంబంధించినటువంటి పోస్టర్ని ఆవిష్కరించారు. వన్ని కుల క్షత్రియులు ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్డి వారి గురువారెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి రాష్ట్ర ఎన్నికల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్లు మిన్నల్ రవి,తేజోవతి, బాల సుబ్రహ్మణ్యం, మునిరత్నం, నియోజకవర్గం వన్ని కుల క్షత్రియ నాయకులు సత్రవాడ ప్రవీణ్,రామారావు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు రెడ్డి, వడ్లతంగల్ బాలాజీ రెడ్డి, చెంజి రత్నం రెడ్డి, ఆర్కాడు ముత్తు, జనార్దన్ రెడ్డి, దొరై రాజు రెడ్డి,ముని రెడ్డి, పెరుమాళ్ రెడ్డి,సోయిండి ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, మస్తాన్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి నాగరాజా,గోపాల్ రెడ్డి,చంద్రారెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చంద్రారెడ్డి, గుణ, ప్రతాపరెడ్డి, భయ్యా రెడ్డి,సుబ్రహ్మణ్యం రెడ్డి, శేషాద్రి,మునిరాజా రెడ్డి, శంకర్ రెడ్డి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ సత్య సాయి మందిరంలో ఘనంగా టైలర్స్ దినోత్సవం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 01, శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీదిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సుమారు 20 మంది టైలరింగ్ ని నేర్చుకుంటున్నారని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమం అనంతరం టైలర్ మాస్టర్ ఎం సరితకు సంస్థ తరఫున సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పాండురంగయ్య, కమిటీ సభ్యులు మురుగేషన్, సుబ్బయ్య ,లలితమ్మ, సుబ్బమ్మ , వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ సేవనాధం ట్రస్ట్ సేవా కార్యక్రమాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) శ్రీ సేవనాధం ట్రస్ట్ వ్యవస్థాపకులు మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక అరుంధతి వాడలోని శ్రీ శ్రీ శ్రీ మాతమ్మ దేవాలయ నూతన నిర్మాణానికి రూ.50,000లు ఆలయ కమిటీకి అందజేశారు. చేంద్రమౌళి నగర్‌కు చెందిన గడ్డం పద్మ చికిత్స కోసం రూ.10,000లు సహాయం చేశారు. బద్దెవోలు రోడ్డులో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన రత్నయ్య కుటుంబానికి అవసరమైన ఇంటి సరుకులు, వంట పాత్రలు, నగదు అందించారు. కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సూర్యాపేట

సూర్యాపేట లో మొబైల్ యూనియన్ ఎన్నికలు

సూర్యాపేట : సూర్యాపేట లొ మొబైల్ షాప్స్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికలు కిరాణా అండ్ ఫాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ బిల్డింగ్ యందు అందరి సభ్యుల సమక్షంలో అధ్యక్షులుగా సయ్యద్ గౌస్ పాషా , ప్రధాన కార్యదర్శిగా నర్సింగ్ సురేష్ ,కోశాధికారిగా మాడుగుల జయప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బత్తుల శశిధర్,జాల గిరిప్రసాద్, ఉప్పల శ్రవణ్,గొడిశాల విజయ్,నెమ్మది బాబు , చల్లా శశిధర్,సుంకర నరేష్ ,తాటికొండ రమేష్ రెడ్డి ,జాల శ్రీకాంత్ ,సతీష్ రెడ్డి , బద్రి,నాని, బెలీదే ముకుందం, యర్రమల్ల ప్రసాద్, బెలిదే నాగేందర్ ,సందీప్ , పవన్,ఖదీర్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

గుండోజీ రంగాదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ఎన్నిక

*గుండోజీ రంగాదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నూతన కార్యవర్గ ఎన్నిక* పున్నమి న్యూస్ ప్రతినిధి 02 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బండరావిరాల గ్రామంలో *”గుండోజీ రంగదాసు ఎడ్యుకేషనల్ ట్రస్ట్”* నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించబడింది. ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు బండరావిరాల గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గ్రామ అభివృద్ధి, విద్య మరియు సామాజిక సేవా కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ క్రింది సభ్యులను వివిధ బాధ్యతలకు ఎంపిక చేశారు. *నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు:* సలహాదారులు: కోదాసు శ్యామ్ సుందర్, నెమరగోముల ముత్యాలు, ఏర్పుల నవీన్ కుమార్. అధ్యక్షులు : ఏర్పుల నరేష్ ప్రధాన కార్యదర్శి: కొత్త ప్రశాంత్ గౌడ్ ఉపాధ్యక్షులు: కందికంటి నిఖిల, నెమరగోముల కరుణ్, ఒంగూరి రమేష్. కోశాధికారి: కందికంటి మధు సహయ కార్యదర్శులు: పిల్లి పూజిత, ఏమ్ముల శివ శంకర్. ఈ సందర్భంగా సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ మాట్లాడుతూ, యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని, నూతన కార్యవర్గం గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ట్రస్ట్ ద్వారా విద్యా పరమైన సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఏర్పుల నరేష్ మరియు ఇతర సభ్యులు తమపై ఉంచిన నమ్మకానికి సర్పంచ్ కి, అడ్వైజర్లకు మరియు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా విద్యార్థులకు విద్యనందిస్తున్న ట్యూటర్లను ట్రస్టు సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దూస శంకర్ ముదిరాజ్ , వార్డు సభ్యులు గుండ్ల భవాని – శివ ముదిరాజ్ , ఏర్పుల హరికృష్ణ గ్రామ యువకులు కందికంటి కృష్ణ , ట్యూషన్ పాయింట్ కమాండర్లు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాదిగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తాం

మాదిగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేస్తాం ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం మాదిగ అమరవీరుల త్యాగ ఫలితమే నేడు దుత్తలూరు టౌన్ లోని ఏసి కాలనీ నందు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగపట్ల సింహాద్రి మాదిగ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం కొవ్వత్తులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఎస్పీ అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పోల్గొని వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగ ఫలితమేనని పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో అతి తక్కువ మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు ప్రధానమంత్రినే కదిలించే విధంగా తయారైందని తెలిపారు అనేక ఒడిదుడికలతో కష్టనష్టాలతో ఉద్యమం ముందుకు సాగి నేడు ఎస్సీ వర్గీకరణ సాధించేంతవరకు కొనసాగిందన్నారు అమరవీరుల త్యాగఫలితంగానే వర్గీకరణ జరిగిందని తెలిపారు ఈ వర్గీకరణతో నేడు డీఎస్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు పొందగలిగామని అదే విధంగా భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలో రాజ్యాధికారం చేపట్టే విధంగా మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుమేరకు ముందుకు సాగుతామని వర్గీకరణ కోసం అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఆశయాలతో భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్రంలోని మాదిగ ప్రజల హక్కుల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులు ఎంతో పుణ్యాత్ములు అన్నారు వారి ఆశయాలను. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల నాయకులు సొంగ రవి మాదిగ,యనమల గిరి మాదిగ,వడ్లపల్లి కల్యాణ్ మాదిగ,యనమల ఉపేంద్ర, ఎ పాపయ్య,ప్రసన్న, ఏడుకొండలు మాదిగ విధ్యార్ధులు మాదిగ పెద్దలు యువకులు తదితరులు అధికసంఖ్యలో పొల్గన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు

చిన్నా జనసేన కుటుంబాన్ని పరామర్శించిన నెల్లూరు జిల్లా జనసేన నాయకులు వీరమహిళలు నెల్లూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ఈ రోజు ఉదయం 11 గంటలకు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్న, చిన్నా జనసేన వారి అబ్బాయిని, కుటుంబాన్ని, పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం అందజేసిన జనసేన నాయకులు, నూనె మల్లికార్జున యాదవ్, పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీసు ఇంచార్జ్ జమీర్, ఏటూరి రవికుమార్, గుర్రం కిషోర్, పవన్ యాదవ్ కపాటి పాలెం సనత్, మరియు వీర మహిళలు ఎంఎస్ నందిని, లత, ప్రమీల, వెంకటసుబ్బమ్మ, భూలక్ష్మి… చిన్నా గారి అబ్బాయి త్వరగా కోలుకోవాలని ఆశీస్సులు అందచేశారు. జనసేన పార్టీ ఆఫీస్ గోమతి నగర్ నెల్లూరు జిల్లా….

విశాఖపట్నం

తక్షణమే ప్రహరీ నిర్మాణం చేపట్టండి

అధికారులకు పల్లా ఆదేశం విశాఖపట్నం, మార్చి 1, పున్నమి ప్రతినిధి. అండమాన్ కొండయ్యవలస కొలనీ వాసుల ఆరాధ్య దేవత బంగారమ్మ ఆలయ ప్రాంగణం లో ప్రహరీ గోడ నిర్మాణం అడ్డుకుంటున్న వారిపై స్థానిక యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు కి గ్రామస్తులు నగరం లో ఉన్న స్వగృహం లో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన తక్షణమే స్పందించి అక్రమణ దారుడ్ని అడ్డు పెట్టుకుని ప్రహరీగోడ నిర్మాణం ను అడ్డుకునే వారికి హెచ్చరించి, పనిని నిలుపుదల చేసిన అధికారులకు పనిని వెంటనే మొదలు పెట్టి పూర్తి చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా బంగారమ్మ కొలనీ వాసులు వందలాది మంది యం ఎల్ ఏ పల్లా శ్రీనివాస రావు గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో పామల వసంతరావు, మదాసు రామక్రిష్ణ, మదాసు గణేష్, కలిమి సుధాకర్, బలిరెడ్డి అప్పారావు, నారాయణరావు, విందుల పాపారావు, జోగారావు, రాజు, రాజేష్, ఇందల అశోక్, శ్రావణ్ కుమార్, సూర్నపూడి నూకరాజు, ఎస్ నారాయణ, జాజుల లక్ష్మి, మంగమ్మ, జయ, వరలక్ష్మి. ఇందుమతి, నీలవేణి, లుకలాపు తవిటమ్మ, కొవ్వాడ అప్పలనసరమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.